రామాయణ రచయిత వాల్మీకి జయంతి

శ్రీరామాయణం రచించిన మహర్షి వాల్మీకి జయంతి నేడు

ధర్మం గురించి చెప్పేవారు చాలమంది ఉంటారు. ధర్మప్రభోదం చేసేవారు కూడా మనకు పెక్కుమంది కనబడుతూ ఉంటారు. ధర్మం ఆచరించి చూపి, ధర్మం మనిషతై ఇలా ఉంటుందనేది శ్రీరాముని గూర్చి చదివితే తెలస్తుందని అంటారు. అటువంటి రామకధను తెలియజేసే శ్రీరామాయణ రచయిత వాల్మీకి జయంతి నేడు. వాల్మీకి మహర్షి రచించి శ్రీరామాయణం నేడు ఎందరో పండితులు వాక్కుతో వింటున్నాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో పూర్ణిమ తిథి వాల్మీకి జయంతిగా ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పూర్ణిమ తిధి ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం తేది మారుతుంది. ఈసారి అక్టోబర్ 13న వచ్చింది. రామాయణ రచయిత అయిన వాల్మీకి గురించిన గాధ ఇలా ప్రాచుర్యం పొంది ఉంది.

బందిపోటు దొంగగా అడవిలో ఉంటాడు. అడవిలో ఆ దారిలో వస్తున్న నారదమహర్షిని కూడా ఆ దొంగ అడ్డగిస్తాడు. అయితే అప్పుడు నారదుడు అతనిని ”నీవు చేస్తున్నది పాపం, ఈ పాపంలో నీ భార్యబిడ్డలకు భాగం ఉందో లేదో తెలుసుకో” అని అంటాడు. దానికి వెంటనే ఆ దొంగ తన ఇల్లాలిని ఇదే విషయం అడిగితే, ఆమె ”నీవు సంపాదించి, తీసుకురావడం నీ ధర్మం, నీ పాపంలో నాకు భాగముండదు” అని చెప్పడంతో ఆ దొంగ మరలా తిరిగి నారదుడిని చేరతాడు.

అప్పుడు నారద మహర్షి అతని వైరాగ్య భావనను గమనించి అతనికి తారకమంత్ర ఉపదేశం చేస్తాడు. అయితే ఆ దొంగకు రామ రామ రామ అనడం కూడా చేతకాకపోవడం వలన రామ అక్షరాలను వెనుక నుండి మర మర అనమని చెబుతాడు. అప్పుడు అతను మర మర మర మర….అంటూ పలుమార్లు ఉచ్ఛరించడం చేత, అది రామా రామా గా మార్పు పొంది, పెద్ద తపస్సులోకి వెళతాడు. అతని తపస్సు పూర్తయ్యేసరిగి అతని చుట్టూ పుట్ట పెరిగిపోయి, అందులోంచి తిరిగి మహాజ్ఙానిగా బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అంటారు.

మహాతపస్సు చేత బ్రహ్మగారి వర ప్రభావంతో నారదమహర్షి సంక్లిప్త రామాయణం విన్న వాల్మీకి మహర్షి ఆరుకాండట శ్రీరామాయణం రచించడం ప్రారంభించి, దిగ్విజయంగా పూర్తి చేసారు. అయితే ఇందులో ప్రత్యేకత ఎవరైనా రచయిత కల్పన చేత పాత్రలను సృష్ఠించగలరు. కానీ శ్రీరామాయణంలోని వ్యక్తుల మనసులోని భావాలను తెలుసుకోగలిగిన వరం పొంది ఉన్న వాల్మీకి రామాయణ రచన అంతా వారి వారి మనోభావాలను యధాతదంగా వ్రాయగలిగారు అని అంటారు.

మానవజీవితాన్ని ఉద్దరించగలిగిన రామాయణం రచించి ఇచ్చిన వాల్మీకి మహర్షి జయంతి నేడు కాగా ఈ వాల్మీకి జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. మనకు మంచిని ప్రబోధిస్తూ ధర్మాన్ని పట్టుకుంటే భూమి ఉన్నంత కాలం చరిత్రగా ఎలా ఉంటుందో నిరూపించే శ్రీరామాయణం రచించిన వాల్మీకి జయంతిని జరుపుకోవడం ఆనందదాయకం.

ధన్యవాదాలు తెలుగురీడ్స్

శరదృతువులో ఆశ్వయుజమాస పూర్ణిమ

శరదృతువు ఈకాలంలో చంద్రుడు తన గమనంలో అశ్వని నక్షత్రంతో కలసి పూర్ణిమ రోజు ఉంటాడు. ప్రతి పౌర్ణమి తిధికి చంద్రుడు ఆరోజంతా ఏ నక్షత్రంతో కలసి ఉంటే, ఆనక్షత్రం పేరున మాసం ఉంటుందని చెబుతారు. ఆ పూర్ణిమ కలిగిన మాసం ఆశ్వయుజ మాసంగా పరిగణిస్తారు.

దసరా ఉత్సవాల తర్వాత వచ్చే ఈ పూర్ణిమ రోజు చేసే ధ్యానం వలన వచ్చే ఫలితం అధికంగా ఉంటుందని అంటారు. ఈ పౌర్ణమి కాంతి అధికంగా ఉండడం వలన ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని కౌమిది పౌర్ణమి అని అంటారు. లక్ష్మి పూజి, ఇంద్ర పూజ, కుబేర పూజలు లాంటివి ఈ పౌర్ణమి సందర్భంగా చేస్తూ ఉంటారు.

ఇంకా ఈ పౌర్ణమి సందర్భంగా జాగరణ చేస్తూ కాలక్షేపంగా గవ్వలు ఆడటం కూడా మహారాష్ట్ర ప్రజలకు ప్రసిద్ధి. లక్ష్మి అమ్మవారు సముద్రం నుండి పుట్టడం వలన ఈ గవ్వలు ఉపయోగిస్తారని చెబుతారు. ఈ రోజ దానఫలితం ఉత్తమ ఫలితాలు ఇస్తుందని చెబుతారు.

శరదృతువులో వచ్చే ఆశ్వయుజ మాసంలో వచ్చే శరద్ పూర్ణిమను కుమార పూర్ణిమ, కొజగిరి పూర్ణిమ, నవన్న పూర్ణిమ, కౌముది పూర్ణిమగా అని కూడా చెబుతారు. ఇంకా ఈ శరద్ పౌర్ణమిపై గల యూట్యూబ్ వీడియో వీక్షించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ చేయండి.

ధన్యవాదాలు –తెలుగురీడ్స్