Telugu Bhāṣā Saurabhālu

అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి

అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి అంటారు. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక కాలంలో ఒకరికి ఎదురైన సంఘటన, తర్వాతి కాలంలో మరొకరికి ఎదురుకావచ్చును. అప్పుడు అనుభవం పొందినవారి మాట తర్వాతి కాలంలో వారికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కావునా అనుభవంతో మాట్లాడే పెద్దల మాటలు, వారిని అనుసరించేవారి వినడం శ్రేయస్కరం అంటారు. ఈ తెలుగురీడ్స్ పోస్టులో కాస్త వివరంగా చూద్దాం.

ఒక్కొక్కరు ఇలా అంటూ ఉంటారు. ”ఇప్పటికీ ఆ తప్పు గుర్తు ఉంది. అప్పట్లో ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే, నా జీవితం మరొక విధంగా ఉండేది” అంటూ చెప్పుకొచ్చేవారి అనుభవ పాఠాలు ఎదిగే పిల్లలు వినడం వల్ల, వారి మనసు అటువంటి తప్పు తమ జీవితంలో జరగకూడదనే భావన బలంగా ఏర్పడగలదు.

పై ఉదాహరణలో ఒక తప్పు ఒక వ్యక్తి చేస్తే, అతని జీవితమే మారిపోవడం జరిగిందనే భావన వ్యక్తం అవుతుంది. అంటే ఒక్కొక్కసారి చేసే తప్పులు జీవితాన్ని తారుమారు చేస్తాయి. కావునా పెద్దల మాట చద్దిమూట అని ఇందుకే ఆంటారేమోననిపిస్తుంది.

అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి? ఎందుకంటే అనుభవం గడించినవారికి కాలం విలువ బాగా తెలుస్తుంది.

ఏదైనా కాలం వృధా కాకుడదు అంటారు. ఒక్కసారి గడిచిన కాలం గతంగానే మారుతుంది. గతంలో డబ్బు సంపాదించి ఉంటే, ఆ డబ్బు ఇప్పుడు మనకు లేదా మనపై ఆధారపడినవారికి ఉపయోగపడుతుంది.

అలాగే గతంలో బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయి ఉంటే, ఇప్పుడు మంచి ఉద్యోగం సంపాదించి, మనల్ని మనం పోషించుకోవచ్చును. మనపై ఆధారపడి ఉన్నవారిని పోషించవచ్చును.

ఇంకాస్త ఆలోచన చేస్తే, గతంలో సమాజంలో మంచి పలుకుబడి సంపాదించుకుని ఉంటే, ఇప్పుడు మనం ఆ పలుకుబడితో వివిధ పనులను చేయించుకోవచ్చును. పలుకుబడిని ఉపయోగించి, మరొకరికి సాయం చేయవచ్చును. అలా కీర్తిని మరింత పెంచుకోవచ్చును. ఇలా గతంలో ప్రయోజనమైన పనులు చేసి ఉంటే, వర్తమానంలో దాని ఫలితం బాగుంటుంది. అలా కాకుండా వాటిలో తప్పులు చేసి ఉంటే, వర్తమానంలో మన జీవితం? మనపై ఆధారపడినవారి జీవితం?

అప్పట్లో నేను చదువు కొనసాగించి ఉంటే, ఇప్పుడు నాకున్న అనుభవం వలన గొప్పస్థాయి ఉద్యోగిని

ఒక్కొక్కరు ఇలా కూడా ఫీలవుతూ ఉంటారు. అప్పట్లో నేను చదువు కొనసాగించి ఉంటే, ఇప్పుడు నాకున్న అనుభవం వలన గొప్పస్థాయి ఉద్యోగిని అనుకుని బాధపడేవారు ఉంటారు. కానీ చదువుకునే వయస్సులో చదువంటే ఆసక్తిని చూపించి ఉండకపోవచ్చును. లేదా పెద్దలు చెప్పినమాటను పెడచెవిన పెట్టే విధానంలో భాగంగా వారు చెబితే మాత్రం చదవాలా? అంటూ జీవితాన్ని తేలికగా తీసుకుని ఉండవచ్చును. లేదా వారి పెద్దలకు చదివించే స్తోమత లేకపోవచ్చును. ఇందులో పెద్దలకు చదివించే స్థోమత లేకపోతే మాత్రం, వారు పైవిధంగా బాధపడరు. కానీ ఆలోచిస్తారు. అయితే చదువంటే నిర్లక్ష్యం చేసినవారు మాత్రం పైవిధంగానే బాధపడతారు. వీరికి చదువు విలువ, చదువుకునే వయస్సులో కాలం వృధా చేయడం వలన జీవితంలో ఎదుర్కొనే కష్టాలు… చాలా అనుభవపూర్వకంగా తెలుస్తాయి. కాబట్టి తమ పిల్లలకు మంచి చదువు అందించాలనే సదుద్దేశ్యంతో ఉంటారు.

నేను నా ఉద్యోగంలో ఆ తప్పు చేయకుండా ఉంటే, ఇలాంటి అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి.

కొందరు చదువులో ఆటంకం లేకపోయినా, వ్యక్తిగత క్రమశిక్షణ పాటించక లేకా చెడు సావాసాల వలన ఉద్యోగంలో తమ కర్తవ్య నిర్వహణలో దోషం ఏర్పరచుకుంటారు. తత్ఫలితంగా ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. లేదా ఉద్యోగంలో ఎదుగుదల కనబడదు. ఎదుగుదల లేని ఉద్యోగం వలన ఆర్ధిక ప్రయోజనాల కన్నా ఆర్ధిక నష్టాలే ఎక్కువ.

చేస్తున్న పనిలో శ్రద్ద పెట్టకుండా ఉండడం వలన పై అధికారుల చేత మాట పడడం.

ఉద్యోగంలో ఇతరులను అనుసరించి, తాను తప్పులు చేయడం

చెడు సహవాసం వలన చెడు అలవాట్లు చేసుకుని, పనిని నిర్లక్ష్యం చేయడం.

నిర్లక్ష్యంగా వ్యవహరించి, పనిలో తప్పులు చేయడం.

పై అధికారులంటే విధేయత లేకపోవడం

తోటివారిని నిందించడం

తదితర కారణాల వలన ఉద్యోగంలో ఏదో పెద్ద తప్పు చేయడం.. వలన ఉద్యోగం కోల్పోవడం లేదా అభివృద్ది లేకుండా ఉండడం జరుగుతుంది. వారు కాలం గడిచిపోయిన తర్వాత కళ్ళు తెరిచినా ప్రయోజనం ఉండదు. ఇలాంటి వారు మాటలు కూడా వినడం వలన వివిధ వ్యక్తుల స్వభావాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది.

ఇలా ఏదైనా వ్యాపార వ్యవహారాలలో కానీ ఏదో ప్రయోగత్మాక పనిలో కానీ అనుభజ్ఙుల మాటలు ఆలకించడం వలన మన ప్రయత్నంలో పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తపడవచ్చును. అందుకే అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి అంటారు.

0 responses to “అనుభవ పాఠాలు అనుసరించేవారు తెలుసుకోవాలి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Go to top