ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే…

ఒక కుక్కకు విశ్వాసం ఉంటుంది, తనకు తిండి పెట్టిన ఇంటి యజమాని ఇంటిని రక్షణ చేయడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. మరి పురుషుడైనా, స్త్రీ అయినా భూమిమీదకు రావాలంటే స్త్రీ గర్భం ధరిస్తేనే. స్త్రీ ప్రసవవేదన మరణవేదనతో సమానం అటువంటి స్త్రీకి చేతులు జోడించి నమస్కారం చేసిన మన సమాజంలో మగాడు మృగాడు అవ్వడం విశ్వాసఘాతుకమే అవుతుంది. ప్రియాంక రెడ్డి మరణం టివిలో చూస్తుంటే, మనిషికి జన్మినిచ్చే స్త్రీ ఎంత వేదనను పొంది ఉంటుంది?

స్త్రీ సహజంగానే పెద్ద పెద్ద త్యాగాలనే చేస్తుంది. ఒకటి వివాహం చేసుకుని తనకు అంతగా పరిచయం లేని అత్తవారింటికి వచ్చి, అందరిలో కలుస్తుంది. తనకు తాళి కట్టిన భర్తకు అన్ని సేవలు చేస్తుంది. తన అత్తవారింటి వంశం పెరగడానికి స్త్రీ తనకు మరణసదృశ్యమైన వేదనను పొందడానికి సిద్దపడుతుంది. అటువంటి స్త్రీపై ప్రియాంకరెడ్డి లాంటి దారుణ హత్యాచారాలు జరగడం, సమాజం ఏస్థితిక పోతుంది?

భారతీయ స్త్రిని గౌరవించడ మన సంప్రదాయం అని ఆర్ టి సి బస్సులలో వ్రాసుకోవడం జరిగిందంటే, అంతకుముందు మన పెద్దలు స్త్రీని ఎంతగా గౌరవించి ఉంటారు. అలాంటి మన సమాజం నుండి నేటి సమాజంలో స్త్రీపై దారుణాలు జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం, భయంకరం. ఇంక స్త్రీ ఎలా సమాజంలో తిరుగుతుంది. ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే… చూసిన స్త్రీ ఎటువంటి వేదన గురి అవుతుంది.

నిర్భయచట్టం ప్రభుత్వం తీసుకువచ్చినా ఇలాంటి దారుణాలు స్త్రీపై జరగడం అమానుషం, ఇలాంటి అమానుషాలు జరిగిప్పుడు అందరం కఠినంగా శిక్షించాలి అని రోదించడం ఒక్కటే ఉంటుంది. కఠిన శిక్షలు ఉంటే, ఇలాంటి మృగాళ్ళకు భయం పెరుగుతుందా? ఇలాంటి ప్రశ్నలకు పండితులు రివ్యూలు చదవడం ఉంటుంది. కానీ సమాజంలో మాత్రం మృగాళ్లకు ప్రియాంకరెడ్డి లాంటి స్త్రీలు బలి అవుతున్నారు. దారుణంగా సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

అసలు స్త్రీపై ఇలాంటి హత్యాచారాలు జరపడానికి, వారికి ప్రేరణ ఎక్కడ నుండి వస్తుంది. ఆ మృగాళ్ళకు తల్లిదండ్రులు చెప్పే నీతి ఏమైనా ఉందా? నీతి చెప్పలేక తల్లిదండ్రులు వదిలేస్తున్నారా? ఇలా మృగాళ్ల తల్లిదండ్రుల విషయంలో కొన్ని ప్రశ్నలు ఉంటే, వారి వారి స్నేహితులకు ఉండే అలవాట్లు ఏమిటి? మృగాళ్లు మరియు వారి స్నేహితులకు చోటిచ్చిన సమాజం, ఎలాంటిది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం? అనే భయంకర ప్రశ్న ఉదయిస్తుంది. ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే… వచ్చే సహజమైన ప్రశ్నలు ఇలా ఉంటే, ఇంతకుముందు టివిలలో వచ్చిన, స్త్రీలపై జరిగిన దారుణాలు గుర్తుకు వస్తుంటే మన సమాజం ఎటువైపు వెళుతుంది?

వంద మంది నేరస్తులకు శిక్షపడకపోయినా సరే ఒక నేరం చేయని వ్యక్తి శిక్ష పడకూడదనే న్యాయవ్యవస్థ వలననే మృగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారా? దారుణాలు చేయడానికి కారణం? కఠినశిక్షలు వెంటనే అమలు కావనే ధైర్యం మృగాళ్ళల్లో పెరుగుతుందనే భావన, ప్రియాంకరెడ్డి మరణం టివీలో చూస్తుంటే… బలపడుతుంది. దారుణం, అమానుషం, అన్యాయం అంటూ నినాదాలు చేసే ప్రజలు ప్రియాంకరెడ్డి లాంటి స్త్రీలపై జరిగినప్పుడు పెరుగుతున్నాయి. కానీ ఇటువంటి సంఘటనలు జరగడం సమాజికంగా భయంకరమైనది.

ప్రియాంకరెడ్డి మరణం లాంటి దారుణ మరణాలు మరలా జరగకుండా ఉండాలి. సమాజంలో యువతకు ధర్మం, న్యాయం, నీతి, స్త్రీ అంటే గౌరవభావం లేకుండా వలన ఇలాంటి దారుణాలు జరగడానికి ప్రేరణ మృగాళ్లకు పెరుగవచ్చును. యువతలో స్త్రీ గురించి చెడుభావన కాకుండా సద్భావన పెరగాలి. స్త్రీ ఒక జీవికి జన్మినిచ్చి సృష్టికర్తగా మారుతుంది. అటువంటి స్త్రీపై గౌరవభావన మరింత పెరగాలి.

ప్రియాంకరెడ్డి ఆత్మశాంతిని పొందాలని ఆశిస్తూ, ఇటువంటి మరణాలు మరే ఇతరస్త్రీకి జరగకూడదు అని కోరకుంటూ….ప్రభుత్వం సరైన రీతిలో మృగాళ్లకు ముచ్చెమటలు పట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ…తెలుగురీడ్స్….. సారీ టు స్త్రీ….

మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్

తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి నానుడి పెద్దల నుండి వింటూ ఉంటాం. అంటే మినప గారెలు తింటే ఒంటికి బలం వస్తే, మహాభారతం వింటే మనసుకు బలం వస్తుంది అంటారు. ధర్మం చాలామందికి తెలిసిన ధర్మసూక్ష్మం అందరికీ అందదు అంటారు. కానీ మహాభారతం చదివి, అవగాహనే చేసుకోగలిగితే, ధర్మసూక్ష్మములలో మర్మమేటో తెలియవస్తుందని అంటారు. మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ గురించి ఈ పోస్టులో చదవండి.

మరే ఇతర పురాణం విన్నా భగవంతునిపై భక్తి కలిగితే, మహాభారతం వింటే ధర్మంపై ఆలోచన పుడుతంది. అది సందేహం అవ్వవచ్చును, లేక ధర్మంగా బ్రతకాలన్న తలంపు కావచ్చును. అది చదివే హృదయం, అర్ధం చేసుకునే మనోస్థితిని బట్టి ఉంటుందని కూడా అంటారు. ఎవరైనా ఒక విషయం గురించి చెబుతూ… ఇదే నిజం అంటే, దానికి బదులుగా… సరే అంటాం, కానీ అది అబద్ధం అనగానే మరి నిజమేమిటి? ప్రశ్నిస్తాం అబద్దం మహిమ అలా ఉంటే, మరి సందేహం ఇంకెంత ఆత్రం కలిగిస్తుంది? మరీ ధర్మ సందేహమైతే మరీ ఆసక్తి పెరుగుతంది. అందుకేనేమో తింటే గారెలు తినాలి – వింటే భారతం వినాలి అనే నానుడి ప్రాచుర్యం పొంది ఉంటుంది. గారెలు ఒంటికి శక్తి అయితే, మహాభారతం మనసుకు శక్తినిస్తుంది అంటారు.

మహాభారతం తెలుగు ఫ్రీబుక్స్ లింకులు

మూడువేల పేజిలకు పైగా ఉన్న సంపూర్ణ మహాభారతం తెలుగులో చదవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. మరీ గ్రాంధిక భాష కాకుండా కొంచెం వాడుక భాష మాదిరగానే చదవడానికి అనువుగా ఉండే సైజులో అక్షరాలు ఉంటాయి. ఈ పుస్తకమును రచించినవారు మొదలి వెంకట సుబ్రహ్మణ్యంగారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వారు రచింపచేసిన  సంపూర్ణ ఆంధ్ర మహా భారతం-1 నుంచి 15 భాగాలు పిడిఎఫ్ ఆన్ లైన్ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి. సుమారు పదివేలకు పైగా పేజిలతో సంపూర్ణ ఆంధ్ర మహాభారతం 1 నుండి 15 భాగాలు ఉంటాయి. పర్వముల వారీగా శ్లోకాలు, ప్రతిపదార్ధం, తాత్పర్యంతో ఈ తెలుగు పిడిఎఫ్ బుక్ ఉంటుంది. ఈ బుక్ రీడ్ చేయడం వలన తెలియని తెలుగు పదాలకు అర్ధములు తెలియవస్తాయి.

తెలియని వస్తువు వాడేటప్పుడు, ఆ వస్తువును గతంలో ఉపయోగించిన అనుభజ్ఙుని మాటలు విని, తద్వారా కొత్త వస్తువును సరిగా ఉపయోగిస్తాం. ఉపోద్ఘాతం వినడం వలన విషయంపై పట్టు పెరుగుతుంది. అలాగే మహాభారతం లాంటి గ్రంధాలు చదివేటప్పుడు ఆయా గ్రంధం యొక్క ప్రయోజనం, గ్రంధం యొక్క సద్భావనను పండితుల ద్వారా తెలుసుకుని, ఆ గ్రంధం పూర్తి పఠనం చేయడం ద్వారా, సదరు గ్రంధపఠన ఫలితం పూర్తిగా పొందగలరని అంటారు. ఈ విధంగా చూస్తే మహాభారతం దర్మసందేహాలను కూడా తెచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మహాభారతం సంపూర్ణ గ్రంధపఠనం కన్నా ముందే మహాభారతం గురించిన ప్రవచనాలు వినడం మేలని పండితులు అంటారు. లేదా ఏదైనా మహాభారతం గురించి ధర్మసూక్ష్మములను, మహాభారత ప్రధాన ప్రయోజనం గురించి వివరించే రచనలు మొదటిగా చదవడం కూడా ప్రయోజనమేనని చెబుతారు. ఈ విధంగా అయితే  ఆంధ్ర మహాభారతంలో ధర్మ సూక్ష్మములు పేరిట శ్రీరామచంద్రమూర్తి గారు రచించిన తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

బాలలకు బొమ్మలను చూడడం ద్వారా ఆసక్తి కలుగుతుంది. బాలలకు పుస్తకాలలో వచనం కన్నా బొమ్మలు ఎక్కువగా ఉంటే, ఆయా బొమ్మలను పరిశీలిస్తూ, వచనం కూడా చదవడానికి ఇష్టపడతారు. బాలలు భారతం చదవాలంటే వారికి బొమ్మలతో కూడిన తెలుగుభారతం బుక్ ఇస్తే చూస్తూ చదవడానికి ప్రయత్నిస్తారు. బొమ్మలు కలిగిన భారతం పిడిఎఫ్ పుస్తకంగా ఆన్ లైన్లో ఉచితంగా లభిస్తుంది.  బాలానంద బొమ్మల భారతం తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

ఇంకా ఈ ఇతిహాసములోని వ్యక్తుల గురించి అంటే భీష్ముడు, ద్రోణుడు, భీముడు, ద్రౌపది, శకుని, ధృతరాష్ట్రుడు విడి విడి ఉన్న తెలుగుబుక్స్, పర్వముల వారీగా విడి విడి ఉన్న తెలుగుబుక్స్, భారతంలో నీతి కధలు తదితర మహాభారతంపై ఉన్న వివిధ రచనల తెలుగుబుక్స్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

గురువు గొప్పతనం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలోనే వినాలి. గురువుగారు గురువుల గొప్పతనం వివరిస్తుంటే, గురువులపై గౌరవం ఇంకా పెరిగుతుంది. అటువంటి గురుతత్వం భారతదేశంలోనే ఉండడం భారతీయులుగా పుట్టిన మన అదృష్టం. గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ ఆన్ లైన్లో మనకు లభిస్తున్నాయి.

నిత్యజీవితంలో ఉపాధికొరకు అవసరమైన విద్య అన్ని చోట్ల లభిస్తుంది. అయితే ఒక వ్యక్తి తాత్విక పరిశీలనతో లేక అచంచలమైన భక్తితో తరించాలంటే, సద్గురువులు బోధించిన బోధనలు మార్గం చూపుతాయి అంటారు. అటువంటి సద్గురువులకు ఆలవాలం మన భారతదేశం. మన భారతీయ గురువులు దార్శినికత ఎంతో గొప్పదిగా పండితులు చెబుతూ ఉంటారు. వారు భవిష్యత్తును తమ మనో నేత్రంతో దర్శించి, భారతీయులకు అవసరమైన భక్తితత్వం, ఆత్మతత్వం, యోగ విజ్ఙానం వంటివి అందించారని చెబుతారు.

బ్రహ్మమును తెలియగోరువారికి బ్రహ్మము తెలిసిన వారి మార్గదర్శకము తప్పనిసరిగా చెబుతారు. పరబ్రహ్మ కాల స్వరూపంగా ఎప్పుడు ఎవరిని అనుగ్రహిస్తాడో తెలియదు. కాలస్వరూపుడు కాలంలో కలిగజేసే కష్టకాలం పరీక్షా కాలంగా చెబుతారు. అటువంటి పరీక్షాకాలం గట్టెక్కాలంటే, సరైన గురువు అనుగ్రహం వలన సాధ్యమంటారు. గురువు అనుగ్రహం ఉంటే ఈశ్వరానుగ్రహం కలిగినట్టేనని పండితులు అంటారు.

గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్ లో గురువిజ్ఙాన సర్వస్వము తెలుగు ఉచిత పుస్తకము ఆన్ లైన్లో లభిస్తుంది. ఇందులో శ్రీకృష్ణం వందే జగద్గురుమ్, శ్రీ దక్షిణామూర్తి స్త్రోత్రమ్, శ్రీశంకరాచార్య కృత గుర్వష్టకమ్, శ్రీ గురు పాదుకాప్త్రోత్రమ్ తదితర గురుస్త్రోత్రాలతో బాటు వాటి భావములను తెలియజేస్తూ ఈ తెలుగుబుక్ ఉంటుంది. గురువిజ్ఙానమునకు సంబంధించిన స్త్రోత్రములు ఎక్కువగా ఈబుక్ లో ఉంటాయి. గురువిజ్ఙాన సర్వస్వము తెలుగు ఫ్రీ పిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఈ అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

విశ్వామిత్ర మహర్షి అంటే కోపం గుర్తుకు వస్తుంది అంటారు, కానీ అంతే స్థాయిలో పట్టుదల కూడా ఎక్కువే, తనపై తనకు ఉండే అచంచలమైన విశ్వాసముతో బ్రహ్మ, మహేశ్వరులను మెప్పించగలిగాడు. అనేక సంవత్సరాల తరబడి తపస్సు చేశాడు. వశిష్ఠ మహర్షిపై కోపంతో, తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారిన మహారాజు చరిత్ర అమూల్యమైనదిగా చెబుతారు. ఈ మహర్షి సత్యహరిశ్చంద్ర మహారాజుని ముప్పుతిప్పలు పెట్టి, సత్యహరిశ్చంద్రుడి కీర్తిని ఆచంద్రతార్కమునకు విస్తరింపజేశాడు. ఇంకా శ్రీరామలక్ష్మణులకు గురువు అయ్యాడు. విశ్వామిత్ర మహర్షి గురించి తెలియజేసే తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

మరిన్ని గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

యోగుల జీవితాలలో జరిగే అద్భుతాలు భగవంతునిపై నమ్మకం, భగవంతుని స్వరూపంపై ఒక అవగాహన ఏర్పడుతుందని అంటారు. అటువంటి యోగుల జీవిత చరిత్రలను చదవడం మనసుకు మేలు కలుగును అంటారు. అటువంటి యోగులలో పరమహంస యోగానంద్ గారి ఆత్మకధ తెలుగు ఉచిత పుస్తకం ఆన్ లైనో ఉచితంగా చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ఈ తెలుగు ఫ్రీబుక్ మీరు ఫ్రీగా పిడిఎఫ్ ఫార్మట్లో రీడ్ చేయవచ్చును.

కంచికామకోటి పీఠాధిపతి పరమాచార్య శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవునిగా అందరూ కీర్తిస్తారు. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారితో నీలంరాజు వెంకటశేషయ్య గారు తనకున్న అనుభవాలతో, తన మిత్రుల అనుభవాలతో ఆయనే రచించిన తెలుగు ఫ్రీబుక్ నడిచే దేవుడు. ఈ పుస్తకంలో నీలంరాజు వెంకటశేషయ్యగారు పరమచార్యులను దర్శించుకున్న సందర్భం నుండి ప్ర్రారంభం అవుతుంది. నడిచే దేవుడు పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి గురించి తెలియజేసే నడిచే దేవుడు తెలుగు ఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ ఈ అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

మనిషికున్న నాలుగు రుణములలో ఋషి రుణం కూడా ఒక్కటిగా పండితులు చెబుతారు. ఋషి ఋణం తీరాలంటే మహర్షులు రచించిన వాజ్ఙ్మయం చదవడమేనని చెబుతారు. ముఖ్యంగా వేదవ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణములను, మహాభారత, భాగవతాది గ్రంధపఠనము చేయాలని చెబుతూ ఉంటారు. ఇంకా మనకు అగస్త్య మహర్షి, అత్రి మహర్షి, అష్టావక్ర మహర్షి, ఋష్యశృంగ మహర్షి, కపిల మహర్షి, గౌతమ మహర్షి, చ్యవన మహర్షి, జమదగ్ని మహర్షి, దధీచి మహర్షి, దత్తాత్రేయ మహర్షి, దుర్వాసో మహర్షి మొదలైన మహర్షుల గురించి పెద్దలు చెబుతూ ఉంటారు లేదా శాస్త్రములలో వీరి చరితములు ఉంటాయి. ఈ మహర్షుల జన్మ కధలు, జీవితంలో ముఖ్య ఘట్టాలు తదితర విషయాలతో కూడిన మహర్షుల చరిత్ర తెలుగు పుస్తకం ఉచితంగా ఆన్ లైన్లో లభిస్తుంది. మహర్షుల చరిత్ర తెలుగు ఫ్రీ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రమూర్తికి వంశపారంపర్య గురువు. శ్రీరాముని మరొక గురువు అయిన విశ్వామిత్రుని జీవితాన్ని ప్రభావితం చేసిన బ్రహ్మశ్రీ వశిష్ఠుడు. ఈయన శాప ప్రభావం చేతనే శంతన కుమారుడు భీష్ముడుగా మారాడు. ఈయన అనుగ్రహం లోకంలో మంచిని పెంచే విధంగానే ఉంటుంది. విశ్వామిత్రుడుకు కోపం కలిగినా అది భక్తి వైపే దారితీసింది. భీష్ముడికి శాపం ఇచ్చినా, భీష్ముడి వలననే అనేక ధర్మాలు మరియు విష్ణు సహస్రనామం చెప్పబడ్డాయి. ఇంతటి శాంత మూర్తి, తపశ్శాలి అయిన వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకోవడం అమూల్యమైన విషయం. వశిష్ఠ మహర్షి గురించి తెలియజేసే తెలుగు ఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మన గురువులలో అనేకమంది అనేక ధర్మములను వారి రచనల ద్వారా తెలియజేస్తే, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఙానం ఇచ్చారు. ఇప్పటికీ ఈ గురువుగారు చెప్పిన విషయాలెన్నో జరిగినట్టుగా దుష్టాంతాలు కనబడ్డాయి. గుర్రాలకు బదులు నడిచే వాహానాలు వస్తాయని చెప్పినట్టు, కరెంటు దీపాలు గురించి చెప్పినట్టుగా మరిన్నే విషయాలు కాలజ్ఙానంలో కనబడతాయి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఙానం విన్నవారికి విపరీతాలు కూడా పెద్దగా ఆశ్చర్యపరచవు అంటారు. ఈయన గురించిన చరిత్రను తదితర విషయాలను చదవడానికి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ చరిత్ర తెలుగు పుస్తకం ఆన్ లైన్లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఈ ఫ్రీతెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

ఇంకొన్ని గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

ఉప్పుకప్పురంబు నొక్కపోలిక నుండు | చూడ చూడ రుచుల జాడవేరు | పురుషులందు పుణ్య పురుషులు వేరయా | విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఉప్పు కర్పూరం ఒకే రంగులో ఉంటాయి, కానీ రుచులు వేరు, అలాగే పురుషులలో పుణ్యాత్ములు వేరుగా ఉంటారు. ఈ పద్యం తెలియని తెలుగు విద్యార్ధి ఉండడు. ఈ పద్యం అంతగా తెలుగువారికి పరిచయం. ఈయన పద్యాలు చాలా పెద్ద పెద్ద భావనలు కలిగి ఉంటాయి. నీతితో కూడి ఉంటాయి. వేమన రచించిన వేమన పద్యాలు వేమన శతకంగా చెబుతారు. ఈ యోగి ద్వారా చెప్పిన పద్యాలు లోక ప్రసిద్ది చెందినవి. ఐదువేల వేమన తెలుగు పద్యాలు కలిగిన తెలుగు పుస్తకం ఉచితంగా లభిస్తుంది. వేమనపద్యాలు5000 తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీదత్త గురుచరిత్ర చదవడం వలన అనేక శుభాలు కలుగుతాయని అంటారు. శ్రీదత్త అనుగ్రహం ఉంటే, ఇష్టాకామ్యాలు నెరవేరతాయని చెబుతారు. గురుదత్త అనుగ్రహం కోసం శ్రీదత్తగురుచరిత్ర పారాయణం నియమనిష్ఠలతో చేయమంటారు. శ్లోకములు వాటికి తాత్పర్యములు కలిగి శ్రీదత్త గురుచరిత్ర తెలుగు పుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఈ తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గురు పారాయణ గ్రంధాలలో శ్రీగురుచరిత్ర విశేషంగా చెబుతారు. నియమనిష్ఠలతో పారాయణం చేయడం వలన సత్ఫలితాలను సాధించవచ్చని చెబుతారు. 52 అధ్యాయాలు కలిగిన శ్రీగురుచరిత్ర తెలుగు పుస్తకం ఒక వారం రోజులపాటు లేక రెండు వారాలపాటు లేక మూడువారాలపాటు నిత్య పారాయాణం చేయవచ్చు అంటారు. ఈ పుస్తకంలోనే మీకు ఏరోజు ఏ అధ్యాయం నుండి ఏ అధ్యాయం వరకు చదవాలో, ఆహార నియమాల గురించి సూచించబడింది. శ్రీగురుచరిత్ర తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షిర్డీ సాయిబాబ గురుస్వరూపంగా భక్తులను అనుగ్రహిస్తున్న దైవస్వరూపుడు. శతాబ్ధం ముందు సాయిబాబ మహిమలను చూసినవారు ఎక్కువగా ఉంటారు. ఆత్మతత్వం గురించి షిర్డీ సాయిబాబ చూపిన లీలలు, మహాత్యములు అసామాన్యంగా ఉంటాయి. గురు స్వరూపం అనగానే ప్రత్యక్షంగా షిర్డి సాయిబాబ స్వరూపం మనకు కనబడుతుంది. షిర్డీసాయిబాబ చరిత్రను తెలియజేసే సచ్చరిత్ర తెలుగుపుస్తకం ఉచితంగా లభిస్తుంది.  షిరిడి సాయిబాబా సచ్చరిత్రము తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగులో గురువులు గురించిన తెలుగు ఫ్రీబుక్స్

భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశములకు తెలియజేసిన మహానుభావుడు మన వివేకానందస్వామి. మన భారతీయ సంస్కృతి గురించి విదేశియులు గొప్పగా మాట్లాడుకునే లాగా మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనుడు స్వామి వివేకానంద. విదేశాల్లో వివేకానందస్వామి చేసిన తొలి ప్రసంగం ఇప్పటికీ అత్యుత్తమంగానే విదేశియులు భావిస్తారు. రామకృష్ణ పరమహంస ప్రియశిష్యుడు అయిన వివేకానందుడు అసలు పేరు నరేంద్రుడు. భగవంతుడిని చూడాలనే తలంపుతో భగవంతుడిని చూపించేవారి కోసం ఎదురు చూస్తున్న నరేంద్రుడికి రామకృష్ణ పరమహంస దగ్గర సమాధానం లభిస్తుంది. స్వామి వివేకానంద చరిత్ర తెలుగుపుస్తకం ఉచితంగా లభిస్తుంది.  వివేకానంద జీవిత చరిత్ర తెలుగుఫ్రీబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మహాభారతంలో పాండవులకు గురువు అయిన ద్రోణాచార్యులు వారు, విద్య నేర్పడంలో ఆచార్యులుగానే వ్యవహరించారు అని అంటారు. ఆవేశగుణం ఉన్న కొడుకుకు బ్రహ్మాస్త్రం గురించి పూర్తిగా వివరించకుండా, శిష్యుడైన అర్జునిడికి ఆ విషయం సవివరంగా నేర్పించాడు. కేవలం తనను చంపడానికే పుట్టిన వ్యక్తి విలువిద్యను నేర్పించాడు. ఒక కుక్క విషయంలో విచక్షణారహితంగా ప్రవర్తించిన ఏకలవ్యుడికి అసాధరణ విద్య ప్రమాదకరమని, ఏకలవ్యుడి బ్రొటనవేలును గురుదక్షిణగా స్వీకరించాడు. ఇలా ద్రోణాచార్యులు విద్యను నేర్పించడంలో పాత్రతనెరిగి ప్రవర్తించారని పండితులు చెబుతారు. ద్రోణాచార్యుల గురించిన తెలుగుఫ్రీబుక్ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

జగద్గురు శ్రీఆది శంకరాచార్య భారతదేశం అంతా నడిచి అవైదిక వాదనలను త్రోసిపుచ్చిన అపర శంకరుని అవతారం. ఈయన దయతో సనాతన ధర్మం మరలా పునరుజ్జీవం పొందిందని పెద్దలు చెబుతారు. ఆది శంకరాచార్యులు రచించిన పలు దేవతా స్త్రోత్రాలు మహిమాన్వితమైనవి. ముఖ్యంగా కనకధారా స్త్రోత్రం, భజగోవిందం, అష్టపది తదితర స్త్రోత్రాలు భగవంతుని ప్రార్ధించడంలో గొప్ప స్త్రోత్రాలుగా చెప్పబడతాయి. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల గురించి తెలియజేసే తెలుగుపుస్తకం ఉచితంగా లభిస్తుంది. ఈ ఫ్రీపిడిఎఫ్ తెలుగుబుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఎందరో గురువులు భారతదేశంలో వేదమును విస్తరింపచేయడంలో, సామాన్యులకు స్త్రోత్రాల రూపంలోనూ, మంచి మాటల రూపంలోనూ అందుబాటులోకి రావాడానికి కృషి చేశారు. ఇది మన భారతీయుల అదృష్టంగానే భావిస్తారు. అలాంటి గురువులు అందించిన శాస్త్రమును తెలుసుకోవడంతో బాటు, ఆయా గురువుల గురించి కూడా తెలుసుకోవడం మేలని పండితులు చెబుతారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.కామ్

తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్

తెలుగుపుస్తకములు చూసి భక్తి పాటలు పాడే అలవాటు నుండి తెలుగు భక్తిపాటలు తెలుగు యూట్యూబ్ చానల్స్ ద్వారా వినడానికి మారిపోయింది కాలం. కానీ పుస్తకం చదివితే ఆ పాటలు మనసులోకి మరింత చేరతాయి అంటారు. అయితే ఈ పోస్టులో తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్ అందించే లింకులను చూద్దాం.

భక్తిపాటలు వినడానికి వివిధ యూట్యూబ్ చానల్స్ మనకు ఉచితంగానే లభిస్తున్నాయి. ముఖ్యంగా లైవ్ చానల్స్ ఏరోజుకారోజు రోజును బట్టి భక్తి పాటలు ప్రసారం అయ్యేవిధంగా అందుబాటులో ఉన్నాయి. వారం యొక్క అధిదేవతకు సంబంధించిన భక్తి పాటలు ఈ లైవ్ చానల్స్ ద్వారా ప్రసారం అవుతాయి. సోమవారం అయితే శివునికి సంబంధించిన భక్తి పాటలు, శనివారం అయితే శ్రీవేంకటేశ్వరునికి సంబంధించిన భక్తిపాటలు ప్రసారం అవుతాయి. భక్తి చానల్ దీనిద్వారా ఏరోజుకారోజు ఆయా అధిదేవత గురించిన భక్తిపాటలు యూట్యూబ్ ద్వారా వినవచ్చును.

TR ARTICLE ADS

శ్రీవేంకటేశ్వరస్వామిపై పాటలు అంటే అన్నమయ్య కీర్తనలే. అవి వింటూ శ్రీవేంకటేశ్వరుడు పరవశించినట్టుగా అన్నమయ్య సినిమాలో చూశాం. అటువంటి కీర్తనలలో భక్తి పాటలు మనం వింటూ ఉంటే మన మనసు శ్రీవేంకటేశుడిపైకి, మన వీనులకు విందుగా భక్తిపారవశ్యం కలుగుతుంది. అన్నమయ్య కీర్తనలు తెలియజేస్తూ ఉచితంగా లభిస్తున్న ఫ్రీ పిడిఎఫ్ బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అన్నమయ్య ఆలపించిన భక్తిపాటలు మనలో భక్తిభావం పెంచుతాయి. ప్రతి శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి గురించిన భక్తిపాటలు వింటూ ఉండడం వలన ఆ శ్రీవేంకటేశ్వరుని కరుణ కలుగుతుంది. ప్రతి శనివారం తెలుగు భక్తిపాటలు యూట్యూబ్ ద్వారా వినవచ్చును.

జన్మసమయం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో వారం రోజులలోనూ ఏదో ఒక గ్రహం కష్టం కలిగించడానికి చూస్తూ ఉంటే మరొక గ్రహం శుభం ఇవ్వడానికి సూచిస్తూ ఉంటుంది. పుట్టిన సమయం బట్టి గ్రహగతులు ఆ వ్యక్తి కర్మను తెలియజేస్తాయి అంటారు. ఆవిధంగా ఆకాశంలో కదిలే గ్రహాలు, మారుతున్న తమ తమ స్థానాల నుండి ఫలితాలను అందిస్తూ ఉంటాయి. అయితే ఆ గ్రహాధిదేవతలను పూజించడం లేదా ఆ గ్రహ స్వరూపములనే ధ్యానం చేయడం ద్వారా ఆయా గ్రహ ఫలితములను ప్రభావమును తట్టుకునే శక్తిని పొందవచ్చు అంటారు. అంటే పూర్తి పేదరికంలో ఉన్నవాడికి ఒక వందకోట్ల లాటరీ తగిలితే, తట్టుకునే శక్తి అంటే అతని ఆరోగ్యం బట్టి ఉంటుంది. అందుకే మంచైనా చెడైనా ఫలితం మనిషి తట్టుకునే లాగా ఉంటే, ఆ వ్యక్తి వలన ఇతరులకు నష్టం జరగదు. కాబట్టి నవగ్రహాలను ధ్యానం చేయడం కూడా మంచిది అంటారు. అయితే ఇక్కడ భక్తి శ్రద్ధలతో పాటు నియమనిబంధనలు కఠినంగానే పాటించాలి, లేకపోతే ఫలితం ప్రతికూలం అంటారు. నవగ్రహ కీర్తనలు ఫ్రీ తెలుగు బుక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్

భక్తి – ముక్తి జానపద గేయాలు భక్తి పాటల తెలుగు పుస్తకం ఉచితంగా ఆన్ లైన్లో రీడ్ చేయవచ్చును లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఈ పుస్తకంలో పలు భక్తిపాటలు తెలుగులో ఉండి అందరికీ అర్ధం అయ్యేలా ఉన్నాయి. ఇందులో కొన్ని భక్తిపాటల ముందు మాటలు ‘నీ మహిమ తెలియనైతి !’ అనే భక్తి పాట, ‘భగవంతా! నీదే భారమురా!’ అను భక్తి పాట ‘ఈశ్వరున కెరుక!’ అంటూ ఈశ్వరునిపై భక్తిని ప్రకటించే భక్తి పాట, ‘శ్రీ కృష్ణ దేవుడు’ అంటూ కృష్ణుడి పాటలు, ‘శివ శివ అని భజించువారికి!’ శివుని గురించి భక్తి పాట రాముని మాటలు, సీతాభిరామా అంటూ ఇలా మరిన్ని భక్తి పాటలు ఈతెలుగు బుక్ లో మనం రీడ్ చేయవచ్చును. భక్తి ముక్తి జానపద గేయాలు ఉచిత తెలుగు భక్తి బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

మనం గుడికి వెళ్లి కోరికలు కోరుతూ ఉంటాం, కానీ శ్రీరామదాసు రామునికి గుడినే కట్టించి ఇచ్చాడు. గుడిని కట్టినందుకు జైలు పాలు అయితే అక్కడి నుండే శ్రీరామునిపై కీర్తనలు చేశాడు. భాదలోనూ భగవంతుడినే దర్శించి, సర్వం రామార్పణ బుద్దితో శ్రీరామదాసు చేసిన కీర్తనలు, సీతారామలక్ష్మణులను కదిలించాయి. శ్రీరామదాసు పాడిన భక్తిపాటలు దాశరధీ శతకంగా ప్రసిద్ది. దాశరదీ మకుటంతో అన్ని పద్యాలు ఉంటాయి. ఈ తెలుగు భక్తిపాటలు కలిగిన తెలుగు బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ / టచ్ చేయండి.

శ్రీరామ నామము భజించిన నోరుండదు. రామా అనే పేరు అనేకమందికి ఉంటుంది. ఎక్కువమందికి ఆ పేరు పిలవడం, వినడం ఉంటుంది. ఇంకా శ్రీరామభక్తులకు రామ నామము రామనామము రమ్యమైనది అంటూ మనసులో మెదులుతూనే ఉంటుంది. రామనామం జపించడం చాలమందికి అలవాటుగా ఉంటుంది. ఇంకా ఈ యుగంలో నామకీర్తన కన్నా గొప్ప మోక్షమార్గం మరొకటిలేదు అంటారు. ఎంతగా భగవన్నామం జపిస్తే అంత మేలు మనసుకు అని చెబుతారు. శ్రీరామచంద్రుడిని గురించిన నామస్మరణ మనసుకు పడితే అంతకన్నా అదృష్టం మరొకటి లేదంటారు. శ్రీరామభజనం చేస్తూ తెలుగు భక్తిపాటల తెలుగు భక్తి బుక్ రీడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ /టచ్ చేయండి.

ఇంకా తెలుగు భక్తిపాటలు తెలుగులో భక్తి బుక్స్ గురించి వివరాలు సింగిల్ లైనుతో ఉండే వెబ్ పేజి తర్వాత ఇక్కడ లింకు చేయబడుతుంది. గమనించగలరు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

సాదారణ సేవల వెబ్ అండ్ మొబైల్ యాప్స్

మనకు సహజంగా అవసరమయ్యే గ్యాస్ బుకింగ్ మొబైల్ ఐవిఆర్ తో బాటు ఆన్ లైన్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే సౌకర్యం వెబ్ సైటునుండి పొందవచ్చును ఇలా వివిధ సాదారణ సేవల వెబ్ అండ్ మొబైల్ యాప్స్ గురించి, యూజ్ పుల్ వెబ్ సైటులు యాప్స్ లింకుల కోసం ఇక్కడ క్లిక్ టచ్ చేయండి. ఇందులో ఆధార్ రీప్రింటింగ్ వివిధ కన్వర్షన్ వెబ్ సైటులు, పిడిఎఫ్ కన్వర్ష్ వెబ్ సైటు, ఆడియో కటింగ్ తదితర వెబ్ సైటు మొబైల్ యాప్స్ లింకులు కలవు.

అయ్యప్ప భక్తులు శబరిమల అయ్యప్పస్వామి టెంపుల్ క్యూ ఆన్ లైన్ బుకింగ్ సర్వీసు వెబ్ సైటు ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్ సైటులో ఉండే ఆన్ లైన్ ఫాం పూర్తిచేసి, భక్తుని ఫోలో అప్డేట్ చేసి, వెబ్ సైటులో రిజిష్టర్ అవ్వాలి. రిజిష్టర్ అయిన తర్వాత ఇమెయిల్ వెరిఫికేష్ చేయాలి.

ఆ తర్వాత మీరు ఈ వెబ్ సైటులో లాగిన్ అయ్యి మీతో బాటు లేక మీరు టికెట్ బుక్ చేయవలసిన భక్తుల వివరాలు పూర్తి చేసి, శబరిమలకు వెళ్లే బక్తుల ఫోటోని కూడా అప్డేట్ చేయాలి. ఇంకా ఏదైనా గుర్తింపు కార్డు నెంబర్ కూడా ఈ ఫాంలో నింపాలి.

టిటిడి ఇదర్శన్ టికెట్ బుకింగ్, డాలర్ రేట్ కన్వర్షన్, ఇవేబిల్, జి.ఎస్.టి. రిటర్న్స్, ఫోటో నుండి పిడిఎఫ్ కన్వర్టర్, ఆడియో ఫైల్స్ కటింగ్, జాయినింగ్, వీడియో కట్టర్, లెంగ్త్ కన్వర్షన్, వెయిట్ కన్వర్షన్ మొదలైన లింకులు ఈ వెబ్ పేజిలో ఉన్నాయి.