శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్ల్యాం రామ నామ వరాననే!!

శ్రీరామనవమి శుభాకాంక్షలు… మీకు మీ బంధుమిత్రులందరికీ శ్రీసీతారామాంజనేయలక్ష్మణుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ… శ్రీరామ పుస్తకాలు, రామభక్తి పుస్తకాల లింకులు ఈ పోస్టు చివరలో ఉన్న బటన్స్ కు లింకు చేయడం జరిగింది.

యోగవాశిష్టం తెలుగు బుక్ చదువుతంటే, శ్రీరాముని అంతరంగం నా అంతరంగంలో సముద్రఘోషను సృష్టించింది…. ఇప్పటికీ ఆఘోష వినబడుతుంది. గురుబోధ కన్నా ముందే శ్రీరాముడి మనసు పట్టుకున్న విషయజ్ఙానం? తెలియాలంటే యోగవాశిష్టం బుక్ చదవాల్సిందే…

శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంటూ మనసా వాచా మనస్పూర్తిగా శ్రీరాముని మదిలో తలిస్తే, విష్ణు సహస్రనామం మననం చేసినట్టే అంటారు. విష్ణు భగవానుని వేయి నామాలు, శ్రీరాముని మూడు నామాలతో సరిపెడుతున్నారంటే, శ్రీరామచంద్రుని మహిమ వర్ణానాతీతమే..

ఏ దేవతా మంత్రమునకు నియమాలు ఉంటాయి. కానీ ఏదేవతా నామమును పలకడానికి నియమాలు ప్రత్యేకంగా అంటూ ఏవి లేవంటారు. శ్రీరామ నామము, మంత్రము ఒకే రీతిలో ఉంటాయి.

మంత్రము అయితే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటూ సాగుతుంది. ఇక నామము అయితే శ్రీరామ అనే అంటారు. శ్రీరామ అని మూడు మార్లు మాములుగా పలికినా అంది మంత్రంలాగానే ఉంటుంది. అయితే శ్రీరామునిపై మన మనసు ఎంతబలంగా నిలిచిందనేది ముఖ్యం.

కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఇంత కష్టం వచ్చింది అనుకుంటాం… కానీ రామదాసును జైలులో పెట్టి చిత్రహింసలు పెడుతుంటే… ఆరామదాసు శ్రీరామునే మదిలో తలిచాడు. సీతారామలక్ష్మణాంజనేయ దశరధులనే తలిచి తలిచి రాముని మెప్పించాడు. అంతకష్టంలోనూ రామునిపైనుండి మనసు వేరు విషయంలోకి వెళ్ళకపోవడం రామదాసు భక్తికి తార్కాణం.

చిత్రం భక్తి గురించి చెప్పడానికి, వ్రాయడానికి మనసు నిలుస్తుంది. కానీ ఆయా దేవతామూర్తులను మదిలో నింపుకోవాలంటే మనసు నిలవదు… అయినా రామచంద్రుని ఎలా పట్టుకున్నా పుణ్యమే… అయితే చిత్తశుద్ధి కోరుకుంటే ప్రయోజనం సిద్దిస్తుంది అంటారు.

నేను యోగవాశిష్టం తెలుగు బుక్ చదివాను.. మనసు ఏం బాగోలేనప్పుడు ఆ బుక్ చదివాను. కానీ ఆ బుక్ చదువుతుండగా ఆసక్తి పెరిగింది. నా కష్టం ఏమి తీరిపోలేదు. కష్టాలు అలానే ఉన్నాయి. యోగవాశిష్టం తెలుగు బుక్ లో ఉన్నది శ్రీరాముని అంతరంగం… అందుకే ఆసక్తి మరింతగా…

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సాదారణంగా అయితే శ్రీరాముని గురించి చదువుతుంటే, రాముని కష్టాలు గుర్తుకు వచ్చి మనకు బాధేస్తుంది. రాముని గుణాలు చదివి మురిసిపోతాం… శ్రీరాముడుకు ఉన్న పదహారు గుణాలు మానవమాత్రునికి అసాద్యం అనిపిస్తుంది. కానీ శ్రీరాముడు మనలాగా మానవుడు అనగానే గర్వం అనిపిస్తుంది. అటువంటి శ్రీరాముని అంతరంగం అంటే ఆసక్తి మామూలుగా ఉండదుగా…

నాకు యోగవాశిష్టం బుక్ చదువుతుంటే, చాలా ఆసక్తి కలిగింది. ఎందుకంటే నాకైతే మాములుగా ఎవరైనా ఏదైనా ఇస్తానని ఆశ చూపించి, అది ఇవ్వనని మాట మారిస్తే కోపం బలంగానే వస్తుంది. ఇక అతనితో ఆ ఆశ గురించి మాట్లాడకూడదనుకుంటా…

కానీ శ్రీరామచంద్రమూర్తికి చక్రవర్తిగా యువరాజ్య పట్టాభిషేకం చేస్తానని పిలిచి మరీ మాట ఇచ్చిన దశరధుడు, మరలా పట్టాభిషేకం లేదు అడవులకు పో అని పినతల్లితో చెప్పిస్తే… మనసు ఎంత పరివేదన పొందుతుంది. చక్రవర్తి కావాల్సిన మనిషి, కానలకు వెళ్ళాలంటే ఎలా? అదీ సీతమ్మను పరిణయం చేసుకున్నాకా..

ఆలోచిస్తే ఎలా సాధ్యం అనిపించేది… ఏదైనా ఎంతమంది చెప్పినా మన మనసు గ్రహిస్తేనే ఆ అంశంపై తృప్తి కలుగుతుంది. అంతవరకు అంతరంగంలో ఏదో అలజడి ఆ అంశంలో ఉంటుంది. ఎలా ఓపిక ఉండి ఉంటుంది?

అయితే యోగవాశిష్టం తెలుగుబుక్ రీడ్ చేయడం మొదలు పెట్టాక ఆ బుక్ లో మనకు తెలిసిన రామాయణంలోని రాముని అంతరంగం ఎలా ఉందో మనకు తెలియజేయడం ప్రారంభిస్తుంది. యోగవాశిష్టం… బుక్.

బాల్యం నుండి యవ్వనంలోకి ప్రవేశిస్తున్న శ్రీరాముడు యాత్రలకు వెళ్ళివస్తాడు. యాత్రలు చేసుకుని తిరిగి వచ్చిన శ్రీరాముడు, ఆరాముని తనతో పంపించమని అడగడానికి అయోధ్యకు వచ్చిన విశ్వామిత్రుడు… ఇక్కడే బుక్ అంతా ఉంటుంది. కానీ లోకంలో మనసు గురించిన విజ్ఙానం అంతా ఇందులోనే ఉంటుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీరాముడు వివాహానికి ముందే వైరాగ్యం పొందాడు. మహారాజు కాకముందే పూర్తి వైరాగ్యం పొందాడు. వేటి మీద ఆసక్తిని పెంపొందించుకోలేదు. దశరధుడు, వశిష్టుడు, విశ్వామిత్రుల ఎదుట శ్రీరాముని అంతరంగం ఆవిష్కృతం అవుతుంది. ఖచ్చితంగా శ్రీరాముని ఆ అంతరంగం చదివి తీరాలి అనిపిస్తుంది. రాముని మాటలు విన్ని గురువులు శ్రీరాముని వైరాగ్యమును ద్రువీకరిస్తారు.

ఇక అటుపై శ్రీరాముడు తండ్రి చెప్పినట్టు చేశాడు. తండ్రి చెప్పినా ఏది ధర్మమో అదే చేశాడు.. ఆసక్తి లేని వ్యక్తికి సమదృష్టి అన్నింటిపై ఒకేలాగ ఉంటుంది. ఏదైనా లోకం కోసం చేస్తారు. నాకు యోగవాశిష్టం బుక చదివాక మనలాగానే శ్రీరాముడు మనసు వేదనకు గురైంది. అయితే అది బౌతికపరమైన విషయాల గురించి కాదు. జీవిత పరమార్ధం వైపు వెళ్ళే మనసు పొందే ఆవేదన…

భోగం పాందే మనసు ముందుగా పట్టుకోవాలసినది ఏది? అంటే అది జీవితపరమార్ధం అని నాకు యోగవాశిష్టం బుక్ చదువుతుంటే అవగతం అయ్యింది. అలా జీవిత పరమార్ధం గురించి వేదన చెంది, పరధ్యానంలోకి పోయి అన్నింటా వైరాగ్యం పొందిన శ్రీరాముడు ఏది చేసినా ధర్మం దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడానికి మనసు సహకరించందనే భావన నాకు కలిగింది.

జీవన పరమార్ధం ముఖ్యం అయినప్పుడు దాని కోసం మనకు ప్రకృతి ప్రసాదించిన బౌతిక వసతులు ఉపయోగించుకోవడంలో పక్షపాతం ఉండదు. ఉన్నదానిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలనే తలంపు మాత్రమే ఉంటుంది. యోగవాశిష్టం తెలుగుబుక్ చదివాకా నాకు తెలిసిందేమిటి అంటే మనం ముందుగా పట్టుకోవాల్సింది.. జీవిత పరమార్ధం.. అని.

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనేద మనకు రామ మంత్రం అయితే రామ నాము కూడా అంతే కదా… శ్రీరామ అని. రామ రామ రామ అంటూ కాలక్షేపం చేయడం పుణ్యమంటారు. అయితే నాకు తెలిసి రామ రామ రామ అంటూ పుణ్యం చేసుకోవచ్చు కానీ రామ రామ రామ అనే నోరు కోపం వచ్చినప్పుడు పరుష పదం పలకకుండా జాగ్రత్తపడగలిగితే, ఆ వ్యక్తి మనసు ఖచ్చితంగా రామునివైపు నడుస్తున్నట్టే… కానీ కోపం వచ్చింది కదా అని పరుషమైన మాటలు మాట్లాడేస్తూ ఉంటే మాత్రం మనసు అలవాటుగా పుణ్యం కోసమని చేస్తున్నట్టు అంటారు.

కష్టం కాలంలో వస్తూ ఉంటుంది. కష్టకాలం కదిలిపోగానే సుఖమనే కాలం వస్తుంది. ఈ రెంటికి మద్యలో మనసు ఎలా ఉంది. గమనిస్తే మనసు ఖచ్చితంగా కష్టానికి కుదేలవుతుంది. సుఖానికి పొంగిపోతుంది. అయితే మార్పు రావాలంటే దైవానుగ్రహం కావాలి. దైవానుగ్రహం కావాలంటే చిత్తశుద్ది కావాలంటారు. కనీసం ఆత్మసాక్షి దగ్గర తన తప్పును మనసు ఒప్పుకోవడం ప్రారంభించాలని అంటారు.

అలా ఆత్మసాక్షిగా మనసు తన తప్పును కనీసం అంతరంగంలోనైనా ఒప్పుకోవాలంటే మనసు గురించి, అది కలగజేసే నేను అహం గురించి.. ఆ అహం వలన గతంలో జీవనం సాగించిన జీవితాల గురించి తెలియబడాలి. మనసు తనకు తెలియకుండానే తనకుతానుగా మేలు ఎలా చేసుకుంటుంది? తనకు తెలియకుండానే తనకుతానుగానే ఎలా మనసు మార్గం మళ్ళించుకుంటుంది. ఈ తేడా మనసు గురించి మనసే తెలుసుకోవాలి.

చాలా చాలా చిత్రమైన పనేమిటి? అంటే మనసుపై మనసుతోనే యుద్దం చేయడం. విచిత్రంగా మనసు కూడా తెలుసుకున్న విషయాలతో తన మూలం చేరేవరకు తనతోతానే పోరాట చేస్తూనే ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం మొదలవ్వడం ప్రధానం. అదీ ఒక్కసారి మొదలైతే మూలం తెలిసేవరకు పెద్దలు మాటలు వింటుంది. ఆ మాటలలో ఆంతర్యం ఆలోచిస్తుంది. బుక్స్ చదువుతుంది. ఆ బుక్స్ లో మర్మం ఏమిటో శోధిస్తుంది. వదలదు ఏమిటో ఆరహస్యం అని వెతుకుతూనే ఉంటుంది.

వయస్సులో వచ్చే మార్పు మనకు కొత్త ఆలోచనలు సృష్టిస్తుంది. శీతాకాలం నుండి వేసవికాలంలోకి వెళ్ళే కాలం కూడా సమస్యలు సృష్టిస్తుంది. అంటే ప్రకృతిలో మారుతున్న కాలం సమస్యలు సృష్టించినట్టు మనసు కూడా మారుతున్న వయస్సులో ఆలోచనలను సృష్టిస్తుంది. ఇక్కడే ప్రకృతిలో మారుతున్న కాలం గమనించి జాగ్రత్తపడినట్టు, వయస్సు మార్పులో మారుతున్న మనసుతీరును గమనిస్తే మన మనసు మన నియంత్రణలోనే ఉండే అవకాశం ప్రకృతి గురువురూపంలో ఇస్తుంది. గురువు దొరక్కపోతే పుస్తకమనే పేపరుగురువుగా అయినా సహకరిస్తుంది.

పెరుగుతున్న వయస్సును బట్టి మనసు తలచే తలంపులకు కారణం? అసలు మనసనేదేమిటి? అని ఆలోచన కలగాలి. యోగవాశిష్టం బుక్ లో రాముని అంతరంగంలో నుండి పలికి పలకులు చదవాలి. మనసుతో లోకం ఎలా ఉంటుందో? లోకం వ్యక్తిపై ఎలా ఉంటుందో? చాలా విషయాలు శ్రీరాముడు గురువుల ముంగిట మాట్లాడతాడు.

గురువుల బోధకు ముందు శ్రీరాముడు పట్టుకున్న జ్ఙానం పలికిన మాటలు మనం పట్టుకుంటే, మన జీవితమే కాలంలో మనకు మన జీవిత పరమార్ధం ఏమిటో మనకు తెలియజేసే అవకాశం ఉంటుంది. యోగవాశిష్టం… మనకు విశిష్టమైన తెలుగు పుస్తకాలలో ఒక్కటి…