గతజన్మలో చర్యకు ఈజన్మలో ప్రతిచర్యగా

గతజన్మలో చర్యకు ఈజన్మలో ప్రతిచర్యగా

ఒక మనిషిని రెండవ మనిషిని పొగిడితే, తిరిగి రెండవ మనిషి మొదటి మనిషిలో ఉన్న మంచి గుణం ఎంచి మరీ పొగుడుతాడు. ఇలా ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు పొగుడుకోవడం, వారిలో ఉండే మనసు చేసే పనిగా చెబుతారు. అలాగే ఒక మనిషి రెండవ మనిషిని తిడితే, వెంటనే రెండవ మనిషి, మొదటి మనిషి గతంలోని తప్పొప్పులను ఎంచి తిడతాడు. ఈవిధంగానూ ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ద్వేషించుకోవడంలోనూ మనసే ప్రధాన కారణం కాగలదని అంటారు. అంటే గతజన్మలో చర్యకు ఈజన్మలో ప్రతిచర్యగా వస్తే దానిని కర్మఫలం అంటారు.

అంటే ఒక వ్యక్తి నుండి ఎదురైన అనుభవం నుండి, ప్రతిచర్యను చేయడం వ్యక్తిలోని మనసుకు సహజ లక్షణం. అయితే కొందరిలో సహనం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు పరిస్థితులను అవగాహన చేసుకుని మాట్లాడుతారు కానీ నిందకు ప్రతినింద వెంటనే చేయరు. కొందరు సహనంతో బాటు మంచితనం కూడా ఉండడం చేత ఎదుటివారి ప్రవర్తనను భరిస్తూ ఉంటారు. ఏదైనా ప్రతిచర్య మాత్రం మనసు చేస్తూ ఉంటే, వ్యక్తి గుణమును బట్టి బహిర్గతమవుతుంది.

ఇలా మనిషి మనసు చర్యకు ప్రతిచర్య ఉంటే, అటువంటి మనిషికి గతజన్మల మంచి చెడులు తోడైతే ప్రస్తుత జీవితం అంటారు. గతజన్మల మంచి చెడుల ఫలితాలు భవిష్యత్తులో ఎటువంటి మార్పులను తీసుకువస్తుందో జ్యోతిష్య చదువుకున్న పండితులు జాతకం రూపంలో సూచిస్తూ ఉంటారు. అయితే వ్యక్తి పట్టుదల కలిగి ఉండి సత్కర్మలను ఎక్కువగా ఆచరిస్తూ, ధర్మంపై మక్కువ ఎక్కువ ఉంటే, జాతక దోషాలను అధిగమించే శక్తి దైవం నుండి చేకూరుతుందని పెద్దలు అంటారు.

జాతకం వలన జీవితంలోని మార్పులపై అవగాహన ఉంటుంది.

ఇప్పటి చర్యకు ప్రతిచర్య చేసే మనసుకు జరుగుతున్న పరిణామాలపై అవగాహన ఉంటుంది. కానీ గతజన్మలలో జరిగిన చర్యలకు, ప్రతిచర్యలుగా ఒక వ్యక్తి ఈజన్మలో వస్తూ ఉంటే, దానిని కర్మగా భావిస్తారు. అంటే గతజన్మలో పుణ్యం ఎక్కువ చేసుకుంటే, ఈ జన్మలో ఎక్కువ సుఖాలు, గతజన్మలో పాపం ఎక్కువగా చేసి ఉంటే, ఈ జన్మలో దు:ఖాలు ఎక్కువగా వస్తూ ఉంటాయని అంటారు. ఎప్పటి చర్యలకో ఇప్పుడు ప్రతిచర్య తెలియకుండా ఆపద రూపంలో వస్తుందంటే, దాని తీవ్రతను తగ్గించుకోవడానికి జ్యోతిష్యం చదువుకున్న పండితులు తగు సూచనలు తెలియజేస్తూ ఉంటారు.

చర్యకు ప్రతిచర్యలు పాప పుణ్యములుగా పరిగణించబడి మరలా ఈజన్మలో సుఖదు:ఖాలుగా రావడం జాతక పరమైన విచారణలో వెల్లడి అవుతూ ఉంటాయి. ఒక వ్యక్తి పుట్టగానే ఉన్న గ్రహస్థితులను బట్టి, ఆయా గ్రహ కదలికల ఆధారంగా, జీవితంలో కలిగే ఫలితాలను తెలియజేసే జ్యోతిష్యం అంటే మన భారతదేశంలో చాలమందికి నమ్మకం ఎక్కువ. జాతకం ప్రకారం వ్యక్తి ఉన్నతికి ఆద్యాత్మికంగా చేయవలసిన కర్మలను సూచించబడే పండితులు మనకు అనేకంగా ఉంటారు. టెక్నాలజీ అభివృద్ది చెంది, ఇంటర్నెట్ ద్వారా జ్యోతిష్యం అందుబాటులోకి వచ్చింది. చాలామంది ఇప్పటికే ఇంటర్నెట్ ద్వారా వివిధ వెబ్ సైట్లలో జాతక పరిశీలన చేసుకుంటూ ఉంటారు.

తెలుగు వెబ్ సైట్ల ద్వారా తెలియబడే జాతకం, క్లుప్తంగానే ఉంటుంది. ప్రాధమిక పరిష్కారాలతో జాతకం లభిస్తుంది. ఒక వ్యక్తి పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం, పుట్టిన తేదిననుసరించి తెలుగులో జాతకం ఆన్ లైన్ ద్వారా వెబ్ సైట్ల నుండి తెలుసుకోవచ్చును. ఒక వ్యక్తి గతజన్మలో చర్యకు ఈజన్మలో ప్రతిచర్యగా ఫలితాలు వచ్చేవిగా ఉంటే, వాటిని పుట్టిన సమయం బట్టి, తేదిని బట్టి గ్రహస్థితుల అంచనాను తెలియజేసే వెబ్ సైటులు. ఈక్రింది బటన్స్ టచ్ లేక క్లిక్ చేయడం ద్వారా మీ ప్రాధమిక జాతక విషయాలు తెలుసుకోవచ్చును.

ఇలా ఒకవ్యక్తి జాతక పరిశీలన చేయడం వలన గతజన్మలో చర్యకు ఈజన్మలో ప్రతిచర్యగా ఇప్పటి ఫలితాలపై అంచనా, అవగాహన ఏర్పడుతుంది. అప్పుడు ఆవ్యక్తికి ఎదురయ్యే కష్టనష్టాలలో ఇతరులను నిందించడం కన్నా తన కర్మఫలితంపై అవగాహన ఉండడం చేత, ఎదుటివారితో విరోధభావన ఉండదంటారు.

ధన్యవాదాలు