ప్రేరణకు మూలం జ్ఙానం గ్రహించే ఆలోచన కలిగి ఉండడం ప్రధానమంటారు!
సాధన చేత సులభంగా పనులు సమకూరును.
అతి పెద్ద విజయాలు సాధించినవారి జీవితాలు అతి సాదారణంగా ఉండకపోవచ్చును. వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండి ఉండవచ్చును. ఒక వ్యక్తి జిల్లా స్థాయి విజయం సాధించడానికి, ఒక జిల్లాలో పోటీపడే పోటీదారుల మద్య ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అలాగే రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి… ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వ్యక్తే విజేతగా గుర్తింపు పొందుతారు.



ఎంత ఎక్కువ స్థాయిలో పోటీపడదలచమో అంత ఎక్కువగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే విజయానికి ప్రధానమైన విషయం. ఎందుకంటే సాధన చేయడానికి కాలమే ఖర్చు. ఎన్ని సదుపాయాలు ఉన్నా, మనం స్వయంగా చేసిన సాధనే, మనల్ని పోటీలో నిలబెడుతుంది. అద్భుతమైన ఫలితాలు, ఉత్తమమైన సాధన చేతనే సాధ్యమంటారు. కావునా కాలం ఖర్చు చేస్తున్న సమయం ఎలా సాగుతుందో చూసుకోవాలి. కాలాల్ని అంత సులభంగా చిన్న చిన్న విషయాలతో కాలాక్షేపం చేయడం అంటే, జీవితపు లక్ష్యానికి దూరం జరుగుతున్నట్టేనని అంటారు.
గొప్పవారు ముందుగా కాలానికి విలువనిస్తారు. కాలానికి విలువనిచ్చి, సరైన సాధన చేస్తే, విజయం తధ్యం!
గొప్పవారు కాలహరణం చేయడానికి ఇష్టపడరు.

టాటా గ్రూపు అధినేత కాలానికి ఎంత విలువనిస్తారో, ఆయన జీవితంలో జరిగిన చిన్న సంఘటన తెలియజేస్తుంది. ఒక్కసారి తోటివారితో కలిసి కారు ప్రయాణం చేస్తున్న ఆయన కారు రోడ్డుపై ఆగింది.డ్రైవరు కారు రిపేరు చేయడానికి పూనుకుంటే, మిగిలినవారు వారి వారి అలవాట్లకు అనుగుణంగా టీ త్రాగడం వంటివి చేస్తుంటే, రతన్ టాటా గారు మాత్రం కారు డ్రైవరుకు సాయం చేశాడు. అలా రతన్ టాటా, తన కారు డ్రైవరుకు సాయపడడం వలన ఆరోజు ఏడు నిమిషాల సమయం సేవ్ చేయగలిగారు. లేకపోతే ఏడు నిమిషాల సమయం వృధా అయ్యేది. ఇలా కాలం గురించి గొప్పవారు ఎప్పుడూ జాగురతతో ఉంటారు. కాలహరణం చేయడానికి ఇష్టపడరు.
అందుకేనేమో మనవారు కాలం కాంచనతుల్యం అంటారు!
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?