హృతిక్ రోషన్ పాపులర్ హీరో , బాలీవుడ్ ఫిల్మ్ యాక్టర్. ఈయన ఇప్పటివరకు 6 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇండియా మీడియాలో మోస్ట్ పాపులర్ పర్సనాలిటిగా ఈయనను చెబుతారు.
1974వ సంవత్సరంలో జనవరి 10వ తేదీన హృతిక్ రోషన్ పింకి – రాకేష్ రోషన్ దంపతులకు జన్మించారు.
1980వ దశాబ్దంలో బాలనటుడిగా కొన్న బాలీవుడ్ మూవీలలో నటించారు. 2000వ సంవత్సరంలో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన కహో నా.. ప్యార్ హై సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.
కహో నా.. ప్యార్ హై సినిమాలోని హృతిక్ రోషన్ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటుడు డెబ్యూ అవార్డులు అందుకున్నారు ఆయన. ఆపై ఫిజా, మిషన్ కాశ్మీర్ వంటి హిందీ సినిమాల్లో నటించారు. హృతిక్ రోషన్ 2001లో కభీ ఖుషీ కభీ గమ్ హిందీ మూవీతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు .
కోయీ.. మిల్ గయా మరొక విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలోనూ హృతిక్ నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు.
2006సంవత్సరంలో కోయీ.. మిల్ గయా మూవీకి సీక్వెల్ గా క్రిష్ సినిమాలో నటించారు. ఇది కూడా బాలీవుడ్ లో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆయన ధూమ్2 సినిమాలో నటించడం ద్వారా మూడవ ఫిలింఫేర్ అవార్డు 2006 లో అందుకున్నారు. ఇండియన్ హిస్టరీ ఆధారంగా వచ్చిన జోధా అక్బర్ సినిమాలో నటించారు. ఈ సినిమా వలన కూడా హృతిక్ రోషన్ నాలుగో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
2010 సంవత్సరంలో హృతిక్ నటించిన గుజారిష్ సినిమాలో వికలాంగుడిగా, ఆయన నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి. జిందగీ నా మిలేగీ దుబారా, అగ్నిపథ్, క్రిష్ 3 వంటి పలు విజయవంతమైన హిందీ సినిమాలలో హృతిక్ రోషన్ నటించారు. అగ్నిపథ్, క్రిష్ 3 మూవీస్ బాలీవుడ్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాల లిస్టులో నిలిచాయి.
నటనకు అవార్డులు ప్రతీకగా నిలుస్తాయి. అవార్డులు అందుకునే సినిమాలకు కలెక్షన్ తక్కువ అంటారు… కానీ హృతిక్ రోషన్ సినిమాలకు మాత్రం కలెక్షన్ వర్షం కూడా కురుస్తుంది.
కమర్షియల్ సినిమా అయినా క్లాసికల్ గా నటించడం హృతిక్ రోషన్ స్పెషాలిటి… అదే ఆయనను అంత ఎత్తుకు ఎదిగేలాగా చేసింది.
కహోనా ప్యార్ హై, క్రిష్2, క్రిష్ 3 సినిమాలు కమర్షియల్ గానూ మంచి విజయం సాధించాయి. ఈయన నటన కూడా చాలా క్లాసిక్ గా ఉంటుంది.
![హృతిక్ రోషన్ పాపులర్ హీరో గురించి తెలుగులో వ్యాసం](https://vyasalu.telugureads.com/wp-content/uploads/2021/01/hritikRoshan_telugu_vyasam_telugulo.png)
ఈయన సినిమాలు అవార్డులు అందుకుంటాయి… రికార్డుల సృష్టిస్తాయి… అందువలన ఈయన బాలీవుడ్లో పాపులర్ హీరోగా నిలిచారు.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలువిద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?