రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు… మీకు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ శుభాకాంక్షలు…
రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము మననము చేయడము జీవనగమ్యము చేరడానికే. రాముడు అనుగ్రహం ఉంటే, సాధ్యం కానీ విజయం సిద్దిస్తుంది.
శ్రీరాముడి అనుగ్రహం కొరకు రామనామము జపించడమే మార్గం.
ఏమి కర్మలు చేసి ఉన్నమో? ఏమి కర్మలు వెంటాడుటయో? కాలం – కర్మ జీవితాన్ని ఎటు మలుపు తిప్పుటయో? ఎవరికెరుక? ఆ రామునికెరుక… కనుక రామునే పట్టుకుంటాను. రామనామము నిత్యము మననము చేస్తా!
శ్రీరామనామము జపిస్తూ, రామభజనము చేసే పోతనకు రామానుగ్రహం అయ్యింది. శ్రీమద్భాగవతమ్ సంస్కృత భాష నుండి తెలుగు భాషకు అనువదించారు.
రామానుగ్రహం పొందిన పోతనామాత్యులు, శ్రీమద్భాగవతమ్ రామునికే అంకితం అందించారు… కానీ డబ్బుకోసం మరే ఇతర విషయాలకు ఆశపడలేదు. తన మనసును రామస్వరూపముతో నింపేసుకున్నారు. మనసు నిండా రాముడే ఉంటే, మరి ఆ మనిషి కావలసినదేముంటుంది.
రామదాసు రామునిపైనే దృష్టి. రామదాసు జీవితం సుఖంలో ఉన్నప్పుడు రామాలయం నిర్మించారు. కష్టంలో ఉన్నప్పుడూ దాశరది శతకం అందించారు. రామానుగ్రహం కలిగితే మంచి పనులు జీవనోద్దరణ నిర్మాణమే మనసులో ఉంటుంది.
ఎంత కష్టం వచ్చిన రామునిపై నమ్మకంతో ఉండి, జీవితాల్ని ధన్యం చేసుకున్నవారు బమ్మెర పోతన, రామదాసు…
శ్రీరాముడు కేవలం పోతనను అనుగ్రహించడమే అనుకుంటే, రామదర్శనం పొందితే చాలు. కానీ రాముడు తెలుగువారందరినీ అనుగ్రహించాలని అనుకున్నాడు.
రావణాసురుడిని చంపడమే కాకుండా, చాలా కాలం భూమిపై ఉండి, మనుష్య జాతిని ఉద్దరించిన శ్రీరాముడు, తెలుగువారందరినీ అనుగ్రహించడం కోసం బమ్మెర పోతనతో భాగవతం అనువాదం చేయించాడు.
అలాగే శ్రీరాముడు రామదాసును అనుగ్రహించడమే అనుకుంటే, రామదాసు గుడి కడుతున్నప్పుడే గోపన్న మనసులో శ్రీరాముడు చేరాడు. కానీ అందరినీ అనుగ్రహించడం కోసం రామదాసుతో శతకం అందించాడు.
మన శ్రీరాముడు కేవలం భక్తుడునే అనుగ్రహించడం కాదు, భక్త జనాన్నే అనుగ్రహించడం చేస్తూ ఉంటాడు.
అలాంటి మన శ్రీరాముడు అందరి మనోసింహాసహనంలో సీతాలక్ష్మణ ఆంజనేయులతో అధిష్టించాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు…
రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు
“శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే”
0 responses to “రామనామము రమ్యమైనది శ్రీరామనవమి శుభాకాంక్షలు”