పుణ్యభూమి నాదేశం సామాన్యుడి ఆవేదన

పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదాస్మరామి

పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్యభూమి నాదేశం సదాస్మరామి అంటూ అన్న నందమూరి తారకరామారావుగారు మేజర్ చంద్రకాంత్ చిత్రంలో పాడితే, ఆ చిత్రంలో హీరోగా నటించిన మోహన్ బాబు పుణ్యభూమి నాదేశం అంటూ సందేశాత్మక చిత్రం తీసారు. రెండింటికి నిర్మాత కధానాయకుడు మోహన్ బాబుగారే.

నటినటులు: మోహన్ బాబు, మీనా, శుభశ్రీ, బ్రహ్మానందం, బాబూమోహన్, దాసరి నారాయణరావు,
దర్శకుడు: ఏ కోదండరామిరెడ్డి
నిర్మాణం: శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్,
నిర్మాత: మోహన్ బాబు

పుణ్యభూమి నాదేశ తెలుగు చలనచిత్ర కధ

స్వాతంత్ర్య సమరయోధుడు తాతాజీ తన మనవడు భరత్ అనే బాలుడుతో  తాతగారు పెన్షన్ కోసం పెన్షన్ ఆఫీసుకి వెళతాడు. అక్కడ భరత్ ప్రభుత్వ అధికారులతో గొడవపడితే తాతగారు ప్రభుత్వ అధికారికి క్షమాపణ చెప్పమని చెబుతాడు. అప్పటిదాక బాగా చదువుకునే భరత్ ఆ సంఘటనతో తన పంధా మార్చుకుంటాడు. స్కూల్ మానేసి స్నేహితులతో ఆటలు ఆడుతూ చెడు అలవాటులకు చేరువ అవుతాడు. ఆఖరికి తాతాజీ గారి ఇచ్చిన స్వాతంత్ర్య సమరయోధుడు తామ్రపత్రాన్ని కూడా తాకట్టు పెట్టి చెడు తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటాడు. ఈ విషయాలు తాతాజీగారికి తెలిసి గుండెపోటుతో మరణిస్తాడు. భరత్ ని ఆమె తల్లి ఇంటి నుండి తరిమి కొడుతుంది.

అలా ఇంటినుండి వెళ్ళిన భరత్ బంగారయ్య అనే పిసినారి కొడుకుని కాపాడి అతని దగ్గర చేరతాడు. బంగారయ్యకి లక్ష్మి కాలనీ ఉంటుంది, ఆ కాలనీలో అద్దె వసూలు చేస్తూ అదే లక్ష్మికాలనీలో భరత్ పెరుగుతాడు. సమాజంలో చెడుపై స్పందిస్తూ పత్రికల్లో కధనాలు వ్రాస్తూ జర్నలిస్ట్ స్వాతి అదే కాలనీలో ఉంటుంది. చైతన్యవంతంగా ఆలోచన చేస్తూ సాదారణంగా కాలనీ తిరిగే భరత్ కి జర్నలిస్ట్ స్వాతికి వాదం జరుగుతూ ఉంటుంది. బంగారయ్య కొడుకు శ్రీపతి కూతురు ఇద్దరు ప్రేమించుకుంటారు. అయితే బంగారయ్య శ్రీపతి ఇద్దరూ బాల్యమిత్రులు, వారిద్దరి వివాహం కాయం చేస్తారు. బంగారు తనకొడుకుతో బాటు భరత్ పెళ్లికూడా చేయాలనీ చూస్తాడు.

శ్రీపతి ద్వారా లక్ష్మికాలనీ భూమి అంతా గనితో నిండి ఉందని, మంత్రికి, గుండా కాళీకి, ఆవులయ్యకి తెలుస్తుంది. ఎలాగైనా లక్ష్మికాలనీ కాళీ చేసి ఆ గనిని స్వాధీన పరుచుకోవాలని చూస్తారు. లక్ష్మి కాలనీ మతగొడవలు సృష్టించి, ఆ కాలనీ స్వాదీనపరచుకోవాలని చూస్తారు, అయితే భరత్ మాటలతో కాలనీ వాసులు తేరుకుని వచ్చిన ఆవులయ్య, మంత్రిని, పోలీసులని, శ్రీపతిని రాళ్ళతో కొట్టి వెనుకకు పంపిస్తారు. కాళి బంగారయ్యతో లక్ష్మికాలనీ తనకు అమ్మేసినట్టు పత్రాలు వ్రాయించుకుని బంగారయ్యని తన మనుషులతో చంపించేసి, లక్ష్మికాలనీలో చెట్టుకు వ్రేలాడదీస్తారు.

భరత్ కాళీ, శ్రీపతి, ఆవులయ్య మొదలైన దుర్మార్గులను కాల్చి చంపుతాడు, కోర్ట్ భరత్ కి ఉరిశిక్ష విధిస్తుంది. తనని నాలుగు గోడలమధ్య కాకుండా నలుగురి మద్య భగత్ సింగ్ మైదానంలో ఉరి తీయలవసినదిగా భరత్ ఆఖరికోరికగా తెలియజేస్తాడు. అందరు చూస్తూ ఉండగా ఉరి తీయబోతున్న సమయంలో కోర్టు వారు ఉరిశిక్ష రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తారు. కాని కాల్పులలో మరణించని కాళి మరలా తుపాకీతో అక్కడ దాడి చేస్తాడు. భరత్ కాళిని చంపడంతో చిత్రం ముగుస్తుంది.

సందేశాత్మక సామజిక ఇతివృత్తం పుణ్యభూమి నాదేశం చలనచిత్రం

మొండివాడు రాజుకంటే బలవంతుడు అని భరత్ ని చూసి అంటారు ఈ చిత్రంలో బంగారయ్య పాత్రలో దాసరి నారాయణరావు గారు. నీ మాటల తూటాలు, నీ మాటలతో విప్లవ జ్వాల వెలిగించు అని భరత్ ని చూసి అంటుంది జర్నలిస్ట్ స్వాతి. భరత్ ని మావయ్య అంటూ పిలిచి ఒక కుర్రవాడు కధ చెప్పమంటే, అందుకు భరత్ బ్రతకలేక చావడం చావలేక బ్రతకడం ఇదే పెద్ద కధ అని చెబుతాడు. అయితే భరత్ కాలనీలో అన్యాయాన్ని భరిస్తూ బ్రతికేవారిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. కులమతాలను వాడుకుంటూ సమాజంలో రాజకీయం చేసే నాయకులంటే ఏవగింపుగా ఉండే భరత్ వారిని ఎదురించడంలో చూపించే ధైర్యం లక్ష్మికాలనీ వాసులకు మార్గదర్శకంగా ఉంటుంది.

కులం అనేది బంధాలను సక్రమంగా పెంచుకునే ప్రక్రియలో భాగంగా అనేక కుటుంబవ్యవస్థలను కలిగి వర్ణ వ్యవస్థగా ఏర్పడినది. అంతేకాని కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ వ్యాపారం చేయమని లేక కులాన్ని అడ్డుపెట్టుకుని చెడుని సమర్ధించమని కాదు. మతం అనేది జీవనమార్గంలో నిచ్చెన ఎక్కే సాధనా సంప్రదాయం కాని ప్రచారం చేసుకునే ప్రక్రియ కాదు, పారమార్ధిక ధర్మాలను పదిమందికి తెలియపరచడమే మతం అవుతుంది కానీ ఒకరి సిద్దాంతాలు ఇంకొకరిపై రుద్దడం మతం అవదు.

పుణ్యభూమి నాదేశం చిత్రం అంతా సమాజంలో ఉండే కులమత ఘర్షణలు వాటిపై అజ్ఞానంతో ఆలోచనచేసే లక్ష్మి కాలనీ వాసులను చూపుతూ ఉంటుంది. వాటిని చూస్తూ నవ్వుకునే భరత్ వారికోసమే దుష్టశిక్షణ చేస్తాడు. మతంపేరుతో మోసం చేసే వారు మోసపోయేవారు, భయం సమాజంలో ఎలా వ్యాపించి ఉందో, ఈ చిత్రం చూపుతుంది. భరత్ పాత్రలో మోహన్ బాబు, బంగారయ్యగా దాసరి నారాయణరావు, స్వాతిగా మీనా, శ్రీపతిగా గొల్లపూడి మారుతిరావు, అవులయ్యా గా ఏవిఎస్, భరత్ తల్లిగా అన్నపూర్ణ నటించారు.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్

Enable Notifications    Ok No thanks