By | July 12, 2024

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి? అంటే పేదరికం, నిరుద్యోగం, వ్యవస్థలలో లోపాలు, రుణభారం వంటివి ప్రధానంగా చెప్పబడతాయి. కారణాలు ఏవైనా అభివృద్ది సాధిస్తే, అది ఆదర్శంగా అనిపిస్తుంది. అభివృద్ది చెందనిదిగా ముద్రపడుతుంది. వ్యక్తిగా అభివృద్ధి సాధిస్తే, ఆ వ్యక్తి కుటుంబంలో అతను ఆదర్శం. నాయకునిగా అభివృద్ది సాధిస్తే, ఆ ప్రాంతంలో అతను ఆదర్శప్రాయం. ఒక సంస్థ అభివృద్ది సాధిస్తే, ఆ సంస్థ, ఆ సంస్థలో పనిచేసేవారు, అక్కడ ఉన్న సంస్థలకు, ఇతర ఉద్యోగులకు వారు ఆదర్శం. అభివృద్ది కాకపోతే, ఎందుకు అభివృద్ది జరగలేదో, అందుకు వారు వారు ఆయా స్థానాలలో నిదర్శనంగా మారవచ్చు.

పేదరికంలో ఉన్నవారు అభివృద్ది సాధించడం చాలా కష్టం అంటారు. అందుకు కారణాలు… పేదరికం వలన వ్యక్తి పోషణ చాలా కష్టంగా ఉంటుంది. జీవితంలో ఎక్కువ సమయం తన కడుపు నింపుకునే ప్రయత్నంతోనే సమయం సాగుతుంది. పేదరికం వలన అభివృద్ది అనే ఆలోచన కూడా పుట్టకపోవచ్చును. పేదరికంలో ఉండి, అభివృద్దిని సాధిస్తే, అది అద్భుతంగానే భావిస్తారు. చరిత్ర అవుతుంది.

ఒక ప్రాంతం అభివృద్ది సాధించాలంటే, ఆ ప్రాంతంలో నివసించేవారంతా కష్టపడి పనిచేయాలి. కష్టానికి తగిన ఫలితం వారికి దక్కాలి. అక్కడ జరిగిన కష్టం మరొక చోట బిజినెస్ జరగాలి. కానీ అలా ఒక ప్రాంతంలో జనులంతా కష్టపడడం అంటే, అక్కడ అందరికి ఉపాధి లభించి ఉండాలి. ఉపాధి లేకుండా జనులకు ఆదాయం ఉండదు. ఉపాధి ఉద్యోగ రూపంలోనూ, స్వీయ వ్యాపార రూపంలోనూ, చిరు వ్యాపార రూపంలోనూ, రోజువారీ వేతన రూపంలోనూ, ఒక ప్రాంతంలో అందరికి ఉపాధి ఉంటే, ఆ ప్రాంతం వేగంగా అభివృద్ది సాధిస్తుంది. కానీ ఒక ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంటే, ఆ ప్రాంతం అభివృద్ది చెందడానికి చాలా కాలం పడుతుంది. అభివృద్ధికి ఆటంకాలు అంటే నిరుద్యోగం ప్రధాన కారణం అవుతుంది.

వ్యవస్థలలో లోపాలు ఉంటే, అధికార యంత్రాంగం పనితీరు సరిగ్గా ఉండదు. ఆదాయ మార్గాలు గతి తప్పుతాయి. ఇవి పెద్ద శాపంగా భవిష్యత్తుకు భారంగా కాగలవు.

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

రుణభారం అంటే అప్పులు. వ్యక్తికైనా, వ్యవస్థకైనా అప్పులు ఎక్కువగా ఉంటే, వ్యక్తి కష్టం అయినా, వ్యవస్థ కష్టం అయినా ఫలితంలో భాగం వడ్డీలకే పోతుంది. తత్కారణంగా ఆదాయం పెరిగే అవకశాలు, ఉన్న ఆర్ధిక భారం పెరుగుతుంది. ఈ విధంగా పేదరికం, నిరుద్యోగం, వ్యవస్థ లోపాలు, రుణభారం అభివృద్దికి ఆటంకాలు….