అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి పట్టించుకోకుండా ఉంటే, అది మరలా మనకే చేటు చేస్తుంది. వాస్తవాలు గ్రహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పెద్దలు అంటారు. దేని గురించి అసత్య ప్రచారాలు? వాస్తవాలు ఏమిటి?
ఒక్కొక్కసారి అబద్దం ఎక్కువగా ప్రచారం అవుతుంది. అది యాదృచ్ఛికం అయితే, కావాలని అబద్దాలు ప్రచారం చేయడం అసత్యాన్ని సత్యంగా చూపించడం లేదా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా జరిగితే, ఆ సమాజంలో ప్రజలు అసత్య ప్రచారాలు, అందులోని వాస్తవికతను గ్రహించాలి అంటారు. లేకపోతే అసత్యమే సత్యంగా నమ్మే ఆస్కారం ఉంటుంది.
ఎందుకు? అసత్య ప్రచారాలు వస్తే, వాస్తవాలు గురించి ఆలోచించాలి?
ఒక్క ఉదాహరణ చూద్దాం!
ఒక ఊరిలో ఒక సర్పంచి గ్రామ అభివృద్ది పనులలో భాగంగా ఒక పనికి పూనుకున్నారు. కానీ అతని ప్రత్యర్ధి ఆ పనిలో సర్పంచి డబ్బులు సంపాదించుకుంటున్నారని, అసత్య ప్రచారం చేస్తే, దానిని ఆ ఊరి ప్రజలంతా నమ్మితే, ఆ అభివృద్ది పని ముందుకు సాగదు. ఇంకా ఎన్నికల జరిగినప్పుడు, ఆ సర్పంచి ఓడిపోవచ్చును. కుట్రతో అసత్య ప్రచారం చేసిన వ్యక్తి, అధికారంలోకి రావచ్చును. అప్పుడు ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అదే అసత్య ప్రచారం జరుగుతున్నప్పుడే, ప్రజలు వాస్తవం గ్రహించి ఉంటే, ఊరి ప్రజల సహకారం, ఆ ఊరి సర్పంచికి ఉంటాయి. ఆ ఊరి అభివృద్ది జరుగుతుంది. కనుక సమాజంలో వచ్చే అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి ప్రజలు పరిశీలన చేయాలని అంటారు.
అవాస్తావాలు నమ్మశక్యంగా ఉండవచ్చు లేదా నమ్మలేనివిగా ఉండవచ్చును. కానీ వాటిని ప్రచారం చేసేవారు బలంగా ప్రచారం చేస్తారు. కావునా ప్రచారం చేస్తున్న వ్యక్తి విశ్వనీయతను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
అసత్య ప్రచారాలు ఇప్పుడైతే మరింత వేగంగా వ్యాపిస్తాయి. కారణం సోషల్ మీడియా చాలా వేగంగా పని చేస్తుంది. కావునా అప్రమత్తతో ఉండాలి. అందుకే అనేక న్యూస్ ఛానల్స్ అందుబాటులో ఉన్నట్టే, అనేకమంది న్యూస్ ఎనలిస్టులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు.