యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం. ఇప్పటి ప్రసాద సాధనాలు యువతపై రెండు రకాల ప్రభావం చూపించే అవకాశం కలదు.

ఒకటి: ఉపయుక్తమైన విషయ సంగ్రహణం చేసే క్రమంలో ఉత్సాహావంతులకు ప్రోత్సాహకరంగా నేటి సాంకేతికత ఉపయోగపడును.

రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బ్లేడు రెండువైపులా పదును కలిగి ఉండి, దానిని ఉపయోగించేటప్పుడు చేతి వెళ్లకు ప్రమాదకరంగా ఉంటుందో, నేటి సాంకేతికత కూడా ఎదిగే మనసుకు అలాగే ఉంటుంది.

ప్రసార సాధనాల ప్రభావం సమాజంలో ముఖ్యంగా యువతపై ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా మొబైల్స్ రూపంలో ప్రసార సాధనాల ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది.

ఒకప్పుడు ప్రసార సాధనాలు కేవలం పత్రికల రూపంలోనే ఉండేవి. అవి మాస పత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలు, దిన పత్రికలు అంటూ పత్రికల ద్వారకా సమాచారం అందేదీ.

రేడియో కార్యక్రమాలు ప్రజలను అలరిస్తూ వచ్చేవి, సాయం వేళలో సాంగ్స్ వినడం ఒక అలవాటుగా కూడా ఉండేదని అంటారు.

ఆ తరువాత టి‌విల వలన ప్రసార సాధనాల పనితీరు మెరుగు పడింది. అనేక అంశాలు ప్రతి ఇంటిలోకి వార్తలుగా రావడం… ఇంకా వినోద కార్యక్రమాలు సంఘజీవిని ఇంటికే పరిమితం చేయడంలో టి‌విల పాత్ర ప్రముఖమైనది అంటారు.

టి‌విల నుండి వేగం అందుకున్న ప్రసార సాధనాలు ఇప్పుడు అందరి చేతులలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడే అందించే క్రమానికి మారాయి.

పత్రిక – రేడియో – టి‌వి – కంప్యూటర్ – లాప్ టాప్ – టాబ్ – స్మార్ట్ ఫోన్ ఇలా ప్రసార సాధనాలు అక్షర రూపంలో, శబ్ధరూపంలో, దృశ్య రూపంలో ప్రసారం అయ్యి, ఇప్పుడు దృశ్యం రూపం పెద్ద పెద్ద స్క్రీనుల నుండి అతి చిన్న స్క్రీనులా ద్వారా కూడా ప్రపంచాన్ని అరచేతిలో చూపుతున్నాయి.

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం
యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

స్మార్ట్ ఫోన్, ఇది ఒక మాయల మరాఠి చేతిలో మంత్రదండం లాగా మనిషి చేతిలో ఇమిడిపోయింది.

ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టడానికి క్యూ కట్టిన జనులు ఇప్పుడు ఉన్న చోట నుండే కదలకుండా కరెంట్ బిల్ పే చేసే స్థితిని ప్రసార సాధనాలు కల్పిస్తున్నాయి.

సమయం సేవ్ చేయడంలో ఇది మంచి పరిణామం అయితే, అదే సమయంలో సహనం స్థానంలో అసహనం ఏర్పడే అవకాశం కూడా ఈ స్మార్ట్ ఫోన్ వంటి సాధనాల రూపంలో కలిగే అవకాశం ఉంటుంది.

ఇలా ఏదైనా నెలవారి చెల్లింపులు చేయడంలో చేతిలోని స్మార్ట్ ఫోన్ పనితీరు ఒక అద్బుతమే అని చెప్పాలి. ఇది నిజంగానే చేతిలో మంత్రదండం వలె ఉంటుంది.

ఇక వినోద కార్యక్రమాలు అయితే సరే సరి. ఎప్పుడంటే అప్పుడే, ఎక్కడంటే అక్కడే టైమ్ పాస్ కావడానికి స్మార్ట్ ఫోన్లో ఎన్నో వినోదాత్మక వీడియోలు దర్శనమిస్తాయి. వినోదభరిత పెట్టె వలె చేతిలో ఇమిడిపోతుంది.

ఒకటి: ఉపయోగకరమైన విషయ సంగ్రహణకు కంప్యూటర్ – లాప్ టాప్ – టాబ్ మరియు స్మార్ట్ ఫోన్లు చాలా ఉపయోగకరంగా….

ఉంటున్నాయనే చెప్పాలి.

ఒక విధ్యార్ధి తరగతిలో టీచర్ చెప్పిన విషయం అర్ధం కాకపోతే, ఇంటర్నెట్ ఆధారిత పరికరములలో శోధించి సాధించవచ్చు.

అలాగే ఒక ఉద్యోగి తన కార్యచరణలో సందేహాలకు సమాధానాలను ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా వచన రూపంలో కానీ దృశ్య రూపంలో కానీ పరిస్కారం కనుగొనవచ్చు.

నేర్చుకునే వయస్సులో ఆసక్తికి నేటి సాంకేతికత అదనపు ఆయుధంగా మారుతుంది. అయితే అది మంచి ఆసక్తి అయితే, అది అతని ఉన్నత స్థితికి హేతువు కాగలదు…

అవసరానికి ఆలోచన తోడైతే, ఆ ఆలోచన అందరికీ ఉపయోగపడేది అయితే, అదే ఆలోచనను అభివృద్ది పరచి అందరికీ ఉపయోగపడేలా చేయడంలో నేటి సాంకేతికత ఒక ప్రోత్సాహకరంగా ఉండగలదు.

రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం

కూడా నేటి సాంకేతికత ద్వారా అభివృద్ది చెందిన ప్రసార సాధనాలు కారణం కావచ్చు. ఇంటర్నెట్ ఆధారిత పరికరాలలో వ్యక్తికి స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది.

అతను శోధించే అంశం అతనికే పరిమితం అవుతుంది కానీ అతని శ్రేయోభిలాషులకు తెలిసే అవకాశం తక్కువ.

వయసుకు మించిన విషయాలు కూడా ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు ఉపయోగించేవారి దృష్టికి వచ్చే అవకాశం నేటి ప్రసార సాధనాల ప్రభావం ద్వారా ఉండవచ్చు.

వాటిని ఉపయోగించే వారి విజ్నతను బట్టి ప్రసార సాధనాల ఉపయోగం ఫలితం ఉంటుంది.

ఈ ప్రసార సాధనాల ప్రభావంతో వ్యక్తి ఆలోచనా తీరు వేగం పుంజుకుంటే, దానికి సరి అయిన పరిస్కారం యోగా అంటారు.

మనసుని నియంత్రించే ప్రక్రియలో యోగా మేలైనదిగా చెప్పబడుతుంది.

ఇప్పటి ప్రసార సాధనాలు అనెక అంశాలు యువత మదిలోకి చొచ్చుకు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే శ్రేయస్సు కలిగించే విషయాలు మాత్రం మనిషికి శాంతిని అందిస్తే, ఆకట్టుకునే విషయాలు మనసులో అశాంతికి ఆలవాలం కాగలవు.

మంచి చెడులు ఒకరిని అనుసరించి తెలుసుకునే రోజుల నుండి శోధించే తెలుసుకునేవిధంగా ప్రసార సాధనాలు మార్పును తీసుకువచ్చాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *