విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

యూట్యూబ్ వచ్చాక మనకు నచ్చినా లేక మనం మెచ్చి ఎంపిక చేసుకున్న సినిమాలో స్మార్ట్ ఫోనులో కానీ లాప్ టాపులో కానీ చూడడానికి అవకాశం వచ్చింది. ఎక్కువగా కొత్తసినిమాలలో సమాజంలో ఉండే ట్రెండు, యూత్ ఆకర్షితులయ్యే విషయాల గురించే ఎక్కువగా ఉండడం లేదా ఏదైనా అసాధారణ సంఘటనల ఆధారంగా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి ట్రెండును బట్టి వచ్చేసినిమాలో అందరికీ నచ్చకపోవచ్చును. ఎందుకంటే, సమాజం విభిన్న సంస్కృతులు, భిన్న మతాలు అలాగే భిన్నమైన తరాలు కలిపి ఉంటుంది. విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

యూత్ ఇప్పటి తరం అయితే, మద్యవయస్సువారు నిన్నటితరం అయితే, ముదుసలివారు మొన్నటి తరం అయితే, సమాజం మూడుతరాలతో కలిసి ఉంటుంది. మూడు తరాలను మెప్పించే చిత్రాలు ఇప్పుడు వస్తున్న అన్ని చిత్రాలకు అసాద్యమే అవుతుంది. చిత్రవిచిత్రమైన విషయాలతో సాగే చలనచిత్రాలు సమాజంలో సగటు వ్యక్తి చిత్తముపై ప్రభావం చూపుతాయి. అలనాటి పాతచిత్రాలకు అభిమానులు కూడా మనకు ఎక్కువగానే ఉంటారు, అటువంటివారు యూట్యూబ్ ద్వారా పాతచిత్రాలను వీక్షించడానికి అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోను కూడా పెద్దతెరను కలిగి ఉండడం వలన స్మార్ట్ ఫోనులోనే యూట్యూబ్ సినిమాలను వీక్షించడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పటి సాంకేతిక ట్రెండుననుసరించి స్మార్ట్ టివీల వాడకం కూడా పెరుగుతుంది. పాతటీవిల స్థానంలో స్మార్ట్ టివీల వినియోగం పెరగుతుంది. కారణం స్మార్ట్ టివీలలో కూడా బడ్జెట్ టివీలు రావడం కావచ్చు. ఏదైనా యూట్యూబ్ ద్వారా పాతచిత్రాలను ఎంపికచేసుకుని చూడడానికి అవకాశం ఉంది. విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

సంక్రాంతి సినిమా చూడండి యూట్యూబ్ ద్వారా కోటిమంది ఈ చిత్రాన్ని చూశారు, అంటే ఫ్యామిలి విలువలను తెలియజేసే ఈ చిత్రాన్ని కోటిమంది చూడడం అంటే, కుటుంబవిలువలను గూర్చి తెలియజెప్పే చిత్రాలను ఆదరించడంలో ధియేటరకు వెళ్లి చూసే ప్రేక్షకులే కాకుండా, సోషల్ మీడియా ప్రేక్షకులు కూడా పెద్దపీట వేస్తున్నారు. సహజంగా సంక్రాంతి పండుగ కుటంబం అంతా కొత్త బట్టలు ధరించి, కొత్త వంటకాలు చేసుకుని, బంధువులను ఇంటికి ఆహ్వానించి, సంతోషంగా కుటుంబం అంతా గడిపే పండుగుగా ఉంటే, ఈ సంక్రాంతి సినిమా మాత్రం ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు సంక్రాంతే అంటుంది.

చిన్న కుటుంబంలోకి చుట్టాలు వస్తే, ఆకుటుంబంలో ఆరోజు పండుగ వాతావరణం కనబడుతుంది. మరి ఉమ్మడి కుటుంబం అయితే, రోజు ఎక్కువమంది కలసి ఉండేవారు ఉండడం, రోజూ ఎవరో ఒకరి తరపు బంధువులు చుట్టపుచూపుకు ఇంటికి రావడం ఉంటే, ఆకుటుంబంలో రోజు పండుగా వాతావరణమే. వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, స్నేహ, ఆర్తిఅగర్వాల్, సంగీత, శారద, చంద్రమోహన్ తదితరులు నటించిన సంక్రాంతి సినిమా, ఉమ్మడి కుటుంబంలో ఒకరిపైఒకరికి అవగాహన ఉంటే ప్రతిరోజూ సంక్రాంతే అంటుంది. సంక్రాంతి సినిమా యూట్యూబ్ ద్వారా చూడడానికి ఈ క్రింది వీడియోపై టచ్ చేయండి.

అమ్మను మించిన దైవమున్నదా అన్నట్టుగా అమ్మపై అంతులేని అభిమానాన్ని పెంచేసుకున్న పెంపుడు కొడుకుపై కపటప్రేమను చూపుతూ ఉండే తల్లి, ఆ ఇద్దరికి ఒకరికి భార్యగా, మరొకరికి కోడలుగా తెలివైన అమ్మాయితో సినిమా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం సెంటిమెంటు సన్నివేశాలతో బాటు, హాస్యసన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కధలో పట్టులేకపోతే ఆదరించని సమయంలో, మంచి కుటుంబకధాచిత్రంగా అందరిని ఆకట్టుకున్న తెలుగుచలనచిత్రం. సంక్రాంతి అంటే పైన ఉన్న పెద్దరికం నుండి ఆశీస్సులను పొందే పండుగ అయితే, ఈచిత్రంలో విషం ఇచ్చిన అమ్మలో కూడా అమ్మ ఆశీర్వాదాన్నే చూసిన ఉత్తమ భారతీయ కొడుకుగా అబ్బాయిగారు చిత్రం ఉంటుంది.

విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

ధర్మచక్రం తెలుగు చలనచిత్రం తండ్రి దుర్మార్గానికి బలైన ఒక వ్యక్తికధ, కొన్ని చిత్రాల విశ్లేషణ కన్నా చూసి, తెలుసుకోవడమే బాగుంటుంది. అటువంటి చిత్రంగా ధర్మచక్రం తెలుగుచలనచిత్రం కూడా. తల్లితర్వాత కొడుకుకు తండ్రి మార్గదర్శకుడు అవుతాడు, అయితే ఈ ధర్మచక్రం సినిమాలో తండ్రి దుర్మార్గుడు, తల్లిదేవత, కొడుకు ఉత్తమ లక్షణాలను కలిగి ఉన్నవాడు. అటువంటి తల్లిదండ్రులకు, వారి యొక్క కొడుకు మద్య జరిగే సంఘర్షణ ఈచిత్రంలో కనబడుతుంది.