ప్రముఖ ప్రవచనకర్తల తెలుగు ప్రవచనాలు ఆడియోలు వీడియోలు ఎక్కడ లభిస్తున్నాయి?

తెలుగు ప్రవచనాలు ప్రముఖ ప్రవచనకర్తలు శ్రీరామాయం, భాగవతం, భగవద్గీత

తెలుగుభాషలో తెలుగు పండితులు పలికే ఆ నాలుగు పలుకులు మనసుకు శాంతిని ఇస్తాయి, అంటారు. అలాంటి ప్రముఖ ప్రవచకర్తల తెలుగు ప్రవచనాలు అందిస్తున్న వెబ్ సైటులు, యూట్యూబ్ చానల్ వివరాలు తెలుసుకుందాం. అయితే ప్రవచనం ఎందుకు వింటారు అంటే?

కొందరు ఏమని అంటారు అంటే, ప్రముఖుల మాటలు మనిషికి ఆదర్శనీయంగా ఉంటాయి, కాబట్టి మంచి మాటలు ఎవరూ చెప్పినా వినాలనే తలంపుతో ఉండాలని కొందరు అంటూ ఉంటారు. మరికొందరు అంటారు కష్టం కలిగితే, అప్పుడు ఆ సమయంలో పెద్దల మాటలు ఓదార్పు తెస్తాయి, అంటారు. పెద్దలు ప్రవచించిన మాటలను ప్రవచనాలుగా చెబితే, ప్రముఖ ప్రవచనకర్తల తెలుగు ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇంకా ప్రవచనం ఆలోచన చూస్తే….

ఒక వ్యక్తికి కష్టంలో స్నేహితుని మాటలు ప్రభావం చూపుతాయి, కుటుంబ సభ్యుల మాటలు ఓదార్పును తెస్తాయి. సహచరుల పలకరింపు మాటలు కూడా మనసును కుదుటపరుస్తూ ఉంటాయి. చిన్న చిన్న కష్టాలలో వీటి వలన ఒక వ్యక్తి ఓదార్పు పొందుతూ ఉంటాడు. తనకు ఇంతమంది అండగా ఉన్నారనే ధైర్యంతో జీవనం సాగిస్తూ ఉంటారు. ఇలా సాదరణ స్థితిలో సాగే మనసు అనుకోని దు:ఖం చేత మరింత బాధను పొందుతుంది. అప్పుడు అందరి మాటలు అందినా, పుచ్చుకునే స్థితిలో మనసు ఉండదని అంటారు.

ఆటలో పాల్గొన్న వ్యక్తికి తను చేస్తున్న పొరపాటు తెలియదు, కానీ ఆ ఆటను చూస్తున్న మైదానం బయటివ్యక్తులకు తెలుస్తుంది. అలాగే పెద్ద కష్టం అనుభవిస్తున్న వారికి, దు:ఖం చేత వారి మనసు అదుపులో ఉండదు, సాదారణ సమయంలో మిత్రుల సలహాలు, బంధువుల మాటలు, ఇతరుల మాటలు వినే మనసు, ఈ సమయంలో వినదు, అంటారు.

అటువంటి దు:ఖ సమయంలోనే తోటివారి సలహా స్వీకరిస్తూ, తనకు తానే పరిస్థితుల నుండి బయటిపడే ఆలోచనను చేయగలిగే స్థితిలో మనసు ఉండాలి, కాబట్టి కష్టంతో కూడిన జీవితాలు చదివి ఉండడం, చరిత్రలు తెలుసుకుని ఉండడం, గొప్పవారి జీవిత చరిత్రలలోని కష్టకాల సంఘటనలను తెలుసుకుని ఉండడం వలన మనకు అటువంటి కష్టం వచ్చినప్పుడు, గతంలోని మాటలు గుర్తుకు వచ్చి మనసు కుదుట పడే అవకాశం ఎక్కువ అంటారు.

సాదారణంగా ప్రపంచవ్యాప్తంగా అయితే ప్రసిద్ధ పొందినవారి జీవిత చరిత్రలు చదువుతూ ఉంటారు. మన భారతీయలకు అయితే పురాణాలతో ఇటువంటి కష్టకాలం, ధర్మ సూక్ష్మాలు, మానసిక ప్రవర్తన, సమాజంలో సహజ మానసిక ధోరణిలు మనకు తెలియబడతాయి అని అంటారు. పని చేసుకునేవారు పురాణం చదవాల్సిన అవసరం లేకుండానే, పురాణాలలో కొన్న గాధలు సినిమాలుగా కూడా మనకు లభిస్తాయి. ఉదాహరణకు: లవకుశ తెలుగు చలన చిత్రం, దక్ష యజ్ఙం తెలుగు చలన చిత్రం, మాయాబజార్ తెలుగు చలన చిత్రం ఇలా పౌరాణిక తెలుగు సినిమాలు ఉన్నాయి.

అయితే సినిమాలలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీయబడడం వలన కొంత కల్పితం కూడా కలిగి ఉంటుంది అని అంటారు. అందుకని కొందరు పురాణ పుస్తకాలు చదువుతూ ఉంటారు. అయితే పురాణ పుస్తకాలు సంస్కృతంలోనూ, తెలుగు గ్రాంధిక భాషలోను ఉంటాయి. అంటే తెలుగులోనే తెలుగురచయిత రచనలు ఉన్నా అవి వాడుకభాషలో అన్ని తెలుగుపుస్తకాలు ఉండవు. కాబట్టి పురాణ, ఇతిహాసాలు చదివినవారి మాటలలో అనేక ధర్మ సందేహాలు, కష్టకాలంలో దైవ గుణం ఎలా ఉంటుంది? రాక్షస గుణం ఎలా ఉంటుంది? మానవత్వం ఏవిధంగా ప్రభావితం అవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు ప్రముఖ ప్రవచనకర్తల తెలుగు ప్రవచనాలు ద్వారా తెలియబడతాయి అని అంటారు.

పురాణాలు చదివిన పండితులకు పురాణలలోని పాత్రల స్వభావం తెలుసుకుని ఉంటారు. ఇప్పుడు ఉన్న సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా సామాన్యులకు కూడా అర్ధం అయ్యే విధంగా మంచి మాటలు చెప్పడంలో ప్రవచనకారులు ప్రసిద్ది చెంది ఉంటారు. అలాంటి వారి మాటలు వినడం వలన దీర్ఘకాలిక కష్టాలు అనుభవించేవారికి కూడా తమ కష్టాలపై ఒక అవగాహన ఏర్పడి, మనసు కుదుటపడుతుంది అని అంటారు. అలా కుదుటపడిన మనసు యొక్క బుద్ది వికసిస్తుంది. బుద్ది వికాసంతో ఒక వ్యక్తి తన సమస్యకు తానే పరిష్కారం తెలుసుకోగలడు. లేకపోతే పరిష్కారం సూచించగలిగే వ్యక్తిని గుర్తుకు తెచ్చుకోగలడు అని అంటారు.

అయితే ప్రముఖుల తెలుగు ప్రవచనాలు వినడం వలన, గ్రాంధిక భాషలో ఉన్న మాటలు మనకు వాడుక భాషలో తెలియబడతాయి. ఇంకా ఆయా గ్రంధాలలో ఉన్న ధర్మ సూక్షమములు కూడా తెలియబడతాయి అని అంటారు. ఈ విధంగా ప్రవచనకర్తల తెలుగు ప్రవచనాలు ఇతిహాసములలోని సంగతులను తెలియజేస్తాయి.

తెలుగులో ప్రముఖ ప్రవచనకర్తల గురించి చూస్తే, అందరికి అర్ధం అయ్యే విధంగా మాట్లాడుతూ ప్రవచనాలు అందించే వారిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు బాగా ప్రసిద్ధి. ఈయన పలికిన పలుకులు ఆన్ లైన్లో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈయన చెప్పే మంచి మాటలు వినడానికి ఎప్పుడూ ప్రజలు ఆసక్తి ఎక్కువ చూపుతారు. గతంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఉచితంగా ఒక వెబ్ సైటులో అందరికి అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు అవి గురువాణి వెబ్ సైటు ద్వారా విక్రయం సాగిస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రచనాల ఆడియో పెన్ డ్రైవ్స్ కావాలంటే ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ ప్రవచనాలలో ఎక్కువగా పురాణములు, ఇతిహాసములలో నుండి దేవీ భాగవతం, పరమశివుడు, శ్రీరామాయణం, భాగవతం, హనుమ వైభవం, శ్రీవేంకటేశ్వర వైభవం, శ్రీశైలం మహాత్యం, గురు వైభవం, మహాభారతంలోని పాత్రలు, ధర్మము, కలియుగం తదితర వర్గాలలో చాలా ప్రసంగాలు చేసి ఉన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు ఆడియో రూపంలో వెబ్ సైటు ద్వారా వినడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

శ్రీరామాయణం గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు యూట్యూబ్ ద్వారా చూడడానికి సంపూర్ణ రామాయణం యూట్యూబ్ చానల్ విజిట్ చేయండి. ఈ చానల్ ద్వారా మీరు రామాయణం అంతా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మాటలలో వినవచ్చును. ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేసి మీరు ఈ యూట్యూబ్ చానల్ విజిట్ చేయవచ్చును.

ఆధ్యాత్మిక అంశములలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, ప్రత్యక్ష ప్రసారలు చూడాంటే, శ్రీగురువాణి యూట్యూబ్ చానల్ దర్శించండి. శ్రీగురువాణి యూట్యూబ్ చానల్ దర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ప్రముఖ ప్రవచనకారులలో తెలుగు ప్రవచనకర్త బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు సుప్రసిద్ధ తెలుగు ప్రవచనకర్త. ఈయన భగవద్గీత మొత్తం అన్ని శ్లోకాలపై ప్రవచనం చేశారు. ఇంకా ఈయన శ్రీరామాయణం, శ్రీ ఆంజనేయం, శ్రీరామవైభవం, శ్రీకృష్ణ కర్ణామృతం, కనకధార స్తోత్రం, గరుడపురాణం, విష్ణు పురాణం, శ్రీ లలితా లీల, శ్రీమద్భాగవతం తదితర ప్రవచనాలు చేసారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ప్రవచనాలు ఆడియో రూపంలో వినాలంటే ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ఇంకా మీరు ప్రముఖ తెలుగు ప్రవచన కర్తల వివరాలు మరియు వారి ప్రవచనాలు ఆడియో రూపంలో వినవచ్చును. వారిలో గరికిపాటి నరసింహారావుగారు, వద్ది పద్మాకర్ గారు లాంటి ప్రవచనకర్తల తెలుగు ప్రవచనాలు ఆడియో రూపంలో వినవచ్చును. ప్రముఖ తెలుగు ప్రవచనకర్తల లిస్టును మరియు వారి ప్రవచనాలకోసం ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి

చివరగా… ఈ పోస్టులో కేవలం ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేవారికోసం, తెలుగు భక్తి విషయాలను చేరువ చేయడంలో ప్రవచకర్తల ప్రవచనాలు చాలా మేలు చేస్తాయి అంటారు కాబట్టి, తెలుగు ప్రముఖ తెలుగు ప్రవచనకర్తల ప్రవచనాల లింకులను షేర్ చేయాడానికి నాకు అనిపించిన నాలుగు మాటలు వ్రాయడం జరిగింది. ఏవిధంగా నమ్మితే లోకం ఆవిధంగా గోచరిస్తుంటారు. అలా చూసినప్పుడు లోకంలో మంచి మాటలను పెంచే ప్రయత్నం చేస్తున్న ప్రవచనకారులకు ధన్యవాదాలు…చెప్పాలి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్.

నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

నవగ్రహపూజామహిమ సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతువులు

సత్యపాల మహారాజు (కాంతరావు) కుమారుడు అంత:పురంలో కాలజారి పడతాడు. ఆ రాజకుమారుడికి వైద్యం చేసిన తర్వాత మహారాజు, రాణి, రాకుమారుని జాతకం చూసిన ఆ రాజస్థాన గురువులు(నాగయ్య) సత్యపాల మహారాజుతో గ్రహస్థితి బాగాలేదు అని చెబుతాడు. అయితే సత్యపాల మహారాజు గ్రహస్థితుల గురించి పట్టించుకోనవసరం లేదు, మేము మహారాజులం అవసరం అయితే పేదవానిని కూడా ఐశ్వర్యవంతులం చేయగలం అని అంటాడు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ.

దానికి ఆచార్యులు అయితే మీరు ఒకపేద సద్బ్రాహ్మణుడికి గుప్తదానం చేసి, అతని అదృష్టాన్ని పరీక్షించమని చెబుతాడు. ఆచార్యుడు చెప్పినట్టే ఒక బ్రాహ్మణ పండితుడికి వజ్రాలు, వైఢూర్యములతో కూడిన నగలు పైకి కనబడకుండా ఒక గుమ్మడి కాయలో పెట్టి రాజు దానం చేస్తాడు. దానం స్వీకరించిన పేద బ్రాహ్మణుడు ఆగుమ్మడికాయను రాజు సమక్షం నుండి బయటకురాగానే నేలకేసి కొట్టి, తిరిగి చూడకుండా వెళ్లిపోతాడు. అది చూసిన రాజు పరివారం అంతా ”ఏదో యాధృచ్ఛికంగా జరిగింది కానీ గ్రహాల ప్రభావం కాదు” అని ఆచార్యులతో అంటారు. ఆచార్యులు ఎంత చెప్పిన నవగ్రహశాంతి పూజ చేయడానికి సత్యపాల మహారాజు ఒప్పుకోడు.

అకాలంలో పల్లెప్రజలు రాజధానికొచ్చి జేగంట మోగిస్తారు. సత్యపాలమహారాజుతో వారు తమపై క్రూర మృగాల దాడి ఎక్కువైందని చెప్పడంతో సేనాని వీరసేనుడు(రాజనాల), స్వయంగా వచ్చి మీ సమస్యను తీరుస్తారని అంటాడు. అతని సహచరులు కూడా మహారాజే స్వయంగా ఆపని చేస్తే బాగుంటుందని ప్రోత్సహిస్తారు. అయితే రాణి మరియు ఆచార్యులు రాజును నవగ్రహాలను పూజించి వెళ్లవలసినదిగా కోరతారు. కానీ సత్యపాల మహారాజు వారిమాటని త్రోసిరాజని వేటకు వెళతాడు.

నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

వేటకొరకు ప్రయాణం చేసిన సత్యపాలమహారాజు విశ్రాంతి మందిరంలో నిద్రిస్తుండగా క్రూరమృగం శబ్ధం రావడంతో అడవిలోకి వెళతాడు. కానీ ముసుగులాంటి వేషధారణలో ఉన్న భటులు రాజును కొట్టి ఒక నూతిలో పడవేస్తారు. మహారాజు కనిపించడంలేదు అనే మిషతో అంత:పురానికి తిరిగి వచ్చిన వీరసేనుడు మహారాణిని అంత:పుర బందీగా ఉంచి, రాకుమారుని తీసుకుపోతాడు. మహారాజు అడవిలో నూతిలోనే కొన్ని రోజులపాటు ఉండిపోతాడు. నీటికోసం వచ్చిన కొందరు మనుషులు సత్యపాలుడిని పైకి లాగుతారు.

మహారాజుని వెతక్కుంటూ మహారాణి రాకుమారుడిని తీసుకుని అడవికి బయలుదేరుతుంది. సత్యపాల మహారాజు మరలా అంత:పుర ప్రవేశం చేస్తాడు. అయితే వంచకుడు వీరసేనుడు మహారాజుని వంచించి, మహారాజుని నిర్భందిస్తాడు. వీరసేనుడు సత్యపాలమహారాజును క్రూరంగా హింసించి, చనిపోయాడు అని భావించి, మహారాజును బయటిప్రారవేయిస్తాడు. అలా మహారాజు ఒక నాటకాల బృందానికి దొరుకుతాడు.

మహారాణి తన అన్నగారి దగ్గరకు వెళితే, అక్కడ ఆమెకు నిరాధారణ ఎదురవుతుంది. ఆమె దిక్కుతోచని స్థితిలో తిరుగు ప్రయాణం అవుతుంది. ఇలా సత్యపాల మహారాజు గ్రహాచారం బాగుండకపోవడం వలన అష్టకష్టాలు పడతాడు. అయితే మహారాజు తన కాళ్లు పోయినా, అది మానవ తప్పిదమే అంటాడు కానీ గ్రహాలను ప్రార్ధించడు. అయితే చివరకు మహారాజు ఆశ్రయం ఇచ్చిన వారి పసిపాపడు ప్రాణం పోవడంతో చలించిన మహారాజు, వారికోసం నవగ్రహాలను శరణువేడతాడు. వెంటనే మహారాజు కాళ్లు, చేతులు రావడం, చనిపోయిన పిల్లాడు బ్రతకడం జరుగుతుంది.

సత్యపాల మహారాజు తిరిగి తన రాజ్యనికి వెళ్లి, వీరసేనుడిని మట్టుపెడతాడు. తన గురువు ఆచార్యులను చెరశాల నుండి విముక్తి చేయించి, తిరిగి తన ఆస్థానంలో కూర్చుంటాడు. నవగ్రహాల శక్తిని తక్కువ అంచనా వేసి, గురువుగారి మాట విననందుకు, ఆచార్యులకు మహారాజు క్షమాపణ చెప్పి, ఇదంతా నవగ్రహ పూజా మహిమగా కొనియాడడంతో సినిమా శుభం అవుతుంది.

గ్రహస్థితి బాగుండనప్పుడు మనిషి బుద్ది ఎలా మందగిస్తుందో? చిన్న చిన్న తప్పులతో పెద్ద పెద్ద ఆపదలను కొని తెచ్చుకోవడమో లేక అవకాశాలను కోల్పోవడమో? ఇలాంటి సంఘటనలను ఈ సినిమాలో చూపించారు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ .

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి.

దీపావళి తెలుగు పాత సినిమా

దీపావళి తెలుగు సినిమా రామారావు, సావిత్రి నటించిన తెలుగు ఓల్డ్ మూవి

దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు పాత సినిమా కు ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది.

కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, శ్రీకృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.

వ్యగ్రతతో సమయంకానీ సమయంలో సంగమిస్తే, దేవతలకు కూడా ధ్వేషబావంతో ఉండే పిల్లలే పుడతారని దీపావళి సినిమా ద్వారా గ్రహించవచ్చును. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి ఆగ్రహం చల్లారకుండానే, వరహామూర్తికి, భూదేవికి పుట్టిన సంతానమే నరకుడు. నరకుడు జన్మించిన సమయంలోనే భూదేవికి, శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు, ”నా చేతులతో నరకుని వధించనని”.

దీపావళి సినిమా ప్రారంభంలో నరకుడు(ఎస్వీ రంగారావు) ఘోరతపస్సుకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. నరకుడు పరమశివుని భక్తితో స్తుతి చేసి, అమరులపై విజయం, మరణం లేకుండా చిరంజీవిగా రెండు వరాలు కోరుతాడు. పరమశివుడు నీ తల్లి తప్ప నిన్ను ఎవరూ వధించలేరని చెప్పి అంతర్ధానం అవుతాడు.

కన్నతల్లి కొడుకుపై కత్తి దూయటం అసాద్యం కాబట్టి, తనకు మరణం లేదని భావించిన నరకుడు, తన బలంతో రెచ్చిపోతాడు. దేవేంద్రుని పదవిని ఆక్రమిస్తాడు. ఇంకా దేవమాత అయిన అదితి దగ్గర నుండి చెవి కుండళాలు చేజిక్కుంచుకుంటాడు. సాధుజనులను భాదిస్తూ, తాను ఆనందిస్తూ ఉంటాడు. కృష్ణభక్తులను బాధిస్తూ ఉంటాడు. పేరుకు తగ్గట్టుగానే ప్రజలకు భూలోకంలోనే నరకలోకయాతనలను చూపిస్తాడు.

ద్వారకలో శ్రీకృష్ణు(ఎన్టీ.రామారావు)ని ఆశ్రయంలో ఉన్న నాగదత్తుడి(గుమ్మడి) కూతురు అయిన వసుమతి(ఎస్.వరలక్ష్మి)ని నరకుడు వంచించి తన భార్యగా చేసుకుంటాడు. నారదుడు(కాంతారావు) వలన నరకుడి వంచన సత్యభామ(సావిత్రి), శ్రీకృష్ణులకు తెలుస్తుంది. నరకుడిని భర్తగా అంగీకరించిన వసుమతిని, నాగదత్తుడు నరకుని వధించమని చెబుతాడు. దానికి వసుమతి భర్తే నాదైవమని, నేను నా భర్తను చంపలేనని తేల్చి చెప్పడంతో నాగదత్తుడు నిష్ర్కమిస్తాడు. కానీ తానే నరకుని చంపబోయి, నరకునికి చిక్కి చెరసాల పాలవుతాడు. దీపావళి తెలుగు పాత సినిమా.

అజేయ బలపరాక్రమాలు కలిగిన నరకుడు తన బలగంతో సాధువులను యజ్ఙయాగాదులలోని అవిస్సులను నరకుడికే అర్పించాలంటూ, వారిని హింసిస్తూ ఉంటాడు. నరకుడి చావు తన చేతిలో లేకపోవడంతో శ్రీకృష్ణుడు నారదునితో నరకునికి హితవు చెప్పిస్తాడు. నారదుని హితవుని నరకుడు లెక్కపెట్టడు. ఇంకా రెచ్చిపోయి సాధు జనులను హింసించడం పెంచుతాడు, వారు చేస్తున్న యజ్ఙయాగాదులను ద్వంసం చేయిస్తూ ఉంటాడు.

నారదుడి సలహామేరకు వసుమతి తన కొడుకుని, చెరసాలలో ఉన్న తన తండ్రి నాగదత్తుడి దగ్గరకు తీసుకువెళుతంది. ఈ విషయం గమనించిన నరకుడు తన కొడుకుని వసుమతి దగ్గర నుండి తీసుకుని, వసుమతిని కూడా చెరసాలలో పెడతాడు. ఇంకా నరకుడు శ్రీకృష్ణుని వేషంలో వచ్చి లోకంలో ఉన్న పడచులను అపహరించుకుపోతాడు. ఈ విషయం సత్యభామకు తెలిసి, శ్రీకృష్ణుని నిలదీస్తుంది. కానీ కృష్ణుని మాటలచేత ఆపని కృష్ణుడు చేయలేదని గ్రహిస్తుంది. అయితే ఆపని నరకుడే చేసాడని, నారదునిచేత తెలుసుకున్న సత్యభామ, ఆ నరకుడిని అంతం చేస్తానని నారదుడుకి మాట ఇస్తుంది.

నరకుడు నాగదత్తుడి కనుగుడ్లు పీకించేస్తాడు. సాధుజనులను హింసించడం కొనసాగిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ సభకు నాగదత్తుడు, అదితి కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో నరకుని ఆకృత్యాలను మొరపెట్టుకుంటారు. దానితో శ్రీకృష్ణపరమాత్మ, సత్యభామతో కలిసి నరకునితో యుద్ధానికి వెళతాడు. భూదేవి పుత్రుడైన నరకుడు, భూదేవి అవతారం అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరక బాధలనుండి విముక్తి పొందిన ప్రజలు దీపాలు వెలిగించి, దీపావళి పండుగ చేసుకుంటారు.

సాక్షాత్తు భూదేవి బిడ్డడు, పరమశివుని వరాలు కానీ వ్యగ్రతతో పీడిత బుద్దితో ప్రజలను నరకయాతన పెట్టిన ఘనుడు నరకుడు. అందుకే భగవానుడు కన్నతల్లి చేతుతోనే మరణించేలా చేస్తాడు. లోకపీడితంగా మారితే, ప్రకృతిలోని మాతృస్వభావం చూస్తూ ఊరుకోదు. అలాగే నరకుని ఆకృత్యాలు విన్న సత్యభామ అతనిపై యుద్ధం చేస్తుంది. లోకాన్ని రక్షిస్తుంది. దీపావళి తెలుగు పాత సినిమా.

దీపావళి సినిమా చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి.

శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం

శ్రీ ఏడుకొండలస్వామి ఏడు శనివారాల వ్రతం మహత్యం

శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుసినిమాకు కమాలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వేంకటేశ్వరస్వామిగా అరుణ్ గోవిల్, పద్మావతిగా భానుప్రియ నటించగా మిగిలిన పాత్రలలో తదితర తారాగణం నటించారు. ఈ తెలుగుసినిమాలో శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం బాగా చూపించారు.

శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుమూవీ ప్రారంభం శ్రీవినాయకుడు, వేదవ్యాసుడు మాటలతో ప్రారంభం అవుతుంది. వినాయకుడుకు, వ్యాసుడు శ్రీ ఏడుకొండలస్వామి అవతారం గురించి చెబుతూ, శ్రీమహావిష్ణువు ఏకారణం చేత వేంకటేశ్వరావతారం స్వీకరించిందీ, ఏడుకొండలు ఏఏ దేవతా స్వరూపాలు భూలోకంలో అవతరించింది వివరిస్తారు. తర్వాత పద్మావతి – వేంకటేశ్వరస్వామి పరిణయం ఘట్టం వెండితెరపై కనులవిందుగా ఉంటుంది. అలా శ్రీనివాసుడు ఎలా ఏడుకొండలపై పద్మావతి సమేతంగా శ్రీ ఏడుకొండలస్వామిగా ఎలా వెలసింది వినాయకుడికి వేదవ్యాసుడు వివరిస్తారు.

నారదుడు ఆకాశమార్గంలో నారాయణ జపం చేస్తూ, సంచారం చేస్తూ ఉండగా, నారదమహర్షికి శనైశ్చరుడు తారసపడతాడు. వారిద్దరి మద్య శ్రీ ఏడుకొండలస్వామి శ్రీనివాసుని గురించి ప్రస్తావన వస్తుంది. పరమశివుడినే కొన్ని ఘడియలపాటు పీడించిన నాకు, కలియుగంలో వేంకటేశుని పీడించడం ఏపాటిది, అని నారదునితో అని శ్రీ వేంకటేశ్వరుని నిలయానాకి చేరి అక్కడ భంగపడతాడు. శ్రీ ఏడుకొండలస్వామి మహిమ అర్ధం చేసుకున్న శనైశ్చరుడు ఆ ఏడుకొండలస్వామి గురించే తపస్సు చేస్తాడు.

శనైశ్చరుని తపస్సుకు మెచ్చిన శ్రీఏడుకొండలస్వామి, శనైశ్చరుని ముందు సాక్షాత్కరించిన శ్రీవేంకటేశ్వరుడు ఏమి వరం కావాలో కోరుకోమంటాడు శనైశ్చరుడిని. అప్పుడు శనైశ్చరుడు శ్రీ ఏడుకొండలస్వామిని ఇలా రెండు వరాలు అడుగుతాడు. ఒకటవ వరం: ఒక్క శనివారం మాత్రమే నిన్ను పూజిస్తే, వారంలో మిగిలిన ఆరు రోజులు నిన్ను పూజించినంతటి పూజాఫలం అనుగ్రహించమని కోరతాడు. రెండవ వరం: గ్రహచారం ఉన్నవారు నీ భక్తుల అయినా సరే వారిని నేను పీడించడానికి నీవు ఆడ్డు పడకూడదు అని అడుగుతాడు. శ్రీనివాసుడు తధాస్తు అని అంతర్ధానం అవుతాడు.

అప్పుడు వినాయకుడు, వ్యాసమహర్షితో ఇలా అంటాడు ”శనైశ్చరుడికి రెండవ వరం కూడా అనుగ్రహించడంలో శ్రీ ఏడుకొండలస్వామి ఆంతర్యం ఏమిటి” అని. బదులుగా వ్మాసమహర్షి ”ఆ జగన్నాధుని లీలలు అర్ధం అవ్వడం అంత సులభం కాదు, ఇదిగో ఆ జగన్నాటకంలో భాగంగా ఆయన ఆడిస్తున పాత్రలు చూస్తే ఆ పరమార్ధం నీకు అర్ధం అవుతందని” అంటాడు. శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం తెలుగు భక్తి సినిమా.

పెద్దలు అందరూ జయంతి, జయంత్ ల వివాహం నిశ్చయం చేసుకుంటారు. అయితే వరాహమిత్రుడు అనే బ్రాహ్మణస్వామి జాతక పరిశీలనలో జయంత్ కు అపమృత్యు దోషం బయటపడుతుంది. అయితే ఇద్దరికి వివాహం జరిగితే, జయంతి జాతకబలం చేత, జయంత్ జాతకంలోని దోషం పోతుందని వివాహం లగ్నం నిశ్చయం చేస్తారు. వివాహం జరిపించి వరాహమిత్రుడు జయంతితో మాట్లాడుతూ ”సరిగ్గా నేటి నుండి ఏడవ శనివారం నాడు, నీ భర్త జయంత్ కు మృత్యుగండం ఉంది” అని చెబుతాడు. అయితే శ్రీ ఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతం గురించి జయంతికి చెప్పబోతూ వరాహమిత్రుడు ప్రాణాలు కోల్పోతాడు.

