కనకదుర్గ పూజామహిమ

కాంతారావు, కృష్ణకుమారి జంటగా నటించిన చిత్రం టైటిల్ కనకదుర్గ పూజా మహిమ భక్తిజానపద చిత్రం. జానపదచిత్రబ్రహ్మ అయిన విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని యూట్యూబ్ ద్వారా చూడడానికి ఈ అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

Actors/Actress నటీనటులు: కాంతారావు, రాజనాల, ముక్కామల, బాలకృష్ణ, మిక్కిలినేని, సత్యనారాయణ, కృష్ణకుమారి తదితరులు ఈ చిత్రంలో నటించారు.
Music/సంగీతం:రాజన్ నాగేంద్ర
Direction/దర్శకత్వం: బి విఠలాచార్య

Kanakadurga pooja mahima telugu chalana chitram kadha

జీవనమే పావనం మానవ జీవనమే పావనం పాటతో ప్రారంభం అయ్యే చిత్రంలో రాజు, రాణి గానం చేస్తూ ఉంటారు. గానం పూర్తయాక ఆ రాజుగారి పురోహితులు వచ్చి కనకదుర్గా దేవి సహస్రనామ అర్చనకు సర్వం సిద్దం తమరు వచ్చి పూజలో పాల్గొనవలసినదిగా కోరతారు. రాజుగారు పూజారినే పూజ ముగించేయండి నేనురాను అని చెప్పి పంపించేసి రాణి దగ్గర ఉండిపోతాడు.  అమ్మపూజలో పాల్గొనకుండా రాజు రాణితో ప్రేమపాటలు వల్లివేయడంలో ఇరువురు మధ్యలో ఒక నక్క గురించి ఆడదా మగదా అనే విషయంలో బేదాభిప్రాయం వచ్చి పందెం కాస్తారు. ఎవరిమాట తప్పు అయితే వారు అరణ్యాలకు వెళ్ళాలని రాజు నిర్ణయించి చెబుతాడు.

అయితే రాణి మహారాజు అడవుల పాలు కావడం ఇష్టంలేకా అది ఆడ నక్కే అయినా, మార్చి మగనక్కని తెప్పించి రాజుగారిని గెలిపిస్తుంది. అయితే మహారాజు మహారాణిని ఏమాత్రం దయలేకుండా అడవులకి పంపించేస్తాడు. రాజబటులు మహారాణిని అడవులలో వదిలి వెళ్ళిపోతారు. కానీ మహారాణి అడవికివెళ్ళిపోయాక చింతిస్తాడు. ఇదంతా కనకదుర్గ పూజని నిరాకరించడం వలననే ఇటువంటి ఫలితం వచ్చింది అని పురోహితులు చెబుతారు. ఇక మహారాజు రాజ్యభారం బావమరిదికి అప్పజెప్పి మహారాణిని వెతుక్కుంటూ అడవులకి బయలుదేరతాడు.

అడవులపాలైన రాజదంపతులను వేరు రూపాలలో ఒకచోటికి చేరడం – కనకదుర్గమ్మ అనుగ్రహం

కనకదుర్గమ్మకి మొక్కుకుని కాలిబాటలో నడుస్తున్న ఇద్దరు దంపతులు అలసి అడవిలో బాటప్రక్కనే కూలబడతారు. మహారాణి ప్రసవవేదనలో నడుస్తూ వచ్చి ముని తపస్సు చేసుకునే చోట మగపిల్లవాడిని ప్రసవిస్తుంది. మహారాణికి దాహం వేసి ధ్యానంలోనే ఉన్న ముని దగ్గరే ఆ పిల్లవాడిని పెట్టి, దాహార్తి తీర్చుకోవడానికి వెళుతుంది. పసిబిడ్డ ఏడుపు విని అటుగా వచ్చిన బాటసారి దంపతులు ఆ మహారాణి బిడ్డని తీసుకుపోతారు. దాహం తీర్చుకుని తిరిగివచ్చిన మహారాణికి బాబు కనబడడు.

ధ్యానంలోనే ఉన్న ముని ఈ పిల్లవాడు అక్కడ ఉంచడం కానీ వేరే దంపతులు పట్టుకువెల్లడం కానీ తెలియని మునిని మహారాణి అరిచి ధ్యానభగ్నం కావిస్తుంది. కోపగించిన ముని ఆమెను బల్లూకం కమ్మని శాపం ఇస్తాడు. ఆవిధంగా మహారాణి ఎలుగుబంటిగా మారిపోతుంది. తర్వాత తేరుకుని ముని, అంతా దివ్యదృష్టితో గమనించి ఇదంతా కనకదుర్గమ్మ చేయించింది, నీకు మేలు జరగాలనే అమ్మ ఆవిధంగా నాతో చేయించిందని చెప్పి ఊరడిస్తాడు. నీపిల్లవాడు కనకదుర్గమ్మ దంపతులకే దొరికాడు క్షేమంగానే ఉంటాడని చెప్పి, కనకదుర్గమ్మ ని నిత్యం ధ్యానించమని చెబుతారు. మహారాజు కూడా అడవిలోకి వచ్చి నడవలేని పరిస్థితికి వచ్చేస్తాడు. తల్లిని కాదన్నవాడికి తరుణీ ఉండదు, సుఖం ఉండదు.

ఎలుగుబంటి రూపంలో ఉన్న మహారాణి మహారాజుని గుర్తుపడుతుంది. మహారాజు ఆకలిని గమనించి అతని ఆకలి అడవిలో పండ్లు తెచ్చి తీర్చుతుంది. వివేకవంతులు చెడులోను మంచిని పొందగలడు, అట్టి వివేకం లేక పరిస్థితి అమ్మ అనుగ్రహం వలననే కలుగుతుంది.

మహారాజు బిడ్డడు మాధవుడు – మాంత్రికుడు మేఘనాధుడు

పెరిగిపెద్దవాడైన మహారాజు బిడ్డ అయిన మాధవ (కాంతారావు) ఎలుగుబంటి బారిన పడిన యువరాణి (కృష్ణకుమారి)ని కాపాడతాడు. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడతారు.

మేఘనాధుడు ఒక మాంత్రికుడు దగ్గర విద్యలు నేర్చుకుని ఉంటాడు. అలా విద్యాగర్విష్టి అయిన మేఘనాధుడు ఒక స్త్రీని చెరబట్టి ఆమెను తనకోరిక కోసం మయవిద్యతో లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. గురువు మందలిస్తే, గురువుని కూడా బందీని చేస్తాడు తనతంత్రవిద్యతో, అయితే గురువు నీవు సంపూర్ణ శక్తిమంతుడు కాలేదు. అయితే సంపూర్ణ సర్వశక్తిమంతుడు కావాలంటే ఒక అయాచితంగా అప్రయత్నంగా సామ్రాజ్య సింహాసనం అధిష్టించిన అదృష్ట మహారాజుకి పరిపూర్ణవైరాగ్యం కలిగించి అమ్మవారికి బలిస్తే సంపూర్ణ శక్తిమంతుడు అవుతావు అని చెబుతాడు.

గురువుగారిని బందీగానే ఉంచి, తాను అనుభవించదలచిన స్త్రీని సర్పంగా మారుస్తాడు మాంత్రిక మేఘనాధుడు. మహారాజుని లోబరచుకోవడానికి ఆ స్త్రీని ఉపయోగించదలచి, ఆమెను మరలా స్త్రీగా మార్చినీవు పౌర్ణమి చంద్రుడుని చూస్తే, మరలా సర్పంగా మారతావు, అప్పుడు ఎవరైనైనా ఒకరిని కాటేసి చంపితే నీవు మరలా ఆడ మనిషిగా మారతావు అని చెప్పి ఆమెను తనతోపాటు రాజ్యానికి తీసుకువెళతాడు.

మేఘనాధుడు తనకోరిక నెరవేర్చుకునే నెపంతో కపటవేషధారి అయి రాజ్యంలో మాధవుడితో తలపడి మాయతో అతనిని ఓడిస్తాడు. తద్వారా తాను మహావీరుడిని నాకు మీ మహారాజుని పాదపూజ చేయాలనీ రాజుతో పాదపూజ చేయించుకోపోతే మాధవుడు వచ్చి ఆపుతాడు. మహారాజు సంవత్సరం గడువు విదిస్తారు మాధవుడికి మేఘనాధుడుని ఓడించడానికి. మాధవుడు మేఘనాధుడుని సంవత్సరం తర్వాత ఓడించాలేకపోతే మహారాజు మేఘనాధుడుకి పాదపూజ చేయాలనీ అనుకుంటారు.

మాధవుడు-యువరాణి గాంధర్వ వివాహం KanakaDurga Pooja Mahima Telugu Chalanachitram

రాజుకు తెలియకుండా మాధవుడు, యువరాణి ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకుంటారు. మేఘనాధుడు ప్రయోగించిన మాయ అనే యువతి వలలో మహారాజు లొంగుతాడు. ఆమె పౌర్ణమి చంద్రుడిని చూడడం ఆస్త్రీ పాముగా మారి మరోకరిని కాటువేసి చంపడం రాజుగారి అంతఃపురంలో జరుగుతూ ఉంటుంది.

మాధవుడు శక్తులు సముపార్జించడానికి బయలుదేరితే దారిలో ఒకబూతం మాధవుడుని మాయశక్తిచేత తీసుకువెళ్ళి అతనిని మోహిస్తుంది. ఒకసుందరిగా మారి ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, కానీ మాధవుడి తమ్ముడి ప్రయత్నం ద్వారా ఆ బూతం అంతం అవుతుంది. అక్కడ నుండి వారు మేఘనాధుడి గుహకి చేరతారు. అక్కడ వినపడుతున్న మనిషి మూలుగు విని మాధవుడు వెళ్లి, మేఘనాధుడి గురువును కాపాడతాడు.

మాధవుడుకి ఆ గురువు తన మంత్రతంత్ర విద్యలు తపస్సు అతనికి ధారపోస్తాడు, కానీ మాధవుడు శక్తిమంతుడు కాలేకపోతాడు. అందుకు కారణం గ్రహించిన గురువు నీకు పాపం అంటి ఉంది, అది నీతల్లిదండ్రుల ద్వారా సంక్రమించింది కావునా నీవు కనకదుర్గమ్మపూజా చేసి అమ్మఅనుగ్రహం సంపాదించమని చెబుతాడు.

మరోప్రక్క పున్నమి చంద్రుడిని చూసి పాముగా మారుతున్నా మాంత్రికబందీ అయిన స్త్రీ కాటుకి అంతఃపురంలో మరణాలు ఎక్కువ అవుతూ ఉంటే, మహారాజు దిగులుపడతాడు. అయితే కపటమాంత్రికుడు అయిన మేఘనాధుడు అందుకు కారణం నాకు తెలుసు నేను చెబుతాను అని, ఆ కారణాన్ని యువరాణిపై నెడతాడు. ఆమె గర్భవతి ఆమె ఒక నాగరాజు ద్వారా ఈ గర్భం వచ్చింది, ఆ బిడ్డవలన సామ్రాజ్యానికి అరిష్టమని చెప్పి యువరాణిని ఇంద్రకీలాద్రి ఆకాశజలపాతంలో తోసివేయించుతాడు.

మాధవుడి భార్య అతని తల్లిదండ్రుల మాధవుని బిడ్డకి జన్మనివ్వడం -కనకదుర్గమ్మ అనుగ్రహం

అలా జలపాతంలో త్రోయబడిన యువరాణి కనకదుర్గమ్మ దయవలన ఎలుగుబంటిరూపంలో ఉన్న మహారాణి ద్వారా కాపాడబడుతుంది. మాధవుడి తమ్ముడు సింహాద్రి ఒక కోయరాజు కుమార్తెను మల్లయుద్దంలో గెలిచి వివాహమాడతాడు.  అలా అతడు చేసే సన్నివేశాలన్నీ హాస్యభరితంగా చిత్ర మధ్యమధ్యలో వస్తూ ఉంటాయి. యువరాణి ఎలుగుబంటి రూపంలో ఉన్న మాజీ మహారాణి, మహారాజుల వద్ద ప్రసవిస్తుంది.

గురువు పర్యవేక్షణలో మాధవుడు కనకదుర్గమ్మని పూజించి అమ్మ అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అమ్మ అనుగ్రహం వలన తల్లిదండ్రుల పాపం పోయి, వారికి నిజరూపం వస్తుంది. ఆకాశజలపాతం దగ్గరనుండి సింహాద్రి, యువరాణి, మాధవుడి తల్లిదండ్రులు అంతా మాధవుడి దగ్గరికి బయలుదేరతారు.

ఇక మేఘనాధుడు ప్రయత్నంలో అప్పటి మహారాజుకి వైరాగ్యం వస్తుంది, పసిగట్టిన మాంత్రిక మేఘనాధుడు ఆ మహారాజుని ఒంటరిగా కాలికాలయం దగ్గరికి తీసుకువెళతాడు. అక్కడే ఉన్న మాధవుడు మేఘనాధుడు చేయబోయేది గమనిస్తూ ఉంటాడు. మహారాజుకి తన మాంత్రిక స్వరూపంతో కనిపించి అమ్మకి ప్రణామం చేయమని చెబుతాడు. చేయనని చెప్పిన మేఘనాధుడు ఆ మహారాజుని మాయవిద్య ప్రయోగించబోతే, ఆ విద్యని నిర్వీర్యం చేస్తాడు మాధవుడు. చివరికి ఇద్దరు బాహుబలంలో పోటిపడి మేఘనాధుడు మట్టికరుస్తాడు.

భోగలాలసలో పడి దేవతాశక్తిని నిరాకరిస్తే వచ్చే అనర్ధాలు ఒక కుటుంబానికి ఎలా ప్రాప్తించి ప్రాకృతిక నియమానుసారం ఎలా ఇబ్బంది పడతాయో, అనుగ్రహించే కులదైవం కష్టాలను కూడా ఉద్దరణవైపుగా ఎలా నడిపించి ఏవిధంగా మనసుని సంస్కారంవంతంగా తల్లి కనకదుర్గమ్మ నడిపిస్తుందో ఈ చిత్రం చూపుతుంది. Kanakadurga pooja mahima telugu chalanachitram directed by B Vithalacharya. జానపద చిత్రాలను చిత్రీకరించడంలో జానపదచిత్రబ్రహ్మగా పేరుగాంచిన విఠలాచార్య ఈ భక్తి చిత్రాన్ని తీయడం విశేషం.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి