బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు

బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు చక్కగా చూపుతుంది. బలరామకృష్ణులు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి బలరామకృష్ణులు అలంపురం ఊరిలో ఇద్దరి అన్నదమ్ముల మద్య జరిగే కధలో ఒక యువజంట ప్రేమాయణం ఈ చిత్ర కధ. బలరామయ్య(శోభన్ బాబు) – కృష్ణమూర్తి(కృష్ణమూర్తి) అన్నదమ్ములు అయితే తండ్రి ఒక్కరే తల్లులు వేరు. కృష్ణమూర్తికి ఒక చెల్లెలు (కల్పన). మొదట్లో ఇద్దరు అన్నదమ్ములు చెల్లెలతో సంతోషంగా ఉన్నట్టు, గిట్టనివారు చెప్పుడు మాటలతో బలరామయ్య, తన తమ్ముడుని, చెల్లెల్ని దూరంగా పెట్టినట్టు…