జయంతితో ఎవరు ఏడుశనివారాల వ్రతం చేయిస్తారు? జయంత్ మృత్యు గండం నుంచి తప్పించుకున్నాడా? శ్రీ ఏడుకొండలస్వామి అనుగ్రహం వలన ఏవిధం జయంతి, జయంతుల జీవితం సంతోషమయం అయ్యింది? శ్రీ ఏడుకొండలస్వామి తెలుగు సినిమాలో చక్కగా చూపిస్తారు. ఆ ఏడుకొండలస్వామిని భక్తితో కొలిస్తే, ఎటువంటి గ్రహదోషం అయినా తప్పించుకోవచ్చు అనే విధంగా ఈ శ్రీఏడుకొండలస్వామి ఏడుశనివారాల వ్రతమహత్యం సినిమా తీర్చిదిద్దారు.

శ్రీ ఏడుకొండలస్వామి తెలుగుసినిమా యూట్యూబ్ వీడియో చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి.

ధన్యవాదాలు- తెలుగు రీడ్స్ యాప్ డౌన్ లోడ్ చేయండి.

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

మంచి భక్తిరసచిత్రంగా అలరించిన అలనాటి ఆణిముత్యం సతి సక్కుబాయి సినిమా.

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా అలనాటి పాత సినిమాలలో ఒక్కటి. సతీ సక్కుబాయి సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా కృష్ణభక్తితో పరవశించే ఇల్లాలు. ఎక్కడైనా, ఏ వస్తువులోనైనా ఎప్పుడైనా సరే కృష్ణుడిని చూస్తూ, ఆరాధించే అరుదైన అదృష్టవంతురాలి కధ. ప్రదేశాన్ని బట్టి, సమయానుసారం కృష్ణలీలలను కాంచుతూ ఉంటుంది.

సక్కుబాయి పండరీలో పాండురంగడి గుడిలో పాటపాడుతూ మయమరిచి, స్వామి పాదాలపై పడి ఉంటుంది. ఆమె తల్లీదండ్రులు అక్కడికి వచ్చి ఆమెను ఇంటికి తీసుకుపోతారు. అయితే ఇంటి దగ్గరకూడా ఆమె నిత్యం పాండురంగడి ధ్యానంలోకి వెళుతూ ఒంటరిగా ఉంటుంది. యుక్తవయస్సుకు వచ్చినా ఇంత భక్తిపరాయణత్వం ఏమిటా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. అయితే ఒకరోజు సన్యాసి ఆ ఇంటికి వచ్చి, సక్కుబాయిని ఆశీర్వదించి ఆమెకు పాండురంగ స్వామి విగ్రహమును ఇచ్చి వెళతాడు. నాటి నుండి సక్కుబాయి ఆపాండురంగడి విగ్రహమే సర్వస్వంగా ఉంటుంది.

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

ఒక శుభమూహర్తమున సక్కుబాయికి, ఒక రైతుకుటుంబంలోని బిక్షపతికి ఇచ్చి వివాహం జరిపించి, ఆమెను అత్తవారింటికి పంపించేస్తారు. బిక్షపతి తల్లి గయాళి అయితే, అతని చెల్లెలు గంగ కూడా తల్లిని మించిన గయ్యాళి. సక్కుబాయి-బిక్షపతిల వివాహానంతరం అతని చెల్లెలు గంగ తన మెట్టింటికి వెళుతుంది. సక్కుబాయి అత్తవారింటికి కూడా తనకు స్వామిజీ ప్రసాదించిన పాండురంగడి విగ్రహాన్ని తీసుకుపోయి, నిత్యం పూజలు చేస్తూ ఉంటుంది.

అది చూసి ఆమె అత్తగారు హెచ్చరిస్తుంది. ఇక నుండి పూజలు చేయవద్దు, ఇంటి పనులు మాత్రమే చేయాలని ఖచ్చితంగా చెబుతుంది. సక్కుబాయి అత్తగారి మాటలకు ఎదురు చెప్పకుండా, ఇంటిపనులు చేస్తూ కూడా, ప్రతిపనిలోనూ కృష్ణలీలలను కాంచుతూ పరవశిస్తూ ఉంటుంది. బిక్షపతి మాత్రం తన భార్యభక్తికి ఏవిధంగానూ అడ్డు చెప్పడు, ఆమెపై మనసునిండా ప్రేమను నింపుకుని ఉంటాడు. సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా.

సక్కుభాయి ఇంట్లో ఒక రోజు మజ్జిగ చిలుకుతూ, వెన్నముద్దను చూడగానే కృష్ణలీలలు గుర్తుకు వచ్చి, నిజంగానే కృష్ణుడు వచ్చి వెన్నతింటున్నట్టుగానే పరవశిస్తుంది. కానీ సక్కుబాయి చేతిలోని వెన్నముద్దను పిల్లి తింటూ, పాలకుండతో ఇంట్లోకి వస్తున్న ఆమె అత్తగారికి కనబడుతుంది. అత్తగారు వచ్చి ఆమెను మందలించి, తన చేతిలోని పాలకుండ సక్కుబాయికి ఇచ్చి, ఉట్టి మీద పెట్టమంటుంది. అక్కడకు వెళ్లిన సక్కుబాయి ఉట్టిని చూడగానే మరలా కృష్టుడు గుర్తుకు వచ్చి, కృష్ణుడికి పాలుపోస్తున్నట్టుగా పరవశిస్తూ, తన చేతిలోని పాలను నేలపై పోస్తుంది. దాంతో అత్తగారు ఆమెపై చిరాకు పడుతుంది. సక్కుబాయి ఇలా ఏవిధంగా ఏపనిలోనైనా కృష్ణలీలలను గుర్తు చేసుకుంటూ, కృష్ణ భక్తిలో పరవశిస్తూ ఉంటుంది.

ఒకరోజు చేతిలో కృష్ణుడి బొమ్మ ఉంచుకుని పరవశిస్తూ నిలబడి ఉన్న సక్కుబాయిని చూసిన, ఆమె అత్తగారు అక్కడకు వచ్చి సక్కుబాయి చేతిలోని పాండురంగడి బొమ్మని తన చేతులలోకి తీసుకుని నేలకేసి కొట్టి ముక్కలు చేస్తుంది. వెంటనే ఆ బొమ్మ మరలా యధావిదిగా అతుక్కుని, సక్కుబాయి చేతిలోకి చేరుతుంది. అత్తగారు ఆశ్చర్యపోయి, ఆ బొమ్మని మాయాబొమ్మగా భావిస్తుంది. అప్పుడే పుట్టింటికి వచ్చిన గంగ కూడా సక్కుబాయి చేతిలోని బొమ్మని తీసుకుని, నీళ్ళున్న భావిలో పడేస్తుంది. వెంటనే భావిలో నీరు అంతా ఇంకిపోయి, భావిలో నుండి బొమ్మ వచ్చి గంగ నెత్తిమీద దెబ్బలు వేసి, మరలా సక్కుబాయి చేతిని చేరుతుంది. గంగకు దాహం వేస్తుంది. కానీ నూతిలో నీరు ఉండదు, ఇంట్లోకి వెళితో ఇంట్లోనూ నీరు ఉండదరు. వారికి ఆశ్చర్యం వేసి, ఇదంతా ఆ మాయాబొమ్మ వల్లే అనుకుంటారు. ఎలాగైనా సక్కుబాయి తిక్క కుదర్చాలని భావించి, గదినిండా ఉన్న గోదుమలను తెల్లారేసరికి పిండి చేయమని చెబుతారు.

నాటి మేటి సినిమా సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

సక్కుబాయి పాండురంగడిని తలుచుకుంటూ, గోదుమలను పిండి చేస్తూ శోష వచ్చి పడిపోతుంది. తర్వాత కృష్ణుడే వచ్చి ఆపని చేసి అంతర్ధానం అవుతాడు. స్పృహకోల్పొయి పడి ఉన్న సక్కుబాయిని చూసిన ఆమె భర్త బాదపడతాడు. తన వల్లే నీకు ఈ కష్టాలు అంటూ భార్యతో బాధని పంచుకుంటాడు. భిక్షపతి తన చెల్లెలు గంగను మెట్టింటికి పంపించేయాలని భావించి, తన బావగారిని తీసుకురావడానికి బయలుదేరతాడు. భిక్షపతి ఊరినుండి తన బావని తోడ్కొని వచ్చే సమయానికి, తల్లీకూతుళ్లు ఇద్దరూ కలసి సక్కుబాయిని చిత్ర హింసలు పెడతారు. ఈ విధంగా వారిద్దరూ సక్కుబాయిని నానావిధాలుగా నిందిస్తూ, అష్టకష్టాలు పెడుతుంటారు. ఒకరోజు సక్కుబాయి పండరీకి బయలుదేరుతుంటే, ఆమెను అడ్డగించి ఒకస్థంబానికి కడతారు. అప్పుడు ఆ పాండురంగడే, సక్కుబాయిని భర్తరూపంలో విడిపించి ఆమెను పండరికి బయలుదేరేలా చేస్తాడు.

ఇక పాండురంగడు అక్కడే సక్కుబాయి రూపంలో ఉండి వారివురికి బుద్ది చెబుతాడు. గంగ సంసారం చక్కదిద్దుతాడు. ఇంకా పండరీలో ప్రాణం విడిచిన సక్కుబాయిని, తిరిగి పునర్జీవుడిని చేసి, ఆమె సంసారం చక్కదిద్దుతాడు. సినిమా ఆద్యంతం కృష్ణభక్తిని ప్రబోదం చేస్తూ, శ్రీకృష్ణుని లీలలతో సాగుతుంది. మంచి భక్తిరసచిత్రంగా అలరించిన అలనాటి ఆణిముత్యం సతి సక్కుబాయి సినిమా. ఇందులో కృష్ణుడిగా కాంతారావు, సక్కుబాయిగా అంజలీదేవి, ఆమె భర్తగా ఎస్వీ రంగారావు, సక్కుబాయి అత్తగా సూర్యాకాంతం, సక్కుబాయి ఆడపడచుగా గిరిజ, సక్కుబాయి ఆడపడచు భర్తగా రేలంగి నరసింహారావుగారు, సన్యాసిగా గుమ్మడి తదితరులు నటించారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

సతీ సుకన్య తెలుగుపాత సినిమా

సతీ సుకన్య, సతీ సుమతి, సతీ అనసూయ మాదిరి మరో ప్రతివ్రతయొక్క కధ

సతీ సుకన్యను చూడడానికి ఇక్కడ తాకండి

ఆనాటి పాత చిత్రాలలో సతీ సుకన్య తెలుగుపాత సినిమా కృష్ణకుమారి ప్రధాన పాత్రగా కధ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. జీవితంలో పొరపాట్లు జరిగినా ఓర్పుతో జీవితాన్ని స్వీకరిస్తే, ఎలాంటి ఫలితాలు ఉంటాయో? ఈ చిత్రం ద్వారా తెలియబడుతుంది.

అయోద్య రాజ్యపు యయాతి కుమార్తె అయిన రాజకుమారి సుకన్య, తన ప్రియసఖులతో కలసి వనవిహారం చేస్తూ, అడవిలోకి వెళుతుంది. అక్కడ ఆ అడవిలో ఆడుతూ పాడుతూ తాను విసిరిన పూలమాల వెళ్లి ఒక పుట్టపై పడుతుంది. అక్కడికి వెళ్లిన రాజకుమారి సుకన్య పుట్టలోంచి కాంతులు వెదజల్లుతూ, కేవలం రెండు రంధ్రాలు మాత్రమే మెరవడం చూస్తుంది. అది ఆమెకు వింతగా తోచడమో లేక విధివైపరీత్యమో కానీ, అవి మెరుస్తూ ఉండడం ఏమిటో చూడాలని అక్కడే ఉన్న దర్బలతో ఆ రెండు రంధ్రాలను పొడుస్తుంది. అంతే భూమి కంపిస్తుంది. జంతువులు ఆక్రొసిస్తూ ఉంటాయి. ప్రజలు అందరూ తెలియని వ్యాధతో బాధపడడం ప్రారంభం అవుతుంది. ఇదిలా ఉండగా రాజనగరిలో

ప్రజలందరూ యయాతి మహారాజుగారి దగ్గరకు వెళ్లి జరుగుతున్న పరిణామాలపై రాజుగారితో మొరపెట్టుకుంటారు. అకారణం కనిపిస్తున్న ఈ దుష్ఫలితాలకు రాజు చింతిస్తూ ఉండగా, అక్కడికి నారదమహర్షి చేరుకుంటారు. నారదుని ఆహ్వానిస్తూ, రాజు తమ రాజ్యంలో ఈ దుష్పరిణామాలకు కారణం ఏమిటో అడుగుతాడు. దానికి బదులుగా నారదమహర్షి, ఎవరైనా సాధుపుంగవునికి అన్యాయం జరిగితే, భూమి భరించదని, వెంటనే తన విళయరూపం ప్రదర్షిస్తుందని, ప్రకృతి వికృతంగా తయారవుతుందని చెబుతాడు. ఇంకా ఇలాంటి ఉపద్రవం సంభవించడానికి కారణం, నీ కూతురు సుకన్యేనని, తనకు తెలియకుండానే, తపస్సు చేసుకుంటున్న చ్యవన మహర్షి కళ్లను అమె పొడిచి, వాటిని పోగొట్టిందని చెబుతాడు. విషయం తెలియగానే రాజు తనపరివారంతో సంఘటనా స్థలానికి చేరతారు.

శతాధిక సంవత్సరాల వయస్సు ఉన్న వృద్ధుని వివాహం చేసుకోవడానికి సిద్దపడిన సుకన్య

ఆక్కడి వెళ్లిన మహారాజుకు కళ్లు పోగొట్టుకుని బాధతో ఉన్న చ్యవన మహర్షి కనబడతాడు, అది చూసిన, రాజు చాలా బాధతో, వినయంగా మహర్షిని ఈ ఘోరమునకు చింతిస్తూ, తన కూతురు చేసిన తప్పుకు క్షమాపణ అడుగుతూ, ”కళ్లు లేకుండా కారడవిలో మీరు ఉండడం కష్టం స్వామి, తన రాజప్రసాదానికి విచ్చేయండి, నేను మీ సేవ చేసుకుంటానని” అడుగుతాడు. దానికి మహర్షి ”తాపసికి వనముకన్న మించిన ప్రశాంత ప్రదేశం ఏముంటుంది? కాబట్టి కానలు వదిలి రాలేనని” చెబుతాడు. అంతలో అక్కడకు చేరిన నారద మునీంద్రుడు ఆ సమస్యకు పరిష్కారంగా చ్యవనుడికి ఎవరైన మంచి కన్యను ఇచ్చి వివాహం చేయండి, అంటూ… పత్ని సేవ వలన మహర్షి తపస్సుకు భంగం ఉండదు అని చెబుతాడు. చ్యవన మహర్షికి తగిన కన్య ఎవరా..? అని ఆలోచిస్తుండగా…నారదుడి మాటలతో…ఆలోచనలో పడిన సుకన్య ”నేను చ్యవనమహర్షిని వివాహం చేసుకుంటానని” అంటుంది. కానీ సుకన్య తల్లిదండ్రులు ఇద్దరూ ఈ విషయాన్ని అంగీకరించరు.

అయితే ఇది ఈశ్వరేచ్ఛ కాబట్టి నేను విసిరిన పూలమాల వెళ్లి పుట్టపై పడింది, అందుకే నేనే ఈ చ్యవన మహర్షిని పతిగా స్వీకరిస్తానని అంటుంది, సుకన్య. దానికి తండ్రి తిరిగి సుకన్యకు నచ్చజెప్పుతూ…”తల్లీ…తెలియక చేసిన తప్పు..తప్పుకాదు, నీవు తెలియక విసిరిన మాల పొరపాటున పడింది ” అని చెప్పగా, సుకన్య తండ్రితో ”ఒకరు చేసిన తప్పుకు ఇంకొకరు శిక్ష అనుభవించడం న్యాయంకాదు, కావునా నేనే వివాహమాడతాను, అంగీకరించమని” తండ్రిని కోరుతుంది. అయితే చ్యవనుడు కూడా సుకన్యను వివాహమాడడానికి సంకోచిస్తాడు. ఎందుకంటే శతాధిక వృద్ధుడైన అయిన నాకు కన్యతో వివాహం వలదని వారిస్తాడు. అయితే నారదముని కూడా సుకన్య-చ్యవనుల మహర్షుల వివాహం దైవ నిర్ణయం అని చెప్పడంతో అందరూ వివాహామునకు అంగీకరిస్తారు. ఒక శతవృద్ధుడైన చ్యవనుడికి, యవ్వనవతి అయిన సుకన్యకు వివాహం చేస్తారు. సతీ సుకన్య తెలుగుపాత సినిమా.

వివాహం కాగానే సుకన్య తన ఒంటిపై ఉన్న ఆభరణాలన్నింటిని తీసి తల్లికిచ్చేస్తుంది. నారబట్టలు కట్టుకుని చ్యవనునితో సుకన్య కాపురం చేయడం ప్రారంభిస్తుంది. పతిసేవ చేస్తూ…సుకన్య చ్యవన ఆశ్రమంలో, పతియే దైవంగా చ్యవన మహర్షిని సేవిస్తూ ఉంటుంది. యవ్వనవతి అయి కూడా, ఒక వృద్ధుని సేవలో కాలాన్ని వెలబుచ్చడం మనసా..వాచా..కర్మణా ఆచరిస్తుంది. గుడ్డివాడైనా వృద్ధమునికి ఆమె కళ్లుగా మారుతుంది. అలా కాలం గడుస్తుండగా ఒకరోజు రాత్రి నిద్రిస్తున్న సుకన్యకు ప్రసాదములో, సుందర ఉద్యానవనంలో విహరిస్తున్నట్టుగా కల వస్తుంది. మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిద్రలేచిన సుకన్యకు, చ్యవనుని ద్వారా ఆరోజంతా పరీక్షా కాలంగానే గడుస్తుంది. ఇది ఇలా ఉండగా

ఇంద్రసభలో అశ్వనీ దేవతలు ప్రతిజ్ఙ

ఇంద్రసభలో అగ్నిదేవుడు యాగంలో వచ్చిన అహిర్భావం తీసుకువచ్చి, ఇంద్రుని ఎదుట నిలబడతాడు. త్రిభువనాధిపతి అయిన ఇంద్రుడు ఆ సోమరసం పంచమని ఒక నర్తకికి చెబుతాడు, అమె అశ్వని కుమారులకు తప్ప అందరి దేవతలకు ఆ అహిర్భావం అందిస్తుంది. అవమానంగా భావించిన అశ్వనీదేవతలు, లేచి తమకు అహిర్భాగానికి అర్హత లేదా? అని దేవేంద్రుడిని ప్రశ్నిస్తారు. దేవేంద్రుడు ఆగ్రహించి, అశ్వనీ దేవతలను అవమానించడంతో, వారు కలత చెందుతారు. అహిర్భావం అందుకున్న నాడే తిరిగి ఇంద్రసభలో ప్రవేశిస్తాం అని ప్రతిజ్ఙ చేసి, అశ్వనీ కుమారులు నిష్ర్కమిస్తారు. అప్పుడే వేంచేసిన, నారదమహర్షి విషయం దేవేంద్రుని ద్వారా తెలుసుకుంటాడు. విచారంలో ఉన్న అశ్వనీ దేవతలను నారదమహర్షి కలుసుకుని వారి అభ్యర్ధన మేరకు, ఆ విషయాన్ని వారి తండ్రి సూర్యభగవానుడికి దగ్గరకు వెళతాడు, నారదమహర్షి. సూర్యలోకం చేరిన నారదునితో సూర్యభగవానుడు ”అశ్వనీ కుమారు తమ అర్హతను నిరూపించుకోవాలసి ఉంటుంది” అని అంటాడు.

అశ్వనీ దేవతలు సుకన్యకు పరీక్ష పెట్టుట

ఇక చ్యవనుని ఆశ్రమంలో పతిసేవలో ఉన్న సుకన్యకు అశ్వనీ దేవతల ద్వారా కఠిన పరీక్షే ఎదురవుతుంది. ఒకరు అందమైన యువకుడిగా మారి సుకన్యను ఆహ్వానిస్తూ ఉంటే, మరొకరు వృద్ధ చ్యవన మహర్షి వేషంలో, సుకన్యపై దుర్భాషలాడుతూ ఉంటాడు. అక్కడ ఒకప్రక్క భర్త ద్వేషభావం ప్రకటిస్తుంటే, మరో ప్రక్క సుందరాకారుడు వలపుల వల విసురుతూ ఉంటే, ఆమెలో ఓర్పు సహించ ఆ యువకుడుని శపించబోతుంది. అమె పతి భక్తికి మెచ్చిన అశ్వనీ దేవతలు, నిన్ను పరీక్షించి నీకు మేలు చేయడానికే మేము నీవద్దకు వచ్చామని, మమ్మల్ని క్షమించమని వేడుకుంటారు. అప్పుడు ఆమెకు ఏమి కావాలో వరం కోరుకోమని సుకన్యతో అశ్వనీ దేవతలు పలకగా, అందుకు ఆమె తనపతినే అడగమని, వారిని ఆశ్రమంలోకి తీసుకువెళ్లి, భర్తకు చెబుతుంది. అంతలోనే నారద మహర్షి కూడా ఆశ్రమంలోకి వేంచేస్తాడు. అయితే అశ్వనీ దేవతలు, నారదముని సలహా మేరకు యవ్వనవతి, సౌందర్యవతి అయిన సుకన్య భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, ఆమెను సుఖపెట్టడానికి తనకు యవ్వనము, దృష్టిని ప్రసాదించమంటాడు. ధర్మబద్దమైన అతని కోరికను అశ్వనీ దేవతలు నెరవేర్చి అక్కడి నుండి నిష్క్రమిస్తారు. సుకన్య-చ్యవనులు సంతోషంగా ఉంటారు. సతీ సుకన్య తెలుగుపాత సినిమా.

అయితే దేవలోకంలో దేవేంద్రునికి నారదమహర్షి, చ్యవనుడు యవ్వనవంతుడు కావడం, దానికి అశ్వనీదేవతలు సహాయం చేయడం గురించి చెబుతాడు. ఆగ్రహించిన దేవేంద్రుడు అశ్వనీదేవతలను గాడిదలుగా మారమని శపిస్తాడు. గాడిదలుగా మారిన అశ్వనీ దేవతలు చ్యవనుని ఆశ్రమం వద్దకు వస్తారు. అక్కడ సుకన్య మొదటిగా వాటిని తరిమినా, తరువాత భర్త ద్వారా విషయం తెలుసుకుని, వారిని తన ప్రాతివత్యాన్ని ధారపోసి, మరలా వారి స్వస్వరూపంలోకి మారేలాగ చేస్తుంది. అశ్వనీ దేవతలు అక్కడి నుండి నిష్రమించాక, దేవేంద్రునికి అశ్వనీదేవతలపై ఎందుకు కోపం, వారి జన్మ వృత్తాంతం ఏమిటి? అని సుకన్య భర్తని ప్రశ్నిస్తుంది.

అశ్వనీ దేవతల జన్మ వృత్తాంతం చ్యవనుడు, సుకన్యకు చెప్పుట

సుకన్యతో చ్యవనుడు ఈ విధంగా చెప్పనారంభిస్తాడు..సూర్యదేవుని భార్య అయిన సంధ్యాదేవి, సూర్యుని వేడిని తాళలేక కొన్నాళ్లుపాటు తన పుట్టింట్లో ఉండటానికై నిశ్చయించుకుని, తనయొక్క ఛాయకు ప్రాణం పోస్తుంది. అటుపై ఆమెను తనస్థానంలో ఉండమని, నేను నా పుట్టింటికి పోయి వచ్చెదనని, అప్పటివరకు తన భర్తను, తన పిల్లలను సేవించమని చెప్పి, సంధ్యాదేవి తన పుట్టింటికి వెళుతుంది. కొంతకాలం గడిచేసరికి ఛాయకు, సూర్యభగవానుడికి ఇద్దరు సంతానం కలుగుతారు. ఇక పుట్టింటికి వెళ్లిన సంధ్యని ఆమె తండ్రి విశ్వకర్మ కారణం అడుగుతాడు. ఇన్నాళ్లు ఎందుకు నీవు భర్తను విడిచి ఉన్నట్టు అని? ఇంకా నేనే నిన్ను నీ భర్తచెంతకు చేరుస్తానని, విశ్వకర్మ అనడంతో…అప్పుడు సంధ్యాదేవి, విశ్వకర్మతో తాను తన భర్తకు తెలియకుండా వచ్చిన విషయం చెబుతుంది. భర్తకు ద్రోహం చేశావు అని ఆగ్రహించిన విశ్వకర్మ, ఆమెను అశ్వముకమ్మని శపిస్తాడు. దాంతో పశ్చాత్తపడిన సంధ్యాదేవి తండ్రిని ప్రార్ధించగా, ఎప్పుడైతే నీ భర్త, నిన్ను గుర్తించి తిరిగి నిన్ను చేరదీస్తాడో అప్పుడే నీకు శాపవిమోచనం అవుతుందని చెబుతాడు. అంతటితో సంధ్యాదేవి ఒక అశ్వమై అడవిలో సంచరిస్తూ ఉంటుంది. ఇక సూర్యలోకంలో ఛాయదేవి తన పిల్లలను ఒకలాగా.., సంధ్యాదేవి పిల్లలను మరొకలాగా చూడడంతో, సూర్యభగవానుడు అనుమానం కలిగి, ఆమెను ప్రశ్నించడంతో… ఆమె ”తాను సంధ్యాదేవి ఛాయను మాత్రమేనని, సంధ్యాదేవి పుట్టింటికి వెళ్లిందని” చెబుతుంది. అప్పుడు సూర్యభగవానుడు తన భార్య సంధ్యాదేవి ఎక్కడ ఉందో తెలుసుకుని, ఆమె అశ్వరూపంలో ఉన్నట్టు గుర్తించి, తాను కూడా ఒక అశ్వంలాగా మారి, ఆమెచెంతకు చేరతాడు. తత్ఫలితంగా వారికి ఇరువురు కుమారులు కలుగుతారు. వారే అశ్వనీపుత్రులు. అని సుకన్యకు చ్యవనుడు చెప్పి, వీరు అశ్వములకు జన్మించారనే నెపంతో దేవతలు వీరిని చులకనగా చూస్తూ ఉంటారని, చెప్తాడు.

దేవేంద్రుడు కల్పించిన కష్టంలో భాగంగా సుకన్య అగ్నిప్రవేశం

అశ్వనీ దేవతలకు శాపవిమోచనం కలిగించిన సుకన్య-చ్యవనులపై ఆగ్రహించిన దేవేంద్రుడు వారి, అహంకారం అణచాలంటూ విద్యాధరుడిని ప్రయోగిస్తాడు. అప్పుడు విద్యాధరుడు ముసలి చ్యవనుడి వేషంలో ఒక శవంలాగా నది ఒడ్డున పడి ఉంటాడు. అక్కడకు వచ్చిన చ్యవనుడి పాత శిష్యుడు, తమ గురువు మరణించాడని భావించి, ఆ శవానికి అంత్యక్రియలు చేస్తాడు. ఈలోపుగా సుకన్య తల్లికి, తన కూతురిపై బెంగతో మంచాన పడడం, ఆమె బెంగను తీర్చడానికి సుకన్య తండ్రి చ్యవనుని ఆశ్రమం దగ్గరకు వెళ్లడము జరుగుతుంది. అక్కడ వృద్ద చ్యవన మహర్షి లేకుండా యవ్యనముని కౌగిట్లో కూతురిని చూసిన మహారాజు ఆగ్రహించి వారివురిని బంధిస్తాడు. వారి మాటలను పెడచెవిన పెట్టి, వారివురుని చెరశాలకు తరలిస్తాడు. నాయ్యవిచారణలో భాగంగా సుకన్య అగ్నిప్రవేశం చేసి, తన సౌశీల్యం నిరూపించుకుంటుంది. చివరకు యయాతి చ్యవన మహర్షి ఆద్వర్యంలో పుత్రకామేష్టియాగం తలపెడతాడు. ఆ క్రతువులో అశ్వనీ దేవతలకు అహిర్భావం ఇవ్వడం ప్రధానంగా ఈ యాగం చేయడం ప్రారంభించారని దేవేంద్రుడుకు నారదుడు చేరవేస్తాడు. ఆ క్రతువులు ఎలా జరుగుతుందోనని దేవేంద్రుడు చూస్తానిని అంటాడు. చివరకు సుకన్య ప్రాతివ్రత్యమహిమ చేత యాగం పూర్తవుతుంది. ఇంద్రుడికి పరాభవం, అశ్వనీ దేవతలకు అహిర్భావం అందుతుంది. సుకన్య పతిభక్తిని అందరూ కొనియాడుతారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

పరమానందయ్య శిష్యులు కధ

పరమానందయ్య శిష్యులు కధ అలనాటి మేటి చిత్రం

పరమానందయ్య శిష్యులకధ సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

Paramaanandayya Shishyula Kadha Telugu Old Movie శ్రీ దేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పరమానందయ్య  శిష్యుల కద చిత్రం- సి పుల్లయ్య దర్శకత్వంలో నాగయ్య, ఎన్టిఆర్, పద్మనాభం, అల్లు రామలింగయ్య, రాజబాబు తదితరులు నటించారు.

సహజమైన నవ్వు ఆరోగ్య స్థితిని తెలియజేస్తూ ఉంటే, బుద్దిహీనతతో చేసే పనుల వలవ వచ్చే నవ్వులతో కూడిన హాస్యకదాచిత్రము పరమానందయ్యా శిష్యుల కధ ‘Paramaanandayya Shishyula Kadha Telugu Old Movie’. కధ ప్రారంభంలో స్త్రీలోలుడైన మహారాజు (ఎన్టిఆర్) ఎప్పుడు రాజనర్తకితోనే గడుపుతూ ఉంటాడు, కానీ రాజ్యవ్యవహారాలు పట్టించుకోడు. అటువంటి మహారాజుకి రాజగురువుగా ఉన్న పరమానందయ్యా (నాగయ్యగారు) గారు హితబోధ చేస్తూ శివపూజని చేయండి, శివుడు సకల శుభాలని ఇచ్చే దైవమని చెబుతారు. వ్యసనం ఉన్నా పెద్దలంటే గౌరవం, దైవమంటే భక్తీ భావన మనసులో సహజంగా ఉండడం వలననేమో, శివపూజ చేస్తానని మహారాజు పరమానందయ్యా గారికి మాట ఇస్తాడు.

భావనలే ప్రధానంగా ఉంటే వాటి ప్రభావం పరిస్థితులను తారుమారు చేస్తూ ఉంటాయి.

ఎన్ని శక్తులు ఉన్న తొందరలో బుద్దిబలం తగ్గుతుంది, అలాగే కాని కోరిక వలన స్థితి మారుతుంది. అని చిత్రలేఖ విషయంలో కనబడితే, ఆమె పరమశివుడి భక్తురాలు కావడం వలన కాలంలో కలిగిన కష్టానికి తోడుగా మరో శివభక్తుడి ద్వారా ఆశ్రయం లభించింది. మానవజాతి అంటే చులకన భావంతో ఉన్న చిత్రలేఖ అదే మానవునితో వివాహ జీవనం కొనసాగిస్తుంది. చూసే దృష్టిలో తేడా ఉంటే, వచ్చే కష్టాలు కూడా ఆ దృష్టితోనే ముడిపడి ఉంటాయి. అని ఇక్కడ అర్ధం అవుతుంది. Paramaanandayya Shishyula Kadha Telugu Old Movie.

శివునికి అర్చించేవారిలో మానవులు మరియు భూమిమీద నివసించే వారే కాకుండా దేవతలు కూడా శివుని పూజిస్తూ ఉంటారు. అలా గంధర్వ కన్య అయిన చిత్రలేఖ పరమశివుని భక్తురాలు. ఈశ్వరేచ్చ వలననే లోకాల్లో స్థితిగతులు మారుతూ ఉంటాయి. అకారణంగా గందర్వకన్య అయిన చిత్రలేఖ భూలోకం వచ్చి జలక్రీడలు ఆడుతుంటే, అక్కడికి అనుకోకుండా వచ్చిన ఋషి అనుయాయులను చూసి, చిత్రలేఖ వారిని శపిస్తుంది. అయితే చిత్రలేఖ ఊహించిన తలంపు లేని ఋషి అనుచరులు, తమ ఋషి రాగానే మొరపెట్టుకుంటారు.  తప్పు తెలుసుకున్న చిత్రలేఖ తనవివాహం అయినవెంటనే మునులకు శాపవిమోచనం అవుతుందని చెబుతుంది. అయితే మహర్షి కుడా ఆమెకు ఒక హెచ్చరిక చేస్తాడు. అదేమిటంటే ఇకపై నీవు భూలోకంలోకి వచ్చి ఏమానవునితో నైన మాట్లాడిన స్పర్శించినా శాశ్వతంగా మానవ కన్యగానే ఉంటావు అని చెబుతారు.

చిత్రలేఖ రాజమందిరంలోనే మానవ కన్యగా ఉండి, మహరాజునే వివాహమాడడం

ఇక ఆమె తన అనుచర కన్యలతో ఆకాశానికి వెళ్తుంది, కానీ శివుడు ఇచ్చిన రుద్రాక్ష మాలను అక్కడే కొలను దగ్గర మరిచి వెళుతుంది. శాపగ్రస్తులైన ఆ మునులు ఋషి సూచన మేరకు బుద్దిహీనులై పరమానందయ్యాగారి దగ్గర విద్యార్ధులుగా చేరతారు. అయితే అడవికి వేటకు వచ్చిన మహారాజు కొలనువైపు వస్తుండగా, దగ్గరలో కనబడిన రుద్రాక్ష మాలను గ్రహించి, తన రాజభవనానికి వెళతాడు. చిత్రలేఖ తనలోకం వెళ్ళాక శివుడి ఇచ్చిన రుద్రాక్షమాల గుర్తుకు వచ్చి, ఎక్కడ మరచినది గుర్తు చేసుకుని మరలా భూలోకం వచ్చికొలను పరిసరాలలో వెతుకుతుంది. అయితే తనకున్న దివ్యదృష్టిచేత ఆ రుద్రాక్ష మాలా ఎక్కడ చేరిందో గ్రహించి, అక్కడకు వెళ్లి రాజు దగ్గర రుద్రాక్ష మాలను గ్రహించడంలో రాజుని తాకడం వలన, మాట్లాడడం వలన ఋషి శాపానుగ్రహం చేత ఆమె భూలోక కన్యగా మారుతుంది.

మహారాజు గారి గురువు పరమానందయ్యా గారి సూచనతో, చిత్రలేఖ మళ్ళి దైవలోకం చేరే మార్గం గురించి ఆలోచన చేస్తూ ధ్యాసలో ఉంటూ ఉంటే మహారాజు ఆమెను వివాహచేసుకునే ఉద్దేశ్యంతో ఉంటాడు. “Paramaanandayya Shishyula Kadha Telugu Old Movie” పరమానందయ్యా శిష్యులుగా వచ్చినా ఆ మునికుమారులు చేసే బుద్దిలేని పనులు చిత్రంగా ఉంటాయి. పరమానందయ్యాగారి దగ్గర శిష్యులు రాజమందిరంలో ఉన్న చిత్రలేఖకు మహారాజుకి పెళ్లిచేసి శాపవిమోచనం కావడంతో చిత్రకధ ముగుస్తుంది. అయితే బుద్ది హీనతతో మునికుమారులు చేసే పనులు తింగరగా ఉన్నాఆ పనుల వలన పరమానందయ్యాగారికి మేలునే చేస్తాయి. చిత్రం హాస్యంగానూ కధాపరంగా ఆసక్తిగాను సాగుతుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి.

భాగవతం తెలుగులోకి అనువదించిన భక్తపోతన తెలుగు చిత్రం

భాగవత రచయిత సహజకవి పోతనామాత్యుని జీవిత కధా చిత్రం

భక్త పోతన సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

అలనాటి మేటి చిత్రాల్లో భక్తపోతన భక్తీచిత్రం. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana Samskrutam nundi Telugulo Anuvadinchina Bhakta Potanaamaatyulu శ్రీకృష్ణుడు మహాభారతం నడిపించడానికి ద్వాపరయుగంలో ధర్మానికి అధర్మానికి యుద్దంలో ధర్మాన్ని రక్షించబూనిన వారికి మద్దతుగా ఉంటూ ధర్మ సంస్థాపన చేయడానికి అవతరిస్తే, ఆ మహాభారతాన్ని సంస్కృత రచన చేసిన వేదవ్యాసుడు, ఆ పరబ్రహ్మ లీలలను కూడా చెప్పదలచి భాగవతం కూడా రచనచేసి ఆత్మతృప్తిని పొందినట్టుగా శాస్త్ర పండితులు పలువురు ప్రవచన కారులు చెబుతారు. భాగవతం వింటే పుణ్యం కలుగుతుంది అని, మరీ భక్తిశ్రద్దలతో వింటే మోక్షమే ప్రాప్తిస్తుంది అని కూడా ప్రవచన కారులు వారి వారి ప్రవచనాల ద్వారా చెబుతూ ఉంటారు. అటువంటి మహానుభావుల చేత చెప్పబడుతున్న మహాభాగవతాన్ని తెలుగులోకి అనువదించిన మహానుభావుడు, తెలుగుజాతికి విలువైన భక్తీ గ్రంధాన్ని అందించిన బమ్మెర పోతరాజు గురించిన తెలుగు చలనచిత్రం చూడడం కూడా ఒక అదృష్టమే అంటారు. ‘BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

భాగవతమును తెలుగులోకి అనువదించిన మహానుభావుడు పోతనామాత్యుడు జీవితం ఆధారంగా తెలుగు చిత్రంగా మలిచిన మరో సినీమహానుభావుడు కె.వి. రెడ్డి(కద్రి వెంకటరెడ్డి)గారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన భక్తపోతన తెలుగుచలనచిత్రంలో పోతనగా చిత్తూరి నాగయ్య నటిస్తే, ఇంకా ముదిగొండ లింగమూర్తి, హేమలతదేవి, టంగుటూరి సూర్యకుమారి తదితరులు నటించారు. బమ్మెర పోతన జీవితంలో భాగవతం వ్రాయడానికి పురిగోల్పిన పరిస్థితులు, భాగవతం వ్రాస్తుండగా భగవానుడు సహకరించిన సన్నివేశాలతో చిత్రం BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana భక్తప్రదంగా సాగుతుంది.

వ్యాసభాగవతం ఆధారంగా తెలుగులో భాగవతం రచన ప్రారంభించిన భక్త పోతన

ఏకశిలానగరంలో శ్రీరామునిపై ప్రార్ధన పాటతో చిత్రం మొదలవుతుంది, అందరిని దైవ బిడ్డలుగా భావించే పోతనగారి ఔన్నత్యం ఆ పాట తరువాత కనిపిస్తుంది. కవిసార్వభౌమ శ్రీనాధుడు, పోతనామాత్యులు బావబావమరుదులు. శ్రీనాధుడి కూతురుకు, పోతన ఇంటిలోనే పెరుగుతూ ఉంటుంది. వారివురుకు వివాహం చేసే ఆలోచన కూడా ఉంటుంది. ఇంకా పోతన కూతురుతో భార్యాభర్తలు కలిసి ఇంటిలో ఉంటూ ఉంటారు. పోతన భక్తి పరిపక్వతకు వచ్చిందని పోతనను అనుగ్రహింప దలచిన భగవానుడు, ఆమాట సీతమ్మతల్లితో చెప్పి బయలుదేరతాడు. భోజనానికి కూర్చుండబోతున్న సమయానికి ఒక అన్నార్ది పోతన ఇంటికి వస్తాడు. వారు తమ భోజనం మాని, ఆ అతిథికి భోజనం కడుపునిండా పెట్టి పంపుతారు, పోతనామాత్యులు. ఇంటి బయటకు వచ్చిన ఆఅతిథి భగవానుడి రూపంలో అంతర్ధానం అవుతారు. పోతననే అనుగ్రహించిన భగవానుడు, పోతనకు శ్రీసీతారాములుగా కనిపించి, శ్రీమహాభాగవతముని తెలుగు అనువదించమని చెప్పి అంతర్ధానం అవుతారు.

పోతనామాత్యులు తనఇంటి పూజామందిరంలోనే, భగవానుణ్ణి అర్చించి, భాగవతం తెలుగులో రచన చేయడం ప్రారంభిస్తారు. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చేడి యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల ఉండేడి యమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది యిచ్యుత కవిత్వ మహాత్య పటుత్వ సంపదల్ లాంటి ఎన్నో మహిమాన్విత పద్యాలు భాగవతంలో పెక్కుగా ఉంటాయి.

గజేంద్రమోక్ష ఘట్టంలో పోతన వేషంలో పద్యరచన చేసిన శ్రీరామచంద్ర మూర్తి

గజేంద్రమోక్షం ఘట్ట రచనలో శ్రీమహా విష్ణువు వైకుంఠం నుండి ఉన్నఫలంగా బయలుదేరే సన్నివేశం వివరణ తోచని మహాకవి పోతనామాత్యులు, అయన కూతురు లక్ష్మిని అక్కడే పూజగదిలోనే కూర్చుండబెట్టి, గుడికి ఆలోచిస్తూ బయలుదేరతారు. పచార్లు చేసి ఆలోచనలతో తిరిగి ఇంటికి వచ్చిన పోతనామాత్యులకు గొప్ప విషయం తెలుస్తుంది. మరలా వ్రాయడానికి తాళపత్రం చూడగానే అందులో తాను వ్రాయదలచిన ఘట్టం వ్రాయబడి ఉంటుంది. ఎలా అనుకుండగా కూతురు లక్ష్మి మీరే కదా అలా వెళ్లి ఇలా వచ్చి పద్యం తట్టినది అని వ్రాసారు, అని చెబుతుంది. అప్పుడు అవగతం అవుతుంది  పోతనామాత్యులకు, తానూ బయటికి వెళ్ళాక, తన వేషంలో శ్రీరామచంద్ర మూర్తి వచ్చి శ్రీమహావిష్ణువు గజేంద్ర రక్షణార్ధం వైకుంఠం నుండి ఎలా బయలుదేరినది వివరించి వెళ్ళారని. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

విష్ణుభగవానుడి అవతార ఘట్టాలతో సాగే భాగవత రచన చేస్తున్న పోతనకు, పోతన కుటుంబ సభ్యలు సేవలు చేస్తూ సహకరిస్తూ ఉంటారు. పోతన భావమరిది అయిన కవిసార్వభౌమ శ్రినాధులు రాజాశ్రయంతో భోగభాగ్యాలతో ఉంటారు. అటువంటి సమయంలో పోతన రచన చేసిన ఒక పద్యం ఒకటిని శ్రీనాధకవిసార్వభౌముల వారు ఆ రాజుకి వినిపిస్తారు. ఆ పద్యం విన్న రాజుగారు పోతనను సత్కరింపదలుస్తారు. అలాగే ఆ భాగవతమును తనకు అంకితం ఇవ్వవలసినదిగా పోతనకు చెప్పమని, రాజుగారు బహుమానాలు శ్రీనాధకవిసార్వభౌముడితో పంపిస్తాడు. పోతనకు నేచెప్పి ఒప్పించెదనని పలికిన కవిసార్వభౌమ శ్రీనాధులు, పోతనకు ఇంటికి వస్తారు.

భాగవతం రాజుకి అంకితం ఇవ్వవలసినదిగా శ్రీనాధకవిసార్వభౌమ పోతనని అడుగుట

పోతనతో భేటి అయిన కవిసార్వభౌమ శ్రీనాధులు వారు, రాజుగారి తలంపును పోతనతో చెబుతారు. అందుకు పోతనామాత్యులు ఆరచన నాదైతే కధా ఆభాగవతం శ్రీరామంకితం నేను రాజుకి అంకితం ఇవ్వటానికి నాది అను కావ్యమేది లేదని చెబుతారు. కుటుంబ సభ్యులు అందరూ కూడా పోతన మాటకే మద్దతుగా నిలబడతారు. పోతనామాత్యుల వారి మాట శ్రీనాధ కవికి, రాజుకి కూడా రుచించవు. రాజుగారి దగ్గర నుండి తనకు వచ్చిన బహుమానాలు పేదవారికి దానం చేస్తూ, పోతనామాత్యుల ఉంటుండగా, రాజపరివారంతో శ్రీనాధ కవిసార్వభౌములవారు పోతన ఇంటికి వస్తారు.

రాజుగారికి భాగవతం అంకితం ఇస్తావా సరే లేకపొతే నా కూతురు కూడా నీకు కోడలు కాదని హెచ్చరిస్తాడు, శ్రీనాధుడు పోతనని. కొడుకు కోసం ఒప్పోకోమని పోతన భార్య వేడుకున్నా, పోతనామాత్యుడు భాగవతం భగవంతుడి సొత్తు, అంకితం ఇవ్వడానికి నేనేవ్వరనే సమాధానమే చెబుతారు. ఇక చేసేది లేక శ్రీనాధకవిసార్వభౌమ పోతన కుటుంబానికి ఆలోచన చేసుకుని చెప్పమని కోరతాడు. ఆరోజు అంతా దుఃఖంతో మునుగుతుంది. ఆకష్టాలలో రాజుకు అంకితం ఇవ్వమనే ప్రోత్సహకానికి పోతనామాత్యులు ఎక్కడ లొంగుతారు అనో ఏమో సాక్ష్యాత్తు సరస్వతీ మాతే పోతన నట్టింట విలపిస్తూ కనబడడం భక్తీ హృదయాన్నే తాకుతుంది. ఆఅమ్మకు ఈ బిడ్డడు మాట ఇచ్చి, అమ్మ కన్నీరు తుడిచి, తన కుటుంబం కన్నీరుకు కారణంగా ఉంటారు పోతనామాత్యులు. కవిసార్వభౌమ శ్రీనాధులను పోతనగారు శ్రీమద్భాగవతం రాజుకి అంకితం ఇవ్వబోనని తేల్చి చెప్పి పంపుతారు. శ్రీరాముడినే నమ్ముకుని ఉన్న పోతనామాత్యులు భాగవత రచనని కొనసాగిస్తూ ఉంటారు.

పోతనామాత్యుల మాటను రాజధిక్కారంగా భావించిన ఆ రాజు, పోతనను దుర్హహంకారిగా జమకట్టి, సేనాధిపతిని సైన్యంతో పోతన ఇంటికి వెళ్లి భాగవతం తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. పరమరామ భక్తుడు అయిన పోతనామాత్యులు భగవదారాధనతో ఉంటుండగా, రాజ సేనాని రాజభటులతో పోతన ఇంటికి రావడం జరుగుతుంది. ఏకశిలానగరంలో పోతనామాత్యుల ఇంటిముందుకు వచ్చిన రాజభటులకు శ్రీఆంజనేయ స్వామి కనబడగానే, వారు రామభజన చేస్తూ పారిపోతారు. రాములవారి గుడిలో దీపారాధనని అవమానించిన వ్యక్తికి, ఆంజనేయస్వామి బుద్ది చెప్పుతాడు.

సీతమ్మ దయతో వందలమందికి పంచభక్ష్య పరవన్నాలతో ఆతిధ్యం ఇచ్చిన పోతనామాత్యుల కుటుంబం.

పోతన పేదరికం అంటే చిన్నచూపు చూపే పోతన బావగారు అనేకమంది తన తోటి పండితులను పోతనామాత్యుల ఇంటికి అతిథులుగా ఆతిధ్యం కోసం తీసుకువస్తాడు. ఇంట్లో ఒక బియ్యం గింజ లేని సమయంలో అతిధులు రావడం, పోతనామాత్యుల భార్య సీతమ్మతల్లిని ప్రార్ధన చేయడంతో, అమ్మ అనుగ్రహంతో పోతనామాత్యుల కుటుంబం వచ్చిన అతిథులకు పంచభక్ష్య పరవన్నాలతో ఆతిధ్యం ఇస్తారు. ఆతిధ్యం స్వీకరించిన పండితులంతా పోతనతో సమావేశమై నన్నయ్య, తిక్కన భారతం అంకితం ఇచ్చారని, అలాగే మీరు ఇవ్వవలసినదిగా సూచన చేస్తారు. అయినా పోతనామాత్యుల వారు భగవత్పరమైన భాగవతమును ఎవరికీ అంకితం ఇవ్వలేనని ఖచ్చితంగా చెప్పుతారు.

పండితుల మద్య వాదనకు దిగిన శ్రీనాధ కవిసార్వభౌమ భాగవత దూషణ చేయబోతు, గజేంద్ర మోక్షంలో పరుగు పరుగున వచ్చిన విష్ణుమూర్తి అలా రావడం ఏమిటి అని ప్రశ్నిస్తాడు. ఇదంతా వినోదంగానే తలపిస్తుంది అని అంటుండగా అంతలోనే ఇంటిబయట ఆడుకుంటున్న శ్రీనాధుడి కూతురుకి ఎదో అయ్యింది అని అరుపు వినగానే అందరూ గబాగబా బయటకి వస్తారు. వెంటనే పోతనామాత్యులవారు సన్నివేశం గుర్తు చేస్తూ, ప్రేమానుభందాలు కలిగిన మనమే ఇంత అల్లాడితే, మరి భగవంతుడు ఇంకెంత అల్లాడుతూ భక్తుల కోసం తపిస్తూ ఉంటాడు అని అనగానే, శ్రీనాధ కవిసార్వభౌమతో సహా వచ్చిన పండితులంతా పోతనకు నమస్కరించినిలబడతారు. BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana

ఇక రాజు శింగభూపాలుడు పోతనకు రాజ్య బహిష్కరణ విధిస్తారు. కట్టుబట్టలతో కుటుంబం రాజ్యాన్ని విడిచివెళ్ళాలని రాజు ఆజ్ఞాపించడంతో బమ్మెర పోతనామాత్యులు కుటుంబంతో సహా కట్టుబట్టలతో ఊరు వదిలి బయలుదేరతారు. అయితే పోతనామాత్యులు రచన చేసిన భాగవత గ్రంధం పోతనామాత్యుల పూజగదిలోనే ఉంటుంది. పోతనామాత్యులు ఊరు వదిలి వెళ్ళాక శ్రీమద్భాగవత గ్రంధాన్ని తీసుకొని పోదలిచిన రాజభటుల ప్రయత్నాలు విఫలం అవుతాయి. అయితే ఆఖిరికి సేనాధిపతి కూడా శ్రీమద్భాగవత గ్రంధ దరిదాపులకు చేరలేక పోతాడు. ఈ విషయం రాజుకి నివేదించగా రాజు పోతనామత్యుడి ఇల్లుని కూలగొట్టమని ఆజ్ఞాపిస్తాడు.

అందరి సమక్షంలో భాగవతాన్ని భగవంతుడికి అర్పించిన పోతనామాత్యులు

రాజభటులు పోతనామాత్యుల ఇంటిని కూలగొడుతున్న కొలది రాజభవనాల్లో ప్రకంపనలు వచ్చి, రాజు భయకంపితుడు అవుతాడు. ఇదంతా పోతనామాత్యుల భక్తీ ప్రభావమేనని తెలుసుకుని పోతనామాత్యుల వద్దకు వచ్చి బమ్మెర పోతన కాళ్ళపై పడతాడు రాజు. చివరికి రాజు సమక్షంలో శ్రీసీతారాములకే భాగవతం సమర్పిస్తారు, బమ్మెర పోతనామాత్యులు. ఎన్ని కష్టాలు కలిగిన ఓర్చుకుని భాగవతాన్ని భగవత్పరం చేసిన ఘనుడుగా పోతనామాత్యులని రాజు కొనియాడతాడు. “BhaktaPotana Bammera Potanaamatyula Bhagavata Rachana”

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

శ్రీ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం

శ్రీ కంచి కామాక్షి తెలుగు పాత చిత్రము

Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram – కంచి కామాక్షి తెలుగు టైటిలుతో భక్తి చలనచిత్రం తమిళం నుండి తెలుగుకు డబ్బింగ్ చేసిన భక్తి మూవీ. జెమినిగణేషన్, సుజాత తదితరులు నటించిన చిత్రం కంచి కామాక్షమ్మ తల్లి గురించి తెలియజేస్తూ అమ్మ మహిమలను చూపుతుంది. జెమినీ గణేషన్ సుజాత జంటకి పుట్టిన ఇద్దరు కవలలో ఒకరిని మీనాక్షి అమ్మకు సమర్పించేయడం మీనాక్షి అమ్మవారి ఆ పిల్లవాడి అలానపాలన చూడడం, గుడి సన్నివేశం చాల చక్కగా దైవనిదర్శనంగా ఉంటుంది.

ఆదిశంకరాచార్య కంచికి వచ్చి అమ్మ అనుగ్రహం సంపాదించడం, అలాగే కంచి కామకోటి పీఠం నెలకొల్పమని కామాక్షి అమ్మవారు చెప్పడం, ఒక అమాయక పిల్లను కామాక్షి అమ్మ అనుగ్రహించి ఆమె నోటపలికిన మాటను వాస్తవం చేసే శక్తిని ప్రసాదించడం, ఇంకా మరిన్ని భక్తి సన్నివేశాలు ఈ  కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం – Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram లో కనిపిస్తాయి.

జనని సినీ ప్రొడక్షన్స్ పతాకం పై కంచి కామాక్షి తెలుగు భక్తి చిత్రం జెమిని గణేషన్, సుజాత, శ్రీప్రియ, వై విజయ, శ్రీకాంత్, శ్రీవిద్య, రాజసులోచన తదితరులు నటించిన చిత్రానికి సంగీతం కెఎస్. రఘునాథన్, దర్శకత్వం కెఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం – Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram తెరకెక్కింది.

కాంచీపురం చుపుస్తూ కంచి గురించి చెబుతూ అమ్మవారి ఆలయం గురించి చూపుతూ అమ్మగురించి చెప్పడం చిత్ర ప్రారంభ సన్నివేశం. కంచి కామాక్షి గుడిలో అమ్మవారికి ఆలయ ధర్మకర్త వచ్చి పూలు పలహారాలు తెస్తే, అక్కడే ఒక స్వర్ణపుష్పంతో నిలబడి ఉన్న సిద్ధుడు, ఆ స్వర్ణపుష్పాన్ని అమ్మవారి పాదాలు దగ్గర పెట్టి పూజించి ఇవ్వమని చెబుతారు. ప్రధాన అర్చకులు ఆ స్వర్ణపుష్పాన్ని అమ్మవారి పాదాలు దగ్గరపెట్టి పూజ చేసి ఆ సిద్దుడికి ఇస్తే, సిద్దుడు అక్కడ నిలబడి ఉన్నఆడువారిలో ఒకామెకు స్వర్ణపుష్పం ఇచ్చి వెళ్ళిపోతారు.

ఆమె ఆ స్వర్ణపుష్పం తీసుకుని వెళ్లి తన భర్తకు ఉన్న కుష్టిరోగాన్ని పోగొడుతుంది. ఆ తరువాత ఒక సాధు కొన్ని శక్తులతో మహిమలు చూపుతూ నేనే భగవంతుడిని నన్నే కొలవండి అని ప్రగల్భాలు పలుకుతుంటే, కంచి కామాక్షి గుడిలో స్వర్ణపుష్పానికి అర్చన చేయించిన సిద్దుడు అక్కడికి వస్తాడు. అక్కడ ఆ సాదువుకి తన మహిమ చూపి అతనికి బుద్ది చెబుతారు సిద్దుడు. అక్కడికి కామాక్షి గుడిలో సిద్దుడి దగ్గర స్వర్ణపుష్పం పొందిన మహిళ రోగం తగ్గించుకున్న తన భర్తతో సిద్ధుడు దగ్గరికి వస్తుంది. అలా వచ్చిన ఆ దంపతులు తమను కంచి కామాక్షే మాకు మీరు వస్తారని చెప్పారని అందుకు మీరు ఎవరో చెప్పమని సిద్దుడిని ప్రాదేయపడతారు. సిద్దుడు అమ్మవారిని తలచుకుని స్పృహ తప్పితే, అక్కడకు మధుర నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆ సిద్దుడు గురించి నాకు తెలిసినది చెబుతాను అని చెప్పడం మొదలుపెడతాడు.

Madhura Meenakshi Penchina Bidda Gurinchina Vivaram

ఆ సిద్దస్వామి పేరు బాల శివానందం అని, మీనాక్షి దూతగా అందరికి తెలుసనని చెబుతూ అతని పుట్టుక గురించి వివరిస్తుండగా, కంచి కామాక్షి చిత్ర సన్నివేశం మారుతుంది. స్వామి తల్లిదండ్రులు(జెమిని గణేషన్-సుజాత) కంచి కామాక్షి గుడిలో నలభై ఒక్కరోజులు దీక్ష చేసిన తరువాత ఒకరోజు కంచి కామాక్షి గుడిలో పడుకుని ఉన్న సుజాతకు కలలో అమ్మవారు కనబడి, “నీవు బిడ్డకోసమే కదా నా సన్నిధికి వచ్చింది, అలాగే మధుర మీనాక్షికి పార్వతి మాతలాగా కూడా ఒక బిడ్డకు ఆలనాపాలనా చూడాలని కోరికగా ఉందట, నీవు నీ భర్తతో కలిసి మధురకు చేరుకో అక్కడ మధురమీనాక్షి కోరిక నీ కోరిక తీర్చుతానని చెప్పి అంతర్ధానం అవుతుంది.” మెలుకువ వచ్చిన సుజాత లేచి జెమినీ గణేషన్ని లేపి విషయం చెప్పి ఇద్దరు దంపతులు మధుర మీనాక్షి అమ్మవారి గుడికి వెళతారు.

అలా మదురై మీనాక్షి అమ్మవారిని దర్శించిన ఆ దంపతులు మాకు పుట్టిన బిడ్డని నీ పాదాలు దగ్గరే వదిలేస్తాను నీకోసం అని మొక్కుకుని అనుగ్రహించమని వేడుకుంటారు. కంచి కామాక్షి అమ్మవారి అనుగ్రహం వలన ఆమెకు మగ కవలలు జన్మిస్తారు. అప్పుడు ఆ దంపతులు ఇద్దరినీ తీసుకుని మధుర మీనాక్షి గుడిలో మీనాక్షి అమ్మవారి దగ్గర పెడితే, ఒక పిల్లవాడు అమ్మవారువైపు మళ్ళితే, మరొకరు అమ్మవైపు మళ్లుతారు. ఆ సన్నివేశం చాలా చక్కగా భక్తిప్రదాయకంగా ఉంటుంది. ఆ పిల్లవాడిని మీనాక్షి అమ్మవారు రమ్మని ఆహ్వానించడం ఆ పిల్లవాడికే కనిపిస్తుంది.

అక్కడ నుండి ఆ దంపతులు వెనుదిరుగుతుంటే ఆలయధర్మ కర్త, పూజారి దంపతులను అడ్డుకుని పిల్లవాడిని తీసుకువెళ్లమంటారు. సుజాత, జెమినీ గణేషన్ దంపతులు మేము ఆ పిల్లవాడిని అమ్మవారికి అప్పగించేశాం, ఇక ఆ పిల్లవాడి భాద్యత మీనాక్షి అమ్మే చూసుకుంటుంది అని చెప్పి వారు ఇంటికి వెళతారు. గుడి ధర్మకర్త ఆలయఅర్చకులు ఎంత ప్రయత్నం చేసినా గుడి తలుపులు తెరుచుకోవు, తాళం రంద్రంలో నుంచి అమ్మవారి స్వరూపం చూసి భయపడతారు వారు.

ఇంటికి చేరిన జెమిని గణేషన్-సుజాత దంపతులు ఆ పిల్లవాడిని అమ్మవారు దగ్గరే పూజారులు ఉంచారా బయట పడవేశారా అని సందేహం దిగులు చెంది, తెల్లవారగానే గుడికి చేరుకుంటారు. పూజారులకు ఎంత ప్రయత్నం చేసిన తెరుచుకొని గర్భగుడి తలుపులు ఆమె తీయగానే తెరుచుకుంటాయి. అమ్మవారి గర్భాలయంలో ఆడుకుంటున్న పిల్లవాడు కనబడతాడు, అమ్మవారి ముక్కు పుడక, బంగారు ఉగ్గుగిన్నె పిల్లవాడి చేతిలో ఉంటాయి. ఇదంతా మీనాక్షి అమ్మవారే మహిమ ఆ తల్లి పిల్లవాడి ఆలనాపాలనా చూసుకుంటుంది అని భావించి వారు వెనుతిరుగుతారు. ఆ పిల్లవాడే ఈ సిద్దుడు అని మధుర నుండి వచ్చిన వ్యక్తి కామాక్షి గుడిలో స్వర్ణపుష్పం గ్రహించిన దంపతులకు చెబుతారు.

Siddhudu Cheppina Kanchi Kamakshi Pouranika Gadha

ఈలోపు తేరుకున్న ఆ సిద్దుడు నా గురించి కాదు చెప్పుకోవలసింది, మధుర మీనాక్షి, కంచి కామాక్షి అమ్మవార్ల గురించి చెప్పుకుంటే, పుణ్యం పరమార్ధం అని కంచి కామాక్షి అమ్మవారి గురించి చెప్పడం మొదలు పెడతారు.

బండాసురుడు తప్పస్సు చేసి బ్రహ్మను మెప్పించి, భూలోకంలో మానుష జాతిలో అడామగ కలవకుండా ఐదేళ్ళ బాలిక పుట్టాలి, ఆ విధంగా బాలిక పుడితే ఆ బాలిక చేతిలో మాత్రమే మరణం ఉండాలి అని వరం కోరుకుంటాడు. వరబలంతో బండాసురుడు దేవతలను హింసిస్తూ ఉంటే, అందరూ దేవతలు కలిసి కైలాసం పరమశివుడి దగ్గరికి వెళతారు. కైలాసం నుండి పరమశివుడు సలహాపై జగన్మాతని ప్రార్ధించడానికి కంచికి చేరుకుంటారు.

కంచిలో సర్వదేవతలు జగన్మాతని ప్రార్ధన చేయడం వలన ప్రకృతి మరియు సర్వదేవతల శక్తి నుండి ఒక ఐదేళ్ళ పాప ఉద్బవిస్తుంది. బండాసురుడు ఆ పాపతో యుద్ధం చేసి మరణిస్తాడు. బండాసురుడుని అంతుతేల్చిన ఆ బాలిక త్రిమూర్తుల దగ్గరికి వచ్చి నాకు గుడికట్టండి అని చెబితే, మయుడు శివుని అజ్ఞా మేరకు కంచిలో ఆలయం నిర్మిస్తారు. మరుసటి ఉదయం దేవతలంతా గుడికి చేరితే ఆ పాప అమ్మవారుగా గర్భగుడిలో దర్శనం ఇస్తుంది. బాలగా అవతరించి బండాసురుడుని అంతం చేసి, కన్యగా గర్భగుడిలో దర్శనం ఇచ్చిన అమ్మవారిని చూసి పరమశివుడు ఆదిపరాశక్తి అని పిలిస్తే, ఆ తల్లి నేను  కామాక్షిని, అలాగే అందరిని అనుగ్రహిస్తాను అని బదులిస్తుంది. ఆ విధంగా సిద్దుడు వారికి ఇంకా కామాక్షి అమ్మవారి మహిమలు చెప్పడం కొనసాగిస్తూ ఉంటారు.

భద్రయ్య అను భక్తుడిని అనుగ్రహించిన Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram

తిరువాయూర్లో ఒక అమ్మవారి భద్ర అనే భక్తుడికి సిద్దుడు “ఒక శుబ్రపరిచిన గదిలో 101 భోజనం చేసే ఆకులు పరచి 100మంది కన్యలను లోపలి పంపించు, భోజనాలు పెడుతూ ఉండు, రోజు 100 ఆకులు మాత్రమే భోజనం చేసి ఉంటాయి, కానీ ఏరోజు అయితే 101 ఆకులు భోజనం చేస్తున్నట్టు కనిపిస్తుందో, ఆ రోజు అమ్మవారు వచ్చి భోజనం చేసినట్టు, అలాగే భోజనం పూర్తయిన తరువాత వారికి 101 రవికలు పంచిబెట్టు, ఏరోజు 101 ఆకులు భోజనం ముగింపు ఉంటుందో ఆరోజే 101 రవికలు సరిపోతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు”.

కామాక్షి గుడి ఊరిమధ్యలో ఉండకూడదు, నేను ఆ మండపాన్ని తీసివేసి, కోర్ట్ కడతాను అని ఆంగ్ల కలెక్టర్ అమ్మవారి భక్తుడు అయిన భద్రయ్యతో గొడవపతాడు, కలెక్టర్ వాళ్ళ అమ్మగారి మాట మీద గుడి దగ్గరి నుండి వెళ్ళిపోతాడు. అదే ఊళ్ళో మిడతంబొట్లు అనే వ్యక్తి అమ్మవారి గుడికి ధర్మకర్తగా ఉంటూ వడ్డీవ్యాపారం చేస్తూ, అమ్మవారి గుడిలో కానుకలు కూడా ఇంటికే తీసుకుపోతూ ఉంటూ ఉంటాడు. సిద్దుడు చెప్పిన భద్రయ్య భక్తుడు అదే వ్యాపారి దగ్గర తన ఆస్తి పత్రాలు మిడతం బొట్లు దగ్గర కాళీనోటు పేపర్ పై వేలుముద్రలు వేసి, డబ్బు అప్పు తీసుకుని క్రమంగా 101 విస్తర్లు వేసి 100 మందికి భోజనం పెడుతూ భక్తిగా అమ్మవారిపై నమ్మకం ఉంచుతాడు.

ఒకరోజు మిడతం బొట్లు భద్రయ్య ఇంటికి వచ్చి ఉన్నపళంగా ఇల్లు కాళీచేసి వెళ్ళమంటాడు, ఎందుకు అని అడిగితే నీవు చేసిన అప్పు చాల వుంది అని చెప్పి దొంగపత్రాలు పట్టుకుని కోర్టుకి వెళతాడు. అమ్మవారుపై నమ్మకం ఉంచిన భక్తుడు అయిన భద్రయ్య కామాక్షి అమ్మే వచ్చి తనవైపు సాక్ష్యం చెబుతుంది అని కోర్టులో వాదిస్తాడు. మోసపూరిత పత్రాలను బట్టి ఆంగ్ల కలెక్టర్ భద్రయ్యపై తీర్పు మరుసటి రోజుకి వాయిదా వేస్తాడు. అయితే తరువాయి తీర్పు వ్రాసే సమయంలో కలెక్టర్ కలం కదలదు, ఎంతా ప్రయత్నం చేసిన కలం కదలదు. అమ్మవారు కలెక్టర్ అమ్మరూపంలో వచ్చి తీర్పు భక్తుడు అయిన భద్ర నిరపరాధి వ్రాయి అది నిజం అయితే, నీ కలం కదులుతుంది. అని చెబుతుంది. అలా భద్రయ్య అయిన అమ్మవారి భక్తుడిని నిర్దోషిగా తీర్పు వ్రాసిన కలెక్టర్, అమ్మవారి గుడిలో ఉన్న భక్తుడి దగ్గరికి వస్తాడు.రేపు భోజనాలు 101 విస్తర్లలో 100 మందికి పెట్టే చోటకి అమ్మ కామాక్షి వచ్చి భోజనం చేస్తుంది. రేపు 101 విస్తర్లలో భోజనం పూర్తవుతుంది అని చెప్పి సిద్దుడు, కలెక్టర్ భద్రయ్య ఇంటికి వెళ్ళాలని నిశ్చయం చేసుకుంటారు.

భద్రయ్య ఇంటిలో 100 మంది కన్యలతో కలిసి భోజనం చేసిన Kanchi Kamakshi అమ్మవారు.

తరువాత సిద్దుడు చెప్పగా ఒక శుబ్రపరిచిన గదిలో 101మందికి విస్తర్లు వేసి 100 కన్యలను గదిలోకి పంపించి భోజనాలు పెడతారు. అప్పుడు ఆంగ్ల కలెక్టర్, సిద్దుడు, భద్రయ్య గమనించగా 101 మంది భోజనం చేస్తూ కనబడతారు. భోజనాలు పూర్తయ్యాక 101 రవికలు పంచిబెడితే, ఒక రవికపై కలెక్టర్ సైన్ చేస్తారు. తరువాత గుడికి వెళ్లి చూస్తే, కలెక్టర్ సంతకం చేసిన వస్త్రం అమ్మవారి మెడలో కనిపిస్తుంది. అందరు అమ్మవారి మహిమను కీర్తిస్తారు. ఇంకా సిద్దుడు కంచి కామాక్షి అమ్మవారి గురించి మహిమలు చెప్పడం కొనసాగిస్తూ ఆదిశంకరాచార్యులు కంచికి వచ్చి, అర్చించి అమ్మని మెప్పించన వైనం చెబుతారు.

కంచిలో ఒక క్షుద్ర పూజలు చేసే వ్యక్తి భక్తులను నమ్మించి అమ్మవారికి బలులు ఇవ్వాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ప్రకృతిలో హింస, అధర్మం పెరిగితే, దైవశక్తి నిమ్మకుండడం ప్రకృతి ప్రకోపించడం సాదరణమే కదా. ఆది శంకరాచార్యులు కంచికామాక్షి గుడికి వచ్చి అమ్మవారికి బలులు ఇవ్వవద్దని చెప్పి అమ్మవారిని స్త్రోత్రం చేస్తే, అమ్మ వర్షం కురిపిస్తుంది. అది చూసిన ఊరిప్రజలు, ఆ క్షుద్ర వ్యక్తి ఆదిశంకరాచార్యులు పాదాలపై పడతారు. అమ్మవారు ఆది శంకరచార్యులకు ప్రత్యక్షం అయ్యి, కంచి కామకోటి పీఠం కంచిలో స్థాపించి, ఆ పీఠం నీవు  అధిష్టించి కీర్తిని గడిస్తావు అని చెబుతుంది.

కంచి కామాక్షి ఆలయ కోశాధికారి సుబ్రహ్మణ్య శాస్త్రికి ఒకసారి చిన్నపాప కనిపిస్తే ఇంటికి తీసుకువచ్చి తన మనుమరాలుగా పెంచుకుంటూ ఉంటాడు. అయితే ఆ పాప(మహాలక్ష్మి) పెరిగాక తన తల్లిదండ్రుల గురించి అడిగితే, నీ అమ్మ ఆ కామాక్షి అని చెప్పి, నీ తండ్రి హిమాలయాల్లో వైద్యం చేయించుకుంటున్నట్టు చెబుతాడు. అయితే అమ్మని చూపించమంటే ఆ పూజారి ఆ పాప మహాలక్ష్మికి గుడిలో కామాక్షిని చూపి నీతల్లి అని చెబితే, అప్పటినుండి ఆపాప అమ్మనే చూస్తూ ఉంటూ ఉంటుంది.

అక్షరజ్ఞానం లేని పాపను అనుగ్రహించిన కంచి కామాక్షి అమ్మవారు. Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram

ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ధర్మకర్త దుర్బుద్ధి తెలుసుకుని, ఇన్నాళ్ళు నేను ఒక పాపపు సొమ్ము తిని పెద్దపాపం చేశాను కాశికి వెళ్లి ఆ పాపం పోగొట్టుకుంటాను అని చెప్పి ఆ పాప మహాలక్ష్మితో కాశికి బయలుదేరతాడు. అలా బయలుదేరుతున్న సుబ్రహ్మణ్య శాస్త్రిని ఆ ప్రక్కనే ఉంటున్న ఇద్దరు దంపతులు పాపను కాశికి తీసుకువెళ్ళడం ఎందుకు మేము ఆపాపను చూసుకుంటాం అని చెప్పి, పాపను సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర నుండి తీసుకుంటారు. మహాలక్ష్మి పాపకు శక్తులు ఉన్నాయి అందుకే పాప ఎప్పుడు అమ్మవారి ఆలయంలో ఉంటుంది అని చెప్పి ఆ పాపను తీసుకున్న దంపతులు ప్రచారం చేస్తారు.

మహాలక్ష్మి పాపపై ప్రచార మహిమలు గురించి విన్న భక్తలు పాపదగ్గరికి వస్తారు. అప్పుడు ఆ దంపతులు పాపతో ఒక ఇల్లాలితో ఆమె భర్త పదిరోజులలో చనిపోతాడని అబద్దం బలవంతంగా పాపతో చెబుతారు. పది బంగారు కాసులు తెస్తే కాపాడతానని కూడా ఆ పాపతో చెప్పిస్తారు. ఆ ఇల్లాలు రోదిస్తూ వెళ్ళిపోతుంది. నిద్రపట్టని పాప మహాలక్ష్మి అబద్దం చెప్పినందుకు మనోవేదనకు గురి అయ్యి అమ్మవారి పాదాలపై తలకొట్టుకుని చనిపోదామని నిశ్చయించుకుని బయలుదేరుతుంది.

పాప అంతరంగం గ్రహించిన కంచి కామాక్షి అమ్మవారు అనంతలక్ష్మితో కలిసి గర్భాలయం వెలుపలికి వచ్చి పాపను ఆపి, ఆ పాపతో నేనే నీ తల్లిని అని చెప్పి పాప మహాలక్ష్మి నాలుకపై తన నాలుకతో బీజాక్షరాలు వ్రాస్తుంది. తరువాత పాప మహాలక్ష్మితో నీనోటితో ఏది పలికితే అది జరుగుతుంది అని చెప్పి పాపను గుడిలోనే పడుకో బెడుతుంది అమ్మవారు. అలా అమ్మ అనుగ్రహం పొందిన ఆ పాప మహాలక్ష్మి మహిమలు చూపించి, దుష్ట బుద్దితో ఉన్న దంపతులకి పాప మహాలక్ష్మి వారికి బుద్ది చెప్పుతుంది. తరువాత కంచి మహారాజు అయిన పల్లవరాజుకి చాళక్యరాజుపై విజయాన్ని కూడా కట్టబెడుతుంది.

అమ్మని మనసారా నమ్మితే, అమ్మ అనుగ్రహానికి ఎదురులేదని ఈ కంచి కామాక్షి తెలుగు భక్తి చలనచిత్రం Kanchi Kamakshi Telugu Bhakti Chalana chitram ద్వారా తెలియవస్తుంది.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

దేవుళ్ళు తెలుగు భక్తి చలనచిత్రం

Devullu Telugu Bhakti Chalanachitram దేవుళ్ళు తెలుగు భక్తి చలనచిత్రం (Devullu Telugu Devotional Movie), ఇద్దరు చిన్నారుల సాహాస భక్తి యాత్రలో దేవుళ్ళను వారి మహిమలు తెలియజెప్పే తెలుగు భక్తి చలనచిత్రం దేవుళ్ళు. కుటుంబంతో చూడదగిన తెలుగుచిత్రాలలో ఈ దేవుళ్ళు చిత్రం ఒకటిగా ఉంటుంది. యూట్యూబ్లో మొబైల్ ఆప్ ద్వారా అయితే ఏ స్మార్ట్ ఫోన్ ద్వారా కంప్యూటర్ అయితే గూగుల్ క్రోమ్ ఇతర వెబ్ బ్రౌజర్ల ద్వారా వీక్షించవచ్చు.

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ దేవుళ్ళు చిత్రం ప్రేక్షకాదరణను సంపాదించింది, ఎక్కువగా మహిళా ప్రేక్షకులకు నచ్చే చిత్రాలు తీయడంలో కోడి రామకృష్ణగారు మంచి సిద్దహస్తులు. 2000 సంవత్సరంలో నవంబర్ 10 న అంటే సనాతన ధర్మంలో భక్తులు నియమనిష్టలు పాటించే కాలంగా ఉంటుంది, ఆ సమయంలో ఈ దేవుళ్ళు చిత్రం విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందింది.

సుమన్ వేంకటేశ్వర స్వామిగా నటిస్తే, శ్రీకాంత్ రామచంద్రమూర్తిగా నటిస్తే, రాజేంద్ర ప్రసాద్ ఆంజనేయస్వామిగా కనిపిస్తారు. రమ్యకృష్ణ కనకదుర్గమ్మగా కనిపిస్తే, లయ సీతమ్మగా కనిపిస్తుంది. చిన్నారుల తల్లిదండ్రులుగా పృద్వీ, రాశి జంటగా నటించారు. ఈ దేవుళ్ళు చిత్రానికి వందేమాతరం  శ్రీనివాస్ సంగీతం సమకూర్చారు.  బాబు పిక్చర్స్ పతాకంపై చెంగోడి హరిబాబు, కరటం రాంబాబు కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఈ దేవుళ్ళు టైటిలుగా చిత్రం నిర్మించారు.

Devullu Telugu Bhakti Chalanachitram Kadhaloki Velite

ప్రశాంత్ (Pridhviraj) ఒక ప్రసిద్ద గాయకుడు అతను ఎక్కువగా స్టేజిలపై పాటలు పాడుతూ అశేష ప్రేక్షకాభిమానం సంపాదిస్తాడు. అయితే అలాంటి అభిమానులలో ఒక వీరాభిమాని నిర్మల (Rashi) అతని పాటలు పాడే చోటకి వెళ్లి వింటూ వుండే ఆమెకి అతనికి ఒక పాట ప్రదర్శన అయినాక పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం పెరిగి వారు పెళ్లికూడా చేసుకుంటారు.

పెళ్ళైన తరువాత ప్రశాంత్ ప్రోత్సాహంతో నిర్మల కూడా పాటలు పాడే పనిలో పడుతుంది. ఆమెకూడా ప్రసిద్ద గాయినిగా పేరు సంపాదిస్తుంది. వారికి చింటూ, భవాని ఇద్దరు పిల్లలు కలుగుతారు. పిల్లలు పెరుగుతూ ఉంటారు, భార్యాభర్తల మధ్య వృత్తిపరమైన పోటికూడా పెరుగుతుంది. ఒక సమయానికి ప్రశాంత్ పాటలకు అభిమానం తగ్గి, నిర్మల గాత్రానికి అభిమానబలం పెరుగుతుంది. ఆ విషయంలో అసహనానికి గురి అవుతారు.

నిర్మల, ప్రశాంత్ ఇద్దరికీ వేరు వేరు సెక్రటరీలు ఉండడం వలన దంపతుల మధ్య అహంబావం వ్యక్తం అయ్యి అది వారిమధ్య చిచ్చుపెట్టి సంసారం కూలిపోయే స్థితికి వెళ్లిపోతుంది. అప్పటికి చిన్నారుల వయస్సు ఉహ తెలిసే వయసుకు వస్తారు. తల్లిందండ్రులపై పిల్లలకు ఉన్న ప్రేమ, పిల్లల విషయంలో ఆ దంపతులు తీరు వివరిస్తూ, ఆ పిల్లలు స్కూల్ ఫంక్షన్లో పాట కూడా పాడుతారు. అయ్యినప్పటికి భార్య భర్తలు కోర్టుకి వెళ్లి విడాకులకు అభ్యర్దిస్తారు.

తల్లిదండ్రులు కలిసే మనతో ఉండాలి అని భావించే ఆ పసి హృదయాలు చాలా తపన చెందుతారు. వారి నాయనమ్మ వారి తల్లిదండ్రుల ఆ ప్రవర్తనకు కారణం నేను కట్టిన ముడుపులు దేవుళ్ళకు చెల్లించకపోవడమే కారణం. అని చెప్పి ఏఏ దేవుళ్ళకు ముడుపులు కట్టింది వివరిస్తుంది ఆ చిన్నారులకు వారి నాయనమ్మ. ఎలాగైనా తమ తల్లిదండ్రులు కలిసి తమతో ఉండాలని భావిస్తున్న ఆ పిల్లలు తమ నాయనమ్మ కట్టిన ముడుపులు తీసుకుని దేవుళ్ళను వెతుక్కుంటూ బయలుదేరతారు.

Chinna pillala teerdhayatra – Devulla Telugu Bhakti Chalanachitram

చిన్నపిల్లలు వారు దాచుకున్న డిబ్బిడబ్బులు తీసుకుని కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకుంటారు. కాణిపాకంలో వినాయకుడు నూతిలో ఉండడంతో నూతిలో ఉన్న స్వామి ఇంక భక్తులను ఏం కాపాడతాడు అని చిన్నారుల పలుకతారు. అప్పుడు ఆ చిన్నారులకు వినాయకుడే మారువేషంలో వచ్చి తనగురించి తనే వివరిస్తూ పాటపాడడం ఆకట్టుకుంటుంది. అక్కడ వారి నాయనమ్మ ముడుపుని చెల్లిస్తారు. తత్ఫలితంగా తల్లిదండ్రుల విడాకుల కేసుకు మొదటి విఘ్నం కలుగుతుంది. వారి తల్లిదండ్రుల విషయం వినాయకుడికి వివరిస్తారు. కలియుగం భక్తి లేని భార్యభర్తలు అహంకారానికి గురి అయి భాదితులు అవుతారని, ఇంకా మీ బామ్మ కట్టిన మిగిలిన ముడుపులు చెల్లించేయండి మీ కోరిక నెరవేరుతుంది అని చెబుతారు, వినాయకస్వామి.

కాణిపాకం నుండి చిన్నారులు తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధికి బయలుదేరతారు. తిరుపతి కొండ కాలినడకన ఎక్కుతున్న చిన్నారులను దారిదోపిడి దొంగలు అటకాయిస్తే, శ్రీ వేంకటేశ్వరస్వామి ఏనుగు రూపంలో వచ్చిచిన్నారులను కాపాడుతారు. అప్పుడు ఆ ఏడుకొండలస్వామి వ్యక్తిగా వచ్చి ఆ పిల్లలను ఏడుకొండలు దగ్గర ఉండి, తీసుకువెళతాడు. వేంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ వారులు చిన్నారుల మొక్కులు దగ్గరే ఉండి తీసుకోవడం చాల చక్కగా ఉంటుంది. అక్కడ నుండి చిన్నపిల్లలు బద్రాచలం బయలుదేరతారు.

గోదావరి దాటే క్రమంలో లాంచీలో నుండి బాలలని లాంచీ యజమాని దించివేయడంతో, ఆ చిన్నారులను గోదావరి దాటించడానికి ఆంజనేయస్వామియే వస్తాడు. వారిని లాంచీలో గోదావరి దాటిస్తూ సీతారాముల గురించి పాటపాడడం ఆకట్టుకుంటుంది. స్వామి దగ్గరే ఉండి సీతారాముల దర్శనం చేయించి విజయవాడ దుర్గగుడికి పంపిస్తారు సీతారామాంజనేయులు.

చిన్నారుల విజయావాడ నుండి శ్రీశైలం మీదుగా షిర్డీ యాత్ర – Devullu Telugu Bhakti Chalanachitram

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ముడుపులు శ్రీశైల బ్రమరాంబిక చేత పూజ చేయించుకుని అప్పజెప్పడం ఇక్కడి సన్నివేశం బాగుంటుంది. అలాగే అమ్మవారి మహిమలు గురించి చిన్నారులకు బ్రమరాంబిక అమ్మ చెప్పడం చాల భక్తిమయంగా ఉంటుంది. గుడిలో అమ్మవారి ముక్కుపుడక దొంగిలించబడి, ఆ ముక్కుపుడక చిన్నారుల శ్రీశైలంలో చెల్లించవలసిన ముడుపులోకి చేరుతుంది. తరువాత భవానికి అమ్మవారి పూనకం వస్తుంది. అమ్మవారికి పూజలు చేసుకున్న చిన్నారులు శ్రీశైలం బయలుదేరతారు.

శ్రీశైలం చేరిన చిన్నారులు విజయవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడకతో కల్సి ఉన్న ముడుపు శ్రీశైలంలో బ్రమరాంబిక అమ్మవారికి ఇస్తారు. ఆ సన్నివేశం చక్కగా ఉంటుంది. అమ్మవారి దగ్గర నుండి వారు పాతాళగంగలో స్నానం చేస్తూ చింటూ కృష్ణా నదిలో కొట్టుకువెళ్ళిపోతాడు. భవాని బస్సులో షిర్డీ చేరుకొని తమ్ముడికోసం విలపిస్తుంటే షిర్డీ సాయిబాబా వచ్చి ఆ పాపతో మాట్లాడిన తరువాత చింటూ వచ్చి పాపని కలుస్తాడు. తరువాత షిర్డీ దర్శనం చేసుకున్న చిన్నారులతో కలిసి షిర్డీ సాయినాధుడు ఆటలు ఆడుతారు.

శబరిగిరికి విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో దొంగతనం చేసిన దొంగతో కలిసి అయ్యప్పస్వాములతో కలిసి బయలుదేరతారు. ముక్కుపుడకకోసం ఆ దొంగ ఆ పిల్లలతో కలిసి శబరిమల వెళతాడు. చిన్నారుల ముడుపులు పోగొట్టుకోవడం వలన తమ తల్లిదండ్రులు విడిపోవడానికి తామే కారణం అని భావించి భాదపడుతున్న చిన్నారుల ప్రమాదావస్తలో ఉంటే అయ్యప్పస్వామి వచ్చి వారిని కాపాడి పిల్లల తల్లిదండ్రులను అయ్యప్ప సన్నిదిలో ఒక్కటవ్వటంతో చిత్రం సుఖాంతం అవుతుంది. స్వామికి చేరవలసిన ముడుపులు అయ్యప్పస్వామికి దొంగద్వారా చేరుతాయి.

చిన్నారుల ద్వారా భక్తిని పెంపొందించే చిత్రంగా దైవ మహిమలు తెలియజేస్తూ చిత్రం చాలా చక్కగా భక్తి చిత్రంగా మలిచారు. పిల్లలకు తల్లిదండ్రులు కలిసి ఉండాలనే బలమైన కోరికకు దేవుళ్ళను సైతం కదిలి వచ్చి వారి ముడుపులు స్వయంగా అందుకోవడం, వారి వారి దర్శనాలు స్వయంగా దేవతలతో చేయించడం చిత్రం చక్కగా ఉంటుంది. పాటలు చాల అర్ధవంతంగా భక్తి, జీవిత జ్ఞానంతో ఉన్నట్టుగా బాగుంటాయి.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్