By | February 19, 2022

పేదలకు దానం చేయటంవల్ల మనం పొందే మేలును గురించి వివరిస్తూ, ఆ మాటలను మీ మిత్రునికి లేఖ వ్రాయండి.

ప్రియ మిత్రమా!

నేను క్షేమం! నీవు క్షేమమని తలుస్తున్నాను. నీవు బాగా చదువుతున్నావని భావిస్తూ…. నేను ఒక మంచి విషయం గురించి ఈ లేఖ ద్వారా నీకు తెలియజేయదలిచాను. బహుశా ఇది నీకు కూడా తెలిసి ఉండవచ్చును. కానీ నా దృష్టి కోణం నుండి ఈ అంశం గురించి ప్రస్తావిస్తాను.

మన పెద్దలకు ఉండి మనకు చదవు నేర్పిస్తున్నారు. తినడానికి తిండి, చదవడానికి పుస్తకాలు, అందంగా కట్టుకోవడానికి బట్టలకు లోటు లేకుండా సాగుతుంది. కానీ నేను చూసిన పేదవారికి అవి లేకుండా ఉంటున్నాయి. వారి స్థితిని చూసి నా మనసు చలించింది. అందుకే నేను మానాన్నగారితో మొర పెట్టుకుని వారితో కొంతమందికి సరిపడా బట్టలు పుస్తకాలు ఖరీదు చేయించాను. వాటిని మా నాన్నగారి ఆధ్వార్యంలోనే పేదలకు ఇచ్చేశాను. ఇంకా నేను దాచుకున్న ధనం ఖర్చు చేసి, బియ్యం, పప్పులు ఖరీదు, చేసి తిండిలేనివారికి దానం చేశాను. ఆ తర్వాత ఎంతో ఆనందం అనిపించింది.

నాకు పరీక్షలలో మంచి మార్కులు వచ్చినప్పుడు కలిగిన సంతోషం కొంత సేపే ఉండేది…. కానీ పేదలకు దానం చేయటంవల్ల నాకు ఇప్పటికీ ఆనందంగా ఉంది. ఏదైనా సాధిస్తే, అది మరొకరికి ఉపయోగపడితే, ఎంతో ఆనందం కలుగుతుందని పేదలకు దానం చేయటంవల్ల నాకు తెలియవచ్చింది. మన సంతోషం కోసం చూడడం వలన స్వార్ధ బుద్ది పెరిగే అవకాశం ఉంటే, ఇతరుల సంతోషం కోసం చూస్తే త్యాగబుద్ది వృద్ది చెందుతుంది.

మనకు ఉండగా మిగిలినది… లేనివారికి పంచడంలో తృప్తి, ప్రశాంతత పెరుగుతుంది. కావునా ప్రియ మిత్రమా అవకాశం ఉంటే, పేదలకు దానం చేయడంలో వెనుకాడవద్దు…

ధన్యవాదాలు…

ఇట్టు నీ ప్రియ మిత్రుడు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు