• ఆన్ లైన్ ఉచిత జాతకం పుట్టిన సమయం బట్టి
    tech reads

    తెలుగు జాతకమును అందించే వెబ్సైటు

    పుట్టిన సమయం, తేదిని అనుసరించి తెలుగు జాతకమును అందించే వెబ్సైటు ఆన్ లైన్లో ఉచితంగా ఉంది. ఈ వైబ్ సైటు వివరములను ఇంకా చదవండి…. పుట్టిన ప్రతి ఒక్కరి జీవితో నవగ్రహాల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి అంటారు. అలాగే ఏ వ్యక్తి అయినా 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక పాదం క్రిందకు వస్తారని అంటారు. పుట్టిన నక్షత్ర పాదం, ఆ నక్షత్ర పాదం గుణగణాలు, పుట్టిన సమయంలో ఉన్న లగ్న ప్రభావం, నవగ్రహాల దృష్టి ప్రభావం లెక్కలు కట్టి ఇంకా పుట్టిన స్థలం ఇతరత్రా అంశాలు పరిశీలన చేసి, ఆ వ్యక్తి యొక్క జాతకం చెబుతూ ఉంటారు. జాతకం చెప్పినప్పుడే కొన్ని ముఖ్యమైన పనులలో ప్రారంభించటప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలను కూడా ఆ పిల్లవాని పెద్దలకు పండితులు తెలియజేసి ఉంటారు. గ్రహశాంతులు ఉంటే ఎప్పుడు చేపించుకోవాలి, ఎప్పుడు ఏ గ్రహ ప్రభావం చేత, ఆ పిల్లవాని భవిష్యత్తు ప్రభావితం అయ్యేది కూడా అంచనా వేసి చెబుతారు. పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఉద్యోగం…