సైరా నరసింహారెడ్డి తెలుగు చారిత్రక చలనచిత్రం

సైరా నరసింహారెడ్డి

తెలుగు వెర్షన్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ తో సైరా నరసింహారెడ్డి సినిమా ప్రారంభం అవుతుంది. అనుష్క ఎంట్రీతో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం గురించిన వివరణ ప్రారంభం అవుతూ ఆరంభం అధరగొడుతుంది.

నరసింహారెడ్డి జాతరలో ఎద్దుల భారీ నుండి ప్రజలను కాపాడడంతో బాటు ఎద్దుల ప్రాణాలను కూడా కాపాడడం చాలా ఆకట్టుకుంటుంది. బ్రిటిష్ దొర నరసింహారెడ్డి సహచరుడికి గుండు కొట్టించి పంపించడంతో, ఆ బ్రిటిష్ దొరను టైము చెప్పి చంపుతానని శపధం చేసి మరి ఊరి ప్రజలు చూస్తుండగా అతనిని చంపే యాక్షన్ సన్నివేశాలు బాగుంటాయి.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లక్ష్మికి ఇచ్చిన మాట తప్పడంతో, లక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు నరసింహారెడ్డి మాటలు ఆకట్టుకుంటాయి. ఆ మాటలు స్పూర్తితో లక్ష్మి ఉద్యమ స్ఫూర్తిని అందరిలో నింపుతూ, తమిళ ప్రజల వరకు ఉద్యమాన్ని తీసుకువెళుతుంది.

ఊరిబాగు కోసం యజ్ఙంలో భాగంగా సిద్దమ్మ చిన్ననాడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో తాళి కట్టించుకుని, అతనే లోకంగా బ్రతకుతుంది. మరలా సిద్దమ్మ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక్కటవటం కూడా ఊరి కరువు తీర్చే యజ్ఙంలో భాగంగానే జరుగుతుంది. ఇంకా ఉద్యమం కోసం కూడా వారు విడివిడిగా జీవించడానికి ఇష్టపడతారు. వీరిద్దరి మద్య ఈ సన్నివేశాలే ఉన్నా అవి మనసుని స్పందింపజేస్తాయి.

క్లైమాక్స్ ఈ సినిమాకు ఆయువుపట్టు, మనం తలతిప్పుకోకుండా నిడివి ఎక్కువైనా ఆ ఎమోషనల్ సీన్స్ ను చూస్తూనే ఉంటాం. తెలుగువాడి పౌరుషం నయవంచనకు గురి అయ్యి, అతని తల తెంచి, కోటగుమ్మానికి వ్రేలాడదీస్తే, కంటతడిపెట్టని తెలుగువాడు ఉండడు.

సుదీప్ చేసిన పాత్ర చాలా చాలా బాగుంటుంది. చిరంజీవి గురువుగా అమితాబ్ నటన, తమన్నా పాత్ర ఆకట్టుకుంటే, ఒక స్వాతంత్ర్య పోరాటయోధునిగా మెగాస్టార్ చిరంజీవి పాత్రలో ఒదిగిపోయాడు.

సమాజానికి స్పూర్తినిచ్చే సినిమాలు సమాజంలో అవసరం అనే విషయం సామాజిక వేత్తల అభిప్రాయంగా కూడా ఉంది. అవును మంచి సినిమాల ద్వారా ఇచ్చే సందేశం, చారిత్రక సినిమాల ద్వారా ఇస్తే దాని స్పూర్తి ప్రభావం మరింత ఉంటుంది. అటువంటి చారిత్రక సినిమాను తీసిన రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి టీమ్ ని ఖచ్చితంగా అభినందించాలి.

దేశభక్తి సినిమా అంటే అందరిలో దేశభక్తుడుగా ఒక పెద్ద హీరో ఎలా నటించాడో అన్న ఆత్రుత ఉంటుంది. ఆంగ్లేయులపై తిరగబడ్డ తొలి భారతీయుడు అనగానే ఇంకా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపించిన మెగాస్టార్ చిరంజీవి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సపోర్టు ఇచ్చిన మిగిలిన పాత్రలను వెండితెరపై చూడడానికి రివ్యూతో పనిలేకుండానే చూడాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది.

కుటిల రాజకీయాలు చేస్తూ, భారతీయుల పౌరుష పరాక్రమాలను తమకు అనుకూలంగా మార్చుకునే బ్రిటిష్ పాలన, మనదేశాన్ని పట్టి పీడించింది. అట్టి పాలకులను ఎదురించిన మన భారతీయుల చరిత్రను తిరిగి తెరపై చూడడమంటే ఎంతో సంతోషం.

ఫిక్షన్ స్టోరి అయిన బాహుబలి సినిమాతో అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన సాధించన తెలుగు సినిమా ఇండస్ట్రీనుండి వచ్చిన మరో భారీ ప్రొజెక్టు ఈ సినిమా. ఇప్పుడు చారిత్రాక అంశంతో వస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా అందరూ చూసి, మన దేశ చరిత్ర గురించి తెలుసుకోవాలి.

తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి