దీపావళి తెలుగు పాత సినిమా

దీపావళి తెలుగు సినిమా రామారావు, సావిత్రి నటించిన తెలుగు ఓల్డ్ మూవి

దీపావళి తెలుగుచలనచిత్రంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణకుమారి, ఎస్. వరలక్ష్మి, రమణారెడ్డి, ఎస్వీ రంగారావు, కాంతరావు తదితరులు నటించారు. ఈ దీపావళి తెలుగు పాత సినిమా కు ఎస్. రజనీకాంత్ దర్శకత్వం వహించారు. 1960లో ఈ సినిమా విడుదలైంది.

కార్తీకమాసం ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య దీపావళి అమావాస్యగా అంతకుముందు రోజు నరకపీడ వదిలిన దినంగా జరుపుకుంటాం. దీపావళి పండుగ రావడానికి కారణం నరకవధగా చెబుతారు. నరకుడు బాధలను చూపుతూ, శ్రీకృష్ణుడి లీలను చూపుతూ ఈ సినిమా సాగుతుంది.

వ్యగ్రతతో సమయంకానీ సమయంలో సంగమిస్తే, దేవతలకు కూడా ధ్వేషబావంతో ఉండే పిల్లలే పుడతారని దీపావళి సినిమా ద్వారా గ్రహించవచ్చును. హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహమూర్తి ఆగ్రహం చల్లారకుండానే, వరహామూర్తికి, భూదేవికి పుట్టిన సంతానమే నరకుడు. నరకుడు జన్మించిన సమయంలోనే భూదేవికి, శ్రీమహావిష్ణువు మాట ఇస్తాడు, ”నా చేతులతో నరకుని వధించనని”.

దీపావళి సినిమా ప్రారంభంలో నరకుడు(ఎస్వీ రంగారావు) ఘోరతపస్సుకు మెచ్చిన పరమశివుడు సాక్షాత్కరిస్తాడు. నరకుడు పరమశివుని భక్తితో స్తుతి చేసి, అమరులపై విజయం, మరణం లేకుండా చిరంజీవిగా రెండు వరాలు కోరుతాడు. పరమశివుడు నీ తల్లి తప్ప నిన్ను ఎవరూ వధించలేరని చెప్పి అంతర్ధానం అవుతాడు.

కన్నతల్లి కొడుకుపై కత్తి దూయటం అసాద్యం కాబట్టి, తనకు మరణం లేదని భావించిన నరకుడు, తన బలంతో రెచ్చిపోతాడు. దేవేంద్రుని పదవిని ఆక్రమిస్తాడు. ఇంకా దేవమాత అయిన అదితి దగ్గర నుండి చెవి కుండళాలు చేజిక్కుంచుకుంటాడు. సాధుజనులను భాదిస్తూ, తాను ఆనందిస్తూ ఉంటాడు. కృష్ణభక్తులను బాధిస్తూ ఉంటాడు. పేరుకు తగ్గట్టుగానే ప్రజలకు భూలోకంలోనే నరకలోకయాతనలను చూపిస్తాడు.

ద్వారకలో శ్రీకృష్ణు(ఎన్టీ.రామారావు)ని ఆశ్రయంలో ఉన్న నాగదత్తుడి(గుమ్మడి) కూతురు అయిన వసుమతి(ఎస్.వరలక్ష్మి)ని నరకుడు వంచించి తన భార్యగా చేసుకుంటాడు. నారదుడు(కాంతారావు) వలన నరకుడి వంచన సత్యభామ(సావిత్రి), శ్రీకృష్ణులకు తెలుస్తుంది. నరకుడిని భర్తగా అంగీకరించిన వసుమతిని, నాగదత్తుడు నరకుని వధించమని చెబుతాడు. దానికి వసుమతి భర్తే నాదైవమని, నేను నా భర్తను చంపలేనని తేల్చి చెప్పడంతో నాగదత్తుడు నిష్ర్కమిస్తాడు. కానీ తానే నరకుని చంపబోయి, నరకునికి చిక్కి చెరసాల పాలవుతాడు. దీపావళి తెలుగు పాత సినిమా.

అజేయ బలపరాక్రమాలు కలిగిన నరకుడు తన బలగంతో సాధువులను యజ్ఙయాగాదులలోని అవిస్సులను నరకుడికే అర్పించాలంటూ, వారిని హింసిస్తూ ఉంటాడు. నరకుడి చావు తన చేతిలో లేకపోవడంతో శ్రీకృష్ణుడు నారదునితో నరకునికి హితవు చెప్పిస్తాడు. నారదుని హితవుని నరకుడు లెక్కపెట్టడు. ఇంకా రెచ్చిపోయి సాధు జనులను హింసించడం పెంచుతాడు, వారు చేస్తున్న యజ్ఙయాగాదులను ద్వంసం చేయిస్తూ ఉంటాడు.

నారదుడి సలహామేరకు వసుమతి తన కొడుకుని, చెరసాలలో ఉన్న తన తండ్రి నాగదత్తుడి దగ్గరకు తీసుకువెళుతంది. ఈ విషయం గమనించిన నరకుడు తన కొడుకుని వసుమతి దగ్గర నుండి తీసుకుని, వసుమతిని కూడా చెరసాలలో పెడతాడు. ఇంకా నరకుడు శ్రీకృష్ణుని వేషంలో వచ్చి లోకంలో ఉన్న పడచులను అపహరించుకుపోతాడు. ఈ విషయం సత్యభామకు తెలిసి, శ్రీకృష్ణుని నిలదీస్తుంది. కానీ కృష్ణుని మాటలచేత ఆపని కృష్ణుడు చేయలేదని గ్రహిస్తుంది. అయితే ఆపని నరకుడే చేసాడని, నారదునిచేత తెలుసుకున్న సత్యభామ, ఆ నరకుడిని అంతం చేస్తానని నారదుడుకి మాట ఇస్తుంది.

నరకుడు నాగదత్తుడి కనుగుడ్లు పీకించేస్తాడు. సాధుజనులను హింసించడం కొనసాగిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ సభకు నాగదత్తుడు, అదితి కూడా వచ్చి శ్రీకృష్ణ పరమాత్మతో నరకుని ఆకృత్యాలను మొరపెట్టుకుంటారు. దానితో శ్రీకృష్ణపరమాత్మ, సత్యభామతో కలిసి నరకునితో యుద్ధానికి వెళతాడు. భూదేవి పుత్రుడైన నరకుడు, భూదేవి అవతారం అయిన సత్యభామ చేతిలో మరణిస్తాడు. నరక బాధలనుండి విముక్తి పొందిన ప్రజలు దీపాలు వెలిగించి, దీపావళి పండుగ చేసుకుంటారు.

సాక్షాత్తు భూదేవి బిడ్డడు, పరమశివుని వరాలు కానీ వ్యగ్రతతో పీడిత బుద్దితో ప్రజలను నరకయాతన పెట్టిన ఘనుడు నరకుడు. అందుకే భగవానుడు కన్నతల్లి చేతుతోనే మరణించేలా చేస్తాడు. లోకపీడితంగా మారితే, ప్రకృతిలోని మాతృస్వభావం చూస్తూ ఊరుకోదు. అలాగే నరకుని ఆకృత్యాలు విన్న సత్యభామ అతనిపై యుద్ధం చేస్తుంది. లోకాన్ని రక్షిస్తుంది. దీపావళి తెలుగు పాత సినిమా.

దీపావళి సినిమా చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి.

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

మంచి భక్తిరసచిత్రంగా అలరించిన అలనాటి ఆణిముత్యం సతి సక్కుబాయి సినిమా.

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా అలనాటి పాత సినిమాలలో ఒక్కటి. సతీ సక్కుబాయి సినిమా చూడడానికి ఇక్కడ తాకండి

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా కృష్ణభక్తితో పరవశించే ఇల్లాలు. ఎక్కడైనా, ఏ వస్తువులోనైనా ఎప్పుడైనా సరే కృష్ణుడిని చూస్తూ, ఆరాధించే అరుదైన అదృష్టవంతురాలి కధ. ప్రదేశాన్ని బట్టి, సమయానుసారం కృష్ణలీలలను కాంచుతూ ఉంటుంది.

సక్కుబాయి పండరీలో పాండురంగడి గుడిలో పాటపాడుతూ మయమరిచి, స్వామి పాదాలపై పడి ఉంటుంది. ఆమె తల్లీదండ్రులు అక్కడికి వచ్చి ఆమెను ఇంటికి తీసుకుపోతారు. అయితే ఇంటి దగ్గరకూడా ఆమె నిత్యం పాండురంగడి ధ్యానంలోకి వెళుతూ ఒంటరిగా ఉంటుంది. యుక్తవయస్సుకు వచ్చినా ఇంత భక్తిపరాయణత్వం ఏమిటా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. అయితే ఒకరోజు సన్యాసి ఆ ఇంటికి వచ్చి, సక్కుబాయిని ఆశీర్వదించి ఆమెకు పాండురంగ స్వామి విగ్రహమును ఇచ్చి వెళతాడు. నాటి నుండి సక్కుబాయి ఆపాండురంగడి విగ్రహమే సర్వస్వంగా ఉంటుంది.

సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

ఒక శుభమూహర్తమున సక్కుబాయికి, ఒక రైతుకుటుంబంలోని బిక్షపతికి ఇచ్చి వివాహం జరిపించి, ఆమెను అత్తవారింటికి పంపించేస్తారు. బిక్షపతి తల్లి గయాళి అయితే, అతని చెల్లెలు గంగ కూడా తల్లిని మించిన గయ్యాళి. సక్కుబాయి-బిక్షపతిల వివాహానంతరం అతని చెల్లెలు గంగ తన మెట్టింటికి వెళుతుంది. సక్కుబాయి అత్తవారింటికి కూడా తనకు స్వామిజీ ప్రసాదించిన పాండురంగడి విగ్రహాన్ని తీసుకుపోయి, నిత్యం పూజలు చేస్తూ ఉంటుంది.

అది చూసి ఆమె అత్తగారు హెచ్చరిస్తుంది. ఇక నుండి పూజలు చేయవద్దు, ఇంటి పనులు మాత్రమే చేయాలని ఖచ్చితంగా చెబుతుంది. సక్కుబాయి అత్తగారి మాటలకు ఎదురు చెప్పకుండా, ఇంటిపనులు చేస్తూ కూడా, ప్రతిపనిలోనూ కృష్ణలీలలను కాంచుతూ పరవశిస్తూ ఉంటుంది. బిక్షపతి మాత్రం తన భార్యభక్తికి ఏవిధంగానూ అడ్డు చెప్పడు, ఆమెపై మనసునిండా ప్రేమను నింపుకుని ఉంటాడు. సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా.

సక్కుభాయి ఇంట్లో ఒక రోజు మజ్జిగ చిలుకుతూ, వెన్నముద్దను చూడగానే కృష్ణలీలలు గుర్తుకు వచ్చి, నిజంగానే కృష్ణుడు వచ్చి వెన్నతింటున్నట్టుగానే పరవశిస్తుంది. కానీ సక్కుబాయి చేతిలోని వెన్నముద్దను పిల్లి తింటూ, పాలకుండతో ఇంట్లోకి వస్తున్న ఆమె అత్తగారికి కనబడుతుంది. అత్తగారు వచ్చి ఆమెను మందలించి, తన చేతిలోని పాలకుండ సక్కుబాయికి ఇచ్చి, ఉట్టి మీద పెట్టమంటుంది. అక్కడకు వెళ్లిన సక్కుబాయి ఉట్టిని చూడగానే మరలా కృష్టుడు గుర్తుకు వచ్చి, కృష్ణుడికి పాలుపోస్తున్నట్టుగా పరవశిస్తూ, తన చేతిలోని పాలను నేలపై పోస్తుంది. దాంతో అత్తగారు ఆమెపై చిరాకు పడుతుంది. సక్కుబాయి ఇలా ఏవిధంగా ఏపనిలోనైనా కృష్ణలీలలను గుర్తు చేసుకుంటూ, కృష్ణ భక్తిలో పరవశిస్తూ ఉంటుంది.

ఒకరోజు చేతిలో కృష్ణుడి బొమ్మ ఉంచుకుని పరవశిస్తూ నిలబడి ఉన్న సక్కుబాయిని చూసిన, ఆమె అత్తగారు అక్కడకు వచ్చి సక్కుబాయి చేతిలోని పాండురంగడి బొమ్మని తన చేతులలోకి తీసుకుని నేలకేసి కొట్టి ముక్కలు చేస్తుంది. వెంటనే ఆ బొమ్మ మరలా యధావిదిగా అతుక్కుని, సక్కుబాయి చేతిలోకి చేరుతుంది. అత్తగారు ఆశ్చర్యపోయి, ఆ బొమ్మని మాయాబొమ్మగా భావిస్తుంది. అప్పుడే పుట్టింటికి వచ్చిన గంగ కూడా సక్కుబాయి చేతిలోని బొమ్మని తీసుకుని, నీళ్ళున్న భావిలో పడేస్తుంది. వెంటనే భావిలో నీరు అంతా ఇంకిపోయి, భావిలో నుండి బొమ్మ వచ్చి గంగ నెత్తిమీద దెబ్బలు వేసి, మరలా సక్కుబాయి చేతిని చేరుతుంది. గంగకు దాహం వేస్తుంది. కానీ నూతిలో నీరు ఉండదు, ఇంట్లోకి వెళితో ఇంట్లోనూ నీరు ఉండదరు. వారికి ఆశ్చర్యం వేసి, ఇదంతా ఆ మాయాబొమ్మ వల్లే అనుకుంటారు. ఎలాగైనా సక్కుబాయి తిక్క కుదర్చాలని భావించి, గదినిండా ఉన్న గోదుమలను తెల్లారేసరికి పిండి చేయమని చెబుతారు.

నాటి మేటి సినిమా సతీసక్కుబాయి తెలుగు భక్తిసినిమా

సక్కుబాయి పాండురంగడిని తలుచుకుంటూ, గోదుమలను పిండి చేస్తూ శోష వచ్చి పడిపోతుంది. తర్వాత కృష్ణుడే వచ్చి ఆపని చేసి అంతర్ధానం అవుతాడు. స్పృహకోల్పొయి పడి ఉన్న సక్కుబాయిని చూసిన ఆమె భర్త బాదపడతాడు. తన వల్లే నీకు ఈ కష్టాలు అంటూ భార్యతో బాధని పంచుకుంటాడు. భిక్షపతి తన చెల్లెలు గంగను మెట్టింటికి పంపించేయాలని భావించి, తన బావగారిని తీసుకురావడానికి బయలుదేరతాడు. భిక్షపతి ఊరినుండి తన బావని తోడ్కొని వచ్చే సమయానికి, తల్లీకూతుళ్లు ఇద్దరూ కలసి సక్కుబాయిని చిత్ర హింసలు పెడతారు. ఈ విధంగా వారిద్దరూ సక్కుబాయిని నానావిధాలుగా నిందిస్తూ, అష్టకష్టాలు పెడుతుంటారు. ఒకరోజు సక్కుబాయి పండరీకి బయలుదేరుతుంటే, ఆమెను అడ్డగించి ఒకస్థంబానికి కడతారు. అప్పుడు ఆ పాండురంగడే, సక్కుబాయిని భర్తరూపంలో విడిపించి ఆమెను పండరికి బయలుదేరేలా చేస్తాడు.

ఇక పాండురంగడు అక్కడే సక్కుబాయి రూపంలో ఉండి వారివురికి బుద్ది చెబుతాడు. గంగ సంసారం చక్కదిద్దుతాడు. ఇంకా పండరీలో ప్రాణం విడిచిన సక్కుబాయిని, తిరిగి పునర్జీవుడిని చేసి, ఆమె సంసారం చక్కదిద్దుతాడు. సినిమా ఆద్యంతం కృష్ణభక్తిని ప్రబోదం చేస్తూ, శ్రీకృష్ణుని లీలలతో సాగుతుంది. మంచి భక్తిరసచిత్రంగా అలరించిన అలనాటి ఆణిముత్యం సతి సక్కుబాయి సినిమా. ఇందులో కృష్ణుడిగా కాంతారావు, సక్కుబాయిగా అంజలీదేవి, ఆమె భర్తగా ఎస్వీ రంగారావు, సక్కుబాయి అత్తగా సూర్యాకాంతం, సక్కుబాయి ఆడపడచుగా గిరిజ, సక్కుబాయి ఆడపడచు భర్తగా రేలంగి నరసింహారావుగారు, సన్యాసిగా గుమ్మడి తదితరులు నటించారు.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

కనకదుర్గ పూజామహిమ

కాంతారావు, కృష్ణకుమారి జంటగా నటించిన చిత్రం టైటిల్ కనకదుర్గ పూజా మహిమ భక్తిజానపద చిత్రం. జానపదచిత్రబ్రహ్మ అయిన విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని యూట్యూబ్ ద్వారా చూడడానికి ఈ అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

Actors/Actress నటీనటులు: కాంతారావు, రాజనాల, ముక్కామల, బాలకృష్ణ, మిక్కిలినేని, సత్యనారాయణ, కృష్ణకుమారి తదితరులు ఈ చిత్రంలో నటించారు.
Music/సంగీతం:రాజన్ నాగేంద్ర
Direction/దర్శకత్వం: బి విఠలాచార్య

Kanakadurga pooja mahima telugu chalana chitram kadha

జీవనమే పావనం మానవ జీవనమే పావనం పాటతో ప్రారంభం అయ్యే చిత్రంలో రాజు, రాణి గానం చేస్తూ ఉంటారు. గానం పూర్తయాక ఆ రాజుగారి పురోహితులు వచ్చి కనకదుర్గా దేవి సహస్రనామ అర్చనకు సర్వం సిద్దం తమరు వచ్చి పూజలో పాల్గొనవలసినదిగా కోరతారు. రాజుగారు పూజారినే పూజ ముగించేయండి నేనురాను అని చెప్పి పంపించేసి రాణి దగ్గర ఉండిపోతాడు.  అమ్మపూజలో పాల్గొనకుండా రాజు రాణితో ప్రేమపాటలు వల్లివేయడంలో ఇరువురు మధ్యలో ఒక నక్క గురించి ఆడదా మగదా అనే విషయంలో బేదాభిప్రాయం వచ్చి పందెం కాస్తారు. ఎవరిమాట తప్పు అయితే వారు అరణ్యాలకు వెళ్ళాలని రాజు నిర్ణయించి చెబుతాడు.

అయితే రాణి మహారాజు అడవుల పాలు కావడం ఇష్టంలేకా అది ఆడ నక్కే అయినా, మార్చి మగనక్కని తెప్పించి రాజుగారిని గెలిపిస్తుంది. అయితే మహారాజు మహారాణిని ఏమాత్రం దయలేకుండా అడవులకి పంపించేస్తాడు. రాజబటులు మహారాణిని అడవులలో వదిలి వెళ్ళిపోతారు. కానీ మహారాణి అడవికివెళ్ళిపోయాక చింతిస్తాడు. ఇదంతా కనకదుర్గ పూజని నిరాకరించడం వలననే ఇటువంటి ఫలితం వచ్చింది అని పురోహితులు చెబుతారు. ఇక మహారాజు రాజ్యభారం బావమరిదికి అప్పజెప్పి మహారాణిని వెతుక్కుంటూ అడవులకి బయలుదేరతాడు.

అడవులపాలైన రాజదంపతులను వేరు రూపాలలో ఒకచోటికి చేరడం – కనకదుర్గమ్మ అనుగ్రహం

కనకదుర్గమ్మకి మొక్కుకుని కాలిబాటలో నడుస్తున్న ఇద్దరు దంపతులు అలసి అడవిలో బాటప్రక్కనే కూలబడతారు. మహారాణి ప్రసవవేదనలో నడుస్తూ వచ్చి ముని తపస్సు చేసుకునే చోట మగపిల్లవాడిని ప్రసవిస్తుంది. మహారాణికి దాహం వేసి ధ్యానంలోనే ఉన్న ముని దగ్గరే ఆ పిల్లవాడిని పెట్టి, దాహార్తి తీర్చుకోవడానికి వెళుతుంది. పసిబిడ్డ ఏడుపు విని అటుగా వచ్చిన బాటసారి దంపతులు ఆ మహారాణి బిడ్డని తీసుకుపోతారు. దాహం తీర్చుకుని తిరిగివచ్చిన మహారాణికి బాబు కనబడడు.

ధ్యానంలోనే ఉన్న ముని ఈ పిల్లవాడు అక్కడ ఉంచడం కానీ వేరే దంపతులు పట్టుకువెల్లడం కానీ తెలియని మునిని మహారాణి అరిచి ధ్యానభగ్నం కావిస్తుంది. కోపగించిన ముని ఆమెను బల్లూకం కమ్మని శాపం ఇస్తాడు. ఆవిధంగా మహారాణి ఎలుగుబంటిగా మారిపోతుంది. తర్వాత తేరుకుని ముని, అంతా దివ్యదృష్టితో గమనించి ఇదంతా కనకదుర్గమ్మ చేయించింది, నీకు మేలు జరగాలనే అమ్మ ఆవిధంగా నాతో చేయించిందని చెప్పి ఊరడిస్తాడు. నీపిల్లవాడు కనకదుర్గమ్మ దంపతులకే దొరికాడు క్షేమంగానే ఉంటాడని చెప్పి, కనకదుర్గమ్మ ని నిత్యం ధ్యానించమని చెబుతారు. మహారాజు కూడా అడవిలోకి వచ్చి నడవలేని పరిస్థితికి వచ్చేస్తాడు. తల్లిని కాదన్నవాడికి తరుణీ ఉండదు, సుఖం ఉండదు.

ఎలుగుబంటి రూపంలో ఉన్న మహారాణి మహారాజుని గుర్తుపడుతుంది. మహారాజు ఆకలిని గమనించి అతని ఆకలి అడవిలో పండ్లు తెచ్చి తీర్చుతుంది. వివేకవంతులు చెడులోను మంచిని పొందగలడు, అట్టి వివేకం లేక పరిస్థితి అమ్మ అనుగ్రహం వలననే కలుగుతుంది.

మహారాజు బిడ్డడు మాధవుడు – మాంత్రికుడు మేఘనాధుడు

పెరిగిపెద్దవాడైన మహారాజు బిడ్డ అయిన మాధవ (కాంతారావు) ఎలుగుబంటి బారిన పడిన యువరాణి (కృష్ణకుమారి)ని కాపాడతాడు. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడతారు.

మేఘనాధుడు ఒక మాంత్రికుడు దగ్గర విద్యలు నేర్చుకుని ఉంటాడు. అలా విద్యాగర్విష్టి అయిన మేఘనాధుడు ఒక స్త్రీని చెరబట్టి ఆమెను తనకోరిక కోసం మయవిద్యతో లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. గురువు మందలిస్తే, గురువుని కూడా బందీని చేస్తాడు తనతంత్రవిద్యతో, అయితే గురువు నీవు సంపూర్ణ శక్తిమంతుడు కాలేదు. అయితే సంపూర్ణ సర్వశక్తిమంతుడు కావాలంటే ఒక అయాచితంగా అప్రయత్నంగా సామ్రాజ్య సింహాసనం అధిష్టించిన అదృష్ట మహారాజుకి పరిపూర్ణవైరాగ్యం కలిగించి అమ్మవారికి బలిస్తే సంపూర్ణ శక్తిమంతుడు అవుతావు అని చెబుతాడు.

గురువుగారిని బందీగానే ఉంచి, తాను అనుభవించదలచిన స్త్రీని సర్పంగా మారుస్తాడు మాంత్రిక మేఘనాధుడు. మహారాజుని లోబరచుకోవడానికి ఆ స్త్రీని ఉపయోగించదలచి, ఆమెను మరలా స్త్రీగా మార్చినీవు పౌర్ణమి చంద్రుడుని చూస్తే, మరలా సర్పంగా మారతావు, అప్పుడు ఎవరైనైనా ఒకరిని కాటేసి చంపితే నీవు మరలా ఆడ మనిషిగా మారతావు అని చెప్పి ఆమెను తనతోపాటు రాజ్యానికి తీసుకువెళతాడు.

మేఘనాధుడు తనకోరిక నెరవేర్చుకునే నెపంతో కపటవేషధారి అయి రాజ్యంలో మాధవుడితో తలపడి మాయతో అతనిని ఓడిస్తాడు. తద్వారా తాను మహావీరుడిని నాకు మీ మహారాజుని పాదపూజ చేయాలనీ రాజుతో పాదపూజ చేయించుకోపోతే మాధవుడు వచ్చి ఆపుతాడు. మహారాజు సంవత్సరం గడువు విదిస్తారు మాధవుడికి మేఘనాధుడుని ఓడించడానికి. మాధవుడు మేఘనాధుడుని సంవత్సరం తర్వాత ఓడించాలేకపోతే మహారాజు మేఘనాధుడుకి పాదపూజ చేయాలనీ అనుకుంటారు.

మాధవుడు-యువరాణి గాంధర్వ వివాహం KanakaDurga Pooja Mahima Telugu Chalanachitram

రాజుకు తెలియకుండా మాధవుడు, యువరాణి ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకుంటారు. మేఘనాధుడు ప్రయోగించిన మాయ అనే యువతి వలలో మహారాజు లొంగుతాడు. ఆమె పౌర్ణమి చంద్రుడిని చూడడం ఆస్త్రీ పాముగా మారి మరోకరిని కాటువేసి చంపడం రాజుగారి అంతఃపురంలో జరుగుతూ ఉంటుంది.

మాధవుడు శక్తులు సముపార్జించడానికి బయలుదేరితే దారిలో ఒకబూతం మాధవుడుని మాయశక్తిచేత తీసుకువెళ్ళి అతనిని మోహిస్తుంది. ఒకసుందరిగా మారి ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది, కానీ మాధవుడి తమ్ముడి ప్రయత్నం ద్వారా ఆ బూతం అంతం అవుతుంది. అక్కడ నుండి వారు మేఘనాధుడి గుహకి చేరతారు. అక్కడ వినపడుతున్న మనిషి మూలుగు విని మాధవుడు వెళ్లి, మేఘనాధుడి గురువును కాపాడతాడు.

మాధవుడుకి ఆ గురువు తన మంత్రతంత్ర విద్యలు తపస్సు అతనికి ధారపోస్తాడు, కానీ మాధవుడు శక్తిమంతుడు కాలేకపోతాడు. అందుకు కారణం గ్రహించిన గురువు నీకు పాపం అంటి ఉంది, అది నీతల్లిదండ్రుల ద్వారా సంక్రమించింది కావునా నీవు కనకదుర్గమ్మపూజా చేసి అమ్మఅనుగ్రహం సంపాదించమని చెబుతాడు.

మరోప్రక్క పున్నమి చంద్రుడిని చూసి పాముగా మారుతున్నా మాంత్రికబందీ అయిన స్త్రీ కాటుకి అంతఃపురంలో మరణాలు ఎక్కువ అవుతూ ఉంటే, మహారాజు దిగులుపడతాడు. అయితే కపటమాంత్రికుడు అయిన మేఘనాధుడు అందుకు కారణం నాకు తెలుసు నేను చెబుతాను అని, ఆ కారణాన్ని యువరాణిపై నెడతాడు. ఆమె గర్భవతి ఆమె ఒక నాగరాజు ద్వారా ఈ గర్భం వచ్చింది, ఆ బిడ్డవలన సామ్రాజ్యానికి అరిష్టమని చెప్పి యువరాణిని ఇంద్రకీలాద్రి ఆకాశజలపాతంలో తోసివేయించుతాడు.

మాధవుడి భార్య అతని తల్లిదండ్రుల మాధవుని బిడ్డకి జన్మనివ్వడం -కనకదుర్గమ్మ అనుగ్రహం

అలా జలపాతంలో త్రోయబడిన యువరాణి కనకదుర్గమ్మ దయవలన ఎలుగుబంటిరూపంలో ఉన్న మహారాణి ద్వారా కాపాడబడుతుంది. మాధవుడి తమ్ముడు సింహాద్రి ఒక కోయరాజు కుమార్తెను మల్లయుద్దంలో గెలిచి వివాహమాడతాడు.  అలా అతడు చేసే సన్నివేశాలన్నీ హాస్యభరితంగా చిత్ర మధ్యమధ్యలో వస్తూ ఉంటాయి. యువరాణి ఎలుగుబంటి రూపంలో ఉన్న మాజీ మహారాణి, మహారాజుల వద్ద ప్రసవిస్తుంది.

గురువు పర్యవేక్షణలో మాధవుడు కనకదుర్గమ్మని పూజించి అమ్మ అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అమ్మ అనుగ్రహం వలన తల్లిదండ్రుల పాపం పోయి, వారికి నిజరూపం వస్తుంది. ఆకాశజలపాతం దగ్గరనుండి సింహాద్రి, యువరాణి, మాధవుడి తల్లిదండ్రులు అంతా మాధవుడి దగ్గరికి బయలుదేరతారు.

ఇక మేఘనాధుడు ప్రయత్నంలో అప్పటి మహారాజుకి వైరాగ్యం వస్తుంది, పసిగట్టిన మాంత్రిక మేఘనాధుడు ఆ మహారాజుని ఒంటరిగా కాలికాలయం దగ్గరికి తీసుకువెళతాడు. అక్కడే ఉన్న మాధవుడు మేఘనాధుడు చేయబోయేది గమనిస్తూ ఉంటాడు. మహారాజుకి తన మాంత్రిక స్వరూపంతో కనిపించి అమ్మకి ప్రణామం చేయమని చెబుతాడు. చేయనని చెప్పిన మేఘనాధుడు ఆ మహారాజుని మాయవిద్య ప్రయోగించబోతే, ఆ విద్యని నిర్వీర్యం చేస్తాడు మాధవుడు. చివరికి ఇద్దరు బాహుబలంలో పోటిపడి మేఘనాధుడు మట్టికరుస్తాడు.

భోగలాలసలో పడి దేవతాశక్తిని నిరాకరిస్తే వచ్చే అనర్ధాలు ఒక కుటుంబానికి ఎలా ప్రాప్తించి ప్రాకృతిక నియమానుసారం ఎలా ఇబ్బంది పడతాయో, అనుగ్రహించే కులదైవం కష్టాలను కూడా ఉద్దరణవైపుగా ఎలా నడిపించి ఏవిధంగా మనసుని సంస్కారంవంతంగా తల్లి కనకదుర్గమ్మ నడిపిస్తుందో ఈ చిత్రం చూపుతుంది. Kanakadurga pooja mahima telugu chalanachitram directed by B Vithalacharya. జానపద చిత్రాలను చిత్రీకరించడంలో జానపదచిత్రబ్రహ్మగా పేరుగాంచిన విఠలాచార్య ఈ భక్తి చిత్రాన్ని తీయడం విశేషం.

ధన్యవాదాలు
తెలుగురీడ్స్ మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేయండి