Categories
bhakti reads book reads

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు

పిల్లలకు తెలుగు కధల పుస్తకాలు చదవడం అలవాటు అయితే, మంచి బుద్దులు అబ్బుతాయని అంటారు. సహజంగా పిల్లలకు కధలంటే ఆసక్తి ఉంటుంది. కధలలోని సారంశం గ్రహించడం పిల్లలకు అలవాటు అయితే, అదే అలవాటు నిత్య విద్యలో కూడా అలవాటు పెరుగుతుంది. అన్ని అలవాట్లుకు పరిమితులు చెబితే, విద్య నేర్చుకోవడంలో పరిమితులు చెప్పరు. వినయంతో కూడిన విద్య ఎంతవరకైనా తెలుసుకోవచ్చును. పిల్లలకు అవసరమైన వినయవిధేయతలు చిన్ననాడే బలంగా నాటుకోవాలని అంటారు. ఇందుకు తరచుగా వాడే మాటలు ‘మొక్కై ఒంగనిది,