By | July 12, 2024

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది? వాన వస్తుందంటే? ఫరవాలేదు కానీ తుఫాన్ వస్తుందంటే? ఫరవాలేదు అనుకోము, జాగ్రత్తలు తీసుకుంటాము. ఒకరు అబద్దం నమ్మి మోసపోతే, అతనిని మరొకరు మోసం చేసే అవకాశం ఉండవచ్చును, కానీ ఒక ప్రాంతంలో అనేకమంది మోసపోతే, వారిని మరలా మోసం చేయడం అసాధ్యమే అంటారు. అంటే అబద్దం చెప్పి ఒకరిని కొన్ని సార్లు మోసం చేయగలరేమో, అది వ్యక్తి తెలివిపై ఆధారపడి ఉంటుంది. కానీ చాలామందిని రెండవసారి మోసం చేయడం అరుదు. ఎందుకంటే చాలామందిలో అనేకమందిని ప్రభావితం చేయగలిగే కొందరు ఉంటారు. ఆ కొందరు జాగ్రత్త వహిస్తారు, మరికొంతమందికి జాగ్రత్తలు తెలియజేస్తారు.

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

కనుక అబద్దం వలన వ్యక్తి విలువ తగ్గుతుంది. అదే నాయకుడికైతే, తన వైపు ఉన్న వ్యవస్థకే విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ, ఇంకా ఒక స్థాయికి వచ్చాకా, ఆదర్శవంతమైన మాటలు, ఆదర్శప్రాయమైన జీవనం కంటిన్యూ చేస్తూ ఉండాలి.

విన్న అబద్దం నమ్మినవారికి, గుణపాఠం చెబుతుంది. చెప్పినవారి విలువ తగ్గిపోతుంది. ప్రచారం చేసినవారికి భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుంది.