Day: September 24, 2019

  • సూర్య, మోహన్ లాల్, ఆర్యల బందోబస్త్

    సూర్యకు తమిళమే కాకుండా తెలుగులోనూ మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. గజినితో గుర్తింపు తెచ్చుకున్న సూర్య, యముడు, సింగం, సింగం2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా బందోబస్తు. ఇందులో సూర్యతో బాటు మోహన్ లాల్, ఆర్య, సయేషా సైగల్, సముద్రఖిని, పూర్ణ తదితరులు నటించారు. దేశ ప్రధానమంత్రి చుట్టూ కధ తిరుగుతుంది, ప్రధానిని రక్షించే అధికారిగా రవికాంత్ (సూర్య) ఇందులో జీవిస్తాడు. లండన్ పర్యటనలో ఉన్న ప్రధానిపై ఎటాక్…

  • గద్దలకొండ గణేష్ విడుదలకు ముందు వాల్మీకిగా ప్రచారం

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా గద్దలకొండ గణేష్ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శింపడుతుంది. గతంలో గబ్బర్ సింగ్-1 చిత్రానికి దర్శకత్వం వహించిన హరీష్ శంకర్ కు ఆస్థాయిలో మరో హిట్ రాలేదు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ చిత్రం అనూహ్య విజయంగానే అంచనా వేస్తున్నారు. అనూహ్య విజయాలు ఎప్పుడూ కొత్త రికార్డులవైపు వెళుతూ ఉంటాయి. అయితే వరుణ్ తేజ్ కు వచ్చిన హిట్…

  • 3 నెలల్లో కోటికి పైగా వ్యూస్ ఉన్న రోషగాడు సినిమా కధ?

    రోషగాడు సినిమా చూడడానికి ఈ అక్షరాలను తాకండి వైవిధ్యం కన్నా కధలో పట్టు ఉండి, ఆశయం సామాజిక స్పృహను గుర్తిస్తే, ఆ విషయం సమాజంలో తొందరగా చేరుతుంది. అలాంటి ఒక చిత్రం రోషగాడు తెలుగులోకి డబ్బింగ్ చేయబడిన సినిమా. విజయ్ ఆంటోని నటించిన ఈ చిత్రం యూట్యూబ్లో ఒక కోటికి పైగా వ్యూస్ పొందింది. యుక్తవయస్సులోకి మారే వ్యక్తి, తన చుట్టూ ఉండే సమాజంలో తన ఐడింటిటీని చెక్ చేసుకుంటాడు. తనను సమాజం ఏవిధంగా ఐడింటిఫై చేస్తుంది?…

  • బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ

    బాల నాగమ్మ తెలుగు ఓల్డ్ మూవీ. ఎన్.టి. రామారావు, ఎస్వీ రంగారవు, రేలంగి, సి.యస్.ఆర్. అంజలీదేవి, రాజసులోచన, సూర్యకళ, హేమలత తదితరులు నటించారు. వేదాంతం రాఘవయ్యగారు బాలనాగమ్మ తెలుగు మూవీకి దర్శకత్వం వహించారు. రాజదంపతులకు పిల్లలు లేక బాధపడుతుండగా, ఒక సన్యాసి వచ్చి వారికి సంతానయోగం కలిగే అవకాశం ఉందని, వెంటనే ఈశ్వరుడిని ప్రార్ధించమని చెబుతాడు. దానితో మహారాణి ఆలయానికి వెళ్లి పరమభక్తితో పరమేశ్వరుడిని పూజిస్తుంది. సంతోషించిన ఈశ్వరుడు ”ఈశాన్య దిక్కున ఒక చెట్టు ఉంది, ఆ…