సోమవారంలో శివునిపై భక్తిని తెలిపే తెలుగుమూవీస్

సోమవారం పరమశివుని గూర్చి పరమభక్తి చిత్రాలు
బుక్ రీడింగ్ అలవాటున్న మీ స్నేహితులకు షేర్ చేయండి

సోమవారం తెలుగు భక్తి సినిమాలు

సోమవారం చంద్రుడు అయితే చంద్రుడిని శిరస్సుపై ధరించిన చంద్రశేఖరుని పూజించడంకన్నా మిన్న ఏముంది. పరమశివుడికి ప్రీతికరమైన రోజుగా సోమవారం చెబితే, సోమవారం శివుని పూజించడం, శివుని లీలలను తెలిపే ఓ భక్తి చిత్రం సాయం సమయంలో చూడడం వలన మన మనసులో శివునిపై ధ్యాస పెరుగుతుంది. పరమశివుని ఈశ్వరునిగా చెబుతారు. అప్పుడు ఏదైవ స్వరూపానికైనా ఈశ్వరుడు పూజనీయుడు అయితే, పరమశివుని పూజించడంతో పరమ శ్రేయష్కరంగా చెబుతారు. పరమశివుని గురించి తెలిపే తెలుగుసినిమాలలో దక్షయజ్ఙం తెలుగుమూవీ చాలా బాగుంటుంది.

దక్షయజ్ఙం తెలుగుఇతిహాస చిత్రంలో ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు తదితరులు అత్యద్భుతంగా నటించి మెప్పించారు. ఈ చిత్రం గురించి విషయాలు చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి. పరమశివుడు మంజునాధునిగా మంజునాధుని అనే భక్తుడిని కరుణించిన భక్తిగాధ మనకు పరమశివునికి భక్తునిపై ఉండే ప్రేమ కనబడుతుంది. శ్రీమంజునాధ తెలుగుసినిమాలో చిరంజీవి, మీనా, అర్జున్, సౌందర్య తదితరులు నటించారు. శ్రీమంజునాధ గురించి చదవడానికి ఇక్కడ ఇవే అక్షరాలను తాకండి. పరమశివుని ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యుడ అలిగితే శివునిలీలలను పార్వతి మాత కుమారస్వామికి చెప్పిన గాధను తెలిపే శివలీలలు తమిళ డబ్బింగ్ తెలుగు మూవీ. ఈ శివలీలలు సినిమా గురించి చదవడానికి ఈ అక్షరాలను తాకండి.

దక్షయజ్ఙం యూట్యూబ్ మూవీ చూడడానికి ఇక్కడ టచ్ / క్లిక్ చేయండి.

శ్రీమంజునాధ యూట్యూబ్ మూవీ చూడడానికి ఇక్కడ టచ్ / క్లిక్ చేయండి.

శివలీలలు యూట్యూబ్ మూవీ చూడడానికి ఇక్కడ టచ్ / క్లిక్ చేయండి.

మహాశివరాత్రి గురించి తెలియని భక్తుడు ఉండడు. శివుని ప్రసన్నం చేసుకోవడంలో మహాశివరాత్రి పర్వదినం భక్తులకు చాలా సులభం చేస్తుంది. భక్తితో మహాశివరాత్రి రోజున త్రికరణ శుద్దితో శివుని ఆరాధిస్తే, శివధ్యానం మనసులో మెదిలితే, ఆ మనిషి జీవితం దశ మారినట్టే అంటారు. అంతటి పర్వదినం అయిన మహాశివరాత్రి గురించిన తెలిపే మహాశివరాత్రి తెలుగు భక్తిమూవీ యూట్యూబ్ ద్వారా చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి. ఇంకా శివరాత్రి మహత్యం గురించి తెలిపే శివరాత్రి మహాత్యం తెలుగు భక్తి సినిమా యూట్యూబ్ ద్వారా చూడడానికి ఇక్కడ టచ్ / క్లిక్ చేయండి.

కాళహస్తిలో మహాశివరాత్రి పర్వదినాన ఒక బోయవానిని అనుగ్రహించిన శివరాత్రి మహిమను తెలిపే కాళహస్తి మహత్యం సినిమాను యూట్యూబ్ ద్వారా వీక్షించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

విష్ణువుతో విరోధ భావన పెంచుకుంటూ, శివునితో భక్తితో మెసిలే పాత్ర రావణ పాత్ర. మాయచేత శివకేశవుల బేధం చూసే రావణాబ్రహ్మ పరమశివ భక్తుడు అంటారు. ఎంతటి శివభక్తుడో అంతటి విష్ణు విరోధి. ఈ వైరుధ్యభావనలో పరమశివుడినే తన ఇంట కొలువు తీర్చాలనే కాంక్షతో శివుని ఆత్మలింగం కోసం తపస్సుచేసే రావణాసురుడు గాధని తెలిపే పౌరాణిక సినిమా భూకైలాస్(1940). ఈ తెలుగు భక్తి మూవీని యూట్యూబ్ ద్వారా చూడడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ధన్యవాదాలు మరిన్ని శివభక్తి తెలుగుసినిమాలను క్లుప్తంగా తెలుపుతూ యూట్యూబ్ లింకును కూడా షేర్ చేస్తాను. మరలా తెలుగురీడ్స్ వెబ్ సైటులో సోమవారంలో శివునిపై భక్తిని తెలిపే తెలుగుమూవీస్ పేజిని విజిట్ చేయండి.

తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి.