ప్రముఖ జ్యోతిష్య పండితుల వెబ్ సైటు లేక తెలుగు వీడియో చానల్స్

ప్రముఖ జ్యోతిష్య తెలుగు యూట్యూబ్ చానల్స్ లిస్టు

గమనిక: ద్వాదశ రాశుల వారికి వారఫలాలు, దినఫలాలు, మాసఫలాలు అందించే కొన్ని చానల్స్ ను లిస్టును తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ పోస్టును క్రియేట్ చేయడం జరిగింది.

తెలుగురీడ్స్ ఈ పోస్టు గురించి!

అదేం చిత్రమో మన ఊళ్లో మనకు అందుబాటులో పిలిస్తే పలికే పండితులు ఉన్నా దూరంగా ఉండే పండితులంటే, ఇంకేమి చెబుతారో అనే ఆలోచన వలననేమో ఒక ఊరి నుండి మరొక ఊరికి జ్యోతిష్యులను వెతుక్కుంటూ వెళ్తాం. కొన్ని పల్లెటూళ్లలో అయితే పండితులు ఉండకపోవచ్చును.

దీర్ఘకాలిక రోగంతో బాధపడేవారు, అందుబాటులో ఉన్న వైద్యంతో బాటు దూరంగా ఉన్న వైద్యంవైపు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. కారణం త్వరగా స్వస్థత చేకూరాలనే ఆలోచనతో, ఇంకా ఆ దీర్ఘకాలిక బాధలు అనుభవించి, అనుభవించి వాటి నుండి ఎప్పుడు బయటపడతామా….అనే ఆలోచన మనసును కుదుటపరచదు. ఈ విధంగానే జాతకపరమైన దీర్ధకాలిక కష్టాలతో బాధపడేవారికి, తమ సమస్యలకు త్వరిత పరిష్కారం కోసం పరితపిస్తూ ఉంటారు, అంటారు.

ప్రతి చిన్న సమస్యకు ఒకప్పుడు జ్యోతిష్యులు దగ్గరకు వెళితే, ఇప్పుడు యూట్యూబ్ వీడియోలలో జ్యోతిష్య పండితులు చెప్పే సూచనలు, సలహాలు పాటించడం కూడా పరిపాటి అయ్యింది. అంటే ఇంట్లో పూజ ఎలా చేయాలి? ఏ ఏ తిధిలలో ఏఏ నియమాలు పాటించాలి? కొన్ని ప్రత్యేకమైన వస్తువులకు ఇంట్లో ఏవిధమైన స్థానం ఇవ్వాలి? ఇలాంటి ప్రశ్నలకు యూట్యూబ్, టి.వి.లలో చాలానే ధర్మసందేహాలకు సమాధానాలుగా వస్తాయి.

ఇప్పుడు పిల్లలు పుట్టగానే ఏ తిధి, ఏ నక్షత్రం, ఏ పాదం, ఏ లగ్నం లాంటి జన్మ పంచాంగ వివరాలు ఆన్ లైన్లో చాలా సులువుగా చెక్ చేసుకోవచ్చును. ఇలా ఆన్ లైన్ ద్వారా చిన్న చిన్న జ్యోతిష్య, వాస్తు సమస్యలకు పరిష్కారం లభిస్తుంటే, పెద్ద పెద్ద పరిష్కారాలు, లోతైన పరిశీలనలకు వ్యక్తిగత అప్పాయింట్ మెంట్లు కూడా ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం నేటి సాంకేతిక పరిజ్ఙానంతో అందుబాటులో ఉంది.

సాంకేతిక వృద్ధిలో ఇప్పుడు సమయం వృధా కావడం అనేది ఎవరు ఇష్టపడరు. ఒకప్పుడు క్యూలో నిలబడి చేసే పనులన్నీ, ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా చేసేస్తున్నారు. బిల్ పేమేంట్, షాపింగ్ లాంటివి. అలా ఆన్ లైన్ ద్వారా జ్యోతిష్యులను కలవడానికి మనకు అందుబాటులో ఉన్న వెబ్ సైటులు చూద్దాం.

యూట్యూబ్ లో లైవ్ తెలుగు వీడియోలలో చిన్న చిన్న సందేహాలకు సమాధానాలు ఇస్తూ, టి.వి.లలోనూ కూడా సందేహాలు తీర్చే చిర్రావురి గారికి వెబ్ సైటు ఉంది. ఆ వెబ్ సైటులో చిర్రావురి గారి గత యూట్యూబ్ తెలుగు వీడియోలను వీక్షించవచ్చును. చిర్రావురి గారి వెబ్ సైటు సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

భక్తి టి.వి.లో ప్రతి ఆదివారం వార ఫలాలు చెప్పే డాక్టర్ శంకరమంచి రామకృష్ణ గారికి కూడా ఆన్ లైన్ వెబ్ సైటు ఉంది. ఈ వెబ్ సైటు నుండి మీరు జ్యోతిష్య పాఠాలను కూడా పి.డి.ఎఫ్ ఫార్మట్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చును. శ్రీ శంకరమంచి రామకృష్ణగారి వెబ్ సైటను సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

వెబ్ సైట్ల కన్నా జనానికి చేరువకావడంలో యూట్యూబ్ తెలుగు చానల్స్ చాలా ముందున్నాయి. ఎక్కువమందికి యూట్యూబ్ తెలుగు వీడియోలు అయితే చేరడం వలన, చాలా మంది యూట్యూబ్ తెలుగు చానల్స్ ద్వారా జ్యోతిష్య వివరాలు అందిస్తూ ఉంటున్నారు. యూట్యూబ్ చానళ్లలో తెలుగు జ్యోతిషం చెప్పే చానల్స్ వివరాలు చూద్దాం.

చిర్రావురి పౌండేషన్ ఈ వీడియో తెలుగు చానల్లో శ్రీ చిర్రావురి గారు స్వయంగా చెప్పిన చిన్న చిన్న పరిహారాలు చాలా ప్రసిద్ది అంటారు. చిర్రావురి పౌండేషన్ యూట్యూబ్ తెలుగు చానల్ విజిట్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ప్రముఖ జ్యోతిష్యులు శ్రీశ్రీనివాస గార్గేయ గారు ప్రణతి తెలుగు టి.వి. ప్రేక్షకులకు బాగా పరిచయమే, ఎందుకంటే వారఫలాలు, పక్షఫలాలు రాశులవారీగా చెబుతూ ఉంటారు. ఇంకా చంద్రగ్రహణం, సూర్యగ్రహణం సమయాలలో రాహుకాలంలో పాటించవలసిన చిన్న చిన్న పరిహారాలను సూచిస్తూ ఉంటారు. అయితే ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ చానల్ కూడా అందుబాటులో ఉంది. ప్రణతి టెలివిజన్ యూట్యూబ్ తెలుగు చానల్ విజిట్ చేయాడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

వారం వారం రాశిఫలాలు అందిస్తూ, రాశిననుసరించి వ్యక్తుల స్వభావం, జీవితం, చిన్న పరిహారవీడియోలను కూడా అందించే యూట్యూబ్ తెలుగు చానల్ త్రిశక్తి భక్తి చానల్. దైవజ్ఙ శ్రీ గుణబ్రహ్మా సరస్వతీ గారు వీడియోలలో మీకు ఇవన్ని చెబుతూ ఉంటారు. త్రిశక్తి భక్తి యూట్యూబ్ తెలుగు చానల్ సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

శ్రీపీఠం యూట్యూబ్ తెలుగు చానల్ మనం వారఫలాలు చూడవచ్చును, భారత్ టుడేకు అనుభంద చానల్ గా ఉన్న శ్రీపీఠం యూట్యూబ్ తెలుగు చానల్లో ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ తేజస్విశర్మగారు వారఫలాలను చెబుతూ ఉంటారు. ఈ వీడియోలను శ్రీపీఠం చానల్ ద్వారా వీక్షించవచ్చును. శ్రీపీఠం యూట్యూబ్ తెలుగు చానల్ విజిట్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు వేణుగోపాల్ గారు ద్వాదశ రాశులవారికి వారఫలాలు AP24x7 జ్యోతిష్యం యూట్యూబ్ చానల్ ద్వారా అందిస్తున్నారు. AP24x7 జ్యోతిష్యం యూట్యూబ్ తెలుగు చానల్ విజిట్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్దాంతిగారు తమ యూట్యూబ్ తెలుగు చానల్ ద్వారా అభిషేకాలు, హోమాలు లాంటివి నిర్వహిస్తూ, వారఫలాలు, గ్రహదశలను వివరస్తూ వీడియోలను అందిస్తారు. మీరు ములుగువారి యూట్యూబ్ తెలుగు చానల్ సందర్శించాలంటే ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ప్రముఖ ఆద్యాత్మిక వేత్తలు, జ్యోతిష్యులు, సిద్దాంతుల ద్వారా ఆద్యాత్మిక సందేహాలకు సమాధానాలు, వారఫలాల వీడియోలు, శతనామావాళిలు, సహస్రనామాలు లాంటి వీడియోలు మీరు భక్తిఒన్ యూట్యూబ్ తెలుగు చానల్లో చూడవచ్చును. ఈ చానల్ ద్వారా ప్రముఖులు అనంతలక్ష్మిగారు, మైలవరపు శ్రీనివాసరావుగారు లాంటి తదితరుల వీడియోలు చూడవచ్చును. భక్తివన్ తెలుగు యూట్యూబ్ చానల్ విజిట్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్/క్లిక్ చేయండి.

టి.ఆర్. క్రియేషన్స్ యూట్యూబ్ తెలుగు చానల్ వారఫలాల వీడియోలు, రెమిడిస్ వీడియోలు చిన్న చిన్న పరిహారాల వీడియోలు, గ్రహాల మార్పులననుసరించి ద్వాదశ రాశుల వ్యక్తుల ప్రభావం గురించి విశ్లేషణ వీడియోలు ఉంటాయి. టి.ఆర్. క్రియేషన్స్ యూట్యూబ్ వీడియో తెలుగు చానల్ ను విజిట్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

జ్యోతిషులు తల్లప్రగడ శివాజీరావు గారు తల్లప్రగడ ఆస్ట్రో అనే తెలుగు యూట్యూబ్ చానల్ ద్వారా వార ఫలాల వీడియోలు ద్వాదశ రాశుల గురించి ముందుగానే అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇంకా రానున్న కాలంలో ఏరాశివారికి ఏవిధంగా ఉండబోతుందో తెలియజేసే వీడియోలు కూడా రాశిననుసరించి ఈ చానల్లో చూడవచ్చును. తల్లప్రగడ ఆస్ట్రో యూట్యూబ్ తెలుగుచానల్ వీక్షించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

ఆస్ట్రో సిండికేట్ యూట్యూబ్ తెలుగుచానల్ నందు జ్యోతిషులు సి.హెచ్. కిరణ్ శర్మగారు వారఫలాలు, దినఫలాలు ద్వాదశ రాశులవారికి అందిస్తూ ఉంటారు. ఇంకా నెలవారీ గోచార ఫలితాల వీడియోలు కూడా మీరు ఈ చానల్ ద్వారా వీక్షించవచ్చును. ఆస్ట్రో సిండికేట్ తెలుగుయూట్యూబ్ చానల్ వీక్షించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

నారాయణశాస్త్రి అఫిషియల్ తెలుగు ఆస్ట్రాలజీ యూట్యూబ్ చానల్ నందు జ్యోతిష్యులు నారాయణశాస్త్రిగారే రాశుల ముఖ్యాంశాలు, వాటికి పరిహారాలు లాంటి వీడియోలు అందిస్తున్నారు. మీరు నారాయణశాస్త్రి యూట్యూబ్ తెలుగుచానల్ విజిట్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

శ్రీ తెలుగు ఆస్ట్రో తెలుగు యూట్యూబ్ చానల్ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మగారు చెప్పే సంవత్సర పంచాంగ వీడియోలు ద్వాదశ రాశుల గూర్చి ఉంటాయి. ఇంకా పరిహారాల వీడియోలు కూడా మీరు శ్రీ తెలుగుఆస్ట్రో తెలుగుయూట్యూబ్ చానల్లో చూడవచ్చును. ఈ చానల్ సందర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

బ్రహ్మశ్రీ వంగర శ్రీనివాసమూర్తి గారి వాయిస్ ఆఫ్ వి.ఎస్.ఎం. తెలుగు యూట్యూబ్ చానల్లో మాస ఫలితాలు, రాబోయే కాలంలో ద్వాదశ రాశి ఫలితాల వీడియోలు మీరు చూడవచ్చును. ఈ వాయిస్ ఆఫ్ వి.ఎస్.ఎం. తెలుగు యూట్యూబ్ దర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / చేయండి.

బ్రహ్మశ్రీ పెదగాడి మోహన్ రవి గారు భక్తి పీఠం తెలుగు యూట్యూబ్ చానల్లో వార ఫలితాలు, దిన ఫలితాలు, ద్వాదశ రాశి ఫలితాల వీడియోలు మీరు చూడవచ్చును. ఈ భక్తి పీఠం తెలుగు యూట్యూబ్ దర్శించడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / చేయండి.

ఆధాన్ ఆద్యాత్మిక తెలుగు యూట్యూబ్ చానల్ ద్వారా ప్రముఖులు మాచిరాజు కిరణ్ కుమార్ గారి హస్తరేఖాశాస్త్రం వీడియోలు, నిట్టల కిరణ్మయి గారి ఆద్యాత్మిక వీడియోలు, సంధ్యాలక్ష్మిగారి మాటల వీడియోలు, న్యూమరాలజీ వీడియోలు, మాచిరాజు వేణుగోపాల్ గారి వాస్తుశాస్త్ర వీడియోలు మీరు ఈ ఆధాన్ ఆద్యాత్మిక తెలుగు యూట్యూబ్ చానల్ ద్వారా వీక్షించవచ్చును. ఈ చానల్ విజిట్ చేయడానికి ఇక్కడ ఇవే అక్షరాలను టచ్ / క్లిక్ చేయండి.

పైన లిస్టు చేయబడిని తెలుగు జ్యోతిష్య యూట్యూబ్ చానల్స్ కేవలం యూట్యూబ్ సెర్చ్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ పోస్టులో చానల్ లిస్టులో ఏ కేటగిరి, ర్యాంకులు నిర్ణయించలేదు. ఎవరిని ఎక్కువ తక్కువ ముందు వెనుకలనుసరించి ఈ వీడియో చేయబడలేదు. కేవలం సెర్చ్ జ్యోతిష పదాల సెర్చ్ ద్వారా వచ్చిన ఫలితాలలో కొన్ని చానల్స్ మీకు ఈ పోస్టులో ప్రచురించడం జరిగింది.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

తెలుగు జాతకమును అందించే వెబ్సైటు

ఆన్ లైన్ ఉచిత జాతకం పుట్టిన సమయం బట్టి

పుట్టిన సమయం, తేదిని అనుసరించి తెలుగు జాతకమును అందించే వెబ్సైటు ఆన్ లైన్లో ఉచితంగా ఉంది. ఈ వైబ్ సైటు వివరములను ఇంకా చదవండి….

పుట్టిన ప్రతి ఒక్కరి జీవితో నవగ్రహాల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి అంటారు. అలాగే ఏ వ్యక్తి అయినా 27 నక్షత్రాలలో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక పాదం క్రిందకు వస్తారని అంటారు. పుట్టిన నక్షత్ర పాదం, ఆ నక్షత్ర పాదం గుణగణాలు, పుట్టిన సమయంలో ఉన్న లగ్న ప్రభావం, నవగ్రహాల దృష్టి ప్రభావం లెక్కలు కట్టి ఇంకా పుట్టిన స్థలం ఇతరత్రా అంశాలు పరిశీలన చేసి, ఆ వ్యక్తి యొక్క జాతకం చెబుతూ ఉంటారు.

జాతకం చెప్పినప్పుడే కొన్ని ముఖ్యమైన పనులలో ప్రారంభించటప్పుడు తీసుకోవాలసిన జాగ్రత్తలను కూడా ఆ పిల్లవాని పెద్దలకు పండితులు తెలియజేసి ఉంటారు. గ్రహశాంతులు ఉంటే ఎప్పుడు చేపించుకోవాలి, ఎప్పుడు ఏ గ్రహ ప్రభావం చేత, ఆ పిల్లవాని భవిష్యత్తు ప్రభావితం అయ్యేది కూడా అంచనా వేసి చెబుతారు. పెళ్లి ఎప్పుడు అవుతుంది? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? స్వగృహం యోగం లాంటివి పరిశీలన చేసి, ఆ పిల్లల పెద్దలకు చెబుతారు.

ఇప్పుడు అలా పేరు, పుట్టిన తేది, సమయం, ప్రాంతము, టైం జోన్ వెబ్ సైటులో ఎంటర్ చేస్తే, ఆ వెబ్ సైటు మీ జాతకం ఆన్ లైన్లో ప్రాధమికంగా చూపుతుంది. అందులో పుట్టిన సమయం యొక్క పంచాంగ వివరాలు చూపుతుంది. ఇందులో పుట్టిన సంవత్సరం, ఆయనం, ఋతువు, మాసం, తిది, వారం, నక్షత్ర పాదం, రాశి, యోగం, కరణం, జన్మనామం, దశలను చూపుతుంది. తెలుగు జాతకమును అందించే వెబ్సైటు ..

ఇంకా వివాహ విషయంలో ఉపయోగపడే అవకహడ చక్రమును చూపుతుంది. మంచి చెడుల విషయంలో ఘాత చక్రమును చూపుతుంది. అలాగే అదృష్ట విషయములలో అనుకూల రోజు, తిది, గ్రహములు, రాశులు, లగ్నములు, రత్నం, దైవం, లోహం, వర్ణం, దిశ, సమయం, సంఖ్యలను చూపుతుంది.

గ్రహస్థితి పట్టికలను చూపుతుంది. ఇంకా గ్రహ వీక్షణలు, మైత్రి చక్రము కుండలిలు, షోడష వర్గ పట్టిక, గ్రహ భావములు తదితర విషయములతో బాటు జాతక దోశములు, పరిహారాలు, దశాంతర్దశా ఫలితములు, జాతక ఫలితాలను ప్రాదమికంగా మీకు ఈ వెబ్ సైటు చూపుతుంది. మీరు మీ ఫలితములను పి.డి.ఎఫ్ ఫార్మట్లో సేవ్ చేసుకోవచ్చును.

పూర్తి జాతకమును పొందాలంటే పెయిడ్ ఆష్ట్రాలజీలోకి వెళ్లి చూడవలసి ఉంటుంది. ఈ వెబ్ సైటులో మీరు ఎంటర్ చేయవలసిన డేటా పేజి ఈ క్రింది విధంగా ఉంటుంది.

తెలుగు జాతకమును అందించే వెబ్సైటు
తెలుగు జాతకమును అందించే వెబ్సైటు

మీరు పై చిత్రంపై టచ్ లేక క్లిక్ చేసి ఆ వెబ్ సైటు సందర్శించవచ్చును. లేక ఇక్కడ ఇవే అక్షరాలను తాకి మీరు ఆ వెబ్ సైటును సందర్శించవచ్చును.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్