రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్

రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్. చదవడం మనసుకొక అలవాటు అయితే, మంచి విషయాలు చదవడం వలన మనసు మంచి ప్రవర్తనకు మళ్ళుతుంది అంటారు.

నవలలు చదవడం అలవాటు అయితే, వివిధ సామాజిక స్థితులలో మనుషుల అంతరంగం గురించిన విషయజ్ఙానం తెలియబడుతుందని అంటారు.

అలవాటుగా పుస్తకాలు చదవడం వలన మనసుకు చదువంటే ఆసక్తితో ఉంటుంది. ఇష్టం లేకుండా పుస్తకాలు చదవడం వలన పుస్తకంలోని విషయం మనసులోకి చేరదు.

సైన్సుకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివితే, సైంటిస్టు మాదిరిగా ఆలోచనా తీరు ఉంటుందని అంటారు.

సోషల్ విషయాలతో కూడిన పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటే, ఓ సామాజికవేత్తగా ఆలోచనతీరు మారుతుందని అంటారు.

పౌరాణిక పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉంటే, దైవభావనలు బలపడతాయని అంటారు.

ఇలా ఏదైనా ఒక అంశంలోని పుస్తకాలు ఎక్కువ చదువుతుంటే, అదే అంశంతో మనుసు మమేకం అవుతూ, ఆ తరహా ఆలోచనలను సృష్టిస్తుందని అంటారు. అయితే ఆసక్తితో పుస్తకాలు చదవడం వలన, ఆ పుస్తకాలలోని సారాంశం మనసుకు త్వరగా చేరతాయి. ఇంకా మననం చేయడం చేత ఎక్కువగా కాలం జ్ఙాపకంగా ఉంటాయని అంటారు.

బుక్ రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్ !

One thought on “రీడింగ్ ఏ ఫ్యాషన్ ఆఫ్ మైండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *