కరోనా కాలం కాలక్షేపంగా తెలుగు వీడియోలు తెలుగులో

కరోనా కాలం కాలక్షేపంగా తెలుగు వీడియోలు తెలుగులో. మాయదారి కరోనా వైరస్ వచ్చింది, గ్యాప్ తెచ్చింది. కాసేపు కాలక్షేపం కోసం సినిమా చూసే అవకాశం లేదు. ఇక తెలుగు మూవీ చూడాలంటే, ఇంట్లోనే… టివిలో ప్రసారం అయ్యే సినిమాలే చూడాలి.

మాయదారి మహమ్మారి కరోనా వైరస్

మహమ్మారి కరోనా వైరస్ న్యూస్ ఏ ప్రాంతంలో ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవడం వలన మనలోనూ జాగ్రత్త పెరుగుతుంది. అయితే అదే పనిగా చూడడం వలన ఆలోచనతో ఆందోళన కూడా ఉంటుంది. మైండుకు రిలాక్షేషన్ వెరీ నాచురల్… దానికి విరామం ఇవ్వకుండా ఒక పనిని చేయడం అంటే, ఒత్తిడిలోకి వెళ్ళడమే… అందుకే వ్యక్తికి విరామం ఇచ్చే విషయాలు అనేకంగా కనబడతాయి. మాయదారి మహమ్మారి కరోనా వైరస్ వలన విరామం లేకుండా ఇంట్లోనే ఉండాల్సిన ఆగత్యం ఏర్పడింది.

మాయదారి మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందనే న్యూస్ ఎక్కువగా ఉంటే, దాని నుండి మైండును మళ్ళించడం కూడా చేయాలి. ప్రభుత్వాలు సూచించిన సూచనలు పాటించడం చేయాలి. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా, ఇంటికే పరిమితం కావాలి. అలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ న్యూస్ తెలుసుకుంటూ, అదే ధ్యాస లేకుండా, వేరే ధ్యాసను పెట్టుకోవడం మేలు అంటారు. దృష్టి మళ్ళించడంలో వ్యక్తికి పుస్తకపఠనం మేలు మార్గంగా చెబుతారు.

​పుస్తకం విషయ విజ్ఙానంతో కూడి ఉంటుంది. చదివే శక్తి ఉండాలే కానీ విషయాలలో ఉండే ‘విష’మును తెలియజేయడంలో పుస్తకాలే సాటి అంటారు. ఆసక్తి ఉండాలే కానీ పుస్తకములు మంచి స్నేహితుడి మాదిరిగా మారతాయని అంటారు. కానీ చదవే ఆలోచన అంత తొందరగా పుట్టదంటారు. అందులోనూ మంచి జ్ఙానమును గురించిన తెలుగు పుస్తకాలు చదవాలనే ఆసక్తి అంత త్వరగా కలగదంటారు.

టెక్నాలజీ గురించిన తెలుగు వీడియోలను వీక్షించడం ద్వారా పరిజ్ఙానం మరింత పెంపొందించుకోవచ్చును.

ఇక ఏదైనా తెలుగులో విషయాలు తెలియజేసే తెలుగు వీడియోలను చూడడం వలన విషయ పరిజ్ఙానం పెంచుకోవచ్చును. మీరు ఎక్కౌంటెంటు అయితే ఎక్కౌంటులో సాంకేతికతను ఉపయోగం గురించిన తెలుగు వీడియోలను చూడవచ్చును. ఎక్కౌంటింగులో టెక్నాలజీ పెరుగుతున్న నేపధ్యంలో టెక్నాలజీ గురించిన తెలుగు వీడియోలను వీక్షించడం ద్వారా పరిజ్ఙానం మరింత పెంపొందించుకోవచ్చును. అలా ఏరంగంలో మీరు ఉంటే, ఆరంగంలోని టెక్నాలజీ తెలుగు వీడియోలను చూడడం ద్వారా టెక్నాలజీలో పరిజ్ఙానం పెంపొందించుకోవచ్చును.

ఎందుకు తెలుగు వీడియోలు టెక్నాలజీ పరంగా చూడాలి. అంటే నేడు టెక్నాలజీ అన్ని రంగాలలోనూ భాగం అయ్యింది. అలాగే మాయదారి మహమ్మారి కరోనా కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నాం. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసిన ఆగత్యం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టుగా ఉంది. ముందు ముందు ఇది ఇంకా పెరగవచ్చును.

వర్క్ ఫ్రమ్ హోమ్ కు ప్రధానంగా సాయపడేది. టెక్నాలజీనే…. ఇప్పటికే ఆఫీసు వర్కులో టెక్నాలజీ ఆక్రమించి ఉంది. ఆఫీసు వర్కు ఇంటినుండే చేయవచ్చును. అయితే కంప్యూటర్, ల్యాప్ టాప్ లాంటి సాంకేతిక పరికరాలు ఉపయోగించడం తెలిసి ఉండాలి. అందువలన టెక్నాలజీకి సంబంధించిన తెలుగు వీడియోలు ద్వారా టెక్నాలజీ పరిజ్ఙానం పెంచుకోవడం ఈ కరోనా కాలక్షేపంగా చేయడం మేలు.

ఆన్ లైన్ ఇపేమెంట్స్ తెలుగు వీడియోలు

ఇక ఆన్ లైన్ పేమెంట్ చేయడం, ఆన్ లైన్లో ఏదైనా ఇకామర్స్ వెబ్ సైటులో ఖాతా తెరవడం… ఇలాంటి తెలుగు వీడియోలు చూడడం ఎక్కుమందికి అవసరం. వర్క్ ఫ్రమ్ హోమ్ కన్నా ఎక్కువగా ఆన్ లైన్ ఆర్డర్స్ చాలానే ఉన్నాయి. ఇక ముందు ఆన్ లైన్ ఆర్డర్స్ మరింతగా పెరుగుతాయని అంటున్నారు. కాబట్టి ఆన్ లైన్లో మెయిల్ చూడడం, ఇకామర్స్ ఖాతాలు మెయింటైన్ చేయడం, పేమెంట్ చేయడం లాంటి తెలుగు వీడియోలను వీక్షించడం మేలు అంటారు.

జిపే ఇదొక పేమెంట్ మొబైల్ యాప్. గూగుల్ సంస్థ నుండి వచ్చిన మొబైల్ యాప్. దీని ద్వారా మీరు డబ్బులు ఇతరులకు పంపడం చాలా సులువు. చాలా మంది ఎక్కువగా వాడుతున్న మొబైల్ యాప్ కూడా ఇదే.. దీనిపై అవగాహన ఉండడం చాలావరకు ఉపయోగం అంటారు. ఎందుకంటే ఎక్కడ ఎక్కువగా వాడకం, ఉంటే అక్కడే మోసాలు జరుగుతాయి.

కాబట్టి ఎక్కువగా వాడే విషయాలలో మనకు జ్ఙానం అవసరం. మన ఉపయోగించేవేళలో మనం మోసపోకుండా ఉండడానికి ఉపయోగం. మనం గూగుల్ పే మొబైల్ యాప్ ద్వారా కరెంట్ బిల్స్ పే చేయవచ్చును. మిత్రులకు, ఇతరులకు తేలికగా మనీ ట్రాన్సఫర్ చేయవచ్చును. ఇతరత్ర బిల్లులు పే చేయవచ్చును. గూగుల్ పే మొబైల్ యాప్ లో బ్యాంక్ ఖాతను ఎలా యాడ్ చేసుకోవాలో ఈ క్రింది వీడియోలో చూడవచ్చును. ఈ కింది తెలుగులోనే ఉండే తెలుగు వీడియోలు చూడండి.

గూగుల్ యాప్ జిపేలో బ్యాంక్ ఖాతా యాడ్ చేయడం… తెలుగు వీడియో
జిపే గూగుల్ మొబైల్ యాప్ ద్వారా కరెంట్ బిల్ పే విధానం తెలుగు వీడియో
గూగుల్ జిపే మొబైల్ యాప్ ద్వారా నెలవారీ బిల్లులు పేచేయడం చూపే తెలుగు వీడియో

ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా ఆన్ లైన్ ఆర్డర్స్ తెలుగు వీడియోలు

ఫ్లిప్ కార్ట్ అతి పెద్ద ఇకామర్స్ వెబ్ సైట్లలో ఇది చాలా ప్రముఖమైన సంస్థ. ఫ్లిప్ కార్టులో పర్చేజ్ చేయడం, అది ఇంటికే చేరడం చాలా మంది చేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్స్ వంటి గాడ్జెట్లు ఆన్ లైన్లో ఆర్డర్ చేయడం ప్రసిద్దికెక్కిన విషయం. ఆన్ లైన్ ఆర్డర్ చేయడంలో ఎక్కువమందికి తెలిసిన సంస్థలలో ఫ్లిప్ కార్టు చాలా ప్రసిద్ది. ఈ సైటులో కానీ యాప్ లో కానీ వస్తువులను ఆర్డర్ చేయడం తేలికే అంటారు. ముందు ముందు ఆన్ లైన్లో ఆర్డర్స్ ప్రధానం కానుండడంతో మనకు ఈ యాప్ ఉపయోగించాల్సిన అవసరం ఉండవచ్చును.

ఫ్లిప్ కార్ట్ ద్వారా వస్తువుల కొనుగలో చేయడం, ఫ్లిప్ కార్టు ద్వారా ఇఎంఐ లో వస్తువులు కొనుగోలు చేయడం ఎలా తెలుగు వీడియోలు ఈ క్రిందగా వీక్షించండి.

కరోనా కాలం కాలక్షేపంగా తెలుగు వీడియోలు తెలుగులో

మరొక ప్రసిద్ద ఇకామర్స్ సంస్థ అమెజాన్.. ఇది కూడా చాల ప్రసిద్ది చెందిన ఆన్ లైన్ వస్తువులను అమ్మకాలు జరిపే సంస్థ. అమెజాన్ ఇకామర్స్ సంస్థలో చాలా రకాల వస్తువులను అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ముందు ముందు ఫ్లిప్ కార్టు, అమెజాన్ లాంటి ఇకామర్స్ సంస్థల ద్వారా అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కుగా ఉంటాయని విశ్లేషకుల అభిప్రాయం. అమెజాన్ ద్వారా కూడా ఎలా వస్తువు కొనుగోలు చేయాలో తెలుసుకోవడం మేలు అంటారు. ఈక్రింది వీడియోల అమెజాన్ సంస్థ నుండి ఆన్ లైన్లో వస్తువను ఆర్డర్ చేయడం చూడండి.

కరోనా కాలం కాలక్షేపంగా తెలుగు వీడియోలు తెలుగులో

ఆన్ లైన్ ఆర్డర్, ఆన్ లైన్ పేమెంట్స్ చేయడంతో బాటు తెలుసుకోవలసినది. ఆన్ లైన్ మొబైల్ ద్వారా మెయిల్ చేయడం. ఎందుకంటే ఏదైనా పేమెంట్, ఆర్డర్ విషయాలలో పొరపాట్లు జరిగితే మెయిట్ చేయడం తప్పనిసరి అవుతుంది. ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి సుముఖత చూపితే, మెయిల్ చేయడం అనే విషయం తప్పక తెలిసి ఉండాలి. మీరు ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా ఇతర వస్తువులు మీకు డెలివరి అయితే మీరు రిటర్న్ చేయడానికి, రిటర్స్ స్టేటస్ తెలుసుకోవడానికి ఇమెయిల్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ.

కాబట్టి మీ ఫోను ద్వారా మెయిల్ చేయడం మీరు తెలుసుకోవాలి. ఫోనుద్వారా మెయిల్ పంపించే తెలుగువీడియోలు ఈక్రిందగా ఉన్నాయి. చూడండి.

కరోనా కాలం కాలక్షేపంగా తెలుగు వీడియోలు తెలుగులో
కరోనా కాలం కాలక్షేపంగా తెలుగు వీడియోలు తెలుగులో

యోగ సాధన తెలుగు బుక్స్

యోగ సాధన తెలుగు బుక్స్: సహజంగానే యోగా వలన ఉపయోగాలు చాలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు అని ప్రధాని మోదీగారు మొదటి ప్రభుత్వం టెర్ములోనే చెప్పారు. ఇక సాక్ష్యాత్తు ప్రధానిగారు చెప్పాక? ఈ యోగ గురించి మనకు సందేహం ఎందుకు.

అయితే ఎవరికి ముఖ్యం? ఎవరు ఎలా చేయాలి? ఎవరు చేయడానికి అర్హులు? ఈ ప్రశ్నలు చాలా ప్రధానం. అనారోగ్యంగా ఉన్నవారు యోగ వెంటనే ప్రారంభిస్తే కొత్త సమస్యలు వస్తాయని అంటారు. అలాగే వయస్సు రిత్యా కొన్ని యోగాసనములు కూడదని అంటారు.

యోగపాధనం మంచిది కానీ ప్రారంభానికి ముందే యోగా అవసనం మన శరీరమునకు ఎంత అవసరమో వైద్యుని ద్వారా తెలుసుకోవాలి. యోగ ప్రక్రియను యోగా శిక్షకుల దగ్గర తెలుసుకోవాలి. అసలు యోగాపై ఆసక్తి పెరగడానికి, యోగాకు సంబంధించని యోగ సాధన తెలుగు బుక్స్ చదవాలి.

మనం ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉండగలం. ఆరోగ్యంగా ఉంటే, వ్యాధినిరోదక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యవంతుని లక్షణాలలో మనసు కూడా ప్రధానమైనదిగా చెప్పడం మన భారతీయ పెద్దలు చెబుతారు.

మనసుంటే మార్గముండదా? అనే ప్రశ్న చాలాసార్లు కాదు అన్న సమాధానానికి ఎదురు ప్రశ్నగా పుడుతుంది. అంటే మనసుపెట్టి, శ్రద్ధ పెడితే కార్యసాధనలో విజయవంతం కాగలం అంటారు. అలాగే వైద్యులు కూడా వైద్యం చేసి, మందులు వాడుతున్నప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకోమని చెబుతారు. ఒత్తిడికి గురికావద్దు అంటారు.

మనిషి ఆరోగ్యంలో శరీరం బలంతో బాటు మనోబలం కూడా ముఖ్యం అంటారు

మనిషి ఆరోగ్యంలో శరీరం బలంతో బాటు మనోబలం కూడా ముఖ్యం అంటారు. శరీరమనకు, మనసునకు అవినాభావ సంబంధం ఉంటుందని కూడా చెబుతారు. ఏదైనా కొత్త రోగం అనగానే ఆందోళనకు గురయ్యే మనిషి ఆరోగ్యం ముందుగా క్షిణించే అవకాశం ఉంటుందంటారు. శరీరం అనారోగ్యంగా ఉన్నా, మనోబలం ఎక్కువగా ఉంటే, అనారోగ్యం నుండి బయటపడవచ్చును అంటారు.

మనిషి తన ఆరోగ్యం తను కాపాడుకోవడంలో జాగ్రత్త వహించాల్సింది మనసే. అలాగే ఏదైనా కొత్త రోగం వచ్చింది అనగానే, దాని గురించి కంగారుపడకుండా అవగాహనతో మెలగాల్సింది కూడా మనసే. మనిషి ఆరోగ్యం విషయంలో మనసు ముఖ్యపాత్రను పోషిస్తుందంటారు. మనసుకు కంగారు, ఆందోళన లేకుండా ఉంటూ, సూచించిన జాగ్రత్త తుచ తప్పకుండా పాటించేవారు పరిస్థితలను ఎదుర్కోవడంలో విజయవంతం కాగలరంటారు.

ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ప్రతిరోజూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు రోజూ న్యూస్ ద్వారా అందరికీ చేరుతుంది. కరోనా పాజిటివ్ కేసులు నమోదుకానీ ప్రాంతాలలో మనసు బాగుంటే, కరోనా పాజిటివ్ కేసులు ఎన్ని ఉంటే, అంతలా మనసు ఆందోళనకు వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఇంకా ఇంట్లోనే ఉంటూ అదే పనిగా న్యూస్ చూడడం కూడా ‘లోకం ఏమైపోతుందో? మనం ఎలా ఉంటామో? ‘ అనే ఆలోచనలు కలగకమానవు.

ఏదైనా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నా.. ప్రపంచ దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా పాజిటివ్ కేసులు తక్కువే… కానీ కరోనా వ్యాప్తి అంటే మనం తీసుకునే జాగ్రత్తను బట్టే ఉంటుంది. ప్రభుత్వాలు సూచించిన సూచనలు పాటించడం. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండడం. సామజికదూరం పాటించడం మన బాధ్యత. ఇంటికే పరిమితం కావడం. అనవసరంగా బయటకు తిరగకుండా ఉండడం… చాలా ప్రధానం.

యోగ సాధన తెలుగు బుక్స్ ఐతే యోగ సాధన చేయడానికి ముందు వైద్యుల సలహా అవసరం

అయితే కరోనా యోగ సాధన ఆవశ్యకతను తెలియజేస్తుందా? అంటే వ్యక్తిని బట్టి ఉండవచ్చును. ఒక వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతుడిగా ఉండి మనసు ప్రశాంతతను కోల్పోకుండా ఉంటే, అతను కరోనా వైరస్ వలప ప్రభుత్వాలు సూచించిన సూచనలు, నియమాలు పాటిస్తే పరిపోతుంది. ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు కూడా ఇంటిలోనే ప్రయోగాలు చేయడం మేలు కాదు. తగు జాగ్రత్తలు సూచనలతోనే యోగాసనాలు వేయాలి. కాబట్టి యోగా ప్రారంభదశలో ఖచ్చితంగా వైద్యుల సలహామేరకు అనుభవజ్ఙుల దగ్గర ట్రైన్ అవ్వాలి.

కానీ కరోనా వైరస్ అంటువ్యాదిగా ఉండడం చేత ఇది ఆందోళనను కూడా వ్యాపింప చేస్తుంది. వైరస్ వచ్చినవారికి కన్నా వైరస్ వస్తుందేమోననే ఆలోచనతో ఉండేవారు చాలా అధికంగా ఉండవచ్చును. కారణం వైరస్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో? న్యూస్ ద్వారా ఆందరికీ తెలుస్తుంది. అలాగే మనదేశంలో ఏవిధంగా వ్యాప్తి చెందుతుందో కూడా న్యూస్ ద్వారా మనకు చేరుతుంది. కరోనా ఎప్పటివరకు ఇండియాలో ఉంటుంది? కరోనా వలన వచ్చిన లాక్ డౌన్ ఎంతకాలం ఉంటుంది? ఇటువంటి ప్రశ్నలతో టివీ చూస్తూ కరోనా వైరస్ న్యూస్ మనకు కనబడుతూనే ఉంటుంది.

మనకు న్యూస్ ద్వారా కరోనా వ్యాప్తి, కరోనా ప్రభావం గురించి తెలుసును. అయితే యోగాభ్యాసం వలన మేలు ఏమిటో తెలసుకుంటే, కరోనా వంటి అంటువ్యాధులు మరలా వస్తే, మనకు యోగ ఎంతవరకు సాయపడగలదు? అనేదానిపై అవగాహన వస్తుంది. ఆరోగ్యం విషయంలో మందులు తాత్కలిక ఉపశమనం కలిగిస్తే, నిత్యం చేసే కర్మలపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అంటారు.

ఈ నిత్యం చేసే కర్మలు మాత్రం మనసు ఆధారంగానే సాగుతాయి. యోగాసనాలు మనసు శరీరం రెండు అనుసంధానం అవుతాయని అంటారు. అందువలన మనసు నియంత్రణకు, శరీరారోగ్యమునకు మేలు అంటారు. అయితే యోగాసనాలు మాత్రం అనుభవజ్ఙుల ద్వారా ప్రాక్టీసు చేసి ఇంటిలో ప్రయత్నించాలని అంటారు. అలాగే ఆరోగ్యమును బట్టి వైద్యుని సలహా కూడా తప్పనిసరి.

ఆసక్తి పెరిగిన మనసు, దానిని సాధించడంలో ప్రయత్నం చేస్తుందని అంటారు.

యోగసాధన విధానం, దాని ఉపయోగాలు తెలుసుకుంటే, దానిపై ఆసక్తి మనసు పెంచుకుంటుంది. ఆసక్తి పెరిగిన మనసు, దానిని సాధించడంలో ప్రయత్నం చేస్తుందని అంటారు. కాబట్టి కొత్తగా ప్రారంభించే మంచి పని ఒక్కసారిగా ప్రారంభించి అపడం కన్నా, సవివరంగా తెలుసుకుని, ప్రారంభించడం వలన ఆ పని రోజూ క్రమం తప్పకుండా జరుగుతుంది. అయితే ఆసక్తిని పెంచుకోవడం ప్రధానం.

గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనగా

గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనను తెలియజేస్తుంది. గత చరిత్రలో గడ్డుకాలం, వర్తమానంలోని పరిస్థితులకు పోలిక పెట్టినప్పుడు, గతం కన్నా వర్తమానంలో పరిస్థితులు మనిషికి అనుకూలంగానే ఉంటాయని అంటారు.

చరిత్ర గతం గురించి చెబుతుంది. న్యూస్ వర్తమానం గురించి సమాచారం అందిస్తుంది. భవిష్యత్తు మన బుద్దిపై ఆధారపడి ఉంటే,,, మనకు సామాజిక అవగాహన సరిగ్గా ఉంటే..బంగారు భవిష్యత్తు.

చరిత్ర మనకు గత గురించి చెబుతుంది. గతమంటే మన వెనుకటి తరానికి మార్గదర్శకంగా నిలిచినకాలం అంతకన్నా వెనుకటి కాలం కావచ్చును. అప్పటికాలం ఆనాటికి ప్రస్తుతం అయితే ఆ ప్రస్తుతం గురించి పుస్తకం అయ్యిందంటే, అది భవిష్యత్తుకు ఒక ఉదాహరణగా నిలిచే అవకాశం ఉందని గ్రహించేదెవరు? అప్పటికీ ఆ ప్రస్తుతం పుస్తకంగా మార్చాలనే తలంపు వచ్చిన వ్యక్తికి భవిష్యత్తు దర్శనం ఎలా? అంటే వారు ఏదో వ్రాసుకోవడం కోసం వ్రాసినవేనా?

మొన్నటి నైపుణ్యం నేటికి మరింతగా మెరుగవ్వాలి. అయితే గతంలో వ్రాయబడిన చరిత్ర, ఇప్పటికీ మనకు ఉపయోగంగా ఎలా ఉంటుంది? అంటే అంటారు పండితులు గతమెప్పుడూ వర్తమానం కన్నా కఠినంగానే ఉండి ఉంటుంది. అటువంటి కఠిన పరిస్థితులు తెలసుకోవడవం వలన వర్తమానం మనకు మేలుగానే ఉందనే భావన మనసుకు ఊరటనిచ్చే అంశంగా చెబుతారు.

గతంలోని కష్టకాలంలో వారు ఎదుర్కొన్న గడ్డు పరిస్థితలు, వర్తమానంలో ప్రస్తుత కష్టకాలం మనిషి మనసు పోల్చి చూసుకుని, గతంలో తమ కంటే తమ పూర్వులు మరింత కష్టం అనుభవించారు. అంటే వర్తమానం మనకు గతంకంటే మేలుగానే ఉంది. ఇది కష్టకాలంలో మనసు పొందే భావన అంటారు.

గత చరిత్ర వర్తమానంలో ఒక సూచనగా ఉంటుంది.

ఉదాహరణ: మహాభారతంలో రాజ్యం కోల్పోయి, వనవాసం చేస్తున్న పాండవులకు ఏర్పడిన కష్టకాలంలో ధర్మరాజు… తమకన్నా అధికమైన కష్టం గతంలో ఎవరూ అనుభవించి ఉండరనే భావనను పొందుతాడు. కానీ ధర్మరాజుగారికి నలదమయంతిల వృత్తాంతం వినేటప్పటికీ తమకష్టం వారి కష్టం కన్నా మేలైన పరిస్థితిలోనే ఉందనే భావన కలుగుతుంది. ఇంకా నలదమయంతిల వృత్తాంతం వినడంతో విజయానికి మేలైన మార్గం ఏర్పడుతుంది. ఇలా గొప్పవారి గతం వర్తమానంలో మనిషికి మార్గదర్శకంగా మారగలదని అంటారు.

నలదమయంతిల కధ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనములో…

గత చరిత్ర వర్తమానానికి ఒక సూచనను తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పటి వర్తమాన పరిస్థితులకు గతం కారణం అయ్యి ఉంటుందని అంటారు. కాలం సృష్టించిన భారీ మార్పులు చరిత్రగా వర్తమానానికి అందుతూనే ఉంటాయి. అవి భవిష్యత్తు ఆలోచనకు వర్తమానంలో మనకు మార్గదర్శకంగా మారతాయని అంటారు.

ప్రపంచం కరోనా వైరస్ వలన కష్టకాలంలో ఉంది

ప్రస్తుతంలో పరిస్థితులు కఠినంగా మారుతున్నప్పుడు సమాజంలో గతాన్ని గుర్తు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కరోనా వచ్చింది. అనగానే గతంలో ప్రపంచాన్ని కుదిపిన అంటువ్యాధుల గురించి మీడియా ప్రస్తావించింది. కారణం మానవాళికి కఠినమైన కాలం ఎదుర్కొనడం సవాలే, కానీ ఎదుర్కొని పోరాడిన ఘనతే మనదే అనే భావనా బలం మనకు కలిగిస్తుంది.

ప్రపంచం కరోనా వైరస్ వలన కష్టకాలంలో ఉంది. అన్ని దేశాలకు పెద్దన్నలాగా ఉండే అమెరికా, కరోనా వైరస్ కాటు కూడా బలంగానే ఉంది. ఎక్కువ పాజిటివ్ కేసులు అక్కడే, ఎక్కువ కరోనా కాటకు బలైనవారు అక్కడే… అన్నింటిలో జాగ్రత్తగా ఉండే అమెరికా కరోనా వైరస్ కట్టడిలో వెనుకబడ్డట్టే చాలామంది భావిస్తారు.

రెండు మిలియన్ కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి దాకా ప్రపంచవ్యాప్తంగా ఉంటే, మరణాలు ఒక లక్షా ముప్ఫై వేలు దాటింది. కరోనా కాటు బలంగానే ప్రపంచంపై పడింది. ఇంత గడ్డుకాలం గతంలో కానవచ్చినట్టుగా మనకు కనబడటం లేదు. కోవిడ్-19 కరోనా కాటు ప్రపంచంలో ఒక గీటురాయిగా మారుతుంది. కరోనా వైరస్ ముందు, కరోనా వైరస్ తర్వాత చరిత్ర అంటూ వర్తమానం చరిత్రగా మారనుంది.

కరోనా వైరస్ తెచ్చిన కష్టం మనకు గతంలో కనబడలేదు… కానీ మనకు ఊరట కలిగించే విషయం ఏమిటంటే తోటివారి కష్టం మనకన్నా పెద్ద కష్టంలో ఉన్నప్పుడు మనకు ఫరవాలేదనే ఊరట పొందే అవకాశం ఉంటుంది. అమెరికా, ఇటలీ, స్పైయిన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, ఇరాన్, టర్కీ లాంటి దేశాలతో పోల్చి చూస్తే, ప్రస్తుతానికి మనం బెటరుగానే ఉన్నాం.

వర్తమానంలో తోటివారు ద్వారా మనకు తెలియవచ్చేది… ఏమిటి? అంటే నిర్లక్ష్యం – జాగ్రత్త… ఈ రెండు ప్రమాదాన్ని పెంచడం, తగ్గించడం చేస్తాయి. ఇటలీ, అమెరికా నిర్లక్ష్యం వలన భారీ మూల్యం చెల్లిస్తే, దక్షిణ కొరియా తదితర ఇతర దేశాల జాగ్రత్తలు ప్రపంచానికి ముందు జాగ్రత్త ఫలితం కనబడుతుంది. నిర్లక్ష్యం భారీ మూల్యం నిర్లక్ష్యం వహించినవారి కన్నా వారిని నమ్ముకున్నవారికే అధికంగా ఉంటుంది.

పోరాడి గెలిచినవారిని సమాజం చరిత్రగా గుర్తు పెట్టుకుంటుంది

భవిష్యత్తు వర్తమానంలో మనం తీసుకునే జాగ్రత్తలు, వర్తమానంలో మనం పోరాడిన తీరు భవిష్యత్తులో మార్గదర్శకంగా మారుతుంది. పోరాడేవారికి పోరాటం చేస్తూనే ఉంటారు. పోరాడి గెలిచినవారిని సమాజం చరిత్రగా గుర్తు పెట్టుకుంటుంది. వర్తమానంలో కష్టపడ్డ కష్టమే భవిష్యత్తుకు బాట అవుతందని అంటారు.

వర్తమానంలో పోరాటం చేయడంలో మనకు సాధానాలను సరిగ్గా ఉపయోగించడమే యోధుల చేసే యుద్ధం అంటారు. అయితే ఇప్పుడు జనులే యోధులు, సమాజంలో ఇల్లే యుద్దక్షేత్రం. సామాజిక దూరమే జనుల ఆయుధం… సామాజికదూరమనే అయుధం ఉపయోగించడమే మన ముందున్న ఏకైక లక్ష్యం. సామాజిక దూరం ఎక్కువగా ఉండడం కోసమే లాక్ డౌన్ ప్రభుత్వాలు విధించారు. కారణం కరోనా వైరస్ కు మందు కనిపెట్టబడలేదు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చూడడంలో ప్రతివ్యక్తి బాధ్యత ఉంటుంది. మనం సమాజంలో ఉంటున్న, ఎందరో కృషి సమాజంలో ఎన్నో రకాల సౌకర్యాలు మనం అనుభవించడానికి దోహదం అయ్యిందని చరిత్ర చెబుతుంది. ఇప్పుడు మనం చేసే పోరాటం సమాజానికి అవసరం. ఇంట్లో ఉండడమే, సామాజిక దూరం పాటించడమే మనం చేసే పోరాటం… అదే మన ప్రస్తుత సామాజిక సేవ.

గత కాలపు మూలాలు మనపై ఏదో విధంగా ప్రభావం చూపుతూ వర్తమానంలో మనపై ఉంటుందని అంటారు. అయితే ఆ మూలాలు తెలుసుకోవడం కన్నా ఎదురవుతున్న పరిస్థితులలో పోరాడడమే మన కర్తవ్యం అవుతుందని అంటారు. కరోనా వైరస్ జీవం పోసుకోవడానికి ప్రస్తుతానికి ముందు ఎవరో కారణం అయ్యి ఉంటారు. వ్యాప్తికి ఎవరి నిర్లక్ష్యమో కారణం అయ్యి ఉంటుంది. అయితే వారిని కాలం చెబుతుంది.

బుక్ రీడింగ్ వలన విషయ పరిజ్ఙానం తెలియబడుతుంది. గమ్యం తెలియబడుతుంది. తెలుగుబుక్స్ మనకు అనేక విషయాలను తెలియజేస్తాయి. కష్టకాలంలో బుక్ రీడింగ్ ప్రస్తుతం నుండి మనసుకు కొంతసేపు దూరం చేయగలవు అంటారు.

ధన్యవాదాలు

ఓర్పు దేవతా లక్షణం అంటారు.

ఓర్పు దేవతా లక్షణం అంటారు. ఎందుకంటే ఓర్పు పట్టడంతోనే మన స్థితి చేజారిపోదు. మన స్థితి అలానే ఉంటే కాలం తెచ్చే కష్టం దాటిపోతుంది. స్థితి సాధారణంగానే సాగుతుంది. జీవితం తలక్రిందులు కాదు. ఓర్పు లేకపోతే జీవితం తలక్రిందులు అవుతుంది. ఈ కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే, ఓర్పుతో ఇంట్లోనే ఉండాలి. లేకపోతే జీవితం తలక్రిందులు, మనతో బాటు మరింతమంది జీవితాలు కూడా ప్రభావితం అవుతాయి.

పోరాడడం జీవితంలో సాధారణంగానే సాగుతుంది. నిత్యం జీవితంలో ఎదురయ్యే సమస్యలతోనో, కష్టాలతో వ్యక్తి పోరాటం సాగిస్తూనే ఉంటాడు. తనకోసమో, తనవారికోసమో పోరాటం సాగిస్తూ ఉంటాడు. ఒక కుటుంబ పెద్దగా తనవారికోసం ఎక్కువగా జీవితంలో పోరాడడం ఉంటే, కుటుంబ సభ్యులు కొందరు సహకారంగా ఉంటే, కొందరు ప్రతకూలంగా ఉండవచ్చును.

కానీ పోరాటం వ్యక్తి జీవితంలో ఉంటుంది. ఆర్ధిక విషయాలలోనో లేదా ఏదైనా ఇతర అంశంలోనో జీవనపోరాటం సాగుతుంది. ఈ పోరాటంలో వ్యక్తి గెలవవలసి ఉంటుంది. ఏదో ఆటలో గెలుపు ఓటములు వెంటనే తేలతాయి. కానీ జీవన పోరాటంలో గెలుపు ఓటములు కాలం దీర్ఘకాలంలో కలుగజేస్తుందని అంటారు.

ఓర్పు దేవతా లక్షణంగా చెబుతారు. ఇలా కష్టనష్టాలలో ఓపికపట్టేవారు

ఈ పోరాటంలో వ్యక్తి మనసుకు కావాల్సింది, ఓర్పు పట్టడమే అని అంటారు. ఓర్పు దేవతా లక్షణంగా చెబుతారు. ఇలా కష్టనష్టాలలో ఓపికపట్టేవారు కూడా మనకు సమాజంలో కొందరు కనబడుతూ ఉంటారు. వారి ఓపికే, వారి లక్ష్యాన్ని దగ్గర చేస్తూ ఉండవచ్చును. కొందరు లక్ష్యం చేరకపోయినా వారికున్న ఓర్పు గుణాన్ని వదలరు. కొందరు ఓర్పు పట్టలేక ఉన్న అవకాశాలనే కోల్పోతూ ఉంటారు.

ఓర్పు పట్టడం అనే అలవాటు సహజంగానే ఉంటే ఫరవాలేదు. కానీ కొందరికి ఓర్పుపట్టలేక ఏదో మనోవికారం వలన తమపై తాము నియంత్రణం కోల్పోతారు. అలా నియంత్రణను కోల్పోయిన మనసు చేస్తున్న పనిలో పట్టు కూడా కోల్పోతుంది. విషయాల వద్ద విచక్షణను కూడా ప్రక్కన పెడుతుంది. తమపై తాము నియంత్రణ కోల్పోతున్నవారు కూడా తమతప్పు తాము ఎరుగకపోవచ్చును. లేదా తమ తప్పు తమకు తెలిసినా, దానిని సాధించడంలో వారి మనసు సహకరించకపోవచ్చును.

పెద్దలు అంటారు ‘తమ మనసు తమ మాట వినడంలేదు’ అన్న విషయం గ్రహించడం కూడా మంచి విషయం. ఒకనాటికి ఖచ్చితం తమ మనసుపై వారు నియంత్రణ కలిగి ఉండగలుగుతారని అంటారు. ఇలా మనసును నియంత్రంచడంలోనే సమాజంలో ఒక వ్యక్తి కార్యాలను సాధించగలడు. ఓర్పు వలననే ప్రమాదాలు తప్పించుకోగలడు. ఇప్పుడు కరోనా వైరస్ బయట బస చేసింది. ఈ కరోనా ఒక అంటువ్యాధి, దీనికి ఇంకా మందు కనిపెట్టలేదు కాబట్టి, కరోనా వైరస్ సోకినవారి ప్రాణాలకు సరైన వైద్యం అందకపోతే అది ప్రాణాంతకమే. ఇప్పుడు ఇది మహమ్మారిలాగా వ్యాపిస్తుంది.

ఇప్పుడు ఓర్పు అందరికీ అవసరం. ఇప్పుడు ఓర్పు పట్టడం అందరి సామాజిక బాధ్యత. కుటుంబ పెద్ద తన వారికోసం ఎన్నో కష్టనష్టాలకు ఓర్పు వహిస్తూ ఉంటారు. అటువంటి కుటుంబ పెద్దకు ఏదైనా జరిగితే, ఆ కుటుంబం అంతా చాలా ఓర్పు వహించి, అతనిని రక్షించుకుంటారు. అలా ఇప్పుడు సమాజం కరోనా మహమ్మారి కోరలలో చిక్కింది. ఇప్పుడు మన సమాజాన్ని మనమే ఓర్పు వహించి రక్షించుకోవాలి.

ఎందుకంటే అదే సమాజంలో మనం తిరుగుతున్నాము. అదే సమాజంలో మనం జీవనోపాధి కలిగి ఉన్నాము. అదే సమాజంలో మనం సుఖసంతోషాలను అనుభవిస్తున్నాము. అదే సమాజంలో మనం ఎన్నో కార్యాలు నిర్వహిస్తూ, సమాజాన్ని ఉపయోగంచుకున్నాం.. ఉపయోగించుకుంటాం కూడాను. కానీ రేపటికి సామాజిక పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాను అంటూ కరోనా మహమ్మారి కోరలు చాచింది. కరోనా వైరస్ ఇప్పటికి మనదేశంలో వేలాదిమందికి సోకింది.

ఒకవ్యక్తికి కరోనా సోకి, అతనికి కరోనా వైరస్ సోకినట్టు తెలియక నెలరోజులు సమాజంలో తిరిగితే అతను 400మందికి ఆ వైరస్ ను వ్యాపింపజేయగలడు. చూడండి ఎంత పెద్ద తప్పు మన వలన మనకు తెలియకుండానే సమాజానికి జరిగిపోతే… సుమారు 400 మంది ప్రాణాలు రిస్కులో ఉన్నట్టే కదా… సమాజాన్ని ఉపయోగించుకుంటూ మనం సమాజానికి కూడా ఉపయోగడపడాలి. సహాయం చేసిన వ్యక్తికి తిరిగి అతనికి అవసర సమయంలో సహాయం చేస్తాం. అలా చేయకపోతే కృతఘ్నుడు అంటారు.

సమాజాన్ని ఉపయోగించుకుంటూ, ఉపయోగించుకోబోతూ మనం సమాజాన్ని రక్షించుకోవడం మన సామాజిక బాధ్యత.

అలా ఇప్పుడు మన సహకారం సమాజానికి అవసరం అయింది. ఇప్పుడు ఆ సహకారం మనం ఓర్పు వలననే అందించగలం. సమాజాన్ని ఉపయోగించుకుంటూ, ఉపయోగించుకోబోతూ మనం సమాజాన్ని రక్షించుకోవడం మన సామాజిక బాధ్యత. ఇటువంటి కాలం ఇంతకుముందు ఎన్నడూ మనం చూడలేదు. కాబట్టి అలవాటు ప్రకారం తప్పులు చేసేస్తూ ఉంటాం. కానీ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మనం సామాజిక దూరం పాటించాలి.

సామాజిక దూరం వలన కరోనా వైరస్ వ్యాప్తి లింకు పెరగదు. తద్వారా ఇప్పటికే బయటపడిన కేసులు పరిష్కరించడంలో వైద్యుల పని సులువు అవుతుంది. కాబట్టి మనం బయటకుపోకుండా ఇంటికే పరిమితం కావడంలో ఓర్పు వహించాలి. అయితే ఒంటరిగా ఉండే, మనసు పరి పరి విధాలుగా పోతుంది. అది అంటుంది, ఇది అంటుంది. అలా చేయి, ఇలా చేద్దాం అంటూ సూచిస్తుంది. కాలును కుదురుండనివ్వదు, చేతిని అదుపులో ఉండనివ్వదు.. దాని అలవాటు ప్రకారం శరీరంపై ప్రభావం చూపుతూ ఉంటుంది.

ఇక్కడే ఇలాంటి సమయంలోనే మనసును నియంత్రణంలో ఉంచుకోవడం ప్రధానం. మనసు చేసే చేష్టలను గమనిస్తే, అదే ఆగుతుంది. అది చెప్పినట్టే వింటే అది ఇంట్లో కూర్చోనివ్వదు. మనసు చదువుకునే సమయంలో శ్రద్ధగా పాఠాలు విని కుదురుగా ఉన్న మనసు ఒక వయస్సు వచ్చాక మాత్రం ఏదో అలవాటును వ్యక్తి మానరిజంగా అంటగట్టేసి అదే మానరిజంలో వ్యక్తిని నడిపిస్తుంది. అదేదో సినిమాలో చూపించినట్టుగా… మనసుకు మానరిజం అంటే అది మనకు ఒక్కోసారి బలం అయితే ఒక్కోసారి బలహీనత కావచ్చును. కానీ ఎప్పుడూ ఒకే తీరు వలన అతి నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ఇక అలవాటుపడిన మనసు ఒకేసారి కుదురుగా ఉండాలంటే, ఒప్పదు. అది చేయాల్సిన పనిని చేసేయాలని సూచిస్తుంది. బహుశా ఇంటికే పరిమితం కానివారి దృష్టి ఇదే అయ్యి ఉండవచ్చును.

కరోనా వైరస్ భారిన పడితే, మనతో బాటు మరికొందరికి వ్యాపింపచేసినవారమవుతాం.. అదే ఓర్పు వహించి, ప్రభుత్వ సూచనలు పాటిస్తే మాత్రం… మనం రక్షణలో ఉన్నట్టే,

కానీ కరోనా వైరస్ బయట కోరలు చాచి ఉంది. బయటకుపోయిన వ్యక్తిని ఏరూపంలో కాటు వేస్తుందో తెలియదు. బయటకుపోయి కరోనా వైరస్ అంటించుకుని వస్తే, అది కుటంబీకులకు వ్యాపిస్తుంది. మరలా వారినుంచి ఇతరలుకు వ్యాపిస్తుంది. ఇలా కరోనా వైరస్ భారిన పడితే, మనతో బాటు మరికొందరికి వ్యాపింపచేసినవారమవుతాం.. అదే ఓర్పు వహించి, ప్రభుత్వ సూచనలు పాటిస్తే మాత్రం… మనం రక్షణలో ఉన్నట్టే, మనం రక్షణలో ఉంటే మనతోటివారు రక్షణలో ఉన్నట్టే.. తద్వారా సమాజం మనవలన రక్షణలో ఉన్నట్టే… ఇంతకన్నా మనం ఇప్పుడు సమాజానికి చేయవలసినది ఏముంటుంది?

సామాజిక సేవ అంటే బయటకుపోయి పెద్ద పెద్ద కార్యాలు నిర్వహించడం అయితే ఇప్పుడు ఇంటికే పరిమితం కావడం పెద్ద సామాజిక సేవ అంటున్నారు. ఓర్పు వహిస్తే రాబోయే ప్రమాదాన్ని అరికట్టవచ్చును. ఈవిషయంలో ఇప్పటికే ఓర్పు వహించి ఇంటికే పరిమితం అయినవారందిరీకి పేరు పేరునా ధన్యవాదాలు. ఎందుకంటే అలా ఓర్పుతో ఇంట్లోనే వారు ఉండడం వలన కరోనా వైరస్ వారికి సోకదు. తద్వారా వారి కుటుంబం కూడా సేఫ్. తద్వారా సమాజం కూడా సేఫ్. తద్వారా ఒక రకంగా నేను కూడా సేఫ్.. అందుకని వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

ఓర్పు పట్టి ఇంటికే పరిమితం అయిన వారందరికి కృతజ్ఙతలు…ఒకవేళ లాక్ డౌన్ మరింత పొడిగించిన అది మన రక్షణ కోసమే కాబట్టి… ఇంకా ఓర్పు పట్టడం మనవంతు ప్రయత్నం.. మన ప్రయత్నం మనం చేద్దాం… ఓర్పుతో సమాజాన్ని సేవ్ చేసుకుందాం.. భవిష్యత్తు బాధను కొంచెమైనా తగ్గించుకోవడానికి మన ప్రయత్నం మనం చేద్దాం… ఓర్పు వలననే అవకాశాలను అందుకుని, జీవితలో ఎదగగలడు. ఓర్పు వలననే జీవన పోరాటంలో గెలుపు గుర్రం, జీవితాంతం వరకు సాగగలుగుతుంది. ఓర్పు దేవతా లక్షణం అంటారు. మనసు అంతిమంగా గెలవాల్సింది. తనని తానే అని చెబుతారు, పండితులు. ​గెలవాల్సిన పోరాటంలో బుక్స్ మన మనసుకు మరింత అవగాహన అందిస్తాయి. ఎందుకంటే ఒంటరిగా ఉండడం అంటే మనసుతో పని. కాబట్టి బుక్స్ మనసుకు మిత్రుని మాదిరిగా ఉంటాయి. పోరాడే సమయంలో మనసు కదలకుండా ఉండడమే ఆయుధం అయితే, ఒంటరిగా ఉండడం అంటే మనసు మనసుతో చేసే యుద్ధం.. అది చూడండి, ఇది చూడండి అనే మాయలో మనసు పడితే, దాని గురించి అది చేయాల్సిన పరిశీలన కాలం కోల్పోతాం.

ఓర్పు దేవతా లక్షణం అంటారు.

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం ! కరోనా కట్టడికి ప్రధాని ఇచ్చిన పిలుపును విమర్శించేవారు ఉన్నారు అంటే అది వారి సామాజిక కాంక్ష. ఎందుకంటే వారికి ప్రజలపై ఉండే ప్రేమ. ప్రజలు కరోనా వలన ఏమైపోతారో అనే ఆందోళన… పరోక్షపద్దతి కన్నా ప్రత్యక్షపద్దతికి వారిచ్చే ప్రధాన్యత.

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం ! డాక్టర్లు, పోలీసులు విశేష సేవలను అందిస్తున్నారు. కరోనాపై పోరాటం చేయడంలో యోధులుగా వ్యవహరిస్తున్నారు. మిగతా మీడియా వర్గం వారికి మద్దుతుగా ఉంటూ మనకు వివరాలు అందిస్తున్నారు. మనవంతు ప్రయత్నంగా మనంకూడా కరోనాను తరిమిగొట్టడంలో అందరూ ఆశిస్తున్న కీలకపాత్రను పోషిస్తూ ఉంటున్నాం అని తెలియజేయడానికి దీపం వెలిగిద్దాం.

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం
కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం

ప్రధాని నరేంద్రమోదీగారు తెచ్చిన సంకల్ప భావనను మనమంతా మన మనసులో నింపుకుని దీపం వెలిగిద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీపం వెలిగించండి సంకల్పం తెలియజేయండి అని మోదీగారి మాటను సమర్ధించారు. మనం కూడా దీపంతో ఇందులో భాగస్వామ్యం అవుదాం. ఈరోజు ఆదివారం రాత్రి 9గంటకు 9నిమిషాల పాటు దీపకాంతులు ఇంటి ముంగిట్లో వెలిగిద్దాం. భారతీయల సంకల్పం దీపకాంతులతో దేశప్రజల ఐక్యతను చాటుదాం. ఒక దీపం వెలిగిస్తే మనకు వచ్చే నష్టం ఏంలేదు.

కరోనాపై పోరాటం చేస్తున్న అనేక మంది డాక్టర్లుకు, పోలీసులకు ఒక సంకేతం వెళుతుంది. ముందు ప్రజలంతా ఒకే భావనతో ఉన్నారు. కరోనాపై పోరాటానికి దేశప్రజలు బలంగా ఆకాంక్షిస్తున్నారనే భావన బలంగా ఉంటుంది. ఇక దీపం జ్ఙానానికి సంకేతం అంటారు. కష్టంలో మనసుకు దీపం ఒక ఆదర్శం అవుతుంది. అజ్ఙానపు చీకటిని దీపం తరిమికొట్టే కాంతి, మనసుకు ఆలోచనను ఇస్తుంది. ఉపాయం వెలుగు ప్రభావం ఎలా సమస్యను దూరం చేస్తుందో అలా చీకటిని ప్రారద్రోలిన కాంతి వెలుగులు మన కళ్ళకు చూపుతుంది. ఇంకా దీపం మనసు ఏకాగ్రతతో ఉండడానికి సాయపడుతుంది. కష్టంలో మనసు ఏకాగ్ర దృష్టితో ఉండడం వలన కర్తవ్యం దాటిపోదు. కర్తవ్యాన్నే పట్టుకుంటుంది. నేటి మన కర్తవ్యం ఏమిటి? నేటి భారతీయుల కర్తవ్యం ఏమిటి? భారతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల కర్తవ్యం ఏమిటి?

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం
కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం

అందరూ మనకు చెబుతున్నది ఒక్కటే ఇంట్లోనే ఉండండి. ఇంట్లోనే ఉండి కరోనా కట్టడికి సహకరించండి. అనవసరంగా బయటకుపోయి కరోనా వ్యాప్తికి సహకరించకండి. కరోనా సోకకుండా ప్రభుత్వం ప్రకటించిన జాగ్రత్తలు పాటించండి. ఇదే అంతా మనకు చెబుతున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు మరయు ప్రభుత్వం ప్రతినిధులు చెబుతున్నారు. ఇంకా మీడియా చెబుతుంది. మీడియా ద్వారా సామాజిక ప్రముఖులు చెబుతున్నారు. సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటికే పరిమితం కండి, సామాజిక దూరం పాటించండి. ప్రభుత్వ సూచనలు పాటించండి. లాక్ డౌన్ ఆశయ సాధనలో సహకరించండి అని.

ఇంత మంది ఇన్నిరకాలు కరోనా మహమ్మారిపై పోరాడుతున్నారు. రోజుకు అయిదు వందలు సంపాదించేవారు అయినా, రోజుకు అయిదువేలు సంపాదించేవారు అయినా బయటకు పోతే కరోనాకు అంతా సమానమే. మన మనసులో వ్యత్యాసాలు ఉండవచ్చును. కానీ కరోనాకు ఉండవు. కేవలం వ్యాప్తి చెందడమే దానికి తెలిసింది. తట్టుకునే శక్తి ఉన్న వ్యక్తి శరీరంలో తనపని తాను చేసుకుంటూ, అతను తాకిన వస్తువుకు కరోనా కూడా చేరుతుంది. అతను ముట్టుకున్న మనిషిని కరోనా కూడా కౌగిలించుకుంటుంది. అతను తుమ్మితే ఆ తుంపర్లలో నుండి గాలిలో కదులుతుంది. కాసేపు గాలిలో ఉంటుంది. వీలైతే అక్కడ ఉన్న వ్యక్తులకు వ్యాపిస్తుంది. అతను తాకిన చేతితో కరోనా కరచాలనం చేస్తుంది. కరోనాకు చిన్నా, పెద్దా అనే వ్యత్యాసాలు చూపకుండా అందరితో కలిసి పోతుంది. ఒకరినుండి మరొకరికి మరొక వస్తువుకు మరొక చోటికి కరోనా వ్యాపించడంలో తేడాపాడాలు చూపదు.

కాబట్టి ఇలా పాకుతూ పోయే కరోనా కట్టడికి మనం అవకాశం ఇవ్వకుండా ఇంటికే పరిమతం కావడం చాలా చాలా చాలా ప్రధానం. మరీ మరీ ముఖ్యమైన విషయం. పుస్తకాలు చదివి అందులో చదివిన విషయం మరిచినట్టుగా మనం మీడియాలో విని, విన్న విషయం మరిచి బయటకుపోతే ఒంటికి వచ్చేది కరోనా. ఇంటికి తెచ్చేది కరోనా, అందరితో మీకన్నా ఒక అడుగు ముందే ఉండేది కరోనా.. ఇంటిల్లిపాదితో సంసారం చేసే, తన సంసారాన్ని పెంచుకునేది కరోనా, కరోనా, కరోనా…. ఇక మిగిలిదే మనం కాదు మనబదులు కరోనా వ్యాప్తి…

దేశమంతా ఒకేకాలంలో ఖచ్చితంగా 05-04-2020 ఆదివారం రాత్రి 9గంటలకు 9నిమిషాల పాటు దీపాలు వెలిగించడం అంటే కోట్ల మంది భారతీయుల చేస్టితం ఒక్కటే అవుతుంది. అందరి ఐక్యతను ప్రకృతి పసిగడుతుంది. కనబడని కరోనాకు అందరి ఆత్మల సంకల్పశక్తి ఒక్కటే అయితే, కనబడని కరోనా శక్తి క్షీణించకపోతుందా…. ఎందుకు క్షీణించదు. కరోనా సోకిన అందరూ మరణశయ్యలపైకి పోవడం లేదు. ఇమ్యునిటీ పవర్ తక్కువగా ఉన్నవారు, అనారోగ్యపరులు, అజాగ్రత్తలు ఎక్కువగా తీసుకునేవారు, ఆహారపు అలవాట్లలో దోషం ఉన్నవారు ఇలా ఏదైనా శారీరక రుగ్మతలు లేక ఆందోళన అధికంగా ఉండేవారు పోతున్నారు. కానీ కరోనా సోకిన అందరూ చనిపోవడం లేదు. రోజు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నా, రివవరీ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. అంటే కరోనా తట్టుకుని నిలబడుతుందీ మనిషే, కరోనాకు ప్రాణాలు కోల్పోతుంది మనిషే… అయితే శక్తిలో తేడా ఉంది. ఎంత శక్తిలో తేడా ఉన్న సంకల్పం గట్టిగా ఉంటే పోరాడి గెలిచినవారు సమాజంలో లేకపోలేదు. కేన్సర్ వచ్చినా సంకల్పం ద్వారా ఆయుష్సును కొన్నాళ్ళు పెంచుకునేవారు ఉన్నారు. సంకల్పశక్తితో ఎయిడ్స్ భారిన పడ్డవారు సాదారణ జనులు మాదిరిగా జీవించేవారు లేకపోలేదు. కరోనా కూడా వ్యాధే అది అంటువ్యాధి.

అయితే కరోనా రికవరీ కేసులు ఉన్నాయి అంటే రికవరీ అయిన వారి శారీరక శక్తి, వారి మానసిక దృక్పధం బట్టే ఉంటుంది. మీరే గమనించండి. ఒక్కసారి రోగం వచ్చిన వ్యక్తికి రోగతీవ్రత తెలియకపోతే సంతోషంగానే ఉంటాడు. రోగతీవ్రతకు కలవరపడితేనే, రోగంతో పోతానేమో అనే ఆందోళనతో సగం సంతోషం దూరం చేసుకుంటాడు. ఆపై ఆందోళనతో అందరి చూపు ప్రభావంతో ఇంకా దిగాలుపడతాడు. ఇలా మానసికంగా కృంగితేనే శారీకంగా కృంగిపోవడం ఉంటుంది. కానీ కొందరు ఇలా మనసులో ఆందోళన రానివ్వరు. కొందరు అందరి చూపులోని ఆంతర్యం తీసుకోరు. తనకు అనారోగ్యతీవ్రత తెలిసిన సంతోషం వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకుని రోగాన్ని జయించి ఇంకొంత ఆయుష్సు పెంచుకుంటాడు. కాలంలో ఎప్పటికైనా మనిషకి మరణం ఉంటుంది. అతను చేసిన పనులకు కాదు. కాబట్టి కరోనాకు కంగారుపడి ప్రాణాలు వదిలితే, పోయాకా కరోనాను తట్టుకుని నిలబడ్డ వ్యక్తి మాటలు ఎలా ఉంటాయో… ఒక్కసారి ఊహించండి. నిద్రలే మహానుభావా… మనసును మేలుకోలుపు…. చేయి.

మనసు ఎక్కడిది? ప్రశ్న వేయి… మనసు దేని ఆధారం పని చేస్తుంది? ఆలోచన చేయి. నేను ఒక్కమాట చెబుతాను. మనిషి మరణిస్తే మనసు ఎటుపోతుంది? మనిషి పుట్టగానే పసిపాపలో కూడా అమాయక మనసు ఉంటుంది. అది ఎక్కడి నుండి వచ్చింది. ఆమనసుకు మూలస్థానం ఏదో అది నీకు పుట్టుకతోనే ఉంది. చనిపోయే కాలంలోనూ ఉంటుంది. సాక్షిగా ఉంటుంది. ఆ సాక్షిని అడుగు.. నీవు ఆసాక్షిని చూడలేకపోవచ్చును. కానీ కాసేపు మనసు ఏకాగ్రతతో ఉంటే, మనసుచేరే మూలమదే… ఆ మూలమే మనిషికి శక్తి… మనిషి పోకముందే ఆమూలాన్ని తెలుసుకోవాలనేది… అన్ని శాస్త్రాల మాట. ఇప్పుడు ఆమూలాన్ని చేరుకోవడం లక్ష్యం కాదు. బ్రతకడం లక్ష్యం. ఎందుకంటే నిన్ను కబలిస్తాను అంటూ కరోనా మహమ్మారి కమ్ముకుంటూ వస్తుంది. కరోనా కరోనా అనేగానే కంగారుపడేవారు ఆందోళనతో కరోనా సోకగానే భయంతో పోయేవారు ఉంటున్నారు. చికిత్స తీసుకుని తేరుకుంటున్నవారు తక్కువగా ఉంటున్నారంటే ఆందోళన అధికమవ్వడమే… కారణం…

ఆందోళనను జయించి మనసు దానికి మూలమైన సాక్షిగా ఉండే ఆత్మతో ఒక్కసారి అనుసంధానం మనిషికి తెలియకుండా అవుతుంది. కాబట్టి తన శక్తిని తాను పుంజుకుంటుంది. ఎలా అనుసంధానం అవుతుందో నీకు తెలియకపోవచ్చును. కానీ అనుసంధానం అవుతుందని ఎలా చెబుతారు అంటే నిద్రిస్తున్నప్పుడు కలతలేని నిద్రలో కలలేని సమయంలో శరీరమును ఏంతాకినా స్పర్శ తెలియని ఆ సమయంలో మనసు ఎక్కడికి వెళుతుంది. అనేది మాములుగా ఎరుకలో ఉండదు. కానీ మనసు కూడా నిద్రించడం అంటే, కాసేపు ఆత్మశక్తితో అనుసంధానం కావడమే… అయితే ఇదంతా ఆధ్యాత్మికలో అందరూ చెప్పేదే… అయితే దైవస్వరూపాలు వేరు వేరుగా చెబుతారు. వేరు వేరుగా అనేక విధానాలు చెబుతారు. అయితే ఇప్పుడు ఇవ్వన్ని అప్రస్తుతం… మనకు కావాల్సింది. మన ప్రాణరక్షణ, మనతోబాటు సమాజ భద్రత. ఇందుకు ప్రభుత్వ వ్యవస్థ, ఒక స్వచ్చంధ సంస్థ, ఒక వైద్య వ్యవస్థ కృషిచేస్తే సరిపోదు. ప్రతి మనిషి కృషి చేయాలి. ఎందుకంటే కరోనా అంటువ్యాధి. కాబట్టి కరోనాపై తగు జాగ్రత్తలు అవసరం. జాగ్రత్తగా ఉంటేనే సరిపోదు చెడును ఎదుర్కోవాలంటే మంచి సంకల్పమే కావాలి. అదీ దీపం ముందు చేయాలి. ఎందుకు దీపం. దీపం జ్ఙానానికి సంకేతం.

ఎవరైనా ఏదైనా చెబితే దానిపై మనసు అభిప్రాయం అనుకూలంగానో, ప్రతికూలంగానో స్పందిస్తుంది. ఇదే కరెక్టు మనసున్న మనిషిగా స్పందించడం సరైన విధానం కానీ కొందరు స్వార్ధపరులు ఏముందీ ఏది అనుకూలంగా అనిపిస్తే అదే మాటను అనుకూలంగా మార్చుకుంటారు. ఇలాంటివారి మాటలు వినే ముందు.. విమర్శలు పాలు అవుతున్న విషయం కానీ మద్దుత పొందుతున్న విషయం కానీ ఏదైనా దానిపై మీరు నమ్మిన వ్యక్తులను అడిగి చూడండి. ఆవిషయంలో మీకు క్లారిటీ ఇస్తారు. లేకపోతే ఇంటర్నెట్లో విషయంపై పరిశీలన చేయండి. ఆ విషయంపే మీకు సరైన సమాచారం దొరుకుతుంది. ఆవిధంగానే ప్రధాని నరేంద్ర మోదీగారు చెప్పిన సంకల్ప శక్తి గురించి వైద్యనిపుణులను అడగండి. లేదా ఇంటర్నెట్లో సెర్చ చేయండి. ఒకవేళ ఇంటర్నెట్లో ఇలాగే ఎవరైనా వ్రాసి ఉంటే, మానసిక శక్తి గురించిన వైజ్ఙానిక పుస్తకాలు చదవండి. వాటికి ప్రమాణాలు ఉంటాయి. లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనించండి. నిత్యం దీపారాధన చేసేవారిని అడగండి. తెలసుకోండి. తెలసుకుని దీపం పెట్టండి. దీపశక్తి ఆత్మశక్తికి సంకేతం.

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం
కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం

మనసుకు మూలం ఆత్మ. ఆత్మను గాలి ఏంచేయలేదు. అగ్ని ఏమిచేయలేదు. కత్తి ఏమిచేయలేదు. ఆత్మ అతీతమైన ఆలోచనకు ఆవల సాక్షిగా ఉంటుంది. అదీ ఏకాగ్రతగా ఉన్న మనసుకే ఉంటుంది. అయితే ఇంతటి శక్తి ఉన్న మనిషికి కరోనా ఏంచేయగలదు. అది సోకిన అందరూ చనిపోలేదు. కొందరు రికవరీ అవుతున్నారు. అన్ని దేశాలలోనే ఒకేరీతిలో ఒకగంటకు ఇన్ని కిలోమీటర్లు లెక్క అన్నట్టుగా అంతా వ్యాపించడంలేదు. మనిషి కదలికలు బట్టే కరోనా పెరుగుతుంది. గమనించండి మీరు కరోనా అంతటా వ్యాప్తి ఒకేలాగా లేదు. ఒక్కోదేశంలో ఒక్కోలాగా ఉంది. అంటే ప్రకృతిలో శక్తి దానికి అవరోదంగానే ఉంది కదా. కరోనా వస్తువుపైన కొంతసేపు జీవించగలదు. కానీ ఆవస్తువును పాడుచేయలేదు. ఎందుకంటే వస్తువు కదలదు. కదలని వస్తువుపై కరోనా కాసేపు కాపురం చేస్తుంది కానీ దానిని నాశనం చేయలేదు. అలాగే ఆందోళన లేని మనిషిని కూడా అంతత్వరగా పడగొట్టలేదు. బలంగా ఉన్నవ్యక్తి లోపలే దాక్కుంటుంది. కానీ ఏంచేయలేదు. వ్యాప్తి చెందడం మినహా.. అందుకే అందరూ ఇంట్లోనే ఉంటే, ఎక్కువమందికి వ్యాప్తి చెందదు అన్నారు.

ఇక ఒక కదలని వస్తువుపై కాసేపు ఉండే కరోనా వైరస్ కొంతసేపటికి ఏం అవుతుంది. ప్రకృతిలో నశిస్తున్నట్టే కదా… మరి నశించిపోయేది. కంటికి కనిపించని చిన్న కరోనా కణానికి కదిలిపోయే మనిషి నీలో కదలని ఆత్మశక్తిని ఒక్కసారి వేడుకో… మనసులో స్థైర్యం నింపుకో…. ప్రపంచమంతా స్ట్రిక్టుగా నిబంధనలు ఉన్నాయి. అయినా అక్కడ కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. మనకు మనదేశంలో వ్యాప్తి తక్కువగా ఉంది. ఇంకా మనదేశంలో నిబంధనలు ఇతరదేశాల మాదిరిగా కఠినంగా ఉండవు. అంటే మనదేశంలో సంకల్పశక్తి చాలా ఉంది. అయితే అది ఇప్పుడు మరింతకావాలి… ప్రపంచానికంతటికి కావాలి. ప్రపంచం ఇండియావైపు చూస్తుందంటే ఇండియాలో ఉన్న సంకల్పశక్తే…. ఈసంకల్పశక్తి అందరూ దీపంద్వారా తెలియజేయడమే ఇప్పుడు అవపరం. సాధించాక ఘనత చెప్పుకోవడానికి చూసేవారు ఉంటే వారికి దారి కనబడదు. సాధించడానికి ప్రయత్నంచేసేవారికి ఏదైనా మార్గమే.. కరోనాను ఎదుర్కోవడానికి కావాల్సింది సంకల్పశక్తి. అంతా ఇంటికే పరిమితం అయ్యాము. ఇప్పుడు మేము సంకల్పం చేసేది.. సామాజిక శ్రేయష్సుకోరి కష్టపడుతున్న అన్ని వర్గాలవారికీ సంఘీభావం తెలియజేస్తూ మనమంతా ఒక్కటే.. మనసంకల్పము ఒక్కటే… మానవ మనుగడ మేలుకోసమే… భారతీయల సంకల్పం దీపకాంతులతో మన సంఘీభావం తెలియజేద్దాం….

కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం

సంఘజీవిగా ఉండి, సంఘంకోసం కష్టపడేవారికి సంఘీభావం దేశమంతా చేయడం మేలైనదే అయితే అదేచేద్దాం. కష్టం చేసిన వ్యక్తి ఇంటికి వస్తే, ఆ ఇంట్లో పరామర్శించేతీరు ఆవ్యక్తికి శాంతినిస్తుంది. ఆ యొక్క శాంతి మనసుకు బలం అవుతుంది. మనం కూడా ఇలానే చేద్దాం.. సమాజ శ్రేయష్షుకోసం కంటికి కనబడని శత్రువతో పోరాటం చేస్తున్నవారికి సంఘీభావం తెలియజేద్దాం… పోయేదేముంది ప్రేమతో ప్రధాని పిలుపును ఆహ్వానించి భారతీయులంతా చేస్తే.. అది చూసిన డాక్టర్లకు, పోలీసులకు వివిధ ప్రభుత్వాధికారులకు కనీస మానసికమైన సంతోషం కలిగిస్తుంది… కదా మనసు సంతోషమే కదా కర్తవ్యం మరింత శ్రద్ధగా ఉంటుంది. ఇప్పుడు వారి కర్తవ్యమే కదా మనకు రక్షణ… మనజాగ్రత్తలు మనము ఎలాగో తీసుకుంటున్నాం. ఈ ఆదివారం రాత్రి 9గంటలకు 9నిమిషాలపాటు కొవ్వొత్తి కానీ దీపపు ప్రమెదలో కానీ దీపపు కుందెలో కానీ దీపం పెడదా.. దేశ ప్రధాని పిలుపు దేశప్రజల ఐక్యతను చాటుదాం… మనం ఓటేసి గెలిపించిన వారి మాట మనమే కాదంటే ఇక మన ఓటుకు మనం ఇచ్చే విలువ ఎంత?

గమనిక: కరోనా మహమ్మారిపై పోరాటానికి భారతీయల సంకల్పం దీపకాంతులతో తెలియజేద్దాం

ఈ పోస్టు వ్రాయడానికి కారణం నా ఆలోచనను పంచుకోవాడానికే కానీ ఎవరిని విమర్శించడానికి కాదు. ప్రధాని నరేంద్ర మోదీగారు ఇచ్చిన పిలుపులో సంకల్పం అనే మాట నామనసును తాకింది. అది కదిలింది… అక్షరాలు అల్లుకుపోయాయి. పదాలు పేరుకుపోయాయి… వ్యాక్యాలు వ్యక్తం అయ్యాయి. పేరాలు పోగయ్యాయి… అంతే అవే మీముందుకు ఇలా తెలుగురీడ్స్.కామ్ ద్వారా వచ్చేశాయి… పరాత్పరరావు.

ధన్యవాదాలు….