By | February 1, 2022

నేడు వరకట్నం తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. వరకట్నం వేధించి తీసుకోవడం పాపంగా పరిగణింపబడుతుంది. జీవితాన్ని పంచుకునే బాగస్వామి ధర్మపత్ని తెచ్చుకునేందుకు వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో….

వధువు మనసులో మంచి స్థానం పొందు, వరకట్నం వద్దను

పాత రోజులు అయినా, ప్రస్తుత రోజులు అయినా ఆడపిల్లల పెళ్ళి అమ్మానాన్నలకు తీరని కష్టాలనే తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళి అనగానే వరకట్నం ఎంత? వరకట్నం కోసం కూడబెట్టిన డబ్బు లేకపోతే, ఇక ఆ తల్లిదండ్రుల కష్టాలు వర్ణానీతతం…. ఒక రాబోవు కొత్త రోజులు అయినా ఈ పద్దతి మారుతుందో లేదో తెలియదు… కానీ చదువుకున్న మనం అయినా ఈ వరకట్నం అనే దురాచారం రూపుమాపుదాం…. కనీసం మన వరకట్నం వద్దని నిలబడదాం.

ప్రేమతో జీవించవలసిన ఆలుమగల మద్యలో ఆర్ధిక పరమైన మనస్పర్ధలు రావడానికి వరకట్నమే కారణం అవుతున్నాయి. వరకట్నం పూర్తిగా తేలేదని వేధింపులకు గురయ్యే మహిళలు ఉంటున్నారు. ఇంకా అదనపు కట్నం కోసం వేధించే ఘనులు కూడా ఉంటే, అది మరీ విడ్డూరం…

మనదేశంలో పేదరికం, పేదరికంతో బాధపడే మద్యతరగతి ప్రజలు అదికంగా ఉంటే, వారిలో వివాహం చేయడం, ఇల్లు కట్టడం వంటి విషయాలు గగనంగా మారుతుంది…. పూర్వమెప్పుడో… వివాహాలకు కట్నం ఇచ్చినా అది… తక్కువ మొత్తంలో ఉంటే, నేడు అది అందనంత పెద్ద మొత్తాలుగా మారడం శ్రేయష్కరం కాని విషయం. కాబట్టి వరకట్నం వద్దని చెప్పడం కాదు వరకట్నం వద్దని నిర్ణయించుకోవాలి…. నేటి యువత తర్వాతి తరానికి మార్గదర్శకంగా నిలబడాలంటే, వరకట్నం తీసుకోకుండా వివాహం చేసుకోవాలని సత్సంకల్పం చేసుకోవాలి. అది ఆచరించాలి.

వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో కరపత్రం

అన్యోన్య దాంపత్యమునకు వరకట్నం వద్దనే మాటే నాంది అయితే

వధువుకు సహజంగానే తండ్రిపై పరమ ప్రీతి ఉంటుంది. అటువంటి తండ్రి తనకు వివాహం చేయడానికి నానా కష్టాలు పడుతుంటే, ఆ కూతురికి సహజంగానే వరుడుపై కోపం కలగవచ్చును… భార్య మనసులో స్థానం పదిల పరచుకోవడానికి, తన పుట్టింటి వారి మేలుకోసం ఒక మంచి మాట చెప్పిన చాలని అంటారు. ఇక వివాహంలో పెద్ద కష్టం అంటే వరకట్నం కోసం డబ్బు సమకూర్చుకోవడమే… అయితే ఆ కష్టం కేవలం ఒక్కమాటతో పోతే, ఆమె మనసు నీ ఇంటి వృద్దిపై ధృడపడిపోతుంది.

ఇంటిలో మహాలక్ష్మీ వలె అల్లరి చేసే అమ్మాయి…. ఒక్కసారి వధువుగా మారి, నీకోసం ఇంటిల్లిపాది ప్రేమకు దూరం అవుతుంది. ఇంటిలోని అన్ని బంధాలకు దూరంగా నీవద్దకు వచ్చేస్తుంది. కేవలం తండ్రి మాటకోసం, నీ మనసేమిటో కూడా తెలియని అమ్మాయి… వధువుగా నిన్ను వరిస్తుంది….

ఎంతో గొప్పదైన మన వివాహ వ్యవస్థ, తర్వాత ఏర్పడే అమూల్యమైన దాంపత్య జీవితం… చక్కగా ఉండడానికి వరకట్నం వద్దని, వధువును వివాహమాడే ధీరులు మనసమాజంలో ఎంత పెరిగితే, అంతలా సమాజంలో స్త్రీ సంతోషపడుతుంది. ఎక్కడ స్త్రీ సంతోషపడుతుందో… అక్కడ దేవతలు సంతోషిస్తారని ప్రతీతి…