• నవగ్రహపూజామహిమ సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతువులు
    telugureads,  భక్తి సినిమాలు

    నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ

    సత్యపాల మహారాజు (కాంతరావు) కుమారుడు అంత:పురంలో కాలజారి పడతాడు. ఆ రాజకుమారుడికి వైద్యం చేసిన తర్వాత మహారాజు, రాణి, రాకుమారుని జాతకం చూసిన ఆ రాజస్థాన గురువులు(నాగయ్య) సత్యపాల మహారాజుతో గ్రహస్థితి బాగాలేదు అని చెబుతాడు. అయితే సత్యపాల మహారాజు గ్రహస్థితుల గురించి పట్టించుకోనవసరం లేదు, మేము మహారాజులం అవసరం అయితే పేదవానిని కూడా ఐశ్వర్యవంతులం చేయగలం అని అంటాడు. నవగ్రహ పూజామహిమ తెలుగుభక్తిమూవీ. దానికి ఆచార్యులు అయితే మీరు ఒకపేద సద్బ్రాహ్మణుడికి గుప్తదానం చేసి, అతని అదృష్టాన్ని పరీక్షించమని చెబుతాడు. ఆచార్యుడు చెప్పినట్టే ఒక బ్రాహ్మణ పండితుడికి వజ్రాలు, వైఢూర్యములతో కూడిన నగలు పైకి కనబడకుండా ఒక గుమ్మడి కాయలో పెట్టి రాజు దానం చేస్తాడు. దానం స్వీకరించిన పేద బ్రాహ్మణుడు ఆగుమ్మడికాయను రాజు సమక్షం నుండి బయటకురాగానే నేలకేసి కొట్టి, తిరిగి చూడకుండా వెళ్లిపోతాడు. అది చూసిన రాజు పరివారం అంతా ”ఏదో యాధృచ్ఛికంగా జరిగింది కానీ గ్రహాల ప్రభావం కాదు” అని ఆచార్యులతో అంటారు. ఆచార్యులు ఎంత చెప్పిన నవగ్రహశాంతి పూజ…