వ్యవసాయంతోకూడినపాడి తిండిగింజలు కూరగాయలు

వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

డబ్బు సంపాదించే మార్గాలు అనేకంగా సమాజంలో నివసించే ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు. అయితే ఎంచుకునే మార్గం, ఆ మార్గంలో ఎన్నాళ్లు పట్టుదలతో పనిచేసి సాధించడం దానిపైనే అర్జన(డబ్బు సంపాధన) ఆధారపడి ఉంటుంది. మనదేశంలో మన తెలుగురాష్ట్రాలలో అనేక రంగాలు మనకు డబ్బు సంపాధన చేయడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం.

అయితే మనం డబ్బు సంపాదించేది ఎందుకు అని ఆలోచన చేస్తే, జీవితలక్ష్యాన్ని చేరడానికి శరీరంతో పనిచేస్తూ, పనిచేయడానికి శక్తి కోసం శరీర పోషణ చేస్తూ, తనపై ఆధారపడి ఉన్నవారి పోషణను కూడా చేస్తూ ఉండడం వలన ఒక సామాజిక వ్యక్తి డబ్బు అవసరం. అలాగే ఉండడానికి ఒక ఇల్లు, ఇప్పటికి మన తెలుగురాష్ట్రాలలో అద్దె ఇళ్లల్లో ఉండేవారు అనేకమంది ఉంటారు. ఒకవేళ సొంతంగా ఇళ్ళు ఉన్న, ఆ ఇంటిపై బ్యాంకు రుణం ఉంటుంది. కాబట్టి డబ్బు సంపాదన చాలా అవసరం.

తెలుగురాష్ట్రాలలో కష్టంతో కూడుకుని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉండే రంగం వ్యవసాయ రంగం. ఈ రంగంలో తక్కువ సేద్యంచేసే భూమి కలిగిన వ్యక్తి, తన పొలంపని తానే చూసుకునే అవకాశం ఎక్కువ ఉంటే, ఎక్కువ వ్యవసాయభూమి కలిగిన వ్యక్తి కూలీలను పెట్టుకుని, వివిధ యంత్రములతో కూడా పనిచేయించుకుంటూ ఉంటాడు. ఈ రంగం అందరి తెలుగు ప్రజలకు తెలిసినదే, అయితే కష్టం ఎక్కువ ఉంటూ ప్రకృతి కూడా అనుకూలంగా ఉండాలి కాబట్టి కొంతమంది వ్యాపారాలు, ఉద్యోగాలు వెతుక్కుంటూ పట్టణ ప్రాంతాలకు తరలి వెళతారు. ఎక్కడికి వెళ్లినా రైతు పండించిన ధాన్యమే మనకు ఆహారం.

వ్యవసాయంతో డబ్బు కన్నా ధాన్యం ఇంట్లో ఉంటుంది. వ్యాపారంతో అయితే ధాన్యం కొనుగోలు చేయవచ్చును. వివిధ వస్తువులను కొనుగోలు చేయవచ్చును. అయితే వ్యాపారంలో మిగులు డబ్బు విరివిగా ఉన్నప్పుడు మాత్రమే, ధాన్యం విరివిగా రైతు పండించవరకు మాత్రమే. వ్యాపారం తెలివితేటలు ఉంటే చాలా వ్యవసాయం కన్నా తేలికగా డబ్బు సంపాదించవచ్చును. వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

వ్యాపారం చేయడం చాలా సులభం, లెక్కల్లో సూత్రాలు, సిద్దాంతాలపై సరైన అవగాహన ఉంటే లెక్కలు చేయడం ఎంత సులభమో..అలాగే సామాజిక అవసరాలలో ప్రాధాన్యత, భవిష్యత్తు మానవ అవసరాలు ఏమిటనే ఒక అవగాహన, అవసరమైన వస్తు, సేవలలో లోటుపాట్లు గురించిన అవగాహన ఉంటే వ్యాపారం సులభతరం అంటారు.

పుస్తకాలలో చదివినట్టు వ్యాపారంలో పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ఎదుటి వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి నివాస ప్రాంతాన్ని బట్టి అనుకూల – ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వ్యాపారం ఆన్ లైన్ ద్వారా కూడా ఎక్కువగా నడుస్తుంది. ఆన్ లైన్లో అనేకంగా ఆఫర్స్ ఎక్కువగా ఎప్పటికప్పుడు పండుగలు లేక విశేషమైన రోజులను బట్టి వస్తూ ఉంటున్నాయి.

కొనుగోలుదారుకు ఆన్ లైన్లో తగ్గింపు ధరలలోనే ఎక్కువగా ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే ఫోన్లు, కంప్యూటర్స్, గృహోపకరణాలు, దుస్తులు లాంటివి చాలానే లభిస్తున్నాయి. అమ్మేవారు కూడా తమ తమ వస్తువుల పాపులర్ ఆన్ లైన్ ఇకామర్స్ సంస్థల వెబ్ సైట్ల నుండి అమ్మకాలు కొనసాగించవచ్చును.

సమాజంలో వ్యక్తికి నిత్యావసరమైనది ధాన్యం, తిండిగింజలు, కూరగాయలు, కిరణా సరుకులు ఇవి ప్రతి వ్యక్తి కుటుంబానికి పోషణార్ధం చాలా అవసరం. అయితే వీటిని పండించే వ్యవసాయం మాత్రం కొందరికే అవసరం అన్నట్టుగా సమాజం సాగుతుంది, అన్న విషయం మహర్షిలాంటి సినిమాలలో చూపిస్తున్నారు…అంటే సమాజంలో వ్యవసాయం తక్కువ అవుతుందనే ఆందోళన అందరిలో వచ్చింది.

వేగంగా వృద్ది చెందుతున్న సమాజంలో వ్యాపారం అవసరం అయ్యి, సాంకేతికతతో మరింత తేలికగా సాగుతుంది. తేలిక విధానంతో డబ్బు సంపాధన ఉండటంతో, డబ్బుకు అన్ని వస్తు, సేవలు దొరకడంతో వ్యవసాయం చేయడం కన్నా వ్యాపారం లేక ఆయా వ్యాపార, ఉత్పాదక వ్యవస్థలలో ఉద్యోగం చాలు అంటూ మానవ జీవితం సాగుతున్నట్టుగా కనబడుతుంది.

ఒక కంపెనీలో కష్టపడి కార్మికులు పనిచేస్తే, ఆ కంపెని వస్తువుని మార్కెటింగ్ చేయడానికి మార్కెటింగ్ వ్యవస్థ కావాలి. కానీ వ్యవసాయం కూలీలు కష్టపడి చేస్తే, మార్కెటింగ్ అవసరం తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ధాన్యం అవసరం లేకుండా ఎవరు ఉంటారు. అయితే దళారివ్యవస్థను సరిదిద్దవలసిన ఆవశ్యకత మాత్రం పబ్లిక్ పైనే ఉంటుంది. వ్యవసాయం – వ్యాపారం – ప్రభావం

వ్యవసాయంతో బాటు కూడా ఉండే మరొకటి పాడి. పొలంలో గడ్టి తీసుకువచ్చి వాటిముందు వేస్తే, ఆ గడ్డితిని పాలను ఇస్తాయి. పాలు వలన ఆరోగ్యం, బలం అంటారు. వ్యవసాయంతో కూడిన పాడి ఉండటం అంటే ఐశ్వర్యవంతుడనే అంటారేమో. అయితే పొలం పని, పాడి పని రెండూ చాకిరి ఎక్కువ అనే అంటారు. కానీ అవి లేనిదే మన తెలుగువారు ఉండలేరు.

వ్యవసాయమా? వ్యాపారమా? అంటే వ్యాపారం తేలిక అయినా వ్యవసాయం కష్టమైనా పెద్దలు వ్యవసాయమే ఎంచుకోమని చెబుతారు. చాలా సార్లు ప్రపంచవ్యాప్తంగా ఆర్ధికమాంద్యం వచ్చింది, అప్పుడు ఆగ్రదేశాలలో ప్రజలు నానాకష్టాలు పడ్డారు అని చెబుతారు. కానీ దాని ప్రభావం మనపై చాలా తక్కువనే చెబుతారు. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత ప్రాంతం మరియు మనదేశ మహిళలు పొదుపుతో కూడిన విధానం కుటుంబంలో పాటిస్తారు. కాబట్టి డబ్బు లేకపోతే అల్లాడిపోవాల్సిన ఆగత్యం మనకు రాలేదు అని చెబుతారు.

దీనిని బట్టి వ్యవసాయం ప్రధానంగా సాగితే, దానిని అనుసరించి పాడి, తిండిగింజలు, కూరగాయలు విరివిగా ఉంటే అక్కడ ఆ ప్రాంతంలో డబ్బుతో తక్కువ పని ఉంటుంది. తినడానికి కావాల్సినవి విరివిగా ఉంటే, ఉన్నడబ్బుతో ఇతర అవసరాలు తీర్చుకోవచ్చు. డబ్బు తక్కువగా ఉంటే ఇతర అవసరాలు ఆపివేయవచ్చును. ఇలా వ్యవసాయం వ్యాపారం కన్నా మిన్నగా కనబడుతుంది.

ఆర్ధికమాంద్యం వచ్చినప్పుడు కష్టాలను ఎదుర్కొన్న ప్రజలు ఎక్కువగా కలిగిన దేశాలు సాంకేతికంగా, వ్యాపారపరంగా వృద్ది ఎక్కుగా ఉన్న దేశాలు కావడం గమనార్హం.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

Enable Notifications    Ok No thanks