భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం ముఖ్యమంటారు. మనిషి మనసు విషయవాంఛలయందు మమేకం అయి ఉంటుంది. ఏదో ఒక వాంఛ తీరుతుంటే, కొత్త విషయం, కొత్త వాంఛ పుడుతుంది… వాంఛలు వస్తూ ఉంటాయి… కానీ భక్తి వచ్చుటకు మార్గం కనబడదు. భక్తి వచ్చుటకు అవకాశం ఏర్పడదు.
విషయవాంఛలయందు మమేకం కాకుండా ఉండలేరని అంటారు. ఎందుకంటే విషయవాంఛలు మనసుకు అంతగా అలావాటు అయి ఉంటాయి. కావునా మనసు మార్గం భక్తిమార్గం కావాడానికి సమయం పడుతుందని అంటారు. కోరికతో తహతహలాడే తనువు కోరిక తీర్చుకోవడంలో తలమునకలవుతుంది. కోరిక తీరిన తర్వాత మరలా కోరికతో తనువు తయారు అవుతుంది… మనసు పడే తపన తనువుతో తీరుతుంది….
మనసు తృప్తికి తనువు సాయపడితే, వ్యక్తి తనువు తరించాలంటే మనసులో భక్తి ఉండాలి. మోహంలో ఉన్నప్పుడు మనసు మాట వినదు. మోహంవీడిన మనసు విజ్ఙానం వైపు వెళుతుంది. కా
తనువు వలన సుఖమెరిగే మనసుకు తనువును ఉపయోగించుకోవడంలో చూపే చొరవ తనువును నియమాలకు కట్టడి చేయడంలో మాత్రం వెనుకాడుతుంది. కానీ దానికి ప్రయత్నం చేస్తే మాత్రం క్రమశిక్షణ మనసుకు అలవాటు అవుతుంది. క్రమశిక్షణతో మనసు తననుతాను నియంత్రించుకుంటుంది.
ఇంతటి శక్తివంతమైన మనసులో భక్తి వచ్చుటకు సద్భక్తి కలిగిన బుక్స్ రీడ్ చేయడం ఒక మార్గం అయితే, భక్తి కలిగిన వారితో స్నేహం మరీ మంచిదని అంటారు. ఇంకా సులభంగా మనసులో భక్తి వచ్చుటకు భక్తి భావనతో మంచి మాటలు వింటూ ఉండడం అని కూడా అంటారు.
అలా భక్తి వచ్చుటకు భక్తి కలిగిన విషయాలు తెలుసుకోవడం వలన మనసులో భక్తి భావన బలపడుతుంది. భక్తి విషయాలు చదవాలనే ఆసక్తి, వినాలనే తాపత్రయం పెరుగుతాయి.