చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది

భక్తి భావన బలపడడంలో ప్రధాన పత్రం చిత్తం పోషిస్తే, అటువంటి చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిదిగా ఉంటుంది.

వ్యక్తి జీవితం యొక్క భక్తి మార్గములో మనసు చాలా ప్రధానమైనది. అది ఎటు తిరిగితే, జీవనగతి అటే ఉంటుంది.

అటువంటి మనసుపై ప్రాపంచిక విషయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి.

ఒక వ్యవస్థలో వ్యక్తి చుట్టూ పరిసరాల నుండి చేరే ప్రాపంచిక విషయాలు మనసుకు అలవాటుగా మారతాయి.

జీవనంలో వ్యక్తి మనసులోకి ప్రవేశించిన అనేక విషయాల్లో కొన్నింటిపై మనసు మమకారం పెంచుకుంటుంది.

అలా మనసులో మమకారం పెరగడంలో ప్రధాన పాత్ర పోషించేది చిత్తం అంటారు.

చిత్తం మనసు యొక్క భావనలలో పొందిన అనుభవాలను జ్నప్తికి తెస్తుందని అంటారు.

చిత్తము అంటే అది ఆన్లైన్ హిస్టరీ వంటిది. అంటే ఆన్ లైన్ హిస్టరీకి సంబంధించిన అంశాలలోనే మనం ఆన్ లైన్లోకి వెళ్ళిన ప్రతిసారి విషయాలు కనబడుతూ ఉంటాయి.

మన ఫోనులో జోడించబడిన ఉన్న మెయిల్ ఐడి ఆధారంగా మన ఫోనులో ఆన్ లైన్ సెర్చ్ హిస్టరీ సేకరించబడుతూ ఉంటుంది. ఆ ఈమెయిల్ ఎక్కడ ఓపెన్ చేసిన ఆ హిస్టరీకి సంబంధించిన విషయాలే కనబడుతూ ఉంటాయి.

యూట్యూబ్ ఖాతాకు జిమెయిల్ ఆధారంగా యూట్యూబ్ వీడియో హిస్టరీ కూడా ఆన్ లైన్లో సేవ్ అవుతుంది.

మరొక పరికరంలో జిమెయిల్ ఖాతా ఓపెన్ చేస్తే, మన ఫోనులో కనబడే వీడియోలే కనబడతాయి. గతంలో చూసిన అంశాలలో వీడియోలు కనబడుతూ ఉంటాయి.

యూట్యూబ్ కానీ ఫేస్ బుక్ కానీ గతంలో లైక్ చేసినవి లేక వాచ్ చేసినవి… ఆయా అంశాలలో పాపులర్ థింగ్స్ మనకు చూపుతూ ఉంటాయి… అలా చూపడానికి ప్రధాన ఆధారం ఆన్లైన్ హిస్టరీ.

అటువంటి ఆన్లైన్ హిస్టరీ డిలీట్ చేయాలంటే జిమెయిల్ ఖాతా అడ్మిన్ సెటింగ్స్ లో హిస్టరీ డిలీట్ చేయాలి….

అలాగే చిత్తము యొక్క చరిత్రను రూపుమాపలంటే ఆత్మ అనే అడ్మిన్ దగ్గర మనసు నిలబడాలి.

మనసు అటువంటి ఆత్మ దగ్గర నిలబడడానికి భక్తి ఒక మంచి మార్గం అని సులభమైన మార్గమని అంటారు.

ముఖ్యంగా చిత్తశుద్దికి భక్తిమార్గం మేలైన మార్గంగా పెద్దలు చెబుతూ ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *