Month: September 2019

నలదమయంతి తెలుగుభక్తి సినిమా

అలనాటి పాత తెలుగు సినిమాలలో నలదమయంతి తెలుగుభక్తి సినిమా ఒక్కటి. ఈ తెలుగు సినిమాలో నలమహారాజు, దమయంతిల వివాహ ఘట్టం నుండి సన్నివేశాలు ఉంటాయి. నలదమయంతి కధ మహాభారతంలో ధర్మరాజు విన్న కధలలో ఒక్కటి. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, అగ్రజుడు అయిన ధర్మరాజు ఈ కధ వింటాడు. ఇక ఈ సినిమా అయితే నలదమయంతిల హంసరాయభారంతో ప్రారంభం అవుతుంది. హంస రాయభారంతో నలుడికి దమయంతి మీద, దమయంతికి నలుడి మీద ఒకరంటే ఒకరికి ఇష్టం మానసికంగా ఏర్పడుతుంది. […]

సూర్య, మోహన్ లాల్, ఆర్యల బందోబస్త్

సూర్యకు తమిళమే కాకుండా తెలుగులోనూ మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. గజినితో గుర్తింపు తెచ్చుకున్న సూర్య, యముడు, సింగం, సింగం2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బందోబస్తు. ఇందులో సూర్యతో బాటు మోహన్ లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖిని, పూర్ణ తదితరులు నటించారు. దేశ ప్రధానమంత్రి చుట్టూ కధ తిరుగుతుంది, ప్రధానిని రక్షించే అధికారిగా రవికాంత్ (సూర్య) ఇందులో జీవిస్తాడు. లండన్ పర్యటనలో ఉన్న ప్రధానిపై ఎటాక్ […]

గద్దలకొండ గణేష్ విడుదలకు ముందు వాల్మీకిగా ప్రచారం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శింపడుతుంది. గతంలో గబ్బర్ సింగ్-1 చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ కు ఆస్థాయిలో మరో హిట్ రాలేదు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రం అనూహ్య విజయంగానే అంచనా వేస్తున్నారు. అనూహ్య విజయాలు ఎప్పుడూ కొత్త రికార్డులవైపు వెళుతూ ఉంటాయి. అయితే వరుణ్ తేజ్ కు వచ్చిన హిట్ […]

3 నెలల్లో కోటికి పైగా వ్యూస్ ఉన్న రోషగాడు సినిమా కధ?

రోషగాడు సినిమా చూడడానికి ఈ అక్షరాలను తాకండి వైవిధ్యం కన్నా కధలో పట్టు ఉండి, ఆశయం సామాజిక స్పృహను గుర్తిస్తే, ఆ విషయం సమాజంలో తొందరగా చేరుతుంది. అలాంటి ఒక చిత్రం రోషగాడు తెలుగులోకి డబ్బింగ్ చేయబడిన సినిమా. విజయ్ ఆంటోని నటించిన ఈ చిత్రం యూట్యూబ్లో ఒక కోటికి పైగా వ్యూస్ పొందింది. యుక్తవయస్సులోకి మారే వ్యక్తి, తన చుట్టూ ఉండే సమాజంలో తన ఐడింటిటీని చెక్ చేసుకుంటాడు. తనను సమాజం ఏవిధంగా ఐడింటిఫై చేస్తుంది? […]

బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ

బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ. ఎన్.టి. రామారావు, ఎస్వీ రంగారవు, రేలంగి, సి.యస్.ఆర్. అంజలీదేవి, రాజసులోచన, సూర్యకళ, హేమలత తదితరులు నటించారు. వేదాంతం రాఘవయ్యగారు బాలనాగమ్మ తెలుగు మూవీకి దర్శకత్వం వహించారు. రాజదంపతులకు పిల్లలు లేక బాధపడుతుండగా, ఒక సన్యాసి వచ్చి వారికి సంతానయోగం కలిగే అవకాశం ఉందని, వెంటనే ఈశ్వరుడిని ప్రార్ధించమని చెబుతాడు. దానితో మహారాణి ఆలయానికి వెళ్లి పరమభక్తితో పరమేశ్వరుడిని పూజిస్తుంది. సంతోషించిన ఈశ్వరుడు ”ఈశాన్య దిక్కున ఒక చెట్టు ఉంది, ఆ […]

మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ

మాయాబజార్ వీడియో వీక్షణకు ఇక్కడ క్లిక్ లేక టచ్ చేయండి పాండవులు కనిపించకుండా పాండవులకు సంబంధించిన కధతో ఒకప్రేమకధను చాలా చక్కగా ఆబాలగోపాలం అలరించేవిధంగా మాయాబజార్ సినిమాను తీయడం కె.వి.రెడ్డిగారికే చెల్లింది. ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రేలంగి, సావిత్రి లాంటి హేమాహెమీలు నటించిన ఈ మాయాబజార్ తెలుగు ఓల్డ్ మూవీ మొత్తం సకుటుంబసమేతంగా చూసి సంతోషించి ఉంటారు. అంత చక్కని కధతో, చక్కని హాస్యంతో హృదయానికి హత్తుకుంటుంది. అలనాటి మేటిచిత్రరాజములలో మనకుమరో మకుటం మాయాబజార్ తెలుగు పాతసినిమా. […]

కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు

కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు తెలుగు ఓల్డ్ మూవీ. తెలుగు ఓల్డ్ మూవీలో పెద్దమనుషులు సినిమా కొందరి పెద్దమనుషుల మసుగును చూపుతుంది. తెలుగులో గల ఓల్డ్ మూవీస్ చూడడానికి మనసు మొరాయించ వచ్చును. కానీ మనసుకు మేలు కలిగించే విషయాలు పాత సినిమాలలో కూడా కనబడతాయి. వాస్తవాలకు దూరంగా అవసరాలకు అనుగుణంగా మాట ఎలా మారుతుందో ఆలోచన చేస్తే, పెద్ద మనుషుల ప్రవర్తన, వారి మాటలు ఇంకెంతలాగా అవసరానికి అనుగుణంగా వాస్తవాలను దాస్తాయో పెద్దమనుషులు సినిమా చూస్తే […]

భారతంలోని ధర్మరాజు గురించి పూర్తి స్థాయిలో తెలుగు మూవీ?

ఎప్పుడైనా చారిత్రాత్మకమైన పుస్తకాలు చదివితే, ఒక రాజు గురించి చెప్పేటప్పుడు, అతను ”ఆ దేశానికి రాజు, ఈ దేశానికి రాజు” అంటూ ఎందరో రాజుల గురించి చరిత్రలో చదువుకుంటాం. కానీ ధర్మానికి రాజుగా మాత్రం ధర్మరాజునే ప్రవచనకారులు చెబుతారు. ధర్మాన్ని అంతలా ఆచరించిన మహానుభావుడుగా ద్వాపరయుగంలో కీర్తింపబడిన ధర్మరాజు గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. మన భారతంలోని ధర్మరాజు మాటకు విజయుడుగా కీర్తి పొందిన అర్జునుడు కట్టుబడి ఉంటాడు. భారతంలో అర్జునుడు ధర్మరాజు మాటను అతిక్రమించకుండా నడుచుకున్నాడు. అని […]

శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా

పాత పౌరాణిక సినిమాలలో ఆంజనేయుని గురించి అంటే చాలా ఆసక్తి ఉంటుంది. ఆంజనేయుడు అంటే అందరికీ ఇష్టేమే. అలాంటి శ్రీఆంజనేయస్వామి చరిత్ర తెలుగుసినిమా గురించి తెలుగురీడ్స్ పోస్టులో చూద్దాం. శ్రీ ఆంజనేయచరిత్ర సినిమాను చూడడానికి ఇక్కడ తాకండి నిత్యం రామనామజపంతో చిరంజీవిగా ఉండే శ్రీఆంజనేయస్వామి అనేకమంది భక్తులను కలిగిన పరమ శ్రీరామభక్తుడు. రామసంకీర్తనం చేస్తూ, శ్రీరామచంద్రుడిని హృదయంలో పదిలపర్చుకున్న భక్తాగ్రేసుడు, హనుమ, ఆంజనేయస్వామి, మారుతి, అంజనీపుత్రుడు, రామదూత అంటూ అనేక నామాలతో నిత్యం భక్తుల మనసులో మెదులుతూనే […]

శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం

ఆనాటి పాత తెలుగు చిత్రాలలో శివలీలలు తెలుగుభక్తి పాతచిత్రం ఒక్కటి. శివలీలలను చూపుతుంది. శివలీలలు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి శివుడిగా శివాజీ గణేషన్ నటించిన శివలీలు తెలుగులోకి డబ్ చేయబడిని చిత్రం కైలాసంలో ఓం నమ:శివాయ అంటూ ఋషులు ప్రార్ధన, శివపరివారం నృత్యం, వాయిద్యంతో నారదాది మహర్షుల ప్రార్ధనతో సినిమా ప్రారంభం అయ్యి, పార్వతి మాత ప్రార్ధనతో మహాదేవుడు బహిర్ముఖుడు అవుతాడు. మహాదేవుడు, మహాదేవిల సమక్షంలో నారద మునీంద్రుడు తన దగ్గర ఉన్న ఫలమును పరమశివునికి […]