గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం

గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం. అనేక బ్లాగులు. అనేకమంది నిర్వహించే బ్లాగులు అనేక బ్లాగులలో అనేకమంది వ్రాసిన, వ్రాస్తున్న బ్లాగు పోస్టులు. అనేక బ్లాగు పోస్టులలో అనేకానేక విషయాలు. అనేక విషయాలలో అనేక సమస్యలు, అనేక విధానాలు, అనేక కధనాలు, అనేక సంఘటనలు, అనేక మార్గాలు…. ఇలా అపరిమితంగా విషయాల గురించి విశ్లేషించే వ్యాసాలు బ్లాగు పోస్టుల రూపంలో ఉంటే, అవి గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా మనకు లభిస్తాయి.

 

telugu ammayi perlu vetakadaniki ee pai photo pai click / touch cheyandi.

ఆన్ లైన్లో ఏది సెర్చ్ చేయడానికైనా గూగుల్ ముందుగా ఉపయోగిస్తాము. ఏదైనా గూగుల్ ద్వారా వెతకడం అలవాటు అయ్యింది. స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా గూగుల్ వాడకం ఎక్కువ. వాయిస్ సెర్చ్ చేయడం…. ఇలా ఏదైనా, ఎలాంటి విషయమైనా గూగుల్ ద్వారా సెర్చ్ చేయడం అందరికీ అలవాటు.

గూగుల్ సెర్చ్ చేయడం గురించి, అన్నీ గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవడం

గూగుల్ సెర్చ్ చేయడంతో, చాలా విషయాలు మనకు గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. కేవలం గూగుల్ సెర్చ్ చేయడం వలననే మనకు విషయాలు తెలుస్తాయనే ఆలోచన కూడా కొంతమందికి ఉండవచ్చును. ఇలా గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా మనం తెలుసుకునే విషయాలను బట్టి గూగుల్ ద్వారా ఇతరులు మనయొక్క ఆసక్తిని గమనిస్తారు.

ఆన్ లైన్లో గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా మనం తెలుసుకునే విషయాలను బట్టి గూగుల్ ద్వారా ఇతరులు కూడా మన ఆసక్తిని గమనిస్తారు.

ఎందుకంటే… గూగుల్ సెర్చ్ ఇంజన్లో వెతికే విషయాలను గూగుల్ ట్రెండ్స్ రూపంలో ఒక డేటాగా అందిస్తుంది. ఇంకా ఎప్పటికప్పుడు సెకన్ల వ్యవధిలో సెర్చ్ చేసే విషయాలను కూడా పాపులర్ పదాలుగా లైవ్ డేటాను కూడా గూగుల్ అందిస్తుంది. సో మన యొక్క ఐపి అడ్రస్ ను బట్టి గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా మనం తెలుసుకునే విషయాల ఆధారంగా, మనకు తెలియనివారు మన యొక్క ఆసక్తిని కనిపెట్టే అవకాశం ఉంటుంది. ఇలా మన ఆసక్తిని కనిబెడితే, దానిని బట్టి మన యొక్క ఫోన్లలో యాడ్స్ వస్తూ ఉంటాయి.

విషయాలను గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకుంటే, ఇతరులకు తెలుస్తాయి? సాక్ష్యం ఏమిటి?

ప్రతి ఫోనులోనూ ఒక బ్రౌజరు ఉంటుంది. ప్రతి ఫోనులో వివిధ రకాల యాప్స్ ఉంటాయి. అయితే కొన్ని వెబ్ సైట్లను బ్రౌజరులో ఓపెన్ చేస్తాము. కొన్ని యాప్స్ ప్రత్యేకంగా ఇన్ స్టాల్ చేసుకుని వాడుతూ ఉంటాము. మనం ఉపయోగించే బ్రౌజరులోనే మనం గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా విషయాలను చూడగలుగుతాము. అలా బ్రౌజరులో మనం చూసే విషయాల మద్య మద్య యాడ్స్ కనబడుతూ ఉంటాయి. అలా కనబడే యాడ్స్ అందరి ఫోనులోనూ ఒకే యాడ్స్ కనబడవు. కొందరికి ఒక రకమైన యాడ్స్ కనబడితే, మరి కొందరికి మరొక రకమైన యాడ్స్ కనబడతాయి. ఒకే వెబ్ సైటు వివిధ ఫోన్లలో అంటే ఇతర జిమెయిల్ ఉండే ఇతర ఫోన్లలో ఓపెన్ చేస్తే అదే వెబ్ సైట్లలో ఒక్కొక్క ఫోనులో ఒక్కొక్క రకమైనా యాడ్స్ కనబడే అవకాశం ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? అంటే గతంలో ఏఏ ఫోన్లలో ఎటువంటి సెర్చ్ జరిగిందో? అటువంటి సెర్చ్ ఆధారంగా యాడ్స్ కనబడుతూ ఉంటాయి. అంటే ఆయా ఫోన్లలో గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకున్న విషయాలు, సదరు ఫోను వాడకందారు యొక్క ఆసక్తిగా రికార్డ్ అయ్యినట్టే… ఆ రికార్డు ఆధారంగా యాడ్స్ ఒకే వెబ్ సైట్ అయినా వివిధ ఫోన్లలో వివిధ రకాల విషయాలలో యాడ్స్ వస్తూ ఉంటాయి.

గూగుల్ సెర్చ్ చేయడం గురించి ఎందుకు ఆలోచించాలి?

ఎందుకంటే…. మన ఆసక్తి గురించి మనకు యాడ్స్ కనబడుతున్నాయంటే, మన ఆసక్తి ఏమిటో… మన జిమెయిల్ ఖాతాలో రికార్డ్ అవుతున్నట్టేగా… అదే సమయంలో ప్రతిభావంతులైన హ్యాకర్స్ అయితే మన యొక్క ఆసక్తిని తెలుసుకునే అవకాశాలు ఎక్కువ. చిన్న పిల్లవాని చేతికి ఏదిబడితే అది చిక్కితే ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. అలాగే మన ఆసక్తి అపరచితులకు తెలియడం కూడా శ్రేయష్కరం కాదు. అందుకనే గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా మనం తెలుసుకునే విషయాలు కేవలం మనం తెలుసుకోవడమే కాదు ఇతరులు గమనిస్తారని గమనించాలి. గూగుల్ సెర్చ్ చేయడం గురించి అవగాహన చాలా అవసరం.

ముఖ్యంగా ఆర్ధిక లావాదేవీలు జరిగేటప్పుడు… మోసాలు ఎక్కువగా జరుగుతాయి. అలాగే స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఆర్దిక లావాదేవీలు జరుపుతూ ఉంటారు. సో స్మార్ట్ ఫోన్ ను హ్యాక్ చేయగలిగితే, స్మార్ట్ ఫోను వినియోగించేవారి ఖాతా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. హ్యాకర్లకు ఇటువంటి అవకాశం మన గూగుల్ సెర్చ్ చేసే విషయాసక్తిని బట్టి మరియు గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా మనం క్లిక్ చేసే లింకుల సాయంతో హ్యాకర్లు మన ఫోను హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ అంటారు.

అందుకనే గూగుల్ సెర్చ్ చేయడం గురించి ఆలోచించాలి అంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ లింకులు గురించి సెర్చ్ చేయడం, అలా గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా వచ్చిన లింకులలో ఏ లింకు మనకు కావాల్సిన బ్యాంక్ యొక్క అధికారిక లింక్ ఏది సెక్యురిటీ లేని లింక్ గమనించాలి. అలా కాకుండా గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా వచ్చే లింకులలో ఏది బడితే అది క్లిక్ చేస్తే మన పరికరం పరుల నియంత్రణలోకి పోతుందని అంటారు.

గూగుల్ సెర్చ్ చేయడంలో ఏది సెర్చ్ చేస్తే గూగుల్ లింకులు చూపుతుందో?

మొబైల్ ద్వారా గూగుల్ సెర్చ్ చేస్తూంటే, ఆ యొక్క గూగుల్ క్రోమ్ బ్రౌజరులో సెర్చింగ్ విషయాల లింకులను చూపుతుంది. మనం గూగుల్ ద్వారా సెర్చ్ చేసిన విషయానికి సంబంధించిన వెబ్ సైటు లింకు మాత్రమే క్లిక్ చేయడం వలన మన ఫోనుకు నష్టం జరగదని అంటారు. కానీ మొబైల్ ద్వారా గూగుల్ సెర్చ్ చేస్తూ, అది బ్రౌజరులో చూపించే అన్ని లింకులను గమనించకుండానే, ఏదిబడితే అది క్లిక్ చేస్తే మాత్రం ఫోన్ హ్యాక్ గురై, మీ ఫోనులోని సమాచారం ఇతరులకు తెలిసే అవకాశం ఎక్కువ.

ప్రధానంగా గూగుల్ సెర్చ్ చేయడం గురించి ఆలోచించవలసినదేమిటి?

గూగుల్ సెర్చ్ మనం సెర్చ్ చేసిన అంశం ఆధారంగా ఆన్ లైన్ సర్వరులో అందుబాటులోఉండే సమాచరపు లింకులను చూపుతుంది. ఆయా లింకులతో బాటు గూగుల్ సెర్చ్ పెయిడ్ యాడ్స్ కూడా చూపుతుంది. అంటే మనం ఆన్ లైన్ బ్యాంక్ ఖాతా ఎలా తెరవాలి? అని గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవాలని అనుకుంటే?

గూగుల్ సెర్చ్ లో ఆన్ లైన్ బ్యాంక్ ఖాతా ఎలా తెరవాలి? అంటూ టైపింగ్ చేయడం లేదా మొబైల్ అయితే వాయిస్ సెర్చ్ చేయడం చేస్తాము. అప్పుడు కొందరు ఔత్సాహికులు వ్రాసిన బ్లాగు పోస్టులు ఓపెన్ అవుతాయి. ఆన్ లైన్ ద్వారా బ్యాంక్ ఖాతా ఎలా తెరవాలి అంటూ వివరించే వివిధ పోస్టుల లింకులను గూగుల్ చూపుతూ… ఆయా బ్యాంకులు ఇచ్చే యాడ్స్ ను కూడా చూపుతుంది. అలా యాడ్స్ మాత్రమే కాకుండా…. హ్యాకర్స్ సృష్టించే డూప్లికేట్ సమాచార లింకులు కూడా గూగుల్ సెర్చ్ లో కనబడే అవకాశం ఉంటుంది. అటువంటి లింకులు ఓపెన్ చేస్తే, ఫోన్ హ్యాక్ కు గురి అవుతుంది.

మనం ప్రధానంగా గూగుల్ సెర్చ్ చేయడం గురించి గమనించవలసిది? ఒరిజినల్ లింకులు ఏవి? డూప్లికేట్ లింకులు ఏవి? ఏవి యాడ్స్? ఏవి మాల్ వేడ్ యాడ్స్?… ప్రధానంగా బ్లాగు లింకులు కూడా ఉంటాయి. వాటిలో సెక్యూర్ బ్లాగు లింకులే ఓపెన్ చేయాలి.

గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా ఫలితాలు ఎలా?

గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం

How to open online bank account అని గూగుల్ లో సెర్చ్ చేస్తే మొదటి పేజిలో ప్రక్క చిత్రంలో మాదిరిగా వెబ్ సైట్ల లింకులను సంక్లిప్త సమాచారంతో గూగుల్ చూపుతుంది. అందులో మొదటిగా కనబడుతున్నాయి… ప్రకటన. లింకులు. అంటే వివిధ బ్యాంకుల ఇచ్చే వాణిజ్య ప్రకటనల ఆధారంగా ఆయా బ్యాంక్ లింకులు ఓపెన్ అయ్యాయి. ఈ లింకులు https: తో ప్రారంభం అయ్యాయి కాబట్టి ఈ లింకులు సురక్షితమే… ఇంకా ఇవి అందరికీ తెలిసిన బ్యాంకులు సంబంధించినవే… అయినా బ్యాంక్ వారి వెబ్ సైట్ లింక్ ప్రకటన రూపంలో ఉన్నా దానిని పరిశీలించాలి.

ఒక ప్రసిద్ద బ్యాంక్ ఏక్సిస్ బ్యాంక్… observe the link it is https://www.axisbank.com/ ఇందులో https:// ఆంగ్ల అక్షరాలు ఇలాగే ఉంటే, ఇది సెక్యూర్ వెబ్ సైటు అంటారు. అలా కాకుండా ఇలా s లేకుండా http:// ఇలా ఉంటే మాత్రం అది సెక్యూర్ కాదని బ్రౌజరు సూచిస్తుంది. ఇప్పుడు ఇది https://www ఇలా ప్రారంభం అయింది… ఇంకా ఇందులో డొమైన్ నేమ్ చూస్తే axisbank అందరికీ తెలిసిన బ్యాంకే… ఇంకా పేరు కూడా ఎటువంటి కూడా కరెక్టుగా మ్యాచ్ అయింది… తర్వాత .com పేరు చివర ఉండే ఎక్స్ టెన్షన్… ఈ లింకు పూర్తిగా https://www.axisbank.com/ ఉంది…

అలాగే క్రిందగా ఐసిఐసిఐ బ్యాంక్ లింకు కూడా ఉంది. ఇది కూడా ప్రకటనే. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క వాణిజ్య ప్రకటన. వాణిజ్య ప్రకటనలు అయినా సమాచారం ఖచ్చితంగా ఉంటుంది.

గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం

ఇందులో కూడా ఆన్ లైన్ బ్యాంక్ ఖాతా అని గూగుల్ సెర్చ్ చేయడం వలన ప్రక్క చిత్రంలో మాదిరి వెబ్ సైట్ల లింకులు ఓపెన్ అవ్వవచ్చును. ఇందులో ప్రధమంగా SBI బ్యాంకు వారి ఖాతా వివరణ గురించి సాదారణ వెబ్ లింక్ ఉంది. అలాగే క్రిందగా onlinesbi ఎస్బిఐ ఖాతా లాగిన్ కావడానికి లింక్ ఉంది. ఇంకా క్రిందగా news18 వెబ్ సైటు వారి telugu వెబ్ పేజిలోని బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయితే పోస్టుకు సంబంధించిన క్లుప్త వివరణ మరియు పోస్ట్ లింకు కనబడుతుంది. తర్వాత యూనియన్ బ్యాంక్ సేవింగ్ ఖాతా గురించి క్లుప్త వివరణతో యూనియన్ బ్యాంక్ లింకు కనబడుతుంది.

పై విధంగా గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా వచ్చే ఫలితాలు గమనిస్తే,

ముందుగా ఇంగ్లీషులో How to open online bank account సెర్చ్ ఫలితాలు చూస్తే, అవి ఇంటర్నేషనల్ బ్యాంకులకు సంబంధించిన డేటా లింకులను బ్రౌజరులో గూగుల్ సెర్చ్ చూపుతుంది. ముఖ్యంగా ముందు ప్రకటనలు. ఇంటర్నేషనల్ కాబట్టి వాణిజ్య ప్రకటనల తాకిడి ఉంటుంది కాబట్టి ముందుగా బ్యాంకుల వాణిజ్య ప్రకటనలు వచ్చాయి. ఇంకా క్రిందికి స్క్రోలింగ్ చేస్తూ ఉంటే, నేషనల్ బ్యాంకుల గురించి లింకులు ఓపెన్ కావచ్చును. అంటే ఇక్కడ భాషను బట్టి ప్రధాన వాణిజ్య ప్రకటనలు, ప్రధాన బ్యాంకుల వివరాల లింకులు ముందుగా వస్తున్నాయి.

అలాగే తెలుగులో ఆన్ లైన్ బ్యాంక్ ఖాతా అని గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా వచ్చిన ఫలితాలు గమనిస్తే, పాపులర్ బ్యాంక్ దేశంలో ఏ ప్రాంతంలోనైనా అందుబాటులో ఉండే బ్యాంక్ వారి పోస్టు లింకు వచ్చింది. ఆ తర్వాత మరొక పాపులర్ బ్యాంక్ లింకు వచ్చింది. అంటే ఇక్కడ భాషను బట్టి ప్రాంతీయ బ్యాంకులలో పాపులర్ బ్యాంకులకు సంబంధించిన పోస్టుల లింకుల కనబడుతున్నాయి.

ఇదే విధంగా గూగుల్ మీ సెర్చ్ చేసే విషయాలను బట్టి కూడా గూగుల్ తన ఫలితాలను చూపించగలదు.

గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా వచ్చే గూగుల్ సెర్చ్ ఫలితాలను గమనించి

ఫోను ద్వారా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే, గూగుల్ ఫలితాలలో ముందుగా యూట్యూబ్ వీడియోలు కూడా రావచ్చును. అప్పుడు మీరు వీడియోలు చూడడం వలన మీరు వెతుకుతున్న విషయంలో అవగాహనతో బాటు, మీరు వెతుకుతున్న వెబ్ సైట్ లింకు కూడా ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది. కావునా గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా మీరు ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే, వాటిలో ముందుగా వీడియోలకు ప్రాముఖ్యత ఇవ్వవచ్చును.

ఇంకా మీరు గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా… ఒక పేరు మీరు టైపు చేస్తే, ఆ పేరుతో కూడిన వెబ్ సైటు… ఇంకా పేరుని విశ్లేషించే సైటులు కానీ, ఆ పేరుతో ఇతర సమాచారం సూచించే ఇతర వెబ్ సైట్ల లింకులు తదితర వెబ్ సైట్లను గూగుల్ సెర్చ్ చేయడం వలన బ్రౌజరు ద్వారా తెలియబడతాయి.

ఈ గూగుల్ సెర్చ్ ఫలితాలు ఎలా ఉంటాయో? ఈ క్రింది వీడియో గమనించండి.
గూగుల్ సెర్చ్ చేయడం గురించి వ్యాసం

తెలుగురీడ్స్

తెలుగు వ్యాసాలు రీడ్ చేయడానికి ఈ అక్షరాలను క్లిక్ చేయండి.

సాహితికధలు తెలుగులో

ధన్యవాదాలు