తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి?

తెలుగు వ్యాసాలు వ్యాసం అంటే ఏమిటి? వ్యాసము అనగా ఒక విషయమును గురించి తెలియజేయుట అంటారు.

ఇలా వ్యాసం విషయమును సహేతుకంగా వివరిస్తుంది. సమస్య తీవ్రతను సమగ్రంగా తెలియజేస్తుంది. ఒక వ్యక్తి గొప్పతనం కీర్తిస్తుంది. ఒక సంఘటన యొక్క తీరు దాని ఫలితం, సామాజిక ప్రభావం గురించి తెలియజేస్తుంది. వ్యాసం ఒక అవగాహన కల్పించడంలో టీచర్ వలె ఉంటుంది.

తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ వ్యాసం వ్రాయమంటారు. అంటే వ్యాసం ఒక వస్తువు లేదా విషయం లేదా ప్రాంతం లేదా ఒక విధానం లేదా చరిత్ర ఏదైనా గొప్పతనం గురించి చక్కగా వివరించగలదు.

వ్యాసం వలన వ్యక్తికి విషయంలోని సారం తెలియబడుతుంది. సారాంశం కూడి అర్ధవంతమైన సమాచారం అందించే వ్యాసం ఏదో ఒక సామాజిక ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని వ్రాయబడతాయి. అటువంటే వ్యాసాల వలన సామాజిక అవగాహన పెరుగుతుంది.

ఆ ఒక విషయమును విపులంగా వివరణతో విశ్లేషించబడి ఉంటుంది. వ్యాసం నందు మొదటిగా విషయము శీర్షిక ఉంటుంది. ఆపై ఉపోద్గాతము ఉంటుంది.

వ్యాసం గురించి

ఉపోద్గాతము తర్వాత వ్యాసంలో విషయమును గురించి వివరాలతో వివరిస్తూ సాగుతుంది. విషయము యొక్క విశిష్టత, విషయము యొక్క ఆవశ్యకత, విషయము యొక్క ప్రభావం, విషయము యొక్క లాభ నష్టాలు తదితర అంశముల వారీ విషయ విశ్లేషణ వ్యాసంలో వ్రాయబడి ఉంటుంది.

ఉదాహరణకు స్మార్ట్ ఫోన్ గురించి వ్యాసం వ్రాయాలంటే… ముందుగా స్మార్ట్ ఫోన్ ఎవరు కనిపెట్టారు. ? ఎప్పుడు కనిపెట్టారు? ఎవరు డవలప్ చేశారు? అందులో పనిచేసే సాఫ్ట్ వేర్? వంటివి వ్రాయాలి.

విషయము యొక్క విశిష్టత: అంటే మొబైల్ ఉంది. దాని ప్రధాన ప్రయోజనం దానియందు విశిష్టమైనదిగా ఉంటుంది. ఒక సాదారణ కంప్యూటర్ ద్వారా నిర్వహించే పనులు స్మార్ట్ ఫోను ద్వారా కూడా చేయవచ్చును. ఈరోజులలో స్మార్ట్ ఫోనులు మల్టి టాస్కింగ్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అలా ఏదైనా వస్తువు యొక్క విశిష్టతను వివరించడం వ్యాసంలో ఉంటుంది.

ఆవశ్యకత: అంటే ఒక విషయము యొక్క ఆవశ్యకత ప్రస్తుత సమాజంలో ఎంతవరకు ఉంది? అనే విషయం చెప్పడాన్ని ఆవశ్యకత అంటారు. అలా ఒక మొబైల్ ఫోన్ ఆవశ్యకత గురించి తెలియజేయాలంటే… స్మార్ట్ ఫోను ద్వారా ఆన్ లైన్ చెల్లింపు చేసేయవచ్చును. స్మార్ట్ ఫోను ద్వారా షాపింగ్ చేయవచ్చును. స్మార్ట్ ఫోన్ ద్వారా విద్యనభ్యసించవచ్చును… నేడు స్మార్ట్ ఫోను మనిషి జీవితంలో ఒక బాగమై ఉంది. కావునా మొబైల్ ఫోన్ నేటి రోజులలో అందరికీ అవసరమే అవుతుంది.

వ్యాసం ప్రభావం

ప్రభావం: ఒక విషయము ప్రస్తుత పరిస్థితలలో ఎలాంటి ప్రభావం సమాజం మీద చూపుతుంది? ఆ విషయము వలన సమాజంపై భవిష్యత్తులో కూడా ఎటువంటి ప్రభావం చూపవచ్చును..? ఇలాంటి ప్రశ్నలతో విషయ ప్రభావం ఎలా ఉంటుందో వివరించడం… ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటే, అది వ్యక్తి జీవితంలో భాగమై ఉంది. ఎక్కడికి వెళ్ళినా వెంట స్మార్ట్ ఫోన్ ఉండాలి.

స్మార్ట్ ఫోను వలన అనే ఆన్ లైన్ లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చును. అయితే స్మార్ట్ ఫోనులో అంతర్జాలం ద్వారా వచ్చే అనేక మంచి చెడు విషయాలను చూపుతుంది. కాబట్టి యువత చెడువైపు ఆకర్షితమయ్యే అవకాశాలు కూడా ఎక్కువ. భవిష్యత్తులో అనేక మార్పులు సమాజంలో మొబైల్ ఫోను ద్వారా జరగవచ్చును… ఇలా ప్రభావం గురించి వివరించడం.. ఇంకా వివరంగా వ్యాసంలో వివరించవచ్చును.

లాభనష్టాలు: ఒక విషయముల వలన సమాజానికి ఒనగూరే పూర్తి ప్రయోజనాలు, పూర్తి నష్టాలు పాయింట్ల వారీ తెలియజేయడం.

  • మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులు చెల్లించవచ్చును
  • స్మార్ట్ ఫోను ద్వారా ఎవరైనా ఎక్కడినుండైనా ఎక్కడివారితోనైనా కమ్యూనికేట్ చేయవచ్చును.
  • ఇమెయిల్ సందేశాలు, మల్టీమీడియా సందేశాలు క్షణాలలో పంపించవచ్చును.
  • సృజనాత్మకతను బట్టి స్మార్ట్ ఫోను ద్వారా కూడా సంపాధన చేయవచ్చును.
  • ఏవైనా విషయాలు శోదించడానికి స్మార్ట్ ఫోను చాలా ఉపయోగం.

    నష్టాలు
  • స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగే కొలది,మనిషికి మనిషికి గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది.
  • రేడియేషన్ ప్రభావం కూడా ఉంటుంది.
  • టచ్ స్క్రీనుపై అనేక క్రిములు ఉంటాయి.
  • యువతకు స్మార్ట్ ఫోన్ గేమింగ్ వంటివి వ్యసనంగా మారే అవకాశం కూడా ఉంటుంది.
  • ఎక్కువగా స్మార్ట్ ఫోనులో వీడియోలు చూడడం వలన కళ్ళపై ప్రభావం పడుతుంది.

ఇలా ఇక విషయమును గురించిన లాభనష్టాలు వ్యాసంలో చూపాలి. అవి సమాజంపై ఏవిధంగా ప్రభావం చూపుతూ మనిషిని ప్రభావితం చేస్తున్నాయి….

వ్యాసం ముఖ్యంగా ఒక విషయం గురించిన సమాచారం అందిస్తుంది. ఒక ఉపన్యాసము అక్షరరూపంలో మారితే వ్యాసం, అది వ్యాసము అవుతుంది.

నేటి నీ కృషి రేపటికి నీకు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు?

అబద్దం చెప్పిన వారి విలువను తగ్గిస్తుంది?

అభివృద్దికి ఆటంకాలు అంటే ఏవి?

అసత్య ప్రచారాలు వాస్తవాలు గురించి

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *