మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ ఓల్డ్ తెలుగు మూవీ

శుభలేఖ చిరంజీవి క్లాసికల్ మూవీ

చిరంజీవి – కె విశ్వనాధ్ కలయికలో వచ్చిన క్లాసిక్ మూవీ

కొందరు ఒక్కపని చేయడంలో కూడా తడబడుతూ ఉంటే, ఒక్కొక్కరు మాత్రం ఒకటి కంటే ఎక్కువ రంగాలలో ప్రతిభను కలిగి ఉంటారు, కానీ చదువు మాత్రం సాగదు. మన శుభలేక హీరో కూడా మల్టిటాలెంటెడ్ హీరో. ఈయన పేరు నరసింహ మూర్తి (చిరంజీవి) డిగ్రీ ఫైయిల్ అవ్వడంతో, ఒక స్టార్ హోటల్లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే అతనికి అంకెల ఆదిశేషయ్య (కైకాల సత్యనారాయణ) నడుపుతున్న కళాశాలలో టీచర్ గా పనిచేస్తున్న సుజాత (సుమలత) అనే అమ్మాయి పరిచయం పెరుగుతుంది. వరకట్నం వరుని బహుమతిగా ఇచ్చే దశ నుండి బలవంతంగా వసూలు చేసే స్థాయికి వరకట్నం విలువలు పడిపోతున్న తరుణంలో ఆదిశేషయ్య తన కుమారుడు మోహన్ (గిరీశ్)తో సహా పెళ్ళిచూపులకి సుజాత ఇంటికి వస్తారు. ఆదిశేషయ్య అడిగిన వరకట్నం తమ కుటుంబం స్తోమతకి మించి ఉండడంతో, సుజాత అతనితో వాదనకి దిగుతుంది. దీంతో తల్లిదండ్రులు తమతోనే ఉంటే తమ కుమార్తె వివాహం చెయ్యలేమని, సంఘంలో తలెత్తుకు తిరగలేమని భయపడిన తల్లిదండ్రులు సుజాతను ఇంటినుండి పంపించేస్తారు.

ఆదిశేషయ్య కూడా సుజాతని పనిలోంచి తీసేయగా నిరాశ్రయురాలైన సుజాతకు, మూర్తి అనే అతను తన ఇంటిలోనే చోటిస్తాడు. అయితే సంఘం వారిద్దరికీ అక్రమ సంబంధం అంటగడుతుంది. ఒక సన్మాన సభలో ఆదిశేషయ్య నిజస్వరూపాన్ని మూర్తి బయటపెడతాడు. అలా తనని అవమానించనందుకు గాను, ఆదిశేషయ్య రౌడీలతో మూర్తిని కొట్టించి, అతని ఉద్యోగం కూడా తీయించేస్తాడు. చెడుకు బలం ఎక్కువ, వెంటనే వ్యాపిస్తుంది. అయితే ధర్మం ఎప్పుడూ నిదానంగానే ఫలితం ఇస్తుంది. మూర్తి సుజాతతో బాటు హైదరాబాదు చేరి, తనకి పరిచయం ఉన్న ఆల్విన్ లో ఉన్నతోద్యోగి అయిన రావు (అరుణ్) తో మాట్లాడి సుజాతకి కొత్త ఉద్యోగం ఇప్పిస్తాడు. సుజాత చెల్లెలు లక్ష్మి (తులసి)ని మోహన్ తమ్ముడు మురళి (శుభలేఖ సుధాకర్) ప్రేమిస్తాడు. నరసింహమూర్తి, సుజాతల, మురళి, లక్ష్మిలు ఎలా ఒక్కటయ్యారనేది ఈ సినిమాకు ముగింపు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్