చీకట్లో చిన్ని చిన్ని దీపాల వరుసతో దీపావళి పండుగ ప్రారంభం చేయడం లక్ష్మీ పూజ భక్తిశ్రద్దలతో ఆచరించడం అలక్ష్మిని దూరం చేయడం దీపావళితో సంతోషాల పర్వం మనసులో నూతనోత్తేజం దీపారాధన చేయడంతో ప్రారంభం…
చిన్ని చిన్ని దీపాల వరుసతో తైల దీపాలను వెలిగిస్తూ, భక్తితో భగవంతుడికి నమస్కరించడంతో చుట్టూ ఉండే పరిసరాలలోని గాలిలోకి మంచి గాలి తోడు అయ్యే విధంగా పూర్వపు దీపాల వరుస ప్రకృతికి మేలు చేయడానికే అన్నట్టుగా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అంటే మన పండుగలలోనే ఆరోగ్యకరమైన ఆచారం మనకు అలవాటు చేశారు. ఉన్నంతలో చుట్టూ ఉన్న పరిసరాలలో తైల దీపాలను వెలిగించడం శ్రేయష్కరమైన కార్యముగా చెబుతారు.
దీపాల వరుసలుగా దీపాలను వెలిగిస్తూ, అగ్నిని ఆరాధించడంతో బాటు దైవరాధన చేయడంతో మనసులో సరికొత్త ఉత్తేజం వస్తుందని పెద్దల విశ్వాసం. ఆ యొక్క విశ్వాసాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చిన మన పెద్దలకు కృతజ్ఙతలు తెలియజేయాలి. లేకపోతే ఈ దీపావళి మనకు ఎలా అలవాటు అవుతుంది. వారు చేయబట్టి వారి నుండి మనకు ఈ దీపావళి పండుగ ఒక అలవాటుగా వచ్చేసింది. అందుకు మన పూర్వికులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి.
దీపావళి అమావాస్య రోజున చిమ్మ చీకటిగా
దీపావళి అమావాస్య రోజున చిమ్మ చీకటిగా ఉంటుంది. అలాగే అజ్ఙానం ఉన్న మనసు చుట్టూ కూడా మాయ ఉంటుందని అంటారు. అటువంటి మాయ మనసు నుండి పోవాలంటే, జ్ఙానదీపం వెలగాలని అంటారు. అలాంటి జ్ఙానదీప సాధనకు దీపావళి పర్వదినాన దీపాలను వెలిగించి దైవారాధన చేయడంతో మనలో సాధనకు పునాది పడుతుంది. దీపావళి పండుగ రోజ నాటి నుండి కార్తీక మాస పర్యంతము నిత్య దీపారాధన వలన మన మనసుకు మేలు జరుగుతుందనేది పెద్దల భావన. అటువంటి భావన బలపరుస్తూ వచ్చిన మన పెద్దలకు ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేయాలి.
మన భక్తి జ్ఙాన తత్వం ఎవరో చెబితే తెలుసుకునే స్థితిలో మనం ఉండేలాగా లేము మనము. మన పెద్దల దయ వలన మనకు భక్తి జ్ఙానం మనకు మన ఆచారంలోనే మనకు ఒక అలవాటుగా వచ్చేసింది. కాబట్టి కొత్తగా నేర్చుకోవలసినది ఏముంది? మన కుటుంబంలో మన పూర్వికులు చేసిన దైవారాధననే మనము చేస్తున్నాము…. చేస్తాము. అలా మనకు మన భక్తి జ్ఙానమును ఆచారములో మనకు ఒక అలవాటుగా అందించేసిన మన పూర్వికులందరికీ మనస్పూర్తిగా కృతజ్ఙతలు.
దీపావళి రోజున ఇంటి గుమ్మంలోనే దీపాలను వెలిగించడం మాత్రమే కాదు మన మనసులో గూడు కట్టుకుని ఉండే ఆజ్ఙానమును జ్ఙానదీపంతో తరిమివేసే సాధనకు పూనుకోవడం చేయాలని పెద్దలంటారు.
అటువంటి పరమ పవిత్రమైన దీపారాధన మీ ఇంటిల్లిపాది జీవితపర్యంతము చేయగలిగే శక్తి, అష్టైశ్వర్యాలు ఆ యొక్క లక్ష్మీదేవి మీకు కలుగజేయాలని ప్రార్ధిస్తూ… మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మీ మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.