నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై

నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై వ్యాసం రాయండి. అంతంత మాత్రంగా ఉండే కుటుంబ ఆర్ధిక పరిస్థితుల రిత్యా చిన్న వయస్సులోనే కార్మికులుగా మారే బాలలు ఉండడం సమాజం యొక్క దురదృష్టకం.

అంతర్జాతీయ కార్మిక నిర్వహణ వ్యవస్థ యొక్క సర్వేలో లక్షలాది బాల కార్మికులు ఉన్నారని తేలడం వలన ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఇంకా గమనిస్తే చుట్టూ ఉన్న పరిసరాలలో బాల కార్మికులు కనబడుతునే ఉంటారు.

బడికిపోయి చదువుకోవలసిన బాలలు హోటల్లలో పని చేస్తూ కనబడుతూ ఉంటారు. ఇష్టమైన ఆటలు ఆడుకుంటూ, చదువుకుంటూ గడపాల్సిన బాల్యం ఏ మెకానిక్ షెడ్డులోనో, ఏ షాపులోనో, ఏ హోటల్ లోనో పని చేస్తూ ఉండడం విచారకర విషయమే.

పని చేయడంలో తప్పులేదు… కానీ వారిలో ఉండే ప్రతిభకు నైపుణ్యం పెంచుకునే విద్యకు దూరం కావడమే దురదృష్టకం.

కొన్ని సెంటర్లలో చేయి చాచి అడుక్కునే స్థితిలో బాలలు ఉండడం, వారి దారిద్య్ర దశలో ఉండే కుటుంబాలు కూడా ఉండడమే కారణం.

నేటి బాలలే రేపటి పౌరులు అయితే, ఎంతమంది ఎంత ఉన్నత చదువులు చదివితే సమాజం అంతటి ఉన్నత స్థితికి వెళ్ళడంలో యువత పాత్ర పెరుగుతుంది.

నైపుణ్యం కలిగిన యువత నేటి సమాజంలో అత్యంత అవసరం. పోటీ ప్రపంచంలో ఒక ప్రాంతం అభివృద్ది చెందాలంటే వివిధ విషయాలలో నైపుణ్యం కలిగిన యువతే ప్రధానం… కానీ బాల్యదశలోనే బాల కార్మికులు ఉండడం వలన వారు నిరక్ష్యరాశులు అయిన యువతగానే మిగిలిపోయే అవకాశం.

బాల కార్మికులను బడికి పంపించే బాద్యతను బాద్యతాయుత సంస్థలు తీసుకోవాలి. వివిధ ప్రాంతాలలో ఉండే నాయకత్వం ఈ బాల కార్మిక వ్యవస్థపై దృష్టి సారించాలి.

కేవలం ప్రచారం కోసం కార్యక్రమాలు చేపట్టకుండా బాలలను బడికి పంపించే విధంగా ఆయా కుటుంబ పెద్దలను మోటివేట్ చేయాలి. ఆయా కుటుంబ ఆదాయం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *