సాహోతో సాహసమే చేశారు

సాహో చాలాకాలంగా ఎదురు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగను తలపింపజేసింది. జాతీయంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో, ఒక యువ దర్శకుడుతో పనిచేయడమే ప్రభాసం చేసిన సాహో సాహసం.

కధ బాగుంది, సీన్స్ బాగున్నాయి, కలపడంలో కొంత గందరగోళంగా సాదారణ ప్రేక్షకులకు అనిపించినా, సినిమా ముగింపు బాగుంటుంది. బాగోలేదు అనడం కన్నా ప్రయత్నం బాగా చేశారు. బాహుబలి సినిమా ప్రభావం ఈ సినిమా మీద పడడంతో, సినిమా అందరికీ తేలికగా అర్ధం అయ్యేలా ఉంటే మంచి టాక్ వస్తుంది. కానీ ఇక్కడ అందరికీ అర్ధం అయ్యేలా కాకుండా, కొందరికే అర్ధం అయ్యేలా అన్నట్టుగా అనిపిస్తుంది.

ఫ్యాన్స్ ఊహించినంతగానే, అంతే రిచ్ గా సినిమా ఉంటుంది. అయితే బాహుబలి చెట్టున పండిన పండైతే, సాహో కోసి ముగ్గేసిన పండులా ఉంటుంది. ఎంతైనా చెట్టున పండిన పండు రుచే వేరు, అలాగే బాహుబలి.

సినిమా బాగుంది, బోర్ కొట్టదు అలాగని అదేపనిగా అందరూ సినిమా ఆద్యంతం తదేకంగా కానీ యాక్షన్ సన్నివేశాల వలన. అందుకే కలెక్షన్లు బాగున్నా సినిమా బాహుబలి మించినది అన్న టాక్ సొంతం చేసుకోలేకపోయింది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

సైరా నరసింహారెడ్డి

సైరా నరసింహారెడ్డి తెలుగు చారిత్రక చలనచిత్రం

తెలుగు వెర్షన్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ తో సైరా నరసింహారెడ్డి సినిమా ప్రారంభం అవుతుంది. అనుష్క ఎంట్రీతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం గురించిన వివరణ ప్రారంభం అవుతూ ఆరంభం అధరగొడుతుంది.

నరసింహారెడ్డి జాతరలో ఎద్దుల భారీ నుండి ప్రజలను కాపాడడంతో బాటు ఎద్దుల ప్రాణాలను కూడా కాపాడడం చాలా ఆకట్టుకుంటుంది. బ్రిటిష్ దొర నరసింహారెడ్డి సహచరుడికి గుండు కొట్టించి పంపించడంతో, ఆ బ్రిటిష్ దొరను టైము చెప్పి చంపుతానని శపధం చేసి మరి ఊరి ప్రజలు చూస్తుండగా అతనిని చంపే యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లక్ష్మికి ఇచ్చిన మాట తప్పడంతో, లక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు నరసింహారెడ్డి మాటలు ఆకట్టుకుంటాయి. ఆ మాటలు స్పూర్తితో లక్ష్మి ఉద్యమ స్ఫూర్తిని అందరిలో నింపుతూ, తమిళ ప్రజల వరకు ఉద్యమాన్ని తీసుకువెళుతుంది.

ఊరిబాగు కోసం యజ్ఙంలో భాగంగా సిద్దమ్మ చిన్ననాడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో తాళి కట్టించుకుని, అతనే లోకంగా బ్రతకుతుంది. మరలా సిద్దమ్మ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక్కటవటం కూడా ఊరి కరువు తీర్చే యజ్ఙంలో భాగంగానే జరుగుతుంది. ఇంకా ఉద్యమం కోసం కూడా వారు విడివిడిగా జీవించడానికి ఇష్టపడతారు. వీరిద్దరి మద్య ఈ సన్నివేశాలే ఉన్నా అవి మనసుని స్పందింపజేస్తాయి.

క్లైమాక్స్ ఈ సినిమాకు ఆయువుపట్టు, మనం తలతిప్పుకోకుండా నిడివి ఎక్కువైనా ఆ ఎమోషనల్ సీన్స్ ను చూస్తూనే ఉంటాం. తెలుగువాడి పౌరుషం నయవంచనకు గురి అయ్యి, అతని తల తెంచి, కోటగుమ్మానికి వ్రేలాడదీస్తే, కంటతడిపెట్టని తెలుగువాడు ఉండడు.

సుదీప్ చేసిన పాత్ర చాలా చాలా బాగుంటుంది. చిరంజీవి గురువుగా అమితాబ్ నటన, తమన్నా పాత్ర ఆకట్టుకుంటే, ఒక స్వాతంత్ర్య పోరాటయోధునిగా మెగాస్టార్ చిరంజీవి పాత్రలో ఒదిగిపోయాడు.

సమాజానికి స్పూర్తినిచ్చే సినిమాలు సమాజంలో అవసరం అనే విషయం సామాజిక వేత్తల అభిప్రాయంగా కూడా ఉంది. అవును మంచి సినిమాల ద్వారా ఇచ్చే సందేశం, చారిత్రక సినిమాల ద్వారా ఇస్తే దాని స్పూర్తి ప్రభావం మరింత ఉంటుంది. అటువంటి చారిత్రక సినిమాను తీసిన రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి టీమ్ ని ఖచ్చితంగా అభినందించాలి.

దేశభక్తి సినిమా అంటే అందరిలో దేశభక్తుడుగా ఒక పెద్ద హీరో ఎలా నటించాడో అన్న ఆత్రుత ఉంటుంది. ఆంగ్లేయులపై తిరగబడ్డ తొలి భారతీయుడు అనగానే ఇంకా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించిన మెగాస్టార్ చిరంజీవి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సపోర్టు ఇచ్చిన మిగిలిన పాత్రలను వెండితెరపై చూడడానికి రివ్యూతో పనిలేకుండానే చూడాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది.

కుటిల రాజకీయాలు చేస్తూ, భారతీయుల పౌరుష పరాక్రమాలను తమకు అనుకూలంగా మార్చుకునే బ్రిటిష్ పాలన, మనదేశాన్ని పట్టి పీడించింది. అట్టి పాలకులను ఎదురించిన మన భారతీయుల చరిత్రను తిరిగి తెరపై చూడడమంటే ఎంతో సంతోషం.

ఫిక్షన్ స్టోరి అయిన బాహుబలి సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన సాధించన తెలుగు సినిమా ఇండస్ట్రీనుండి వచ్చిన మరో భారీ ప్రొజెక్టు ఈ సినిమా. ఇప్పుడు చారిత్రాక అంశంతో వస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా అందరూ చూసి, మన దేశ చరిత్ర గురించి తెలుసుకోవాలి.

తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

కె.వి. రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు

పెద్దమనుషులు అలనాటిపాత కధ కె.వి.రెడ్డి దర్శకత్వంలో

పెద్దమనుషులను చూడడానికి ఇక్కడ తాకండి

వాస్తవాలకు దూరంగా అవసరాలకు అనుగుణంగా మాట ఎలా మారుతుందో ఆలోచన చేస్తే, పెద్ద మనుషుల ప్రవర్తన, వారి మాటలు ఇంకెంతలాగా అవసరానికి అనుగుణంగా వాస్తవాలను దాస్తాయో పెద్దమనుషులు సినిమా చూస్తే అవగతమవుతుంది.

దర్శకులలో మేటి దర్శకుడుగా కీర్తిగాంచిన కె.వి.రెడ్డిగారు దర్శకత్వం వహించిన పెద్దమనుషులు చిత్రం. ఒక ఊరిలో పెద్దమనుషుల కుటుంబాలలో ఉండే స్థితిని, ఇంటిబయట వారికి సమాజంలో ఉండే స్థితిని చాలా చక్కగా ఈ చిత్రంలో కనిపిస్తుంది. బయట సన్మానాలు సత్కారాలు, వారి మాటకు తిరుగు ఉండదు, ఇంట్లో వారి మాటకు విలువ ఉండదు. సమాజంలో అవసరానికి దణ్ణం పెడితో, ఇంట్లో అవసరం ఉన్నా పట్టించుకోని బంధాలతో సాగే పెద్దమనుషుల కధే ఈ చిత్రం.

ఒక ఊరిలో అయిదుగురు పెద్ద మనుషులలో నలుగురు పెద్దమనుషుల జీవితం పైన వివరించనట్టే ఇంటాబయటా కూడా అలానే ఉంటుంది. అయితే అందులో అయిదో పెద్దమనిషి మాత్రం ఇంటా బయటా గౌరవం ఉంటుంది. ఇంకా అతని చెంత ధనం కన్నా ధర్మం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత అతని బీద కుటుంబం అయినా ఓ మధ్యతరగతి పెద్దమనిషిగా ఇంటాబయటా సమాన గౌరవం పొందుతూ తనపని తాను చేస్తూ ఉంటాడు. అతని పేరే రామదాసు, అతను భార్య, గుడ్డి కూతురితో కలసి తాను నిర్వహిస్తున్న పత్రికా ప్రింటింగ్ ప్రెస్ తో కూడి ఉన్న ఇంటిలోనే నివాసం ఉంటారు.

అయితే ఈ రామదాసు మాత్రం ఆ ఊరి చైర్మెన్ అంటే అభిమానం, నమ్మకం మరియు గౌరవం ఇంకా స్వామి భక్తి ఎక్కువ. ఎందుకంటే రామదాసు ఆద్యర్యంలో ఒక శరణాలయం నిర్వహణ జరుగుతూ ఉంటుంది. అయితే ఆ బాధ్యతలో ఎక్కడా తప్పుడు లెక్కలు చూపించకుండా, వచ్చిన విరాళపు సొమ్ము అంతా శరణాలయానికే ఖర్చు చేస్తూ ఉంటాడు. కానీ చైర్మెన్ ఇతర సహచరులు అయిన పూజారి, వ్యాపారి, కాంట్రాక్టరుతో ఎంతోకొంత సొమ్మును ఎప్పటికప్పుడు చైర్మెన్ గారికి చాటుమాటున చేరవేస్తూ ఉంటారు. వీరు ముగ్గురు చేసే వారి వారి వృత్తులలో లాభాలు అక్రమమార్గంలో అర్జించి, వాటిలో వాటాను మాత్రం చైర్మెన్ గారికి ఇస్తూ ఉంటారు. ఇదంతా రామదాసుకు తెలియదు. ఇంకా రామదాసు విషయంలో చైర్మెన్ ఏది అడగడు, అతను చెప్పినదానికి సరేనంటూ పైకి నటిస్తూ ఉంటాడు. అందుకే రామదాసు తన పత్రికలో రామదాసుగారి ప్రజాసేవ గురించి గొప్పగా వ్రాస్తాడు.

చైర్మెన్ గారికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు, అతని ఇంట్లోనే ఉంటారు. తమ్ముడు తిక్క శంకరం ఎప్పుడూ అన్నయ్యని అల్లరి చేస్తూనే ఉంటాడు. అతను మేక వన్నె పులిగానే వర్ణిస్తూ..ఉంటాడు. వాస్తవానికి తమ్ముడుని పిచ్చోడు అని ముద్ర వేసి, చెల్లిని ఒక ముసలోడికిచ్చి వివాహం చేసి, ఆస్తిని తమ్ముడికి, చెల్లెలకు పంచే అవకాశం లేకుండా చైర్మెన్ తగు జాగ్రత్తలతో ఆస్తిని కాపాడుకుంటాడు. మొత్తమ్మీద చైర్మెన్ పైకి పెద్దమనిషి, లోపల చిన్న మనిషి. చిల్లరకు చాటుమాటున చేయి చాస్తూ, పైకి పెద్ద పెద్ద దానాలు చేస్తూ ఉంటాడు. ఇంకా చైర్మెన్ గారి కొడుకు పట్నంలో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉంటాడు.

చైర్మెన్ గారి అబ్బాయికి అతని బాబయి తిక్క శంకరం, పత్రికా సంపాదకుడు రామదాసు, అతని ఫ్యామిలి అంటే బాగా ఇష్టం. అతని మద్య మద్యలో ఊరికి వచ్చినప్పుడు రామదాసుగారింటికి వెళ్లి వస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే రామదాసు కూతురుకి కళ్ళ ఆపరేషన్ చేయించడానికి పూనుకుంటాడు. ఒక్కసారి పట్నం తీసుకుపోయి పరీక్షలు చేయించి తీసుకువస్తాడు కూడాను.

ఇదిలా ఉండగా చైర్మెన్ గారి కారు డ్రైవరు, చైర్మెన్ విధవ చెల్లెలతో సరసమాడుతూ కనబడతాడు. వెంటనే చైర్మెన్ తన దగ్గర ఉన్న తుపాకితో ఆ కారు డ్రైవరుని కాల్చి చంపుతాడు. అక్కడే ఉన్న రామదాసు, చైర్మెన్ గారి చేతిలో తుపాకి తీసుకుని, కారు డ్రైవరు దగ్గరకు పరుగు పరుగున వెళతాడు. అందరూ అక్కడికి చేరతారు, కారు డ్రైవరు రామదాసు చేతుల్లోనే కన్నుమూస్తాడు. అక్కడికి చైర్మెన్ కూడా వస్తాడు. అప్పటికే వచ్చిన పోలీసులు ఇది ఎలా జరిగిందని అడగడంతో, రామదాసు నేనే పొరపాటున పిట్టను కాల్చబోతే, అది ఇతనికి తగిలిందని సమాధానం చెబుతాడు. రామదాసుకు కోర్టు కొంతకాలం కారాగార శిక్ష విధిస్తుంది. జైలులో రామదాసుని కలసిన చైర్మెన్, తాను నిజం చెప్పి పోలీసులకు లొంగిపోతానని నంగనాచి వినయం ప్రదర్శిస్తాడు. రామదాసు అది నిజమనుకుని, మీరు ఎట్టి పరిస్థితులలోనూ నిజం చెప్పవద్దు అని, మీరు ప్రజాసేవ చేయాలని చెబుతాడు.

ఇక రామదాసు జైలుకెళ్లడంతో చైర్మెన్ సహచరుల అరాచకాలు ఎక్కువ అవుతాయి. అనాధ శరణాయం నుండి కూడా దోపిడి చేస్తూ ఉంటారు. ఇంకా రామదాసు కూతురు, చైర్మెన్ గారి అబ్బాయిని వల్లో వేసుకుందని, చైర్మెన్ గారికి మాటలు ఎక్కిస్తారు. తరువాత రామదాసు భార్యని, అతని గుడ్డి కూతురుని అవమానించడంతో వారు ఊరు వదిలి వెళ్లిపోతారు.

రామదాసు జైలు నుండి వచ్చాక వారి ఆరాచకాలకు ఏవిధంగా అడ్డు వచ్చాడు. వారిని భగవంతుడు ఏవిధంగా శిక్షించింది? తెరపై చూడాలి. ఇంకా రామదాసు కూతురు చైర్మెన్ గారి అబ్బాయి ఒక్కటవటంతో కధ సుఖాంతం అవుతుంది. తిక్క శంకరయ్య సన్యాసం స్వీకరించడంతో సినిమాకు ముంగింపు పలకుతారు కె.వి. రెడ్డిగారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి

సైరా నరసింహారెడ్డి చిత్రం అంచనాలు ఆకాశంలోకి….

సైరా నరసింహారెడ్డి తెలుగు చలనచిత్రం

మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక పాత్రలో నటించిన చిత్రం, సైరా నరసింహారెడ్డి తెలుగు చలన చిత్రం. ఈ భారీ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రం టీజరుకు కూడా ఒక్కొక్క భాషకు, ఆయా భాషలలో టాప్ హీరోస్ వాయిస్ అందించడం దేశవ్యాప్తంగా మరింత ఆసక్తి పెరిగింది. భారీ నిర్మాణం, భారీ తారగణం, చారిత్రాత్మక కధ ఇలా చాలా విషయములతో సైరా నరసింహారెడ్డి చిత్రంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

బ్రిటీష్ వారిపై తొలి తిరుగుబాటు చేసిన భారతీయుడు అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్ర నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా రామ్ చరణ్ చేపట్టారు. భారీ అంచనాలు సృష్టించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఆక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే టీజరుతో ఆకట్టుకున్న సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్ ఈరోజున విడుదల అయ్యింది. తెలుగు టీజరుకు పవన్ అందించిన వాయిస్ అందరిలోనూ ఇంకా ఆసక్తిని పెంచింది.

ఈ క్రింది వచనం పాతది.

Megastar Chiranjeevi Syeraa Narasimhareddy Teaser Release సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తెలుగు చలన చిత్రం. అంగ్లేయులపై తిరగబడ్డ తెలుగు బిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకి పెరిగేల ప్రాచుర్యం పొందుతుంది. ఆగష్టు 22 అనగా చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు విడుదల అయిన సైరా నరసింహారెడ్డి తెలుగు మూవీ టీజర్. ఇప్పటికే విడుదల అయిన సైరా నరసింహారెడ్డి పోస్టర్స్ అందరిని బాగా ఆకట్టుకున్నాయి, సోషల్ మీడియాలో సదరు చిత్రాలు ఎక్కువగా షేర్ అవుతుంటే, ఇప్పుడు ఈ చిత్రం టీజర్ మరింత ఉత్సుకతను పెంచాయి.

ఎప్పటికప్పుడు గంటలలో విడుదల అంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో హాల్ చల్ చేసి అభిమానుల్లో ఆత్రుత పెంచి విడుదల సైరా నరసింహారెడ్డి టీజర్ అంచనాల ప్రకారం వీడియో వీక్షణ రికార్డులు సృష్టిస్తుంది. ప్రసిద్ద భారతీయ చలనచిత్ర నటులు అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, అల్లు అర్జున్, కన్నడ నటుడు సుదీప్, నయనతార తదితరులు నటిస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి సృష్టిస్తుంది. సినిమా టీజర్ ఇంకా చిత్రంపై అంచనాలు భారీగా పెంచుతుంది. ‘Megastar Chiranjeevi Syeraa Narasimhareddy Teaser Release’

మీడియాలో వచ్చే విషయాల్లో విశేషం ఎక్కువ చలన చిత్రాల గురించే ఉంటే, ఇక మెగాస్టార్ చిత్రమంటే మరింత ఆసక్తి కలుగుతుంది. అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్న సైరా నరసింహారెడ్డి టీజర్ అందరిని ఆకట్టుకుంటుంది. చిరంజీవి 151వ చిత్రంగా వస్తున్న ఈచిత్రం టీజర్ ఆయన అభిమానులే కాకుండా అందరిని ఆకర్షించే విధంగా ఉండి, యూట్యూబ్లో లక్షల వీక్షణాలతో సంచలనం సృష్టిస్తుంది.
బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. “Megastar Chiranjeevi Syeraa Narasimhareddy Teaser Release” ఉదయం 11.౩౦ నిమిషాలకి రామ్ చరణ్ నాయనమ్మగారి చేతుల మీదుగా విడుదల అయ్యి యూట్యూబ్లో అధిక వీక్షణలకు సాగుతుంది.

ధన్యవాదాలు

బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు

బలరామకృష్ణులు చిత్రం – పల్లెటూరి అన్నదమ్ముల బంధం

బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు చక్కగా చూపుతుంది. బలరామకృష్ణులు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

బలరామకృష్ణులు అలంపురం ఊరిలో ఇద్దరి అన్నదమ్ముల మద్య జరిగే కధలో ఒక యువజంట ప్రేమాయణం ఈ చిత్ర కధ. బలరామయ్య(శోభన్ బాబు) – కృష్ణమూర్తి(కృష్ణమూర్తి) అన్నదమ్ములు అయితే తండ్రి ఒక్కరే తల్లులు వేరు. కృష్ణమూర్తికి ఒక చెల్లెలు (కల్పన). మొదట్లో ఇద్దరు అన్నదమ్ములు చెల్లెలతో సంతోషంగా ఉన్నట్టు, గిట్టనివారు చెప్పుడు మాటలతో బలరామయ్య, తన తమ్ముడుని, చెల్లెల్ని దూరంగా పెట్టినట్టు చిత్ర ప్రారంభంలోనే రమ్యకృష్ణ ద్వారా తెలియజేస్తారు. బలరామయ్యకు పెళ్లీడుకొచ్చిన పూజ అను కూతురు ఉంటుంది.

వీర శివాజీ(జగపతిబాబు) పనికోసం అంటూ తన మేనమామ అయిన కృష్ణమూర్తి దగ్గరికి చేరతాడు. ఇద్దరి అన్నదమ్ముల మద్య చిచ్చు పెట్టే వ్యక్తిగా చెడిపోయిన కొడుకుకు తండ్రిగా చింతామణి (గొల్లపూడి మారుతీరావు) నటిస్తే, చింతామణి కొడుకుగా అంతర్వేది (తనికెళ్ల భరణి) నటించారు. అలంపురంలో సారాకొట్టు పెట్టి తీరాలని బావించే వ్యక్తిగా ఉగాది (రామిరెడ్డి) నటించారు. బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు గురించి చదండి.

ఊరిపెద్దగా ఉండే బలగం బలరామయ్య అంటే ఆఊరి వారికి శాసనం అలాగే తమ్ముడు కృష్ణమూర్తికి కూడా బలరామయ్య అంటే ఎనలేని ప్రేమ. అన్న ద్వేషిస్తున్న, అన్న కుటుంబ క్షేమం కోసం ఆలోచించే వ్యక్తి కృష్ణమూర్తి నడుచుకుంటాడు. అయితే బలరామయ్య తన కూతురు పూజ-శివాజీల ప్రేమగురించి తెలిసి కోపంతో, తన కూతురు పూజని నీచుడు అయిన చింతామణి కొడుకు అంతర్వేదితో చేయాలని నిశ్చయం చేస్తాడు.

పూజ-శివాజీ ప్రేమ గురించి పూర్తిగా అవగాహన ఉన్న కృష్ణమూర్తి, వారి వివాహం చేయదలుస్తాడు. చివరికి శివాజీ-పూజల ప్రేమ ఎలా ఫలించింది? అన్నదమ్ములను చివరికి ఎలా ఒక్కటి అయ్యిందీ? చిత్రం చూసే కొలది ఆసక్తిగా ఉంటుంది. రాజశేఖర్ – రమ్యకృష్ణల కెమిష్ట్రి ఈచిత్రానికి బాగా ప్లస్ పాయింట్. శోభన్ బాబు-శ్రీవిద్య, జగపతిబాబు, గొల్లపూడి, తనికెళ్లభరణి నటన చిత్రకధను పట్టుతో నడిపిస్తాయి. బలరామకృష్ణులు తెలుగుచిత్రం – పల్లెటూరి బంధాలు పండించిన తెలుగు పాత సినిమా

తెలుగురీడ్స్

విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

విక్టరీ వెంకటేష్ దృశ్యం తెలుగు చలనచిత్రం

యూట్యూబ్ వచ్చాక మనకు నచ్చినా లేక మనం మెచ్చి ఎంపిక చేసుకున్న సినిమాలో స్మార్ట్ ఫోనులో కానీ లాప్ టాపులో కానీ చూడడానికి అవకాశం వచ్చింది. ఎక్కువగా కొత్తసినిమాలలో సమాజంలో ఉండే ట్రెండు, యూత్ ఆకర్షితులయ్యే విషయాల గురించే ఎక్కువగా ఉండడం లేదా ఏదైనా అసాధారణ సంఘటనల ఆధారంగా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి ట్రెండును బట్టి వచ్చేసినిమాలో అందరికీ నచ్చకపోవచ్చును. ఎందుకంటే, సమాజం విభిన్న సంస్కృతులు, భిన్న మతాలు అలాగే భిన్నమైన తరాలు కలిపి ఉంటుంది. విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

యూత్ ఇప్పటి తరం అయితే, మద్యవయస్సువారు నిన్నటితరం అయితే, ముదుసలివారు మొన్నటి తరం అయితే, సమాజం మూడుతరాలతో కలిసి ఉంటుంది. మూడు తరాలను మెప్పించే చిత్రాలు ఇప్పుడు వస్తున్న అన్ని చిత్రాలకు అసాద్యమే అవుతుంది. చిత్రవిచిత్రమైన విషయాలతో సాగే చలనచిత్రాలు సమాజంలో సగటు వ్యక్తి చిత్తముపై ప్రభావం చూపుతాయి. అలనాటి పాతచిత్రాలకు అభిమానులు కూడా మనకు ఎక్కువగానే ఉంటారు, అటువంటివారు యూట్యూబ్ ద్వారా పాతచిత్రాలను వీక్షించడానికి అవకాశం ఉంది.

స్మార్ట్ ఫోను కూడా పెద్దతెరను కలిగి ఉండడం వలన స్మార్ట్ ఫోనులోనే యూట్యూబ్ సినిమాలను వీక్షించడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పటి సాంకేతిక ట్రెండుననుసరించి స్మార్ట్ టివీల వాడకం కూడా పెరుగుతుంది. పాతటీవిల స్థానంలో స్మార్ట్ టివీల వినియోగం పెరగుతుంది. కారణం స్మార్ట్ టివీలలో కూడా బడ్జెట్ టివీలు రావడం కావచ్చు. ఏదైనా యూట్యూబ్ ద్వారా పాతచిత్రాలను ఎంపికచేసుకుని చూడడానికి అవకాశం ఉంది. విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

సంక్రాంతి సినిమా చూడండి యూట్యూబ్ ద్వారా కోటిమంది ఈ చిత్రాన్ని చూశారు, అంటే ఫ్యామిలి విలువలను తెలియజేసే ఈ చిత్రాన్ని కోటిమంది చూడడం అంటే, కుటుంబవిలువలను గూర్చి తెలియజెప్పే చిత్రాలను ఆదరించడంలో ధియేటరకు వెళ్లి చూసే ప్రేక్షకులే కాకుండా, సోషల్ మీడియా ప్రేక్షకులు కూడా పెద్దపీట వేస్తున్నారు. సహజంగా సంక్రాంతి పండుగ కుటంబం అంతా కొత్త బట్టలు ధరించి, కొత్త వంటకాలు చేసుకుని, బంధువులను ఇంటికి ఆహ్వానించి, సంతోషంగా కుటుంబం అంతా గడిపే పండుగుగా ఉంటే, ఈ సంక్రాంతి సినిమా మాత్రం ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజు సంక్రాంతే అంటుంది.

చిన్న కుటుంబంలోకి చుట్టాలు వస్తే, ఆకుటుంబంలో ఆరోజు పండుగ వాతావరణం కనబడుతుంది. మరి ఉమ్మడి కుటుంబం అయితే, రోజు ఎక్కువమంది కలసి ఉండేవారు ఉండడం, రోజూ ఎవరో ఒకరి తరపు బంధువులు చుట్టపుచూపుకు ఇంటికి రావడం ఉంటే, ఆకుటుంబంలో రోజు పండుగా వాతావరణమే. వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, స్నేహ, ఆర్తిఅగర్వాల్, సంగీత, శారద, చంద్రమోహన్ తదితరులు నటించిన సంక్రాంతి సినిమా, ఉమ్మడి కుటుంబంలో ఒకరిపైఒకరికి అవగాహన ఉంటే ప్రతిరోజూ సంక్రాంతే అంటుంది. సంక్రాంతి సినిమా యూట్యూబ్ ద్వారా చూడడానికి ఈ క్రింది వీడియోపై టచ్ చేయండి.

అమ్మను మించిన దైవమున్నదా అన్నట్టుగా అమ్మపై అంతులేని అభిమానాన్ని పెంచేసుకున్న పెంపుడు కొడుకుపై కపటప్రేమను చూపుతూ ఉండే తల్లి, ఆ ఇద్దరికి ఒకరికి భార్యగా, మరొకరికి కోడలుగా తెలివైన అమ్మాయితో సినిమా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం సెంటిమెంటు సన్నివేశాలతో బాటు, హాస్యసన్నివేశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కధలో పట్టులేకపోతే ఆదరించని సమయంలో, మంచి కుటుంబకధాచిత్రంగా అందరిని ఆకట్టుకున్న తెలుగుచలనచిత్రం. సంక్రాంతి అంటే పైన ఉన్న పెద్దరికం నుండి ఆశీస్సులను పొందే పండుగ అయితే, ఈచిత్రంలో విషం ఇచ్చిన అమ్మలో కూడా అమ్మ ఆశీర్వాదాన్నే చూసిన ఉత్తమ భారతీయ కొడుకుగా అబ్బాయిగారు చిత్రం ఉంటుంది.

విక్టరీ వెంకటేష్ విభిన్న పాత్రలు

ధర్మచక్రం తెలుగు చలనచిత్రం తండ్రి దుర్మార్గానికి బలైన ఒక వ్యక్తికధ, కొన్ని చిత్రాల విశ్లేషణ కన్నా చూసి, తెలుసుకోవడమే బాగుంటుంది. అటువంటి చిత్రంగా ధర్మచక్రం తెలుగుచలనచిత్రం కూడా. తల్లితర్వాత కొడుకుకు తండ్రి మార్గదర్శకుడు అవుతాడు, అయితే ఈ ధర్మచక్రం సినిమాలో తండ్రి దుర్మార్గుడు, తల్లిదేవత, కొడుకు ఉత్తమ లక్షణాలను కలిగి ఉన్నవాడు. అటువంటి తల్లిదండ్రులకు, వారి యొక్క కొడుకు మద్య జరిగే సంఘర్షణ ఈచిత్రంలో కనబడుతుంది.

శోభన్ బాబు సోగ్గాడు

శోభన్ బాబు, జయసుధ, జయచిత్రల కాంభినేషన్ ఓల్డ్ సూపర్ హిట్ మూవీ

సోగ్గాడ్ సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

శోభన్ బాబు, జయచిత్ర, జయసుధ జంటగా నటించిన తెలుగుచలనచిత్రం సోగ్గాడు చిత్రానికి బాపయ్య దర్శకుడు. Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu old movie. పొలం పని చేస్తూ పల్లెటూరిలో నివసించే శోభనాద్రి ఆ ఊరిలో సోగ్గాడుగా ప్రసిద్ది. అతని మామ పరమేశం (అల్లు రామలింగయ్య) కూతురు సరోజ(Jayasudha), శోభనాద్రి ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే సరోజ పెద్ద చదువు పట్నంలో పూర్తి చేసుకుని, తిరిగి ఊరికి వచ్చాక, శోభనాద్రి (Shobhan babu)ఊరి పెద్దలతో అతని మామ పరమేశం ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తారు. సరోజ తండ్రి పరమేశం పట్నంలో చదువుకున్న నా కూతురుని పొలం పనులు చేసుకునే నీకు ఇచ్చి పెళ్లి చేయనని చెబుతాడు.

పరమేశం శోభనాద్రి – సరోజ(Jayasudha)ల పెళ్లి ప్రస్తావన కాదనడమే కాకుండా, నలుగురి ముందు నీలా మట్టి పిసుక్కోనేవాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదని హేళనగా మాట్లాడతాడు. సోగ్గాడికి కోపం వచ్చి నీ కూతురు కంటే అందమైన చదువుకున్న అమ్మాయినే వివాహం చేసుకుంటానని చాలెంజ్ చేస్తాడు. తోటివారి ప్రోద్బలంతో ఒక్కడే పట్నం బయలుదేరతాడు, సోగ్గాడు శోభనాద్రి (Shobhanbabu). ‘Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu’

మరోప్రక్క జమిందారీ కుటుంబంలో పుట్టి పెరిగిన లత(JayaChitra)కి, తన మేనమామ భూపతి అంటే ఆమెకి మహాభయం. ఆ జమీను అంతటికి లత వారసురాలు కావడం వలన, లతని భూపతి (Satyanarayana)పెళ్లి చేసుకుని, ఆమె ఆస్తిని చేజిక్కించుకోవాలని అనుకుంటాడు. లతను చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదని, కావునా లతని నేనే పెళ్లి చేసుకుంటానని, భూపతి లత(JayaChitra) తల్లితో చెప్పి, పెళ్లి ముహూర్తం పెట్టిస్తాడు. సరిగ్గా పెళ్లి సమయానికి, పెళ్లికూతురుగా అలంకరించబడిన లత పట్నం పారిపోతుంది, ప్రసాదు సహాయంతో.

తన మామ కూతురు సరోజ కన్నా అందమైనా, చదువుకున్నా అమ్మాయి కోసం పట్నం బయలుదేరిన శోభనాద్రి, మేనమామతో పెళ్లి ఇష్టం లేని లత హైదరాబాదుకి ఒకే రైలులో ప్రయాణం చేస్తారు. హైదరాబాదు చేరుకున్న శోభనాద్రి, సన్యాసిరావు ద్వారా ఒక లాడ్జిలో దిగుతాడు. ప్రసాదు(Giribabu) తో రైలులో హైదరాబాదుకు బయలుదేరిన నగలు ధరించి ఉన్న లత(JayaChitra), రైలు హైదరాబాదు చేరుకునే సమయానికి ఒంటరిగా మిగులుతుంది.

Lata (JayaChitra) Shobhanadri (Shobhan Babu) Marriage in Lodge – Soggadu Movie.

శోభనాద్రిని హోటలుకి చేర్చిన సన్యాసిరావు మరలా లతని కూడా అదే హోటలుకు చేరుస్తాడు. శోభనాద్రి, లతలు ఒకే గదిలో చేరతారు, సన్యాసిరావు వలన. రైలులో లత నగలుతో ఊడాయించిన ప్రసాదు అదే హోటల్లో వేరే అమ్మాయితో లతకి కనబడతాడు. ఆ విషయం లత, శోభనాద్రికి చెప్పగానే, సోగ్గాడు శోభనాద్రి(Shobhan Babu) ప్రసాదుకి బుద్ది చెప్పి లత నగలను ప్రసాదు దగ్గర నుండి తిరిగి లతకి ఇప్పెస్తాడు. Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu

లత-శోభనాద్రిలు ఒకరంటే ఒకరు ఇష్టపడి, ఊరికి వెళ్లగానే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో, పెళ్లి సామానులు హోటల్ రూముకి తెచ్చుకుంటారు. అయితే ఆ హోటలుకి పోలీసులు రావడం వలన, అదే హోటల్లో లత మెడలో తాళి కట్టేస్తాడు, సోగ్గాడు శోభనాద్రి. ఇద్దరూ కలసి లత ఇంటికి వెళతారు. అక్కడ లత తల్లి వారిని ఆదరించినా, మోసగాడు అయిన లత(Jayachitra) మేనమామ, శోభనాద్రిని పోలిసులకు పట్టిస్తాడు.

దుర్మార్గుడు అయిన భూపతి, లత జీవితంలోనే కాకుండా, గతంలో శోభనాద్రి తల్లి జీవితంలో కూడా దుర్మార్గంగా నడుస్తాడు. జైలునుండి ఇంటికి తల్లి దగ్గరికి వచ్చిన శోభనాద్రి, తన తల్లి గతం తెలుసుకుని, కోపంతో రగిలిపోతాడు. దానికి తోడు భూపతి మోసం వలన లత-శోభనాద్రిల పెళ్లి చెల్లదని కోర్టు తీర్పు ఇస్తుంది. ఎలాగైనా లత(JayaChitra) ఆస్తిని కాజేయాలని భూపతి దుర్మార్గపు పధకాలు వేస్తూ ఉంటాడు.

గతంలో సోగ్గాడి శోభనాద్రి తండ్రిని చంపి, శోభనాద్రి తల్లి అయిదోతనాన్ని దూరం చేసిన భూపతి, ఇప్పుడు శోభనాద్రి భార్య లత జీవితానికి కూడా ప్రమాదంగా మారిన భూపతి ప్రోద్బలం పలన పరమేశం పధకం, అతని కూతురు సరోజ ప్రాణాలు తీస్తుంది. చెడుకు దగ్గరగా చేరితే, చెడు చేసే దారుణం ఎంత ప్రమాదకరమో పరమేశం జీవితం ఈచిత్రంలో కనబడుతుంది.

ఆస్తి కోసం మనిషి ప్రాణాలు తీసే భూపతిని శోభనాద్రి అంతం చేయడంతో ఈ చిత్రం ముగుస్తుంది. భూపతి, శోభనాద్రి తండ్రి ప్రాణాలు ఎలా తీసాడో, అదే విధంగా శిక్షింపబడి, చివరికి శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళతాడు. రైతు పండించిన అన్నం తింటూ రైతులను పీడింపచేసే భూపతికి దగ్గరగా, ఊరి పెద్దగా ఉన్న పరమేశం జీవితంలో కూతురుని కోల్పోయాక సోగ్గాడిలాంటి రైతు విలువ ఏమిటో తెలుసుకుని, భూపతి గురించి పోలిసులకు తెలియజేస్తాడు. రైతులను, మంచివారిని పీడించిన భూపతి జైలుకు వెళితే, భూమిని నమ్ముకున్న సోగ్గాడు బంధువర్గంతో సంతోషంగా ఉండటం చిత్ర కధ ముగుస్తుంది.

లతగా నటించిన జయచిత్రకు తెలుగులో తొలి చిత్రం. శోభన్ బాబుకు, జయసుధకు, జయచిత్రకు మంచి విజమవంతమైన తెలుగుచలనచిత్రం. “Shobhanbabu Jayachitra Jayasudha Soggadu Telugu”

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

అప్పుచేసిపప్పుకూడు తెలుగు పాత చలనచిత్రం

అప్పుచేసిపప్పుకూడు తెలుగు పాత చలనచిత్రం

అప్పు చేసి పప్పు కూడు సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie విజయ ప్రొడక్షన్స్ పతాకం పై ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో NT రామరావు, SV రంగారావు, సావిత్రి, కొంగర జగ్గయ్య, జమున, చిలకలపూడి సీతారామాంజనేయులు, రేలంగి వెంకటరామయ్య, గిరిజ, అల్లు రామలింగయ్య, ముక్కామల, రమణారెడ్డి, సూర్యకాంతం, తదితరులు నటించారు.

అప్పుచేసి పప్పుకూడు పరపతిని ఉపయోగించుకుని అప్పులు చేసే వ్యక్తి, ఆ అప్పులు తీర్చడానికి ఎన్ని ఇబ్బందులు గురి అవుతారో ఎందరి జీవితాలతో అడుకుంటారో ఈ చిత్రం ద్వారా కనబడుతుంది. రావు బహద్దూర్ రామదాసు పరపతితో అప్పులు చేయడం, ఇంకా తన కోడలుని కాదని ఇంకో జమిందారి సంబంధం కోసం ప్రాకులాడడంతో మొదలయ్యే చిత్రం, దివాన్ బహద్దూర్ ముకుందరావు తన మనవరాలికి మహారాజాతోనే పెళ్లి చేయాలనీ భావించండంతో చిత్రకధ అనేక మలుపులు తిరుగుతుంది. ‘Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie’.

రావు బహుద్దూర్ రామదాసు జమిందారు అయితే నిండా అప్పుల్లో మునిగి ఉంటాడు. అతనికి ఒక రఘు అనే కొడుకు, పట్నంలో చదువు కుంటూ ఉంటాడు. రావు బహుద్దూర్ రామదాసు కింద గుమస్తాగా భజగోవిందం పని చేస్తూ ఉంటాడు. అయితే రావు బహుద్దూర్ రామదాసు తన కొడుకు రఘు రాజారావు చెల్లెలు లీలతో వివాహం జరిగి ఉంటుంది, అయితే విదేశాలకు చదువు నిమిత్తం రఘు, ఉద్యమంలో భాగంగా రాజారావు జైలు కి వెళ్ళినప్పుడు, డబ్బుపై పేరాశతో రావు బహుద్దూర్ రామదాసు లీల ఇంటినుండి గెంటివేస్తాడు. తరువాత లీల చనిపోయిందని విదేశాల్లో ఉన్న రఘుకి చెబుతాడు. అంతేకాకుండా సాటి జమిందారు అయిన దివాన్ బహుద్దూర్ ముకుందరావు మనవరాలు మంజరికి ఇచ్చి పెళ్లి చేస్తే వచ్చే సొమ్ముతో బాకీలు తీర్చివేయవచ్చు అని భావిస్తాడు.

భజగోవిందం, రాజారావు కలసి వేసే వేషాలతో కధకు ముగింపు

అలాగే దివాన్ బహుద్దూర్ ముకుందరావు దగ్గర పనిచేసే గుమస్తాకి రావు బహుద్దూర్ రామదాసు లంచం ఇచ్చి సంబంధం ఖాయం చేసేవిధంగా చూడమాని చెబుతాడు. స్వతంత్ర సమరంలో జైలుకి వెళ్లి జైలు నుండి విడుదల అయిన రాజారావు వచ్చేటప్పటికి భజగోవిందం, మంజరి జరిగిన విషయాలు రాజారావుకి చెబుతారు. ఇంటినుండి గెంటివేయబడిన లీలని మరల రామదాసు ఇంటిలో తీసుకువస్తాడు, రాజారావు. సుగుణవతి అయిన లీలని ఇంట్లో పని మనిషిగా అయితే ఉండు, నా ఇంటికోడలుగా కాదు అని ఒప్పిస్తాడు. రావు బహద్దూర్ రామదాసు. రావు రామదాసు గారికి గుణపాఠం చెప్పడానికి, మంజరి, లీలల జీవితాలను కాపాడడం కోసం రాజారావు ఒక జమిందారు గా వేషం వేసుకుని దివాన్ బహద్దూర్ ముకుందరావు గారి ఇంటికి వస్తాడు. విదేశాల నుండి రఘు చదువులు పూర్తీచేసుకుని వస్తాడు. రఘు వచ్చాక అతని భార్య అయిన లీలని పనిమనిషిగా పరిచయం చేస్తాడు. Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie

కానీ ఆ పని మనిషే లీల అని రఘు తరువాత తెలుసుకుని, తను కూడా ఆ విషయం తెలియనట్టే రావు బహద్దూర్ రామదాసు దగ్గర నటిస్తూ ఉంటాడు. అయితే రాజారావు ఆడుతున్న రాజావారి నాటకం తెలుసుకున్న రావు బహద్దూర్ రామదాసు రాజారావు చెల్లెలుని తీసుకువచ్చి బెదిరించి, జమిందారు దగ్గర నుండి దివాన్ బహద్దూర్ దగ్గర నుండి పంపించేస్తాడు. అలాగే రావు రామదాసు దివాన్ బహద్దూర్ ముకుందరావు దగ్గరికి వచ్చి అతని మనవరాలు మంజరిని తన కొడుకు రఘుకి ఇచ్చి చేయమని, లేకపోతే దొంగ రాజాని ఇంట్లో పెట్టుకొని నాటకం సంగతి కోసం నలుగురి చెప్పి మనవరాలి మంజరి పెళ్లి జరగనివ్వనని బెదిరిస్తాడు. Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie

ఇక భజగోవిందం సూచనతో రాజరావు మరలా సన్యాసి వేషం వేసి, దివాన్ బహద్దూర్ ముకుందరావు దగ్గరికి చేరతాడు. రాజారావుతోబాటు భజగోవిందం కూడా సన్యాసి వేషంతో రావు బహద్దూర్ రామదాసు ఆటలకు చెక్ పెడతారు. చివరికి లీల-రఘు, ఉష-భజగోవిందం, మంజరి-రాజారావు జంటలుగా పెద్దలు అంగీకరించడంతో చిత్రం ముగుస్తుంది. “Appu Chesi Pappu Kudu Telugu 1959 Old Movie”. దురాశ దుఃఖానికి చేటు, అయితే అయినవారి చొరవతో పెడదారి సరిచేయబడితే బుద్ది తెచ్చుకున్న ఒక పెద్దమనిషిచేత ప్రభావితమైనవారు వేసే వేషాలు ఈ చిత్రంలో ఆకట్టుకుంటే, పాటలు కూడా బాగుంటాయి.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

కలసి ఉంటే కలదు సుఖం తెలుగు చలన చిత్రం

కలసి ఉంటే కలదు సుఖం తెలుగు చలన చిత్రం

కలిసి ఉంటే కలదు సుఖం సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

కలసి ఉంటే కలదు సుఖం నందమూరి తారకరామారావు సావిత్రి జంటగా నటించిన కుటుంబ కధా చిత్రం. తెలుగు చిత్రాలలో కుటుంబ విలువలను అందులోను ఉమ్మడి కుటుంబ విలువలను గూర్చి చక్కగా చెప్పే పాత చిత్రాల్లో కలసి ఉంటే కలదు సుఖం ఒక మంచి చిత్రంగా ఉంది. స్వర్గీయ ఎన్టిఆర్ సావిత్రల కలియకలో ఎస్వి రంగారావుగారు, సూర్యకాంతం, రేలంగి తదితరుల అద్బుత నటనతో చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram Ummadi kutumbamlo bandhalu gurinchi venditerapai veligina chitrarajamu. ముద్దబంతి పూలు పెట్టి, మొగలి రేకులు జడను అంటూ సాగే పాట సూపర్ హిట్ సాంగ్. శ్రీ సారది స్టూడియోస్, బ్యానర్ పై రామరావు, రేలంగి, ఎస్విఅర్ సావిత్రి, గిరిజ హేమలత, రమాదేవి తదితరులు నటించిన తెలుగు చలనచిత్రం కలసి ఉంటే కలదు సుఖం చిత్రానికి తాపి చాణుక్య దర్శకత్వం వహించారు. ‘NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

రైతు సోదరులు పట్టాభిరామయ్యా, సుందరయ్య ఇద్దరూ ఒకే కుటుంబంగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ఒకే ఇంట్లో పెళ్ళిళ్ళు అయ్యాక కూడా కలిసే ఉంటారు. పట్టాభిరామయ్య(SV Rangarao) భార్య పేరు సౌభాగ్యం (Suryakantam), సుందరయ్యా భార్యపేరు రమణమ్మ. అయితే పట్టాభిరామయ్య-సౌభాగ్యంలకు పిల్లలు పుట్టరు, కానీ తమ్ముడు సుందరయ్యా – రమణమ్మలకు ఇద్దరు మగసంతానం ఉంటుంది. అయితే పెద్ద కుమారుడు బాల్యంలో గాలిపటం కోసం కరెంటు స్థంభంపైకి ఎక్కి గాలిపటం పట్టుకోబోయి కరెంటు వైర్ పట్టుకోవడంతో ఆ బాలుడికి కరెంటు షాక్ వలన చేయి అవిటిగా మారుతుంది, ఆ బాలుడు పేరు కిష్టయ్య(NT Ramarao), మనసు బంగారంగా ఉంటుంది. కిష్టయ్యకి అతని కుటుంబ సభ్యులు అంటే మహా అభిమానం. అతనికి అమ్మ నాన్నలకు తోడు పెదనాన్న, పెద్దమ్మ ఒకే కుటుంబంలో ఉంటారు. అలాగే అతనికి ఒక తమ్ముడు మధు(Haranath) పట్నంలో చదుకుకుంటూ ఉంటాడు.

అనాదిగా వస్తున్న కుటుంబ సంప్రదాయంలో రంగూన్ నుండి వచ్చి చిచ్చు పెట్టిన రాజా

రమణమ్మ, సుందరయ్య, పట్టాభిరామయ్య (SV Rangaro), కిష్టయ్య(NT Ramarao) సౌమ్యంగా ఉంటే, సౌభాగ్యం మాత్రం కటువు మాటలతో గయ్యాళిగా ఉంటూ ఉంటుంది. సంక్రాంతి పండుగకు పట్టాభిరామయ్య అందరికి కొత్తబట్టలు కొని కుటుంబ సభ్యుల అందరికి ఇస్తాడు. తరువాత సంతకి వెళ్ళిన రమణమ్మకి సంతలో ఒక అనాధ అమ్మాయి కనబడుతుంది, పేరు రాధా (Savitri), ఆమెను తోడ్కొని ఇంటికి తీసుకువస్తుంది రమణమ్మ, పట్టాభిరామయ్యకి చెప్పి ఆమెను ఇంట్లోనే పెట్టుకుంటారు. సౌభాగ్యం అన్నగారి సంతానం అయిన  కొడుకు రంగూన్ రాజ (Relangi Narasimharao), కూతురు జానకి (Girija) ఇద్దరు అన్నాచెల్లెళ్ళు పట్టాభిరామయ్య ఇంటికి వస్తారు. అప్పటిదాకా ఒక సౌభాగ్యం తప్ప మిగతా అందరి సభ్యులతో ప్రశాంతతో కూడిన కుటుంబంలో ముసలం వచ్చినట్టుగా ఉంటుంది. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram.

పట్టాభిరామయ్య తన తమ్ముడి కొడుకు అయిన మధు(Haranath)కు పెళ్లి సంభందం తమ్ముడి సమక్షంలోనే ఖాయం చేస్తాడు. మధు(Haranath) పట్నం నుండి ఇంటికి రాగానే, పెళ్లి చేసేయాలని భావిస్తారు పట్టాభిరామయ్య, సుందరయ్యాలు. అయితే రంగూన్ రాజా(Relangi) వచ్చి రాగానే అత్తయ్య సౌభాగ్యంకు వేరు సంసారాల గురించి, పాశ్చాత్య దేశాల సంస్కృతి గురించి గొప్పగా చెబుతూ, సౌభాగ్యం(Suryakantam) మనసుపై ప్రభావం కల్పిస్తాడు. అయితే అతని ప్రవర్తనతో పట్టాభిరామయ్య, కిష్టయ్య, రాధలకు ఇబ్బందిగా ఉంటుంది. రమణమ్మ సుందరయ్యాల చిన్నకొడుకు మధు(Haranath) పట్నం నుండి ఇంటికి వస్తాడు. రంగూన్ రాజ చెల్లెలు జానకి (గిరిజ)ని చూసి మధు ఇష్టపడతాడు, ఇక ఇద్దరికి ఇష్టం కుదిరి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అలాగే జరగాలని కోరుకునే సౌభాగ్యం (Suryakantam), రంగూన్ రాజా(Relangi) లు వారి చేతుల మీదుగానే పట్టభిమరామయ్య– సుందరయ్యాలను విడదీస్తారు. అస్తిపంపకాలు జరిపించి, ఇంటి మద్యలో గోడ కట్టిస్తారు.

జానకి-మధు, రాధా-కిష్టయ్యల వివాహాలు కష్టాలతో

తరతరాలుగా కలసి ఏకకుటుంబంగా వస్తున్న అన్నదమ్ముల సంప్రదాయం, కుటుంబ ఆచారాలు పాటించే కుటుంబం ఇప్పుడు రంగూన్ రాజా మాటలకూ తలవంచిన సౌభాగ్యం వలన విడిపోతే, జానకి(Girija) మీద ఇష్టంతో సుందరయ్య చిన్నకొడుకు మధు(Haranath) రంగూన్ రాజా మాటలు వింటాడు. ఆ మాటలు వలన కిష్టయ్య-మధుల వాటాలు కూడా పంచేసి, మధు(హరనాథ్)ని తమ దగ్గరే అట్టేపెట్టుకుంటారు, సౌభాగ్యం-రంగూన్ రాజాలు, పట్టాభిరామయ్య అచేతనంగా అసహనంగా భావన చెందుతాడు.. అన్నగారు అంటే అభిమానించే సుందరయ్య మంచాన పడతాడు.  ఆ సమయంలోనే పట్టాభిరామయ్య – సుందరయ్యలు కలసి  కుదిర్చిన పెళ్లిని కాదని, జానకి-మధులకు పెళ్లి చేసేస్తారు. నాన్నకు బాగోలేదని సుందరయ్య చావుబతుకుల మధ్య ఉన్నాడని కిష్టయ్య (NT Ramarao) బ్రతిమాలినా మధు అందుకు ఒప్పోకోడు. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram.

దుఃఖంతో నిండిన కుటుంబంలో కిష్టయ్య పెళ్లి ఒక సమస్యగా ఉంటుంది. అన్నకు పెళ్లికాకుండానే తమ్ముడు మధు పెళ్లిచేసుకోవడంతో రమణమ్మ – సుందరయ్యాలు ఆలోచనలో పడతారు. అయితే ఇంట్లోనే ఉంటున్న రాధతో కిష్టయ్య పెళ్లిచేస్తే బాగుంటుంది అనే రమణమ్మ ఆలోచనను కిష్టయ్య తోసిపుచ్చుతాడు. నీకే ఆడకూతురు ఉంటే, నాలాంటి కుంటివాడికి ఇచ్చిచేయడానికి ఒప్పుకుంటావా, నీ కూతురు అయితే ఒకలాగా వేరేవారి కూతురు అయితే ఒకలాగా ఆలోచన చేయవద్దని కిష్టయ్య చెబుతాడు. అయితే కిష్టయ్య మంచి మనసుని ఇంట్లోకి వచ్చినప్పటి నుండి గమనించిన రాధా కిష్టయ్యతో పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఇక రాధా-కిష్టయ్యల పెళ్ళితో ఆ కుటుంబం కొంచెం కుదుటపడుతుంది.

రంగూన్ రాజా ప్రభావం పట్టాభిరామయ్య పచ్చని సంసారం పట్నం పాలు

సౌభాగ్యం, జానకి, మధులు పూర్తిగా రంగూన్ రాజా మాటల మాయలో ఉంటారు. మధుకు ఉద్యోగం రావడంతో, ఉద్యోగం నిమిత్తం మధు పట్నం బయలుదేరుతుంటే, రంగూన్ రాజా కూడా పట్నం బయలుదేరతారు. అయితే వెళ్ళేటప్పుడు సౌభాగ్యం దగ్గర పట్నంలో వ్యాపారం చేసి డబ్బు సంపాదించి తెసుకువస్తానని చెప్పి, పెద్దమొత్తంలో సొమ్ములు అడుగుతాడు. ఆ సొమ్ములు సౌభాగ్యం పట్టాభిరామయ్య గారిచే తనఖా సంతకం చేయించి అప్పు తీసుకుని రంగూన్ రాజాకి ఇచ్చి పంపుతుంది. NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram.

జానకి-మధులకి ఒక బాబు పుడతాడు అలాగే తరువాత రాధాకిష్టయ్యలకు ఒక బాబు పుడతాడు. జానకి మధులు వారి బిడ్డకు తండ్రి పేరు పెట్టుకుని, ఆ నామకరణ ఉత్సవం పూర్తవ్వగానే ముగ్గురు పట్నం వెళ్తారు. కిష్టయ్య అవిటితనం నయం చేసే ప్రత్యేక వైద్యులు పట్నంలో ఉన్నారు అంటే రాధా కిష్టయ్యలు ఇద్దరు పట్నం వెళ్తారు. పెద్దమొత్తంలో సొమ్ములు తీసుకువెళ్ళిన రంగూన్ రాజా దగ్గరి నుండి ఉత్తరాలు వస్తూ ఉంటాయి కానీ సొమ్ములు రావు. అప్పుల వారి సతాయింపు కారణంగా సౌభాగ్యం తన అన్నకొడకు రంగూన్ రాజ కోసం పట్నం వెళ్తుంది. కొత్త కాపురం పెట్టిన జానకి మధులు, డబ్బు సంపాదనలో మోసపోయిన రంగూన్ రాజా అతని కోసం వచ్చిన సౌభాగ్యం, వైద్యం కోసం పట్నం వచ్చిన రాధా కిష్టయ్యలు పట్నంలో కష్టంలో కలుసుకుంటారు. కష్టం దాటాక కుటుంబ విలువలు తెల్సుకుని కుటుంబాన్ని అభిమానించి కిష్టయ్య, మానవత్వంలో అతని గొప్పతనం గ్రహించి అందరూ ఒక్కటి అవుతారు. చివరికి కిష్టయ్య కాలు చెయ్యి బాగుపడి, అందరిలో సంతోషం నిండుకుంటుంది. అక్కడితో చిత్ర కధ ముగుస్తుంది.

ఉమ్మడి కుటుంబం వలననే సంస్కృతి సంప్రదాయాలకు విలువలు పెరుగుతాయనే విషయం ప్రస్ఫుటం చేసే చిత్రం కలసి ఉంటే కలదు సుఖం.

కుటుంబంలో కర్మతో భాదపడేవారు ఉంటే వారికి సేవ చేసేవారికి మంచి జీవితం, వారిని హేళన చేసేవారికి కష్టాలు తప్పవు అని ఈచిత్రంలో కనబడితే, అవిటితనం ఉన్నా అది శరీరానికే గాని మనసుకు కాదని ఈ చిత్రంలో కిష్టయ్య పత్రంలో కనబడుతుంది. ఆత్మీయత అనుభందం కోరుకుంటే, స్వార్ధం బంధాలను తెంచుతుంది, మనసులని భాదిస్తుంది అని ఈ చిత్రం నిరూపిస్తుంది. ఈ చిత్రంలో ప్రధానంగా అంటే పట్టాభిరామయ్యగారి కుటుంబమే అన్నట్టుగా ఉంటుంది. పట్టాభిరామయ్యగా SV రంగారావు గారు నటన, కిష్టయ్యగా రామారావు నటన, రాధగా సావిత్రి, మధుగా హరనాథ్, రంగూన్ రాజాగా రేలంగి గయ్యాళిగా సూర్యకాంతం ఇలా ఎవరి పాత్రలో వారు కనిపిస్తూ చిత్రకధని కుటుంబ బంధాల మధ్య భావనలు చక్కగా చూపిస్తారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒక్కటిగా ఉండకబోతే, రకరకాల జాతుల, మతాల వారు ఎలా కలసి ఉండేది, భారతమాతను సంతోష పెట్టె కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది ? మంచి సందేశాత్మక చిత్రం ఉమ్మడి కుటుంబ గురించి గొప్పగా చెప్పిన చిత్రాల్లో కలసి ఉంటే కలదు సుఖం చిత్రం ఒకటి. “NTR Savitri Kalasi Unte Kaladu Sukham Telugu Chitram

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

పవన్ కళ్యాణ్ మూవీస్

పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాలు, పవన్ కళ్యాణ్ తెలుగు మూవీస్

తెలుగు తెరపై అగ్ర కధానాయకుడుకి తమ్ముడుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ వచ్చి గోకులంలో సీతతో జతకట్టి సుస్వాగతం అంటూ కొత్త సంవత్సరం ప్రారంభించి తొలిప్రేమతో ఆకట్టుకుని తమ్ముడుగా బద్రి ఖుషి చేసుకుని, జానీతో తననితానే కొత్తగా పరిచయం చేసుకుని గుడుంబా శంకర్ గా బాలు బంగారంతో అన్నవరంతో జల్సా చేసుకుని పులితో తీన్ మార్ చేసిన పవన్ పంజా గబ్బర్ సింగుతో తనకితానే సాటి అనిపించుకుని కెమెరామేన్ గంగతో రాంబాబుగా వచ్చి అత్తారింటికి దారేది గోపాలా గోపాల అన్న సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడుల అజ్నతవాసిగా వచ్చి ప్రస్తుతం తెరనుండి కాకుండా నేరుగా ప్రజల్లో వెలుగుతున్న పవర్ స్టార్.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి పవన్ ఫస్ట్ ఫిలిం.

మెగాస్టారు చిరంజీవి చినతమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తెలుగుచలనచిత్రంతో ఆంధ్ర-తెలంగాణా రాష్ట్ర ప్రజలకు తెరపై పరిచయం అయ్యారు. 1996 లో వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో చిరంజీవి సోదరుడు హీరో అయితే అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ హీరొయిన్ గా నటించారు. ఈ చిత్రానికి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. కాలేజీ ప్రేమకధ ఊరిలో పెద్దల పట్టుదల మద్య ప్రేమికులుగా కళ్యాణ్ – సుప్రియలు నటించారు. ఈచిత్రానికి పవన్ పేరు కళ్యాణ్ గానే పరిగణించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం పవన్ కళ్యాణ్ కి కళ్యాణ్ గా తొలి చిత్రం.

Power Start Pawan Kalyan Telugu Movies List

తమిళంలో హిట్టైన గోకులత్తిల్ సీత చిత్రం ఆధారంగా తెలుగులో పునర్మించిన చిత్రం గోకులంలో సీత, ఈ చిత్రానికి దర్శకుడు ముత్యాల సుబ్బయ్యగారు. పవన్ కళ్యాణ్ రెండవచిత్రంలో రాశి కధానాయకగా హరీష్ సహానటుడుగా నటించిన తెలుగు చలన చిత్రం. కేవలం సుఖాల వెంట తిరిగే వ్యక్తి, తన స్నేహితుడి కోసం పెళ్లిపీటల మీద నుండి అమ్మాయిని తీసుకువచ్చాక, స్నేహితుడు కాదంటే, ఆ అమ్మాయికి ఆశ్రయం కల్పించి, ఆ అమ్మాయి సహవాసంలో చెడుసావాసలకు దూరమయ్యే డబ్బున్నవ్యక్తిగా, ఆమెను ప్రేమించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నటించారు.

పవన్ కళ్యాణ్ మూడవ తెలుగుచలనచిత్రంగా సుస్వాగతం తెలుగుచలనచిత్రం కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతూ యువ ప్రేక్షకులకు ప్రేమసందేశాన్ని అందించారు. ఆకర్షణ అనో ప్రేమ అనో యువత సమయం వృదా చేసుకోరాదు, అలా చేసుకున్న యువకుడు జీవితం ఎలా ఉంటుందో ఈచిత్రం ద్వారా దర్శకుడు భీమినేని శ్రీనివాసరావుగారు చక్కగా చూపించారు. ప్రేమించే తండ్రి, ప్రాణమిచ్చే స్నేహితుల మద్యలో ఒక యువకుడు ఒక యువతి ప్రేమకోసం, ఆమె అంగీకారం కోసం నాలుగు సంవత్సరాలు వేచి ఉండే యువకుడు పాత్రలో పవన్ నటన చక్కగా ఉంటే, పాటలు మంచి ప్రజాదరణను పొందాయి. ఆలయాన హారతిలో ఆఖిరి చితిమంటలలో అంటూ చిత్రం ఆఖరున వచ్చే పాట కంటతడి పెట్టించే సన్నివేశాలతో ఉంటూ ఆకట్టుకుంటుంది.

తొలిప్రేమ ప్రేమకధా చిత్రాలలో ట్రెండ్ సెట్ చేసిన పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ తెలుగుచలనచిత్రం

Power Start Pawan Kalyan Telugu Movies List

సుస్వాగతం చిత్రంతో యువతకు మంచి మెసేజ్ అందిస్తే, తొలిప్రేమ చిత్రంతో లక్ష్యం ఎంత గొప్పదో నిజమైన ప్రేమ ఏమి చేస్తుందో తొలిప్రేమ చిత్రం ద్వారా మధ్యతరగతి కుటుంబ భావనలతో సాగే చిత్రం యువతను బాగా ఆకర్షిస్తే, ఆ చిత్రం నిదానంగా సాధించిన విజయం ఇప్పటికి ఆ చిత్ర దర్శకుడుకి అంతటి స్థాయిలో పేరు తెచ్చిన చిత్రం మరేది రాలేదు. కుటుంబంలో అఖిరి కొడుకుగా నాన్నతో చివాట్లు తింటూ పెదనాన్న అభిమానంతో సరదాగా స్నేహితులతో గడిపేస్తూ ఉండే అబ్బాయి మదిలో అలజడి సృష్టించిన ఒక దీపావళి తెల్లవారుజాము అతని జీవితాన్నే ఏవిధంగా మలుపు తిప్పిందో చిత్రం చూస్తేనే బాగుటుంది. కొన్ని చిత్రాలకు విశ్లేషణ కన్నా వీక్షణ ఉత్తమం అలాంటి చిత్రాల్లో తొలిప్రేమ తెలుగుచలనచిత్రం ఒకటి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి, అలీ తదితరులు నటించగా ఏకరుణాకరన్ దర్శకత్వం వహించారు.

తమ్ముడు టైటిల్ కి తగ్గ పాత్రలలో నటించడం పవన్ చిత్రాల్లో మొదటి చిత్రం నుండి కనబడుతుంది. అలాగే తమ్ముడు చిత్రంలో కూడా ఆదర్శంగా ఉండే అన్నకి తమ్ముడుగా, అఖిరికి అన్నఆశయాన్ని నెరవేర్చే తమ్ముడుగా, ఎప్పుడు తండ్రితో తిట్లు తినే చిన్నవాడిగా ఉంటూ, చివరికి తండ్రి శభాస్ అనిపించుకునే కొడుకు పాత్రలో పవన్ నటన యూత్ కి అద్బుతంగా అనిపించింది. ఇంకా ఈ చిత్రంలో ప్రక్కనే ప్రేమ ఉన్నా పట్టించుకోకుండా పోకడలను పట్టుకుని ఆకర్షణని ప్రేమ అనుకుని తిరిగే కుర్రవాడిగా కూడా పవన్ చాలా చక్కగా నటించారు. చిరంజీవికి తగ్గ తమ్ముడుగా తమ్ముడు తెలుగుచలనచిత్రంతో పవన్ అందరితో అనిపించుకున్నారు. తమ్ముడు చిత్రానికి ఏఅరుణప్రసాద్ దర్శకత్వం వహించగా ప్రీతిజింగానియా, అదితి గోవిత్రికర్ హీరొయిన్లుగా నటించారు.

పవన్ కళ్యాణ్ బద్రి – ఖుషి సూపర్ డూపర్ హిట్ తెలుగు చిత్రాలు

Power Start Pawan Kalyan Telugu Movies List

బద్రి టైటిల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లో పవన్ నటనే హైలైట్ ఈచిత్రానికి. నువ్వు నందా అయితే ఎవడిక్కావాలి నేను బద్రి బద్రీనాథ్ అంటూ పవన్ డైలాగు పవర్ ఫుల్ డైలాగ్. ప్రకాష్ రాజు నందగా పవన్ బద్రిగా పోటిపడి నటించిన ఈ చిత్రానికి ప్రసిద్ద దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకుడుగా పరిచయం అయ్యారు. ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తిగా, ప్రియురాలితో పందెం కట్టి ఇంకొక అమ్మాయితో ప్రేమ నాటకం మొదలుపెట్టి, ఆ అమ్మాయితో ప్రేమలో పడడంతో ఈ చిత్రం ముక్కోణపు ప్రేమ కధ చిత్రంగా మారుతుంది. రేణుదేశాయ్, అమీషాపటేల్, అలీ తదితరులు నటించిన ఈతెలుగుచలనచిత్రం చక్కటి ప్రజాదరణను పొందింది.

ఖుషి తెలుగుచలనచిత్రం చూస్తున్నంతసేపు ఖుషిగానే చిత్రకధనం సాగుతుంది. చక్కటి కాలేజీ ప్రేమ కధకు ఇగో ఉన్న అమ్మాయి పాత్రదారి అయితే ఆ ప్రేమికుడు పడే పాట్లు ఈచిత్రంలో చాల చక్కగా కనబడుతుంది. పవన్ కళ్యాణ్ భూమిక ప్రేమికులుగా ఈచిత్రం అందరిని అలరించి పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రం నిలిచింది. ఫైట్లలో చిరంజీవి చిత్రాలు ప్రసిద్ది అయితే ఖుషి చిత్రం తరువాత చిరంజీవి తన చిత్రానికి కూడా ఫైట్ కంపోజ్ పవన్ కళ్యాణ్ చేయించుకోవడం విశేషం. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్ జె సూర్య. పవన్ కళ్యాణ్ తారస్థాయిలో తీసుకువెళ్ళిన చిత్రం, ఖుషి తెలుగుచలనచిత్రం.

Power Start Pawan Kalyan Telugu Movies List

వరుస ఏడు హిట్ చిత్రాల హీరో పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో భారి అంచనాల మద్య వచ్చిన జానీ తెలుగు చలనచిత్రం హాలీవుడ్ చిత్రానికి దగ్గరగా సగటు తెలుగు ప్రేక్షకులకు దూరంగా నిలబడి, పవన్ కళ్యాణ్ మరియు పవన్ ఫాన్స్ కి నిరాశపరిచింది. రేణుదేశాయ్ పవన్ జంటగా వచ్చిన ఈతెలుగుచలనచిత్రం హాలీవుడ్ చిత్రం తరహాలో కధనం సాగుతూ సగటు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే విధంగా సన్నివేశాలు ఉంటూ భారిగా ఫెయిల్ అయిన చిత్రాల్లో చేరిపోయింది. ఖుషి వరకు ప్రతి చిత్రంతో అంచనాలు అందుకుంటూ అన్ని చిత్రాలతో అందరిని ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ జానీ చిత్రం విడుదల తర్వాత అంచనాలు తలక్రిందులు చేసింది.

ఇక అటుతరువాత వచ్చిన గుడుంబా శంకర్ తెలుగుచలనచిత్రానికి వీర శంకర్ దర్శకత్వం వహించగా మీరాజాస్మిన్ జతగా నటించింది. ఈచిత్రం ఒక చిల్లర దొంగతనాలు చేసే దొంగగా, ఆపదలో ఉన్న అమ్మాయితో ప్రేమలో పడి, ఆ అమ్మాయి ఆపదను తొలగించడానికి ఆ దొంగ పడేపాట్లు ఈ చిత్ర కధాంశం. అయితే గుడుంబాశంకర్ చిత్రం పవన్ కి తగ్గ స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కాని పాటలు ప్రాచుర్యం పొందాయి.

తొలిప్రేమ దర్శకహీరోల కాంబినేషన్ బాలు తెలుగుచలనచిత్రంతో పునరావృతం అయ్యింది. బాలు తొలిప్రేమచిత్రంలో పాత్రపేరు, అదే టైటిల్ ఆ చిత్రదర్శకుడుతో వచ్చిన బాలు చిత్రంలో శ్రియ, నేహ ఒబెరాయ్ జతగా నటించారు. పాటలు ప్రజాదరణ పొందాయి, చిత్రం విజయవంతం అయినా పవన్ పూర్వస్థాయిలో విజయం సాధించలేకపోయింది అప్పటికి, అయితే చిత్రం రెండవభాగం బాగా ఆకట్టుకుంటుంది. మొదటి భాగం హాస్యభరితంగా సాగిన రెండవ భాగం కధనం బాగుంటుంది. అమ్మాయి కోసం అన్ని చేసే పెట్టె ఒక యువకుడు అనే అర్ధం వచ్చే లా బాలు టైటిల్ ట్యాగ్ లైన్ ఉంటుంది.

Power Start Pawan Kalyan Telugu Movies List

పవన్ కళ్యాణ్ బాలు తరువాత బంగారంగా ప్రేక్షకుల వద్దకు వచ్చారు. ప్రేమంటే పడని పని అంటే పడిపడి చేసే ఒక యువకుడు, సాటి యువతి ప్రేమ కోసం యుద్దమే చేస్తాడు. తన అవసరం తీరిన తనదారిన తాను పోకుండా, ఉపకారం పొందిన ఇంటిపెద్దకి ఇష్టం లేకపోయిన ఆ ఇంటి కూతురు ప్రేమని రక్షించి బంగారంగానే నిలబడతాడు. పాటలు చక్కగా ఉంటాయి, పవన్ కళ్యాణ్, మీరా చోప్రా, రీమసేన్ ప్రధానంగా నటించారు. ఈచిత్రంలో కేవలం ఇంకొకరి ప్రేమకోసం పాటుపడే కధానాయకుడుగానే ఉంటాడు, ప్రేమకోసం కాకుండా పనికోసం పాటుపడే యువకుడుగా పవన్ నటన బాగుంటుంది. Pawan Kalyan’s Eleventh Movie is Bangaram. ఈ చిత్రానికి దర్శకుడు తమిళ చిత్రాల దర్శకుడు ధరణి దర్శకత్వం వహించారు.

అన్నగా అన్నవరం ప్రేమికుడుగా తీన్ మార్ చిత్రంలో పవన్ కళ్యాణ్

చెల్లెలుపై మిక్కిలి మమకారం ఉన్న అన్నగా అన్నవరం చిత్రంలో పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ చిత్రంలో నటించారు. చెల్లెలు అంటే అమితమైన అభిమానం ఉన్న అన్నయ్యగా ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించి, అక్కడ చెల్లెలు కాపురానికి అడ్డుగా ఉన్నసామజిక పరిస్థితులపై పోరాటం చేసి, సంఘవిద్రోహ చర్యలకు పాల్పడే వ్యక్తులను అందుకు సహకరించే పెద్దమనుషులకు బుద్ది చెబుతాడు. సమాజంలో చెడు సాధారణ జీవితానికి ఎలా అడ్డంకిగా ఉంటుందో ఈ చిత్రంలో కనబడుతుంది. పవన్ కళ్యాణ్ అన్నగా నటిస్తే, అతడికి చెల్లెలిగా ప్రేమిస్తే ఫేం సంధ్య నటించింది. పవన్ కళ్యాణ్ కి జతగా అసిన్ నటించింది. సుస్వాగతం హీరోదర్శక కాంబినేషన్లో ఈతెలుగుచలనచిత్రం వచ్చింది. Annavaram Powerstar Pawan Kalyan’s Twelth Movie as hero.

Power Start Pawan Kalyan Telugu Movies List

Pawan Kalyan Thirteenth Film is Jalsa, Super Hit entertainer. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు చిత్రంలో నటించాల్సిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా తెలుగుచలనచిత్రంలో నటించడం విశేషం. ఈచిత్రం పవన్ అభిమానులకు ఖుషిలాగా జల్సా తెచ్చింది. పునరావాసం పొందిన నక్శలైట్ , కాలేజీలో చదువుకునే స్టూడెంట్ పాత్రలో పవన్ నటించారు. ఒక పోలీసు అధికారికి ఉన్న ఇద్దరి అక్కచెల్లెలికి ఒకే ప్రేమికుడుగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించారు. ప్రకాష్ రాజ్ పోలీసు అధికారిగా నటిస్తే, పోలీసు అధికారి కూతుళ్ళుగా  ఇలియానా, కమిలినిముఖర్జీ నటించారు. పార్వతి మెల్టన్ ఇలియానాకు స్నేహితురాలుగా పవన్ కళ్యాణ్ అభిమానిగా నటించారు. ఈ చిత్రంలో పాటలు ప్రజాదరణ పొందాయి.

ఖుషి కాంబినేషన్లో హీరోదర్శకులతో పులి తెలుగుచలనచిత్రం వచ్చింది. పవర్ ఫుల్ పోలీసు ఆఫీసు పాత్రలో పవన్ నటన బాగున్నా చిత్రం ఆశించనంత విజయం సాధించలేకపోయింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జతగా నికిష పటేల్ నటించింది.

పులి తరువాత తీన్ మార్ చిత్రంలో పవన్ నటించారు. అమ్మాయితో మాట్లాడాలంటే సంవత్సరాల సమయం పట్టే కాలం, అమ్మాయితో రోజుల వ్యవధిలోనే తెగతెంపులు చేసుకునే కాలానికి పోల్చుతూ ఈ చిత్రంలో ఒకే సమయంలో రెండు తరాల ప్రేమకధలు కనిపిస్తూ కధనం సాగుతుంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో త్రిష, కృతి కర్బందా పవన్ కళ్యాణ్ కి జతగా నటించారు. ప్రస్తుతంలో అందాలని ఆస్వాదిస్తూ ఉండే యువకుడు గడిచిన ప్రేమకధని వింటూ, తన జీవితంలో ప్రేమను పొందే యువకుడు కధగా ఈ చిత్రం ఉంటుంది. గతంలో ప్రస్తుతంలో ప్రేమకధలలో కధానాయకుడుగా పవన్ కళ్యాణ్ నటన బాగుటుంది. పాటలు బాగుంటాయి.

పవన్ పంజా గబ్బర్ సింగ్ చిత్రంలో

Power Start Pawan Kalyan Telugu Movies List

వివాదమైన న్యాయం ఉంటే ఆ వివాదానికి ప్రాచుర్యం లభిస్తుంది. పంజా చిత్రంలో ఒక క్రిమినల్ నిజాయతీ, అతని అంతరంగంలో ఉండే ఆవేదన చిత్రంలో పవన్ నటనలో కనబడుతుంది. యాక్షన్ త్రిల్లర్ గా విష్ణువర్ధన్ దర్శకత్వంలో వచ్చిన పంజా చిత్రం కమర్షియల్ విజయం సాధించలేకపోయిన హీరో నటనపరంగా ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్, జాకిష్రాఫ్, సారా జేన్, అలీ తదితరులు నటించారు. జై పాత్రలో పవన్ నటనతో ఈచిత్రంలోమెప్పించారు. తనను చేరదీసిన యజమాని కొడుకు దురాగతాలను అడ్డుకోవడానికి, యజమానిపై ఉండే విశ్వాసానికి ప్రతీకగా ఒక నేరస్తుడు మదిలో మెదిలే సంఘర్షణ యాక్షన్ త్రిల్లర్ గా ఈ చిత్రంలో ఉంటుంది.

హిందీలో విజయవంతమైన చిత్రం ఆధారంగా ఒక తిక్క పోలీసు ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించారు. సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ధియేటర్లో కూర్చున్న వ్యక్తి విరామం కోసం వేచి చూడకుండా దృష్టి తెరపైనే ఉంచగలిగే కధనం ఉంటే ఆ చిత్రం సూపర్ హిట్టే. గబ్బర్ సింగ్ చిత్రం చూస్తున్నంత సేపు చిత్రంలో లీనమవ్వడమే ఈ చిత్ర కధనం తిక్క పోలీసు ఆఫీసర్ నటన ప్రత్యేకత. పవన్ కళ్యాణ్, శృతిహసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది డైలాగ్ ప్రసిద్ది చెందింది. పాటలు అన్ని ఆకట్టుకునే విధంగా చక్కగా ఉంటాయి. తిక్క పోలీసు ఆఫీసర్ ప్రేమ కధలో పవన్ నటన ఆకట్టుకుంటుంది.

Power Start Pawan Kalyan Telugu Movies List

కెమెరా మేన్ గంగతో రాంబాబుగా టివి విలేకరిగా పనిచేస్తూ సమాజ సేవ చేసే బాద్యత కలిగిన పౌరుడుగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో నటించారు. రాంబాబు పవన్ కళ్యాణ్ అయితే గంగగా తమన్నా నటించింది. ఒక ప్రతిపక్ష నాయకుడు కొడుకు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతో రాజకీయంగా అతని ఆకృత్యాలను అడ్డుకునే టివి విలేఖరిగా, చివరికి అతనిపై పోరాటానికి యువతలో చైతన్యం కలిపించి పోరాడే పాత్రలో పవన్ నటిస్తే, ప్రతిపక్ష నాయుకుడు కొడుకుగా ప్రకాష్ రాజ్ నటించారు. బద్రి దర్శకహీరో కాంబినేషన్లో కెమెరామేన్ గంగతో రాంబాబు చిత్రం రావడం విశేషం. సామాజికమైన అంశాలకు సహజంగా స్పందించే వ్యక్తిగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటించారు. ఇప్పుడు సమాజ సేవకోసం రాజకీయాలలోకి వచ్చి జనసేనపార్టికి నాయకత్వం వహిస్తున్నారు.

సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది అంటూ అందరిని అలరించిన పవన్ కళ్యాణ్ చిత్రం సూపర్ డూపర్ హిట్ తెలుగుచలనచిత్రంగా నిలించింది. జల్సా దర్శకహీరో కాంబినేషన్లో ఈచిత్రం వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రేమకోసం ఇంటినుండి దూరంగా ఉంటున్న అత్తకోసం అల్లుడు పడేపాట్లు, అత్తకూతుళ్ళతో ఆటలు ఈచిత్రం సాగి, చివరికి సెంటిమెంట్ సన్నివేశంతో అందరిని ఆకట్టుకుంటుంది. అత్తగా నదియా నటిస్తే, మరదళ్ళుగా సమంతా, ప్రణీత నటించారు. ఒక మిల్లినియర్ పాత్రలో పవన్ నటన ఈ చిత్రానికి హైలైట్. పాటలు, కధనం, సెంటిమెంట్, కామెడీ అన్నింటితో అందరిని అలరించే అత్తారింటికి దారేది. నెట్లో సగం సినిమా లీక్ అయ్యిన సూపర్ హిట్ అయ్యిన చిత్రం.

Power Start Pawan Kalyan Telugu Movies List

పవన్ కళ్యాణ్ వెంకటేష్ కలయికలో వచ్చిన బహుతార తెలుగుచలనచిత్రం గోపాల గోపాల ఒక గోపాల భక్తుడు అయితే ఇంకో గోపాల దేవుడు. భక్తుడుగా వెంకటేష్ నటిస్తే, భగవానుడుగా పవన్ కళ్యాణ్ నటించారు. భక్తీ ముసుగులో కొంతమంది చేసే మోసాలను ఎండగడుతూ, పోరాడే ఒక భక్తుడు కోసం దిగివచ్చిన దేవుడుగా పవన్ ఈ తెలుగుచలనచిత్రంలో నటించారు. వెంకటేశ, శ్రియ భక్తులుగా నటించిన ఈ చిత్రంలో విష్ణువు అవతారం కృష్ణుడుగా పవన్ కళ్యాణ్ నటించి మెప్పించారు. హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించారు.

గబ్బర్ సింగ్ చిత్రానికి అనుకరణ చిత్రంగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం వచ్చింది, కానీ గబ్బర్ సింగ్ స్థాయిలో ఈ చిత్రం విజయవంతం కాలేకపోయింది. ఎదురులేని ఒక వ్యక్తి నిర్మించుకున్న దుష్ట సామ్రాజ్యాన్ని కూల్చి, అతని నుండి ఒక రాజకుటుంబానికి చెందిన అమ్మాయిని, ఆమె ఆస్తిని రక్షించే పోలీసు పాత్రలో అలాగే ఆమెకు ప్రియుడుగా ఈ తెలుగుచలనచిత్రంలో పవన్ కళ్యాణ్ కనబడతారు. గబ్బర్ సింగ్ చిత్రంలో పండిన హాస్యం ఈచిత్రంలో ఉంటుంది. పవన్ కళ్యాణ్ కాజల్ జంటగా నటించిన ఈ చిత్రానికి కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించారు.

Power Start Pawan Kalyan Telugu Movies List

కాటమరాయుడు అత్తారింటికి దారేది చిత్రంలో పాట పల్లవి, అదే పేరుతో ఒక ఊరి పెద్దమనిషి పాత్రలో పవన్ నటించారు. ఆడవాళ్లంటే పడని వ్యక్తిగా తమ్ముళ్ళతో కలిసి ఉంటాడు. అయితే అతని తమ్ముళ్ళ తమ ప్రేమ ఫలించాలంటే అన్నకూడా ప్రేమలో పడాలని, భావించి, అతని జీవితంలోకి అవంతిక అనే అమ్మాయి వచ్చేలా చేస్తారు. అమ్మయాలంటే ఇష్టంలేని పెద్దమనిషికి అవంతికతో ఎలా ప్రవర్తించడం, ఆ అమ్మాయి కుటుంబ సమస్యని పరిష్కరించడం కోసం చూడడం ఉంటుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ శ్రుతి హసన్ జంటగా నటించిన తెలుగుచలనచిత్రం కాటమరాయుడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూడుసార్లు నటించిన పవన్ కళ్యాణ్

జల్సా చేసి అత్తారింటికి దారేది అంటూ అందరిని ఆనందింప చేసిన కాంబినేషన్ అజ్ఞాతవాసి తెలుగుచలనచిత్రంతో అభిమానులను నిరాశపరిచారు. తన తండ్రిని చంపినవారి ఆచూకికోసం తన కంపెనీలోనే ఒక ఉద్యోగిగా చేరి, వారిని తుదమొట్టించడమే ఈ చిత్ర కధాంశం. పవన్ కళ్యాణ్ కి జతగా కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి