Telugu Bhāṣā Saurabhālu

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు అంటారు. నేటి మొక్కలు రాబోయే కాలంలో చెట్లు. నేడు నేలలో నాటిన మొక్క భవిష్యత్తులో ఆక్సిజన్ అందించే చెట్టు. మొక్కగా ఉన్నప్పుడు చెట్టుని రక్షిస్తే, అది పెరిగి మానై మనకు ఆక్సిజన్ అందించే చెట్టుగా మిగులుతుంది. చెట్టు ఆయుష్సు చాలా ఎక్కువగా ఉంటుందంటారు. అంటే మొక్కలు మానులుగా మారితే, అవి కొన్ని తరాలకు ప్రకృతిని పచ్చగా ఉండడంలో సాయపడతాయి.

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు

ఇప్పటికే ఉన్న భారీ చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు, అవి ఎప్పుడో నేలలో నాటుకుని ఉన్నాయి. అందువలన మనకు ప్రకృతి ఒడిలో సహజంగా లభించే గాలితో ప్రశాంతత చేకూరుతుంది.

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు

ఎప్పుడో నేలలో పాతుకుపోయిన చెట్లు గాలి స్వచ్ఛంగా ఉండడానికి ఉపకరిస్తే, వాటిని తొలగించడం ప్రకృతి పర్యావరణంలో సమతుల్యత లోపిస్తుంది అంటారు. కావున అనవసరంగా చెట్టు తొలగించడం శ్రేయస్కరం కాదు అంటూ ఉంటారు.

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు

ఒక వేళ ఒక చోట ఒక చెట్టు అడ్డంగా అనిపిస్తుంటే, ఆ చెట్టుకు బదులు ఎక్కువ మొక్కలు నాటి, వాటిలో వీలైనన్ని మొక్కలు వృక్షాలుగా మారే వరకు ప్రయత్నం చేయాలి అని అంటారు. ఎదుగుతున్న క్రమంలో చాలా కాలం కరిగిపోతుంది కానీ పడిపోవడానికి అట్టే సమయం అవసరం లేదు.

గాలి నీరు నేల మీద సమృద్ధిగా ఉండాలి. ప్రకృతి ప్రసాదించిన వరాలు, వాటిని సక్రమంగా వాడుకునే విధానం శ్రేయస్కరం. కానీ అవి కలుషితం అయ్యేలా మానవ చర్యలు ఉండరాదు.

చెట్లు మనకు స్వచ్చమైన గాలి అందించడంలోను, సమయానుకూలంగా వానలు కురవడానికి ముఖ్యంగా పర్యావరణ సమతుల్యతకు ఉపకరిస్తాయి అంటారు.

మన ముందు తరం వారు చెట్లకు చేటు చేయకుండా, వాటిని తొలగించడం చేయకుండా, జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి మన మనుగడకు ప్రకృతి సహకరిస్తూ ఉంటే, చెట్లను తొలగించడం చేస్తూ, ప్రకృతి పర్యావరణం దెబ్బ తింటే భవిష్యత్తు తరాలకు ప్రకృతి సహజత్వం అందుతుందా?

మనం కూడా ప్రకృతిలో భాగమై ఉన్నాం. కాబట్టి ప్రకృతి నుండి లభిస్తున్న ఆహారం తీసుకోవడం జరుగుతుంది. మన మనుగడకు నిత్యం అవసరమైన గాలి స్వచ్ఛంగా సమృద్ధిగా లభిస్తుంది అంటే కారణం ప్రకృతి. నీరు, నిప్పు ప్రకృతి నుండి లభిస్తున్నాయి.

పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు కావున మన ప్రకృతిని ఆస్వాదిస్తూ, ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా చెట్లను కాపాడే ప్రయత్నం చేయాలి. నేటి మొక్కలు రేపటి చెట్లు, నేటి చెట్లు ఏనాడో మన పెద్దలు ముందుచూపుతో నాటినవి. లేదా ప్రకృతి మనకు చేసిన మేలు.

0 responses to “పచ్చని చెట్లు ప్రకృతి ప్రసాదించిన వరాలు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Go to top