స్మార్ట్ ఫోన్లలో నెంబర్ సిరిస్ లెటర్ సిరిస్ ఏమిటి? మొబైల్ కంపెనీలు, ప్రతి ఏడాది తమ ప్రతి కంపెనీ పేరు మీద ఒక నెంబర్ సిరిస్ విడుదల చేస్తూ, లెటర్ సిరిస్ తో కూడా కొన్ని మోడల్స్ తీసుకువస్తూ ఉంటారు. ఏమిటి ఏ సిరిస్ ఫోన్లు?

ఉదాహరణకు సామ్సంగ్ గాలక్సీ ఎస్ సిరిస్, ఏ సిరిస్, ఎం సిరిస్, మరియు ఎఫ్ సిరిస్లలో ఫోన్లను ప్రతి ఏడాది లాంచ్ చేస్తుంది. అలాగే వన్ ప్లస్, రియల్ మి, మోటోరోలా, పోకో, వివో, ఐక్యూ వంటి కంపెనీలు వివిధ సిరిస్లలో ఫోన్లను ప్రతి ఏడాది లాంచ్ చేస్తూ ఉంటాయి. వీటిలో తేడాలు ఏమిటి? ఏ సిరిస్ ఎటువంటి ధర స్పెక్స్ కలిగి ఉంటాయి?

స్మార్ట్ ఫోన్లలో నెంబర్ సిరిస్ లెటర్ సిరిస్ ఏమిటి?

వన్ ప్లస్ 10, వన్ ప్లస్ 11, వన్ ప్లస్ 13, వన్ ప్లస్ 15 సిరీస్ గల ఫోన్లు వన్ ప్లస్ ఫోన్లలో టాప్ మోడల్ ఫోన్స్…. వీటిలో లేటెస్ట్ ప్రాసెసర్ ఉపయోగించి బెస్ట్ స్పెసిఫికేషన్స్ తో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తూ ఉంటారు. ఇవి రూ.60000/- లేదా అంతకన్నా ఎక్కువ ధరలో లభిస్తాయి.

ఫ్లాగ్ షిప్ కన్నా తక్కువగా వన్ ప్లస్ 10R, వన్ ప్లస్ 11R, వన్ ప్లస్ 13R సిరిస్ ఫోన్లలో స్పెక్స్ కొద్దిగా తగ్గుతాయి… పెర్ఫార్మెన్స్ బాగున్నా, క్వాలిటీలో రాజి పడ్డట్టుగా ఉంటుంది. ఇవి రూ.40000/- లేదా అంతకన్నా ఎక్కువ ధరలో లభిస్తాయి.

ప్రీమియం బడ్జెట్ వన్ ప్లస్ నార్డ్ 4, వన్ ప్లస్ నార్డ్ 5 సిరిస్ ఫోన్లలో స్పెక్స్ బాలన్స్ చేయబడినట్టుగా ఉంటాయి. ప్రీమియం మిడ్ రేంజ్ ఫోన్స్ అని చెప్పవచ్చు. ఇవి రూ.25000/- లేదా అంతకన్నా ఎక్కువ ధరలో లభిస్తాయి.

వన్ ప్లస్ నార్డ్ సిఇ 4, వన్ ప్లస్ నార్డ్ సిఇ 5 సిరిస్ ఫోన్లలో స్పెక్స్ బడ్జెట్ ఆధారంగా చేయబడినట్టుగా ఉంటాయి. బడ్జెట్ ఫోన్స్ అని చెప్పవచ్చు. ఇవి రూ.20000/- లేదా అంతకన్నా ఎక్కువ ధరలో లభిస్తాయి.

సామ్సంగ్ గాలక్సీ ఎస్ సిరిస్, ఏ సిరిస్, ఎం సిరిస్, మరియు ఎఫ్ సిరిస్

ఈ కంపెనీ s సిరీస్ ఫోన్లు హై ఎండ్ ఫోన్స్. టాప్ స్పెక్స్ తో లేటెస్ట్ ప్రాసెసర్ తో లాంచ్ అవుతాయి. ఆ తర్వాత a సిరిస్ ఫోన్లు అప్పర్ మిడ్ రేంజ్ ఫోన్స్, m & f సిరిస్ ఫోన్లు బడ్జెట్ ఆధారంగా వివిధ ధరలలో లభిస్తాయి.

వివో లో వివో x సిరిస్ ఫోన్లు టాప్ మోడల్ ఫోన్స్. లేటెస్ట్ ప్రాసెసర్ తో వస్తాయి. ఆ తర్వాత v సిరిస్, t సిరిస్ పాపులర్ ఫోన్స్ వివిధ ధరలలో లభిస్తాయి. y సిరిస్ ఫర్ యూత్.

ఐక్యూ 11, ఐక్యూ 12, ఐక్యూ 13 ఫోన్లు ఫ్లాగ్ షిప్ ఫోన్స్…. అప్పర్ మిడ్ రేంజ్ లో ఐక్యూ నియో సిరిస్, బడ్జెట్లో ఐక్యూ z సిరిస్ ఫోన్లు లభిస్తాయి.

ఈ విధంగా మనం వివిధ కంపని ఫోన్స్ చూసినప్పుడు మనకు 60 వేలు నుండి 80 వేలు ధర మధ్యలో మంచి ఫ్లాగ్ షిప్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు… ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ప్రియులు ఫ్లాగ్ షిప్ ఫోన్ అనగానే ముందుగ ఆపిల్ ఫోన్ కోసం ట్రై చేస్తారు… అయితే ఇవి బేస్ మోడల్ ఫోన్స్ అఫర్లలో మాత్రమే లభిస్తాయి. లాంచ్ అయినప్పుడు ఆపిల్ ఫోన్స్ బేస్ మోడల్ కూడా 1 లక్ష దాటి ఉంటుంది. అలాగే సామ్సంగ్ నుండి s సిరిస్ ఫోన్ కూడా లాంచ్ అయినప్పుడు 1 లక్ష దాటి ఉంటుంది. 7 – 8 నెలల తర్వాత ఆఫర్లలో ఇవి 60 వేలు నుండి 85 వేలు మధ్యలో లభించవచ్చు. చాలామంది ఈ రెండు ఫోన్లతో బాటు వన్ ప్లస్ ఫ్లాగ్ షిప్ ఫోన్ కోసం చూస్తారు.

ఆఫర్లలో కొనే మొబైల్ బడ్జెట్

స్మార్ట్ ఫోన్లలో నెంబర్ సిరిస్ లెటర్ సిరిస్ ఏమిటి?

ఒక్కొక్కసారి ఫ్లాగ్ షిప్ ఫోన్స్ 45 వేలు నుండి కూడా లభించవచ్చు. తర్వాత ఇక మిడ్ రేంజ్ ఫోన్లలో ఎక్కువగా వివో v సిరిస్, t సిరిస్, ఐక్యూ r సిరిస్, రియల్ మి, ఒప్పో ఎఫ్ సిరిస్ వంటి ఫోన్లలో స్పెక్స్ చెక్ చేసుకుని బడ్జెట్ బట్టి ఫోన్లు కొనుగోలు చేస్తూ ఉంటారు. అఫర్లలో ఎక్కువగా వీటిని 30 వేలు ధర అటు ఇటుగా చూసి కొనుగోలు చేస్తూ ఉంటారు.

తర్వాత బడ్జెట్ ఫోన్స్ సుమారు 14 వేలు నుండి 22 వేలు ధరలో స్పెక్స్ విషయంలో (కెమెరా, ప్రాసెసర్) రాజీపడి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎక్కువ బ్రాండ్స్ సెల్ చేసుకునే ధర కూడా ఇదే… ఈ ధరల మధ్యలో ఎక్కువ బ్రాండ్స్, ఎక్కువ మోడల్స్ ను అందిస్తాయి.

స్మార్ట్ ఫోన్లలో నెంబర్ సిరిస్ లెటర్ సిరిస్ ఏమిటి?

10 వేలు ధర అటు ఇటులో స్మార్ట్ ఫోన్ 4జి నెట్ వర్క్ / 5జి నెట్ వర్క్ రామ్ విషయంలో మాత్రమే చెక్ చేసుకుని, మిగిలిన విషయాలలో ప్రాధాన్యత చూపకుండా కొంటు ఉంటారు.

జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?

రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్

అంకణము అంటే అర్ధం ఏమిటి?

పునః పునః అంటే అర్ధం ఏమిటి?


కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు