తెలుగు ట్రెడిషనల్ బేబి నేమ్స్ మన ట్రెడిషన్ మన పేర్లు

న ట్రెడిషన్ మన పేర్లు సశాస్త్రీయమైన అర్ధమును కలిగి ఉంటాయి. ఇంకా కొన్ని తెలుగు ట్రెడిషనల్ పేర్లు పూర్వపు కాలంలో గొప్పవ్యక్తులను గుర్తుకు తెస్తూ ఉంటాయి. తెలుగు ట్రెడిషనల్ బేబి నేమ్స్ , పిల్లల భవిష్యత్తు ప్రభావితంలో కూడా కొంత ప్రభావం చూపుతాయని జ్యోతిష్యులు అంటారు.

తెలుగు ట్రెడిషనల్ నేమ్స్ ఎక్కువగా దైవనామముతో కూడి ఉంటాయి. ఉదాహరణకు చూస్తే, శివకుమార్, హరికృష్ణ, రామకృష్ణ, శ్రీనివాసరావు, వేంకటేశ్వరరావు, ఆంజనేయప్రసాద్, హనుమంతు, కుమారస్వామి, గణపతి, హరిహరకుమార్ అని మగపిల్లల పేర్లు ఉంటాయి.

దుర్గ, లక్ష్మీ, సరస్వతి, పద్మావతి, అలివేలు, కృష్ణవేణి, గంగ అంటూ ఆడపిల్లలకు తెలుగు పేర్లు చాలా ట్రెడిషనల్ గా ఉంటాయి….. ఇలా చాలా వరకు మన తెలుగు ట్రెడిషనల్ పేర్లు దైవనామమను కలిగి ఉంటాయి.

ఇలా మన తెలుగు ట్రెడిషనల్ పేర్లు దైవనామముతో కూడి ఉండడానికి ప్రధాన కారణం ఉందని పండితులు అంటారు.

మనదేశంలో చాలా వరకు దైవనామముతోనే పిల్లలకు పేర్లు పెడుతూ ఉంటారు. పిల్లలకు దైవ నామమును పేరుగా పెట్టడడానికి కారణం. పిల్లలను పిలవడంలో దైవ నామాస్మరణ జరుగుతూ ఉంటుంది.

ఒక వ్యక్తి తన కుమారుడుకి స్థితికారకుడు అయిన విష్ణు నామము నారాయణ అని పెట్టి, తన కొడుకును అదే పేరుతో పదే పదే పిలవడం వలన, పదే పదే విష్ణు నామమును జపించినట్టే అవుతుందని అంటారు. సాదారణంగా పిల్లలు అంటే మహాప్రీతి తల్లిదండ్రులకు ఉంటుంది. కాబట్టి అలా నారాయణ, నారాయణ అంటూ పేరు పిలవడంలో హరినామస్మరణ చేసినట్టే అవుతుంది.

ఇదే విధంగా ఆడపిల్లల పేర్లు కూడా కూతురుకు జగన్మాత నామమునే పేరుగా పెట్టుకుని, పిలవడం వలన పదే పదే జగన్మాత నామస్మరణ చేసినట్టే అవుతుంది. ఇలా దైవ నామమును పిల్లలకు పెట్టి, పిలుచుకోవడం వలన దైవ నామస్మరణ మన జీవితంలో ఒక అలవాటుగా మారుతుంది.

కలియుగంలో దైవనామనస్మరణ, దైవనామ కీర్తనలే మహామేలును చేయగలవు అని ప్రవచనకారులు అంటారు. అందుకనే దేశంలో దైవనామమును పిల్లలకు పెట్టుకుని, వారిని పిలవడంలో కూడా దైవమును గుర్తుకు చేసుకోవడం ఒక అలవాటు ఉంది.

ఇంకా నక్షత్ర అక్షరమును బట్టి పేరును పెట్టి, ఆపేరును పిలవడం వలన, జాతక ప్రకారం కూడా పిల్లల భవిష్యత్తుకు భగవంతుడి అనుగ్రహం ఉంటుందని, జ్యోతిష్యులు అంటూ ఉంటారు.

పేర్లలో తెలుగు ట్రెడిషనల్ బేబి నేమ్స్ ప్రకృతి పరంగానో, దైవపరంగానో సూచనను తెలియజేస్తూ ఉంటాయి.

ఆడువారి పేర్లు ఎక్కువగా అమ్మవారి నామముల లేక ప్రకృతిలో ముడిపడి ఉన్న నామమును కలిగి ఉంటాయి. లక్ష్మీ, పార్వతి, దుర్గ ఇలా కొన్ని పరాశక్తి పేర్లతో ఆడపిల్లల తెలుగు పేర్లు ఉంటే, కొందరికి విజయ, జయ, జయంతి, అనిత, సునీత, నిర్మల, అభిరామి, ఐశ్యర్య, అమూల్య, ఆనందిని మంచి అర్ధమును కూడి ఉండే పదాలు పేర్లుగా ఉంటాయి.

కొందరి ఆడపిల్లలకు ప్రకృతిలో మేలు మొక్కల పేర్లు ఉంటాయి. ఉదాహరణకు తులసి. లోకంలో తులసి మొక్క యొక్క ఉపయోగాలు అందరికీ తెలిసిందే. అలాగే పూల మొక్కల పేర్లు కూడా ఆడపిల్లలకు ఉంటాయి.

పేరులో మొదటి అక్షరం చాలా కీలకం అని జ్యోతిష్యులు, సాంఖ్య నిపుణులు అంటారు.

A అక్షరంతో స్టార్ట్ అయ్యే పేరు గల వ్యక్తుల జాతకం ఇలా ఉంటుంది. B అక్షరంతో స్టార్ట్ అయ్యే పేరు గల వ్యక్తుల జీవితం ఇలా ఉంటుంది. P అక్షరంతో స్టార్ట్ అయ్యే పేరు గల వ్యక్తుల జీవితం ఎలా మారుతుంది? S అక్షరంతో స్టార్ట్ అయ్యే పేరు గల వ్యక్తుల జీవితం ఎలా ప్రభావితం అవుతుంది?

ఇలా పేరులో మొదటి అక్షరంతో ఉండే వ్యక్తుల స్వభావం గురించి చాలామంది చాలా రకాలు విశ్లేషణలు చేస్తూ ఉంటారు. వీటి గురించి పుస్తకాలు కూడా ఉంటాయి. అందుకే పేరు పెట్టేటప్పుడు పేరులో మొదటి అక్షరం ఎలా ఉండాలో? చూడాలని అంటారు? ఇంకా నక్షత్రం బట్టి కూడా పేరులో మొదటి అక్షరం ఉంటుందని అంటారు.

పుట్టిన తేది, సమయం బట్టి కొందరు పేరును సూచిస్తూ ఉంటారు. నక్షత్రం, సమయం, వారం, తిది, మాసం ప్రభావితం అవుతూ ఇష్టదైవ నామమును గుర్తుకు తెచ్చే విధంగా మన తెలుగు ట్రెడిషనల్ బేబి నేమ్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆయా పేర్లు ఈ క్రింది విధంగా ఉంటాయి.

నాగ వెంకట దుర్గా లక్ష్మణ కుమార్,

వినాయక వర ప్రసాద్,

సోమ సూర్య వర ప్రసాద్,

లీలా వేంకట దుర్గా లక్ష్మీ ప్రసాద్

వేంకట రామ నారాయణ శివ ప్రసాద్

ఇలా మన తెలుగు సంస్కృతిలో తెలుగు పేర్లు ఉంటాయి. తెలుగు ట్రెడిషనల్ బేబి నేమ్స్ మన తెలుగులో ఉండే కాంబినేషన్ బట్టి పేర్లు చూడాలనుకుంటే మా తెలుగురీడ్స్.కామ్ నుండే మొబైల్ యాప్ కలదు… ఈ మొబైల్ యాప్ ఉచితంగానే డౌన్ లోడ్ చేయవచ్చును. ఈ క్రింది చిత్రంపై టచ్ చేసి మొబైల్ యాప్ ప్లేస్టోర్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేయవచ్చును.

తెలుగు ట్రెడిషనల్ బేబి నేమ్స్ మన ట్రెడిషన్ మన పేర్లు
తెలుగు ట్రెడిషనల్ బేబి నేమ్స్ మన ట్రెడిషన్ మన పేర్లు

ఒకపుస్తకం రచన చేసేటప్పుటడు, దైవ నామస్మరణ చేస్తారు. ఒక పుస్తకం ప్రింట్ చేసే సమయంలో కూడా దైవ నామస్మరణ, దైవస్తుతి ఉంటుంది. ఒక వ్యక్తి జీవితం ప్రకృతి చేత ప్రభావితం కాబడుతుంది. అటువంటి వ్యక్తి పేరు బాల్యంలో తల్లిదండ్రులు, పెద్దల చేత నిర్ణయించబడుతుంది.

రచయిత తన పుస్తకమునకు విశేషముగా దైవమును స్మరిస్తే, మరి మంచి భవిష్యత్తును దర్శించబోయే పిల్లల పేర్లు కూడా వారికి మేలు కలిగే విధంగా దైవ నామముతో కూడి ఉండడం శ్రేయష్కరం.

తెలుగురీడ్స్.కామ్ తెలుగు బేబినేమ్స్

Enable Notifications    Ok No thanks