Telugu Bhāṣā Saurabhālu

మ్యాజిక్ డోర్స్ తెలుగులో మాయా తలుపులు

మ్యాజిక్ డోర్స్ తెలుగులో మాయా తలుపులు హాయ్ నేను మీకు షార్ట్స్ స్టొరీ అందించాలి అనుకుంటున్నాను. చిన్న చిన్న భాగాలుగా నేను కధ రాస్తాను, ఇంకా తెలుగురీడ్స్ యూట్యూబ్ చానెల్ లో వినండి. మీరు చదువుతూ ఉండండి. దయచేసి మీకు నచ్చితే, లైక్ చేయండి… కధను మరింత బాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ లైక్ మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది… ఇక కధలోకి వెళితే…

అనగనగా ఒక ఊరు, ఒక ఊరు అంటే మరీ పల్లెటూరు కాదు, ఒక చిన్న పట్టణంలాంటి ఊరు. ఆ ఊరిలో ముగ్గురు మిత్రులు ఉన్నారు. వారి పేర్లు అర్జున్, రాహుల్, సంజయ్. వీరు ఒకరోజు ఆ ఊరిలోనె తాము ఎప్పుడు తిరగని వీధిలో వెళతారు. అక్కడ వీరు మాట్లాడుకుంటూ…

          అర్జున్; “ఒరేయ్ చూడండి రా… ఈ వీధిలోకి మనం ఎప్పుడు రాలేదు… ఎందుకు ఇక్కడకు వచ్చాం?”

          రాహుల్ – సంజయ్: “ఎప్పుడూ ఉన్న చోటే ఉండకూడదు. కొత్త ప్లేసులలో కూడా తిరగాలి.”

          అర్జున్: “అవున్రా కొత్త ప్లేసులలో తిరగాలి కానీ దానికో సమయం ఉంటుంది… ఇలా చంద్రుడు నడినెత్తికి వచ్చే సమయంలో కాదురా…” అర్జున్ దూరంగా ఉన్న ఒక గదివైపు అనుమానస్పదంగా చూసాడు…. అర్జున్ చూస్తున్న గదివైపు సంజయ్ కూడా చూసాడు…. రాహుల్ ఆ గదివైపు అడుగులు వేస్తున్నాడు… సంజయ్ రాహుల్ ని అనుసరించాడు. రాహుల్ గదిని చేరుతున్నాడు. “ఒరేయ్ రాహుల్ అగరా…” రాహుల్ కు అర్జున్ మాటలు వినబడడం లేదు.. అంత దూరం ఉంది… “ఒరేయ్ సంజయ్ అగరా…” అని గట్టిగా అరిచాడు…      అర్జున్… సంజయ్ అర్జున్ ని చూస్తూ… ఏమిటి అన్నట్లు సంజ్ఞ చేసాడు… అప్పుడు అర్జున్ సంజయ్ తో “ఒరేయ్ గుర్తుందా… రాహుల్ మనకు తనకు ఒక కల గురించి చెప్పేవాడు…” అప్పుడు సంజయ్ అర్జున్ తో “అవునా…?” ప్రశ్నార్ధకంగా చూస్తాడు. అకస్మాత్తుగా చినుకులు పడడం ప్రారంభం అయ్యాయి…. వెంటనే అర్జున్ సంజయ్ తో…. “ఒరేయ్ మనం ముగ్గరం వెంటనే బయలుదేరదాం” అంటాడు. వెంటనే “అవును, చినుకులు పెద్దవి కాకముందే మనం బయలుదేరదామ్” అంటూ రాహుల్ వైపు తిరిగి గట్టిగా పిలిచాడు… రాహుల్ గది తలుపును ముట్టుకోబోయి, వెనుకకు తిరిగి, అర్జున్, సంజయ్ లను చూస్తూ… “ఏమిట్రా… “ అన్నాడు సంజయ్, అర్జున్ ఇద్దరూ ఒకేసారి బయలుదేరదాం వర్షం గట్టిగా వస్తే, ఇబ్బంది పడతాం అన్నారు.” వెంటనే రాహుల్ అక్కడి నుండి… వెనుకకు వచ్చేసాడు.

మ్యాజిక్ డోర్స్ తెలుగు part – 2

సూర్యోదయం కావడంతో అర్జున్ ముఖంపై సూర్య కిరణాలు తాకాయి… వెంటనే ఒక్కసారిగా లేచిన అర్జున్, తన ప్రక్కనే పడుకుని ఉన్న గబగబా సంజయ్ ని నిద్రలేపుతున్నాడు. “ఒరేయ్ సంజయ్… లేవురా.  త్వరగా లేవు… అంటూ పిలిస్తున్నాడు. సంజయ్ మత్తుగా అటు ఇటు కదులుతూ “ఒరేయ్ ఏంట్రా…. ప్రశాంతంగా పడుకున్నవాడిని నిద్రలేపితే మహా పాపం రా… పడుకో రా బాబూ… ” అంటూ మరలా దుప్పటి ముసుగు వేసేసుకున్నాడు.

ఇక అర్జున్ చేసేది లేక మెల్లగా పైకి లేచాడు. చుట్టూ చూసి, నిదానంగా గది తలుపుల వైపు వెళ్ళాడు. ఆ గది డోర్ దగ్గరకు వెళ్ళిన అర్జున్ గది తలుపులను తాకాడు. అర్జున్ అలా తలుపులు తాకగానే వెంటనే, ఎవరో తనను తోస్తున్నట్టుగా ఒక్కసారిగా మూసి ఉన్న తలుపుల నుండి బయటకు వచ్చి క్రిందపడ్డాడు. అలా బొక్కబోర్ల పడ్డ అర్జున్ చాలా కోపంతో తలవెనుకకు త్రిప్పి చూసాడు, ఎవరు తనని వెనుక నుండి తోసేసింది? అని. అర్జున్ వెంటనే ఆశ్చర్యానికి గురి అవుతాడు. అందుకు కారణం అక్కడ తాము నిద్రించిన గది అక్కడ లేదు.

అర్జున్ చాలా ఆశ్చర్యంతోనూ, ఆందోళనగా పైకి లేచాడు. చుట్టూ కలియ చూసాడు…. ఇప్పుడు అర్జున్ కు మరింత మతి పోయినట్టయింది. ఎందుకంటే…  రాత్రి వారు పడుకున్న గది చుట్టూ బిల్డింగ్స్ ఉండేవి, గదికి బాగా దగ్గరలో వాటర్ ట్యాంక్ ఉండేది… దూరంగా ఒక చర్చి కనబడేది. ఖచ్చితంగా గది ముందర రోడ్ కు అటువైపుగా కిల్లి కొట్టు ఉండేది…. ఆ కిల్లి కొట్టు ప్రక్కనే మొబైల్ షాప్, ఆ మొబైల్ షాప్ ప్రక్కనే, మెడికల్ షాప్, ఆ మెడికల్ షాప్ ప్రక్కనే, చెప్పుల షాపు, ఆ చెప్పుల షాపు ప్రక్కనే కిరాణా కొట్టు ఇలా వరుస క్రమంలో కొట్లు ఉండే బిల్డింగ్ ఇప్పుడు అక్కడ లేదు.  వాటర్ ట్యాంక్ లేదు, చర్చి లేదు, అదంతా గడ్డితో పెరిగిన బీడు భూమి మాదిరిగా ఉంది. అక్కడక్కడా పెద్ద వివిధ రకాల చెట్లు ఉన్నాయి… కొన్ని చోట్ల కంపలతో గుబురు గుబురుగా పెరిగిన పొదలు కనబడుతున్నాయి.

సూర్యుడు భూమిపై మరింత వేడిని పెంచుతున్నాడు… ఆ వేడికి దుప్పటి కప్పుకున్న సంజయ్ కు చెమటలు పడుతుండడంతో నిద్రలేచాడు… అలా ప్రక్కపైనే కూర్చుని ఆ గదంతా చూసాడు. రాత్రి తన ప్రక్కన పడుకున్న ఇద్దరూ ఎక్కడ? అన్నట్టుగా గదిలో చూసాడు. ఎవరూ కనబడలేదు… గది మొత్తం నిశబ్దంగా ఉంది…. “వీరు ఏమయ్యారు?” అనుకుంటూ ఆలోచించాడు…. అర్జున్ తనని నిద్రలేపడం గుర్తుకు వచ్చింది. అయితే అర్జున్ ఎందుకు కంగారుగా తనని నిద్ర లేపాడు? రాహుల్ ఏమయ్యాడు? అతని బుర్రలో ప్రశ్నల పరంపర ప్రారంభం అయ్యింది?

మ్యాజిక్ డోర్స్ తెలుగు part – 3

మనిషికి ఆలోచించడం ఒక వరం, అతిగా ఆలోచించడం ఒక వ్యసనం. మనిషికి త్రాగుడు వ్యసనంగా ఉంటే, అది తీరాలంటే అతనికి డబ్బు కావాలి. కానీ అతిగా ఆలోచించడం అనే వ్యసనానికి ఎటువంటి సోర్స్ అవసరం లేదు… లోపలే ఉంటూ లోపలే మనస్తాపానికి గురిచేస్తుంది. సరే… కధలోకి వెళితే

తన మిత్రులు ఏమయ్యారు? అని ఆలోచన చేస్తూ, గదిలో కూర్చున్న సంజయ్ కు రకరకాల ఆలోచనలు వస్తున్నాయ్… అర్జున్ ఏమయ్యాడు? ఎవరైనా వచ్చారా? రాహుల్ ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇద్దరిని రాత్రికి రాత్రే గది నుండి బయటకు తీసుకువెళ్ళిన శక్తి ఏమిటి? అనుకుంటూ ఉన్న సంజయ్ మనసులో పరిపరి విధాలుగా ఆలోచనలు సాగుతున్నాయి. సంజయ్ తలకాయ అడ్డంగా అటు ఇటూ ఊపుతూ, పైకి లేచాడు…. “ఎవరు ఇక్కడ? ఏం చేస్తున్నారు? నా మిత్రులు ఏరి? ఎవరైనా ఉన్నారా?…” అంటూ గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకున్నాడు. అలా తాను గట్టిగా రియాక్ట్ కావడానికి కారణం, ఆ రాత్రి ముగ్గురు మిత్రులు గదిలోకి వచ్చి పడుకున్నారు.. కానీ సంజయ్ లేచి చూసేటప్పటికి గదిలో తను ఒక్కడే ఉన్నాడు…. దీనిలో ఆశ్చర్యం ఏముంది? ఇతను లేవకముందే మిగిలిన ఇద్దరూ నిద్ర లేచి బయటకు వెళ్లి ఉంటారు కదా? సంజయ్ అలా అనుకునేవాడే కాకపోతే, ఆ గదిలోపలే డోర్ లాక్ చేసి ఉంది.

సంజయ్ భారంగా కళ్ళు తెరిచాడు…. వెంటనే తన కళ్ళను చేతులతో నలుపుకుని మరలా చూసాడు…. తన కళ్ళు మూయకముందు, తనకెదురుగా ఎవరు లేరు, కానీ కళ్ళు మూసి తెరిచేటప్పటికి, తనకెదురుగా ఎదురుగా నిలబడింది ఎవరు? అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. సంజయ్ సంశయంలో ఉండగానే, సంజయ్ తో సంజయ్ కు ఎదురుగా నిలబడి ఉన్న ఆకారం మాట్లాడుతుంది.

“చూడు సంజయ్ జీవితంలో అవకాశాలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. వాటిని ఉపయోగించుకోకపోతే, ఆ వ్యక్తీ జీవితం వృధా ప్రయాసే అవుతుంది. కాని మంచి అవకాశం అనేది, ఎప్పుడో ఒక్కసారి మాత్రమే జీవితంలో వస్తుంది. అది అమితమైన ఆనందాన్ని పంచుతుంది. ఇప్పుడు నీకు అటువంటి ఆనందాన్ని అందుకునే అవకాశం వచ్చింది. నీవు ఉపయోగించుకుంటావు అని నేను అనుకుంటున్నాను” అంటూ అనుమానంగా చూస్తున్న సంజయ్ తో మరలా “ఏమిటి అలా చూస్తున్నావ్?” అనే ప్రశ్న వేసింది.

దాంతో సంజయ్ “ఎవరూ లేకుండా ఒంటరిగా పరిచయంలేని అమ్మాయితో మాట్లాడడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సాదారణంగా సినిమాలలో చూపించే అందమైన అమ్మాయి ఎదురుగా నిలబడడం అంటే, ఎప్పుడైనా చూస్తామా అనుకునే అందం ఎదురుగా నిలబడ్డట్టు అయితే, ఒక కధను చదువుతూ ఊహించుకున్న అమ్మాయి ఎదురుగా నిలబడడం అంటే, నాకు మాటలు ఎలా వస్తాయి? … అంటూ ఆమెను చూసాడు.

మ్యాజిక్ డోర్స్ తెలుగులో మాయా తలుపులు

0 responses to “మ్యాజిక్ డోర్స్ తెలుగులో మాయా తలుపులు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Go to top