సామ్సంగ్ న్యూగాలాక్షీ ఎం31 ఫోను

కొత్త 4జి స్మార్ట్ ఫోను కొనాలనుకంటే సామ్సంగ్ నుండి గాలాక్షీ సిరీస్ లో సామ్సంగ్ న్యూగాలాక్షీ ఎం31 ఫోను వచ్చింది. ఈ ఫోను మార్చి5, 2020 నుండి అమ్మకాలకు అమెజాన్ సైటులో అందుబాటులో ఉంటుంది. దీని ధర 14999/-.

న్యూ గాలాక్షీ ఎం31 ఫోను నాలుగు బ్యాక్ కెమెరాలు కలిగి ఉంటుంది. ఈ కెమెరా క్వాలిటీ 5ఎంపి డెప్త్ కెమెరా, 5ఎంపి మార్కో కెమెరా, 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమరా లు ఉన్నాయి.

32ఎంపి ఫ్రంట్ కెమెరా 4కె వీడియో రికార్డింగుకు చేయవచ్చట. టైప్ సి చార్జింగ్ ద్వారా ఫాస్ట్ చార్జింగుకు అనుకూలం.
6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ద్యం కలిగి ఉండడం వలన బ్యాకప్ బాగుండవచ్చు.
6.4 అంగుళాల ఇనిఫినిటి డిస్ల్పే గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది.
6జిబి ర్యామ్ డిడిఆర్4 టెక్నాలజీతో ఫాస్ట్ పెర్పార్మెన్స్ కలిగి ఉంటుంది.

128/64 జిబి ఫోన్ మెమోరి, 512జిబి ఎక్స్ టర్నల్ మెమోరి కార్డు స్లాట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్, ఆండ్రాయిడ్ 10, వర్చువల్ లైట్ సెన్సింగ్, జియోమెట్రిక్ సెన్సార్, గైరో సెన్సార్, ఏక్సలరోమీటర్, ప్రొక్సిమిటి తదితర ఫీచర్లు కలిగి ఉంది.

ఈ ఫోను ఓసన్ బ్లూ మరియు బ్లాక్ కలర్లలో లభిస్తుంది.

మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్

మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్టు ఈకామర్స్ సంస్థలో అందుబాటులోకి రానుందీ స్మార్ట్ ఫోను. ఎందుకు ఈ ఫోను కొనాలంటే, ఈ ఫోను రేటింగుతో బాటు బడ్జెటు ధరలో లభించనుంది. దీని ధర ప్రస్తుతం రూ.13999-00లుగా ఉంది.

ఈ స్మార్ట్ ఫోను డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ, క్విక్ చార్జింగ్, ప్రొసెసర్ ఫీచర్లలో బాగుందన్న సూచనలు 91మొబైల్స్ వెబ్ సైటులో చెప్పబడి ఉంది. ఇంకా స్క్రీను ప్రొటక్షన్ విషయంలో ఆలోచన చేయమని సూచనను కూడా ఈ వెబ్ సైటులో చూడవచ్చును. బడ్జెట్ ధరలో మంచి స్మార్ట్ ఫోనుగా 84% out of 100% 91 మొబైల్స్ వెబ్ సైటులో స్కోర్ చేసింది.

స్మార్ట్ పిక్స్ వెబ్ సైటులో మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోను 79 స్కోర్ చేసింది. మొత్తం మీద ఈ ఫోను స్మార్ట్ పిక్స్ సైటులో 10 పాయింట్లలో 8పాయింట్లు సాధించింది. ఇంకా ఈ ఫోను ఫీచర్లలో డిస్ప్లే, డిస్ప్లే సైజు, డిస్ప్లే రిజుల్యషన్, కెమెరా ఆకట్టుకునే విధంగా ఉంటే, ఫోను వైయిట్, ధిక్ నెస్ విషయంలో సరి చూసుకోవలసిందిగా, ఫీచర్లు బాగానే ఉన్నట్టుగా సూచిస్తున్నారు.

ఇంకా మోటో జి8ప్లస్ న్యూస్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9వ వెర్షన్ అయిన పై ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోను ఫీచర్లు:

Octa core (2 GHz, Quad Core + 1.8 GHz, Quad core)Snapdragon 665 Processor, 4 GB RAM, 6.3 inches (16 cm)1080x2280px, 400PPI IPS LCD Display, 48 MP + 16 MP + 5 MP Triple Primary Cameras LED Flash25 MP Front Camera, 4000 mAh Battery, Turbo Charging USB Type-C port, 4g Supports Indian bands, VoLTE, Storage 64 GB + 512 GB Expandable, Dual SIM: Nano + Nano, Fingerprint sensor, USB OTG Support, Splashproof, IPX2, FM Radio, Wi-Fi 802.11, ac/b/g/n/n 5GHz, Mobile Hotspot, Bluetooth v5.0, GPS with A-GPS, Glonass, 3.5 Audio Jack.

ఈ ఫోను ఫీచర్స్ ఆన్ లైన్ డేటా ఆధారంగా అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా ఈస్మార్ట్ ఫోను గురించిన రేటింగ్ వెబ్ సైటులో ఉన్న రేటింగు మాత్రమే కానీ ఈ ఫోను యూజర్ల రేటింగు మాత్రం కాదు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

నోకియా6.2 స్మార్ట్ ఫోను బడ్జెట్ ఫోను

నోకియా ఫోను ప్రియులకు నోకియా6.2 స్మార్ట్ ఫోను నచ్చే విధంగా బడ్జెట్ ధరలో ఆన్ లైన్లో లభిస్తుంది. నోకియా వెబ్ సైటు నుండి ఈ ఫోను కొనవచ్చును. ఇంకా అమెజాన్ ఈకామర్స్ వెబ్ సైటు నుండి కూడా మీరు నోకియా6.2 స్మార్ట్ ఫోనును కొనుగోలు చేయవచ్చును. అయితే ఈ ఫోను ఫీచర్స్ చూస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి. బ్రాండెడ్ బడ్జెట్ ఫోన్లలో నోకియా6.2 ఒకటిగా చెబుతున్నారు.

నోకియా6.2 స్మార్ట్ ఫోను 6.3అంగుళాల స్క్రీను FHD, HDR ఫీచర్స్ కలిగి ఉంటుంది. మూడు కెమెరాలు కలిగి ఉంటుంది. సిరామిక్ బ్లాక్, ఐస్ కలర్లలో నోకియా6.2 స్మార్ట్ ఫోను లభిస్తుంది. స్నాప్ డ్రాగన్ 636 సి.పి.యు కలిగి, 4జి.బి. ర్యామ్, 64జి.బి. ఇంటర్నల్ మెమోరి కలిగి ఉంటుంది. డ్యూయల్ సిమ్ కార్డు స్లాటుతో వస్తున్న ఈ ఫోను నానో సిమ్ కార్డును సపోర్టు చేస్తుంది.

నోకియా6.2 స్మార్ట్ ఫోను గురించి రివ్యూ వెబ్ సైటులు ఏమి చెబుతున్నాయో చూస్తే…. ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ప్రముఖ ఆన్ లైన్ రివ్యూ వెబ్ సైటు అయిన 91మొబైల్స్ వారు ఈ స్మార్ట్ ఫోనుకు స్పెక్ స్కోర్ 80% వరకు ఇచ్చారు. స్మార్ట్ ఫోను కెమెరా, డివైస్ పెర్ఫార్మెన్స్, బ్యాటరీ విభాగాలలో రేటింగ్ శాతం ఎక్కువగా ఉంది.

మరొక ఆన్ లైన్ రివ్యూ వెబ్ సైటు అయిన స్మార్ట్ ఫిక్స్ 8.1/10 రేటింగ్ ఇచ్చారు.

ఇంకా టైప్-సి చార్జర్ తో బాటు, 4జి, వైఫై, బ్లూటూత్, జిపిఎస్, ఎఫ్.ఎం రేడియో, 3.5 ఆడియో జాక్ రెండు మైక్రోఫోన్లు కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 9 వెర్షన్ కలిగిన ఈ నోకియా6.2 స్మార్ట్ ఫోన్ ధర 15999/- లుగా నోకియా వెబ్ సైటులో ఉంది. మీరు నోకియా సైటును సందర్శించి ఆన్ లైన్ ద్వారా ఈ ఫోనును కొనుగోలు చేయవచ్చును.ఇన్ బాక్స్ లో డివైస్, గైడ్, చార్జర్, హెడ్ సెట్, సిమ్ ట్రే టూల్ ఉంటాయి.

గమనిక: ఆన్ లైన్ సమాచారం అనుసరించి, తెలుగు వీక్షకుల సౌకర్యార్ధం ఈపోస్టు చేయడం జరిగింది. నాణ్యతా పరమైన విషయాలలో ఆయా వెబ్ సైటులో సరిచూసుకుని కొనుగోలు చేయగలరు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్