దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు

దేవాలయ దర్శనంకు నియమ నిభందనలు చెబుతారు. తగు నియమాల వలన మనసులో దైవంపై భక్తి శ్రద్దలు పెరుగుతాయని చెబుతారు.

దేవాలయం అంటే భక్తులను అనుగ్రహించడానికి దైవము కొలువుతీరిన క్షేత్రం. ఆ క్షేత్రం పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన పరమాత్మ భక్తుల కోరికలు తీర్చడానికి కొలువైన పరమ పావన దైవనివాసం. అంతరి పరమపుణ్య ప్రదమైన దేవాలయములో దైవ దర్శనమునకు వెళ్ళేటప్పుడు కొన్ని నియమ నిభందనలు చెబుతారు.

గుడికి వెళ్ళే భక్తులు (స్త్రీ / పురుషులు) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేయవలెను. నుదుట కుంకుమ ధరించాలి.

గుడి ఆచారం ప్రకారం సంప్రదాయమైన దుస్తులు ధరించాలి. మగవారు పంచె, కండువా… ఆడువారు సంప్రదాయక చీరలు.

దేవాలయమునకు బయలుదేరుతున్నప్పుడే భగవన్నామ స్మరణ మేలని అంటారు.

భగవంతుడికి భక్తితో పూజించడానికి కనీస పూజా సామాగ్రి ఉండాలి… అంటే ధూప దీప నైవేద్యాలు…

దేవాలయ ప్రాంగణం చేరుకోగానే, ప్రాంగణం బయటే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతారు.

దేవాలయం ఆలయం ప్రవేశించడానికి ముందు, ఆలయ గోపురానికి నమస్కరించి ఆపైన మెట్లకు నమస్కరించాలి.

దేవాలయం లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ మనసు భగవంతుడిపైనే పెట్టాలి.

దేవాలయం చుట్టూ ఆలయంలొని దైవమును అనుసరించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని అంటారు.

ప్రదక్షిణ సమయంలో మనసంతా భగవంతుడిపైనే ఉండడం శ్రేయస్కరం అంటారు.

దేవాలయంలో పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిలబడాలని అంటారు.

ఆలయంలో దైవమును ఆపాదమస్తకం వీక్షించాలని అంటారు. అంటే కాళ్ళ దగ్గర నుంటి ముఖం వరకు పూర్తిగా దైవమును దర్శించాలని అంటారు.

దైవదర్శనం అయిన తరువాత ఆలయంలో కాసేపు కూర్చొని ఆలయంలో కొలువుతీరిన దైవనామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో కాసేపు దేవాలయంలోనే ఉండాలని అంటారు.

దైవ ప్రసాదం భక్తితో స్వీకరించడం వలన భగవంతుంది అనుగ్రహం కలుగుతుందని అంటారు.

ఇంటికి తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ ఆలయంలోని స్వామికి నమస్కరించుకుని ఆలయం బయటికి వచ్చిన తరువాత మళ్ళీ తిరిగి గోపురానికి నమస్కరించి వెళ్ళాలని అంటారు.

వివిధ ప్రాంతాలు వివిధ పద్దతులను బట్టి ఆయా దేవాలయములలో కొన్ని ప్రత్యేక నియమాలు చెబుతూ ఉంటారు. అటువంటి క్షేత్రముల దర్శనమునకు వెళ్ళే ముందు, ఆయా క్షేత్రముల చరిత్రను, నియమాలను ముందుగా తెలుసుకోవడం శ్రేయస్కరం అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *