భాగవతము భక్తి మార్గమునకు మార్గదర్శిని, భాగవతము భగవంతునిపై అచంచల విశ్వాసము కలిగిన భక్తుల గురించి, భగవంతుడి గురించి తెలియజేస్తుంది.
రోజు మంచిమాటలు వింటూ నిద్రిస్తూ ఉంటే, మనసు భగవంతుడిపైకి మరలుతుందని దృతరాష్ట్రుడి నిష్క్రమణ తెలియజేస్తుంది.
సకలభోగాలు అనుభవించిన పాండవులు, కృష్ణనిర్యాణం కాగానే సర్వము త్వజించి ఉత్తరదిక్కుకు ప్రయాణం చేసే విధానం, భోగాలపై మనసులో వైరగ్యా అవసరాన్ని తెలియజేస్తుంది.
శివుని గురించి చెబుతుంది. లోకాలను రక్షించడం కోసం విషమును కంఠమునందే నిలుపుకున్న పరమేశ్వరుడి గురించి భాగవతం తెలియజేస్తుంది.
పశువులకు కూడా భక్తి ఉంటుందని… పశువులు కూడా భగవంతుడి అనుగ్రహం పొందగలవని గజేంద్రమోక్షం తెలియజేస్తుంది.
త్రాగు నీటిని పాడు చేస్తూ, అమాయకులైన ప్రజలను భక్షిస్తే, భగవంతుడు శిక్షిస్తాడని కాళీయమర్ధనం తెలియజేస్తూ ఉంటుంది.
భగవంతుడి లీలలను చూపుతూ భగవంతుడిపై ఆరాధన పెంచే క్రమంలో భాగవతం ఒక తీపి పదార్ధం వంటిది అంటారు.
మనసుకు బాగా నచ్చిన విషయంలో, అది బాగా స్పందిస్తుందని మనోవేత్తలు చెబుతారు. అలా మనసుకు బాగా నచ్చే విధంగా భగవంతుడు గురించి చెప్పడమే శాస్త్రం పని అయితే, అది భాగవతములో పుష్కలంగా ఉందని అంటారు.
కృష్ణుడి అల్లరిలో అద్బుతమైన లీలలు మనసుని కట్టిపాడేస్తాయి.
ఎంత నియమ నిష్ఠలతో ఉన్నా, మనసు చెడిపోవడానికి ఒక్క క్షణం చాలని అజామిలోపాఖ్యానం తెలియజేస్తుంది.