Month: February 2020

  • లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం

    ఒక వేళ ఎవరైనా లీప్ డేన పుడితే తెలుగు పంచాంగం ప్రకారం పుట్టిన రోజులు ప్రతి యేడాది జరుపుకోవచ్చును. ఈరోజు లీప్ డే, నాలుగు సంవత్సరాలలో పావు రోజు కలిపి నాలుగు సంవత్సరాలకొకసారి వచ్చే లీపు సంవత్సరంలో పూర్తి రోజుగా వస్తుంది. అదే ఫిబ్రవరి 29. మనకు కొత్త దశాబ్దం ప్రారంభం సంవత్సరంలోనే లీపుడే వచ్చింది. ఈరోజు ఫిబ్రవరి 29, 2020. ఒకవేళ ఎవరైనా ఫిబ్రవరి 29వ తేదీనాడు పుట్టి ఉంటే, ఆ రోజు ఘడియల ప్రకారం…

  • జ్ఙాన బోధ గీత అయితే

    జ్ఙాన బోధ గీత అయితే రాముడు చెబితే రామగీత, శివుడు చెబితే శివగీత, కురుక్షేత్రంలో చెబితే భగవద్గీతగా మనకు వివిధ గీతలు ఉన్నాయి. గీత అంటే ఉపదేశముగా భావింపడుతుంది. భగవద్గీత అంటే భగవంతుడు, భక్తుడికి చేసిన బోధ కాబట్టి భగవద్గీతగా చెబుతారు. అలా భగవానుడు ఉపదేశించిన గీతాసారమను భగవద్గీతగా చెబుతారు. మహాభారతంలో శ్రీకృష్ణభగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధించిన గీతాబోధను భగవద్గీతకు అందరికీ తెలుసు. జ్ఙాన బోధను గీతగా చెబితే, అలా చెప్పిన జ్ఙాన బోధలు మనకు ఇంకా…

  • ఈ రోజు నేషనల్ సైన్స్ డే

    ఈ రోజు నేషనల్ సైన్స్ డే, రామన్ ఎఫెక్ట్ పరిశోధనా ఫలితాన్ని ఫిబ్రవరి 28, 1928లో ధృవపరుచుకున్నారు. ఆ సందర్భంగా ఈరోజు జాతీయ వైజ్ఙానికి దినోత్సవం. కావునా ఫిబ్రవరి 28వ తేదీ జాతీయ వైజ్ఙానిక దినోత్సవం(నేషనల్ సైన్స్ డే) గా జరుపుతున్నారు. రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టింది, చంద్రశేఖర వేంకట రామన్. రామన్ ఎఫెక్ట్ అంటే… ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో (చెదురుతాయో) తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు చంద్రశేఖర్…

  • SBI కెవైసి సబ్మిట్ గడువు

    SBI కెవైసి సబ్మిట్ గడువు ముగియనుండడంతో, ఆన్‌లైన్ ద్వారా sbi బ్యాంకు కెవైసి సబ్మిట్ చేయవచ్చునా? బ్యాంకుకు కెవైసి సబ్మిట్ ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా చేయలేం. మీరు ఖచ్చితంగా ఖాతా కలిగిన బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్ళవలసి ఉంటుంది. మీ బ్యాంక్ ఖాతా ఏ బ్రాంచ్‌లో ఉందో ఆ బ్రాంచికే మీరు వెళ్లాలి. అనగా హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి కెవైసి డాక్యుమెంట్లను బ్యాంకులో సంబంధిత ఆఫీసరుకు అందించాల్సి ఉంటుంది. ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పాన్ అప్డేట్ చేయవచ్చును.…

  • ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఆలోచించాలి.

    ఎంత ఎక్కువ డిస్కౌంటు ఉంటే, అంత ఆలోచించాలి. ఆన్ లైన్లో ఎక్కువ డిస్కౌంటు ఉన్న వస్తువు, ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా ఎంతో కొంత తగ్గింపు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ డిస్కౌంటు ఆఫర్ చేస్తున్నారంటే, అవి ఎక్కువ స్టాక్ ఉండి ఉండాలి. ఎక్కువ స్టాక్ ఉన్నాయి, అంటే ఆ మోడల్ ఫెయిల్ అయ్యి ఉండవచ్చును. గత కొంతకాలంగా ఆన్ లైన్లో భారీ డిస్కౌంట్ల ప్రకటనలు ఎక్కువగా ఉంటున్నాయి. భారీ డిస్కౌంట్లు మార్కెట్లో పోటిపడి ప్రకటిస్తే అది ఒక…

  • ఫ్లిప్ కార్ట్ నుండి అరువు కొనుగోలు

    ఫ్లిప్ కార్ట్ నుండి అరువు కొనుగోలు చేయవచ్చును. ఫ్లిప్ కార్టులో పే లేటర్ ద్వారా అప్పు తీసుకోవచ్చును. ఇందుకు ఎటువంటి ష్యూరిటీతో సంబంధం లేదు. కేవలం మీకు ఫ్లిప్ కార్టు ఖాతా ఉండి, ఆ ఖాతకు ఆధార్ ఐడి లింక్ అయితే సరిపోతుంది. ఒక్కసారి మీ ఖాతా పేలేటర్ అప్రూవ్ అయితే, మీ ఖాతకు కొంత ఏమౌంట్ కేటాయించబడుతుంది. మీకు కేటాయించిన ఎమౌంటులో నుండి మీరు షాపింగ్ చేయవచ్చును. ఈ నెల ఒకటో తేదీన మీరు కొనుగోలు…

  • సామ్సంగ్ న్యూగాలాక్షీ ఎం31 ఫోను

    కొత్త 4జి స్మార్ట్ ఫోను కొనాలనుకంటే సామ్సంగ్ నుండి గాలాక్షీ సిరీస్ లో సామ్సంగ్ న్యూగాలాక్షీ ఎం31 ఫోను వచ్చింది. ఈ ఫోను మార్చి5, 2020 నుండి అమ్మకాలకు అమెజాన్ సైటులో అందుబాటులో ఉంటుంది. దీని ధర 14999/-. న్యూ గాలాక్షీ ఎం31 ఫోను నాలుగు బ్యాక్ కెమెరాలు కలిగి ఉంటుంది. ఈ కెమెరా క్వాలిటీ 5ఎంపి డెప్త్ కెమెరా, 5ఎంపి మార్కో కెమెరా, 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమరా లు ఉన్నాయి.…

  • నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్.

    వ్యక్తి మనసును అంచనా వేయడం ఎదుటివ్యక్తి మనోశక్తిని బట్టి ఉంటుంది. తన మనసును తానే అంచనా వేసుకోవడం వలన అది పెరుగుతుంది. మనోనిగ్రహం పాటించడానికి, తమ మనసులో ఉన్న మిత్రుడెవరు? శత్రువు ఎవరు? తెలియాలి. ఇలా ప్రతి మనిషిలో ఉండే రెండు మనస్తత్వాలను వివరించే బుక్ నీలోఇద్దరు తెలుగు ఫ్రీపిడిఎఫ్ బుక్. ప్రతి మనిషి రెండు రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారని చెబుతారు. ఒక మనసు ఒకలాగా ఆలోచన చేస్తే, మరొకటి వ్యతిరేఖంగా ఆలోచన చేస్తుంది. ఆలోచన…

  • ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్

    ఎలాచదవాలి పబ్లిక్ విద్యార్ధులకు సూచనలబుక్ తెలుగులో ఉచితంగా లభిస్తుంది. ఈ బుక్ గురించి తెలుసుకోవడానికి చదవండి…. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. అదీ అందరికి తెలుసు, తెలిసిన దానిపై అంతగా ఆసక్తి ఉండదు. అదే పుట్టగానే పరిమళించని పువ్వు, కొన్నాళ్లకు పరిమళిస్తే ఆపువ్వుపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఎప్పుడూ చదివేవారు పాసవ్వడం కన్నా ఎప్పుడూ ఫెయిల్ అయ్యే విద్యార్ధి, కష్టపడి చదివి పాసయితే, ఆవిద్యార్ధిపై అందరి దృష్టిపడుతుంది. పబ్లిక్ పరీక్షలు అంటే భయంతో విద్యార్ధులు సిద్దం అవుతూ ఉంటారు.…

  • తెలుగు బుక్స్ చదివే అలవాటు

    మనకు మేలు చేసే విషయాలలో తెలుగు బుక్స్ అని అంటారు. తెలుగు బుక్స్ చదివే అలవాటు ఉంటే, అవీ ఉత్తమ రచయితల బుక్స్ అయితే మరీ మేలు అంటారు. ఎందుకు అంటే స్వామి వివేకానంద లాంటి మహానుభావుల మాటలు బుక్స్ ద్వారా ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంటాయి. మహానుభావుల మాటలు మనసుకు బలమైన మందు అంటారు. ఏనుగు మావటివాని అంకుశానికి భయపడ్డట్టు, మనిషి మనసు సజ్జనుల మాటలకు భయపడుతుందని అంటారు. అందుకని తెలుగులో అందుబాటులో ఉన్న ప్రసిద్ధ…

  • తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం

    తింటే కానీ రుచి తెలియదు. చదివితే కానీ బుక్ లో ఉన్న విషయం తెలియదు. తెలుగు గొప్పతనం తెలియాలంటే, తెలుగు సాహిత్యం చదవాలి. కాబట్టి బుక్స్ తెలుగులో చదవడానికి తెలుగు నేర్వడం ప్రధానం అంటారు. ఏ ప్రాంతం వారికి, ఆ ప్రాంతంలో మాట్లాడే భాషపై సహజంగా పట్టు ఉంటుంది. ఆ ప్రాంత చరిత్ర కూడా ఆ ప్రాంతీయ భాషలో చక్కగా వివరించబడి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నివసించినవారే ఆ ప్రాంతం గురించి ఖచ్చితంగా వివరించగలరు. అప్పుడు…

  • మహా శివరాత్రి శుభాకాంక్షలు

    మంత్రమేదైనా దైవం మాత్రం ఒక్కటే, అనేక రూపాలుగా ఉండడం వలన అనేక మంది మనస్తత్వాలను అనుగ్రహించవచ్చు, అనే తలంపుతో భగవానుడు అనేక మూర్తులుగా మనకు పరిచయం అని పెద్దలంటారు. అటువంటి భగవన్నామస్మరణ మేలును చేకూర్చును. అది పర్వదినాలలో మరింతగా ఉంటుంది. మరి మహా శివరాత్రి అయితే మరింత పుణ్యదాయకం అంటారు. అందరికి శివానుగ్రహం కలగాలని ఆశిస్తూ…. మీకు మీ కుటుంబ సభ్యులకు మహా శివరాత్రి శుభాకాంక్షలు….

  • భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్

    గురువును మించిన శిష్యుడుగా, తండ్రికి వివాహం కొరకు తన వివాహం చేసుకోనని ప్రతిజ్ఙ చేసి, భీష్ముడుగా ప్రసిద్దికెక్కిన దేవవ్రతుడు మిక్కిలి కృష్ణ భక్తుడుగా చెబుతారు. మహాభారతంలో పితామహుడుగా కనిపించే, ఈయన ధర్మాన్ని ఆచరించి, భీష్మాచార్యులుగా ప్రసిద్దికెక్కారంటారు. భీష్మఏకాదశి రోజున భీష్ముడుని తలచుకోవాలని చెబుతారు. 2020లో భీష్మఏకాదశి ఫిబ్రవరి 5న వస్తుంది. భీష్మఏకాదశి సందర్భంగా భీష్మపర్వము బుక్ గురించి…. భీష్ము పితామహుడు శంతనుడుకు, గంగకు కొడుకుగా పుడతాడు. అతనిని చిన్నప్పుడే గంగ తనవెంట తీసుకువెళ్లి విద్యాభ్యాసం చేయించి, మరలా…

  • మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస

    లోకంలో సామెతలు చాలా విశిష్టమైనవి, అవి చాలా నిగూఢమైన అర్ధాన్ని కలిగి ఉంటాయని అంటారు. అలాంటి వాటిలో జన్మానికో శివరాత్రి అంటూ నానుడి ఉంది. మహాశివరాత్రి పర్వదినమున పరమశివునిపై ధ్యాస కలిగి ఉంటే, అంతకన్నా మరొక అదృష్ట విషయం ఏముంటుంది? నిత్యం సమస్యలతో సతమతమయ్యే మనిషి మనసుకు, ఒక్కరోజులో దేవునిపై ధ్యాస కలగాలంటే, కష్టమే! అందుకనేమో జన్మానికో శివరాత్రి అంటారు. ఏదైనా పండుగ వస్తే, ఆ పండుగ రోజునా ఏమి చేయాలి? ఎలా చేయాలి? అనే ప్రశ్నలతో…