Tag: తెలుగులో వ్యాసం
-
ప్రేరణ పొందడానికి మనసుకు గొప్పవారి ప్రవర్తన మూలం
ప్రేరణకు మూలం జ్ఙానం గ్రహించే ఆలోచన కలిగి ఉండడం ప్రధానమంటారు! సాధన చేత సులభంగా పనులు సమకూరును. అతి పెద్ద విజయాలు సాధించినవారి జీవితాలు అతి సాదారణంగా ఉండకపోవచ్చును. వారి జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉండి ఉండవచ్చును. ఒక వ్యక్తి జిల్లా స్థాయి విజయం సాధించడానికి, ఒక జిల్లాలో పోటీపడే పోటీదారుల మద్య ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలి. అలాగే రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి… ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన…
-
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి. మంచి గుణముల గల వ్యక్తి ఎవరు? అనే ఓ మహర్షి తలంపుకు మరో మహర్షి సమాధానమే రామాయణం రచించడానికి మూలం అంటారు. సుగుణాలు గల నరుడెవరు? ఈ ప్రశ్న ఉదయించిన మహర్షి పేరు వాల్మీకి అయితే, ఆ ప్రశ్నకు బదులుగా రాముడు గురించి, రాముడు నడిచిన మార్గము గురించి వివరించిన మహర్షి నారదుడు. ఇద్దరి మహర్షుల మాటలలో శ్రీరాముడు గొప్పతనమే కీర్తింపబడింది. ఎంతటి కష్టం వచ్చినా, ఎవరు అవకాశం చూపినా,…
-
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి! ఇది మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వ్యాఖ్య. మంచి లక్ష్యం గురించి కలలు కనడం, ఆ లక్ష్య సాధనకు కృషి చేయడం… జీవితంలో ఉండాలని అంటారు. పగటి కలలు కనడం తప్పు అయితే, ఏదైనా సాధించాలనే తపనతో కూడిన కలలు జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయని అంటారు. కేవలం కలలు కంటూ ఉండడం ముమ్మాటికి తప్పనే అంటారు. కానీ ఒక మంచిలక్ష్యం ఏర్పరచుకుని, ఆ లక్ష్యం సాధిస్తాననే కల…
-
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల ప్రత్యేకత గురించి
దర్శకధీరుడు రాజమౌళి సినిమాల ప్రత్యేకత గురించి చూసి, రాజమౌళి నుండి గ్రహవించవలసినదేమిటి? దర్శకేంద్రుడి శిష్యుడు దర్శకధీరుడు రాజమౌళిని అంతా జక్కన అంటారు. ఎందుకంటే, ఆయన సినిమా తీస్తే, ఓ శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది. చక్కగా చెక్కబడిన శిల్పం ఎలా ఆకర్శిస్తుందో? రాజమౌళి దర్శకత్వంలో వచ్చే సినిమా కూడా అంతే. రాజమౌళి సినిమా దర్శకుడిగా పరిచయం అయ్యింది…. ఎన్టీఆర్ సినిమాతోనే… అదే స్టూడెంట్ నెం-1. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్… ఆ తర్వాత సింహాద్రి, సై, చత్రపతి,…
-
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు?
మార్గ దర్శకులు అని ఎవరిని అంటారు? వ్యాసం రూపంలో తెలియజేయండి! మనకు మార్గ దర్శకులు అనగానే సామాజిక ప్రయోజనాల కోసం తమ తమ జీవితాలను త్యాగం చేసినవారిని, సామాజిక సమస్యలపై పోరాడినవారిని, సామాజిక శ్రేయస్సుకొరకు నిత్యం తపించేవారిని మనకు మార్గ దర్శకులుగా చెబుతూ ఉంటారు. ఇంకా ఏదైనా గొప్ప గొప్ప పనులను చేసినవారిని, ఏదైనా విషయం కనిపెట్టినవారిని ఆయా విషయాలలో, ఆయా పనులలో మార్గ దర్శకులుగా చెబుతారు. మార్గదర్శకులు ప్రయత్నాలు పాఠ్యాంశములలో కొందరి మార్గ దర్శకుల ప్రయత్నాలను…
-
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యాసంతో వివరించండి! ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఎందుకంటే వ్యక్తి శరీరం ఆరోగ్యంగా ఉంటే, ఆ శరీరంతో కష్టపడి పని చేయగలడు. డబ్బు సంపాదించగలడు… తనను తాను పోషించుకుంటూ, తనపై ఆధారపడినవారిని పోషించగలడు… కానీ అనారోగ్యంతో ఉంటే, తను ఇతరులపై ఆధారపడాలి…. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న పెద్దల మాట చద్దిమూట వంటిదే. ఇక ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు చాలామంది ప్రతిరోజూ నడవండి… అంటారు. వేళకు భోజనం చేయండి…
-
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా ఉపయోగపడుతాయో విశ్లేషించి రాయండి. మనకు తెలుగు శతకాలు వేమన శతకం, సుమతీ శతకం తదితర శతకాలు చాలా ప్రసిద్ది. కవులు రచించిన శతకాలు లేదా కవుల చేత చెప్పబడిన శతకాలు వారి వారి దృష్టికోణంలో సామాజిక స్థితిగతులకు అద్దం పడుతూ ఉంటాయి. ఇంకా వారి దృష్టికోణంలో సమాజంలో వారికెదురైన వివిధ వ్యక్తుల స్వభావం లేదా వారు గమనించిన మనో ప్రవృత్తులపై కూడా కవుల సామాజిక దృష్టి ప్రభావితం అవుతూ, సామాజిక…
-
స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి!
స్పూర్తినిచ్చే మాటలు వ్యక్తుల మనసులోకి వలస వెళతాయి! మనిషి మాటలు ప్రయాణం చేస్తూ, మనుషుల మనసులలోకి చేరుతూ, పోతూ ఉంటే, కొందరి మంచి మాటలు మాత్రం వలస వెళ్ళినట్టుగా మనుషుల మనసులలో నిలిచి ఉంటాయి. స్పూర్తిదాయకమైన మాటలతో సామాజిక శ్రేయస్సు కలుగుతుందని అంటారు. ఆచార్యులు, పండితులు, మేధావులు, ఉత్తమ నాయకులు స్పూర్తిదాయకమైన మాటలు మాట్లాడితే, అవి వ్యక్తుల మనసులలో ఆలోచనలు పుట్టిస్తాయి. సహజంగా గొప్పవారు సామాజిక శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతారు కాబట్టి స్పూర్తిదాయకమైన మాటల వలన…
-
సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది.
సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది. అదే జాతీయ సైన్స్ దినోత్సవం. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర వేంకట రామన్ సైన్సులో ఒక ఎఫెక్ట్ అది రామన్ ఎఫెక్ట్ గా ప్రఖ్యాతి గాంచినది. వైజ్ఙానికరంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన మహనీయుడు. భారతరత్న ఇచ్చి భారత ప్రభుత్వం ఈయనను సత్కరించింది. బౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ 1888 సంవత్సరంలో నవంబర్ ఏడవ తేదిన తిరుచినాపల్లి దగ్గరలో గల అయ్యన్…
-
నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి
నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. వారిని పట్టించుకుసే స్థితి ఉండకపోవడం విశేషం. కారణం భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయి ఉండవచ్చును. మరొక కారణం తల్లిదండ్రులకు దూరంగా పిల్లల ఉపాధి అవకాశాలు ఉండి ఉండడం కావచ్చును. ఒత్తిడిలో ఉండే యువత పెద్దల స్థితిని పట్టించుకోలేని పరిస్థితి కావచ్చును. కారణం ఏదైనా ఉమ్మడి కుటుంబంలో ఏదో బంధుత్వం ద్వారా సేవలు పొందే వృద్దాప్యం వృద్ధాశ్రమంలో కాలం గడుపుతుంది. ఎప్పటినుండో స్వేచ్చగా జీవించే పెద్ద హృదయం, చిన్న కుటుంబంలో చిన్నవారి…
-
పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా?
పదవ తరగతి తరువాత ఆలోచన ఎలా? ఏం చేయాలి?. పదవ తరగతి చదువుతుండగానే, తర్వాతి చదువుల గురించిన ఆలోచన ఉండడం వలన ఏమి చదవాలో, అందుకు ప్రవేశ పరీక్షలు ఏమిటి? అవి ఎప్పుడు జరుగుతాయి? వాటికి ఎప్పటిలోగా దరఖాస్తు చేయవచ్చును…. వంటి విషయాలు తెలుసుకోగలుగుతాము. పదవ తరగతి పూర్తయ్యాక ఆలోచన చేద్దామనే భావన ఉంటే, అది కాలం వృధా కావడానికి కారణం కావచ్చును. హైస్కూల్ చదువుతుండగానే ప్రతి విద్యార్ధికి, తన బలమేమిటో తనకు తెలియవస్తుంది. ఆ బలంతోనే…
-
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు
మంచి మాటలు నీతి వాక్యాలు పిల్లలకు మంచి అలవాట్లు అబ్బే అవకాశం ఉంటుందా? చెడ్డవారు సైతం, వారికి రోజూ నాలుగు మంచి మాటలు చెబుతూ ఉంటే, వినగా వినగా మంచి పనులు చేయడానికి వారి మనసు అంగీకరిస్తుందని అంటారు. కాబట్టి పిల్లలకు పెద్దలు చెప్పిన మంచి మాటలు లేదా నీతి వ్యాక్యాలు నుండి కొన్ని మాటలు తల్లిదండ్రులు చెప్పడం మేలు. మార్గదర్శకంగా నిలిచిన మహనీయులంతా తల్లిదండ్రుల నుండి కానీ గురువుల నుండి కానీ మంచి మాటలు విన్నవారేనని…
-
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు
శ్రీరాముడు వనవాసం వెళ్లడానికి కారణాలు చూస్తే, కాలం కర్మ వెంటాడినా, వద్దని వారించినా, శ్రీరాముడి పట్టుదలే ప్రధాన కారణంగా కనబడుతుంది. శ్రీరామదృష్టి కోణం ధర్మమునే చూడడం వలన శ్రీరాముడు, ధర్మము ప్రకారం శ్రీరాముడు వనవాసం చేయడానికి సిద్దపడ్డాడనే భావిస్తారు. అయోధ్యాధీశుడైన దశరధ మహారాజు, శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తానని సభలో సభికులతో చెబుతారు. సభలో అందరూ హర్షిస్తారు. శ్రీరామ పట్టాభిషేకానికి ప్రజలు కూడా సుముఖంగా ఉన్నారని తెలుసుకున్న దశరధుడు, శ్రీరాముడిని పిలుపించుకుంటాడు. పట్టాభిషేక విషయం శ్రీరాముడితో దశరధుడు స్వయంగా…
-
మంధర పాత్ర స్వభావం చూస్తే
శ్రీరామాయణంలో మంధర పాత్ర స్వభావం చూస్తే, ఆమె మంచి మాటకారితనం గల ఓ సేవకురాలు. ఆమె ఒకరికి సేవకురాలు కాబట్టి, తను సేవచేసేవారి స్థితినిబట్టి తన స్థితి ఉంటుందని బాగా తెలిసిన వ్యక్తి. ఆమె తను ఉన్న చోట మంచి స్థితిలో ఎప్పటికీ ఉండాలంటే, తను సేవిస్తున్నవారు ఉన్నత స్థితిలో ఉండాలి. ఈ విషయం ఆమె అంతరంగంలో బాగుగా ఉంటుంది… మంధర మాటలు వినడానికి వినసొంపుగా అనిపిస్తే, అటువంటి మాటలు వ్యక్తిని చులకన చేస్తాయి… కైకేయి విషయంలో…
-
అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం
కుటుంబ పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ కొన్ని విషయాలలో తస్మాత్ జాగ్రత్తగా పెద్దలు మంచి మాటలు చెబుతూ ఉంటారు. వాటిని వినడం వలన వ్యక్తి జీవితంలో ఎలా ప్రవర్తించాలో? ఎలా ప్రవర్తించకూడదో తెలుసుకుంటాడని పెద్దలు అంటారు. ముఖ్యంగా అర్ధనాశం గృహమందలి దుశ్చరితం వంచనం పరాభవం వంటి విషయాలలో తస్మాత్ జాగ్రత్త అంటారు. అర్ధనాశం: అర్ధము అంటే సంపాదించినది… అది ధనము కానీ దాన్యము కానీ వస్తువు కానీ ఏదైనా అర్ధముగా మారుతుంది. మన అవసరాలకు తీరడానికి ఉపయోగపడేది…
-
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి
పాఠ్య పుస్తకాలే కాదు పాఠ్యేతర పుస్తకాలు చదవాలి… మంచి పుస్తకాలు కూడా చదవాలి. మంచిని తెలియజేసే మంచి తెలుగు పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారాలి. ఇంకా సామాజిక అవగాహన కల్పించే వారపత్రికలు, వార్తాపత్రికలు కూడా చదవాలి… పిల్లలకు చదవడం బిగ్గరగా చదవడంతో అనర్ఘలంగా చదివే శక్తి పెరగాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు పాఠశాలల్లో రీడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్న మనసు తన ఆసక్తి నెరవేర్చుకోవడం బహు శ్రద్ద చూపుతుంది. అంటే… ఆసక్తి అంటే ఏమిటి? సినిమా…
-
వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో
నేడు వరకట్నం తీసుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. వరకట్నం వేధించి తీసుకోవడం పాపంగా పరిగణింపబడుతుంది. జీవితాన్ని పంచుకునే బాగస్వామి ధర్మపత్ని తెచ్చుకునేందుకు వరకట్నం వద్దని చెబుతూ కరపత్రం తెలుగులో…. వధువు మనసులో మంచి స్థానం పొందు, వరకట్నం వద్దను పాత రోజులు అయినా, ప్రస్తుత రోజులు అయినా ఆడపిల్లల పెళ్ళి అమ్మానాన్నలకు తీరని కష్టాలనే తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆడపిల్లల పెళ్ళి అనగానే వరకట్నం ఎంత? వరకట్నం కోసం కూడబెట్టిన డబ్బు లేకపోతే, ఇక ఆ తల్లిదండ్రుల కష్టాలు వర్ణానీతతం….…
-
మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి
మనిషికి మాత్రమే మాట్లాడే శక్తి ఉంటే, పనులపై నిర్ణయాధికారం ఉంది. మంచి చెడులు ఆలోచించి పనులు చేయవచ్చును లేక చేయకపోవచ్చును కానీ సృష్టిలో ఇతర ప్రాణులకు తమ భావనను మాటలలో బహిర్గతం చేయలేవు. వాటికి తెలిసింది కేవలం తమ ఆకలి తీర్చుకోవడం వరకే… అయితే మూగ జీవులను ఎందుకు ప్రేమించాలి? మూగ జీవుల గురించి మనకున్న శ్రద్ధ ఎలా ఉండాలి? పైన చెప్పినట్టుగా మూగ జీవులు అంటేనే మాట్లాడలేవు. వాటికి బాధ కలిగితే, మూలుగుతూ బాధపడతాయి. సంతోషం…
-
ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి
ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ దీపమే చదువుకుని ఉంటే, జ్ఙానం పిల్లల్లోకి ప్రసరిస్తుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి. ఇంటిలో పనులు ఇల్లాలు మాత్రమే చక్కని తీరుగా చక్కబెట్టగలదు అంటారు. అలా ఇంటిపనిలో అదనపు పని పిల్లలతో హోమ్ వర్క్ చేయించడం. పిల్లలకు చక్కని నీతి కధలు బోధించడం. పిల్లలకు మంచి మాటలు చెప్పడం. పిల్లలకు గొప్పవారి గురించి చెబుతూ, వారి మనసులో గొప్పవారు కావాలనే కాంక్షను పుట్టించడం.. ఇలా ఇంటిలో ఇల్లాలు…
-
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
ప్రజలు ఆర్ధిక వనరుల బాగా ఉన్నచోట, నివాసానికి అనువుగా ఉన్నచోట, సౌకర్యాలు లభించే ప్రాంతాలలో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు… బహుశా నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు ఇంకా ఇలా ఉండవచ్చును. ప్రధానంగా నగరములలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. విశ్వవిద్యాలయములు నగరములలోనే ఉంటాయి. స్వయం ఉపాధి అవకాలు కూడా ఉంటాయి. ఆరోగ్యపరమైన సేవలు నగరములలో ఎక్కువగా లభిస్తాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నగరములలో ఎక్కువ. నగరములలో వ్యాపార, వాణిజ్యములు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటాయి…
-
స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా?
స్మార్ట్ ఫోన్ సమస్యగా మారుతుందా? ఉపయోగపడుతుందా? పూర్వం పెద్దలు వస్తువు మన్నిక మరియు నాణ్యతతో బాటు వస్తువు ద్వారా కలగబోయే చేటును కూడా అంచనా వేసి, వస్తువులను ఇంటికి తెచ్చుకునేవారని పెద్దలు చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వస్తువు కొనండి… ఈ వస్తువు వలన కలుగు ప్రయోజనాలు ఇవి… ఈ వస్తువుతో మీకు పనులు చాలా సులభం… అంటూ తదితర విషయాలతో వివిధ వస్తువుల మార్కెటింగ్ మనపై జరుగుతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాకా,…
-
మోజులో పడి జీవితం కోల్పోకు
మోజుగా ఉన్నప్పుడు మనసంతా మోహమే కమ్ముకుని ఉంటుంది. కాబట్టి తప్పొప్పులు కూడా విచారించకుండా మనసు మోజులో పడిపోతుంది. మోజు పడ్డ మనసు, వ్యసనం బారిన పడిన వారి మాదిరిగా ప్రవర్తిస్తుంది… కావునా మోజులో పడి జీవితం కోల్పోకు, జీవితం చాలా విలువైనది… ప్రపంచంలో వెలకట్టలేని మెషీన్ ఉందంటే, అది మనిషి శరీరమే… దానిని మోజులో పడి పాడు చేయకు… ఈమోజు ఒక వస్తువుపై కలగవచ్చును. పురుషుడికి స్త్రీపై, స్త్రీకి పురుషుడిపై మోజు కలగవచ్చును… మితిమీరిన మోహం కలిగితే,…
-
మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు.
అపకారికి కూడా ఉపకారం చేసేవారి గురించి, ఏమి ఆశించకుండా సాయపడే గుణం ఉన్నవారి గురించి, ద్వితీయాలోచన లేకుండా సాయం చేయడానికి చూసేవారి గురించి, తమ చుట్టూ ఉన్నవారి గురించి మంచినే చెబుతూ ఉండేవారి గురించి… ఇలా ఏదైనీ ఒక మంచి గుణ విశేషంగా ఉన్నప్పుడు మంచి వ్యక్తిగా గుర్తిస్తారు… ఎక్కువగా మంచి గుణాలు గల మనిషిని ఎప్పుడు మంచితనానికి మారుపేరు అని చెబుతారు. తనకు అవసరమైనప్పుడు సాయం అందించకుండా మోసం చేసిన మిత్రునికి అవసరమైప్పుడు సాయం చేసేవారుంటే,…
-
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, సమయానికి తిండి, సమయానికి నిద్ర, సమయానికి పని మూడు ఉంటే…. ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కాయకష్టం చేసే వ్యక్తి, వేళకి తింటారు. వేళకి నిద్రిస్తారు… ఏదైనా కల్తీ వలన కానీ ఏదైనా అంటువ్యాది సోకితే, ఆనారోగ్యంపాలు అవుతారమో కానీ వారి శరీరం వలనే వారికి ఆనారోగ్యం కలగదు… కారణం కష్టం చేసే కాయంలో వృధా కొవ్వు ఉండదు. వేళకి తినడం, నిద్రించడం ఉంటుంది. ఇలా వ్యక్తికి కాయకష్టం లేకపోతే, ఆరోగ్యంగా…
-
మనిషి జీవితం ఎలా ఉంటుంది!
సాధించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది. సాదించకుంటే అంత గొప్పగా ఉండదు. సమాజంలో మనిషి జీవితం ఎలా ఉంటుంది? మనిషికి తన చుట్టూ ఏర్పడి ఉన్న పరిస్థితులు, ఆ పరిస్థితులో తన లక్ష్యం… తన లక్ష్యానికి ఉపయోగపడే వనరులు… కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అంది వచ్చిన అవకాశం అందుకుంటే అందలమైనా అందుతుందని అంటారు. వ్యక్తి జీవితం అతని స్వభావం… దాన్ని బట్టి సమాజం నుండి స్పందన, సామాజిక స్పందనను బట్టి వ్యక్తి ప్రతిస్పందన… ఇరువురి ప్రతిస్పందనల మద్య మనసు…
-
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి! నీటి ఎద్దడి ఎదుర్కొనేవారికి నీటి విలువ తెలుస్తుంది. వారు నీటిని పొదుపుగా వాడతారు. నీరు వాడడంలో నీటి వృధా కానివ్వరు. నీటి యొక్క ఉపయోగాలు బాగా గుర్తెరిగి ఉంటారు. నీటి వృధా చేసేవారికి నీటి విలువ తెలియకుండానే నీటిని ఉపయోగిస్తూ ఉంటారు… ఎవరు ఎలా ఉపయోగించినా గాలి తరువాత మనిషి మనుగడకు నీరు చాలా చాలా అవసరం. త్రాగు నీరు లేనిదే మనిషి మనుగడ లేదు… అలాగే భూమిమీద…
-
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు
మంచి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు కొన్నింటిని…. మంచి విద్యార్ధిగా ఉన్నప్పుడు మంచి లక్షణాలు ఉండడం చేత ఉపాధ్యాయుని వద్ద మంచి గుర్తింపు వస్తుంది. ఇంకా ఉపాధ్యాయుడు మంచి లక్షణాలు గల విద్యార్ధులకు పాఠాలు చెప్పడంలో ఆసక్తి చూపుతారు. అంటే ఒక విద్యార్ధికి మంచి లక్షణాలు ఉంటే, అవి తోటివారికి కూడా సాయపడతాయి… అనుకరణలో విద్యార్ధులు ఒకరిని చూసి మరొకరు చేస్తూ ఉంటారు… కాబట్టి మంచి లక్షణాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్ధి తమ వైఖిరి పట్ల తాము…
-
నేర్చుకోవాలి అనే తపన ఉంటే
నేర్చుకోవాలి అనే తపన ఉంటే, అదే మన వృద్దికి కారణం కాగలదని అంటారు. తపించే స్వభావం, తాపత్రాయం నెరవేరేదాకా ఊరుకోదు. తపనే లేనప్పుడు ఎవరూ, ఏమి చేయలేరు. విద్యార్ధికి నేర్చుకోవాలనే తపన బలంగా ఉంటే, కరోనా కాలంలో కూడా ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యను అభ్యసించడానికి కృషి చేస్తారు… ఆ తపన లేకుంటే మాత్రం, ఎలా స్కూల్ కు సెలవు పెట్టాలనే తలంపు తలుస్తారు. తపను ఉంటే అందుకు అనుగుణంగా తలంపులు పుడతాయి. నేడు నేర్చుకోవాలనే…
-
దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు మొదట్లో నిదానంగానే ఉంటాయి.
అటువంటి అంశాలు తాత్కలిక కాలంలో ప్రభావం చూపనట్టుగా ఉంటూ, తర్వాతి కాలంలో ప్రభావం చూపుతాయి…. అంటే రహస్యంగా మనపై నిఘా పెట్టిన వ్యక్తి మనతో మాములుగానే మాట్లాడుతూ ఉంటూ, మనకు సంబంధించిన అంశాలలో వారికి అవసరమైన విషయం తెలిసేవరకు ఓపిక పట్టినట్టుగా దీర్ఘకాలిక ప్రభావం చూపే అంశాలు కూడా మొదట్లో వాటి ప్రభావం చూపక, ఆపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి…. తెలివిగా ఉంటే, మనతో మాట్లాడే వ్యక్తి స్వభావం కనిపెట్టవచ్చును అలాగే దీర్ఘకాలిక ప్రభావం చూపించే అంశాలను…
-
తెలివి అంటే ఏమిటి తెలివి తేటలు ఏవిధంగా ఉపయోగపడతాయి?
తెలివి అంటే ఏమిటి తెలివి తేటలు ఏవిధంగా ఉపయోగపడతాయి? తెలివి అంటే తెలిసి ఉన్న విషయ పరిజ్ఙానంతో చురుకుగా ఆలోచిస్తూ, పనిని సులభంగా పూర్తి చేయడం… పనితనంలో తెలివి అయితే, తెలిసిన విషయ విజ్ఙానంతో అప్పటికప్పుడు అవసరమైన మాటలు మాట్లాడడం మాటకారి… లేదా తెలివిగా మాట్లాడుతారని అంటారు. ఎరుకతో వ్యవహరించడం అంటే మేట్కోని ఉండడం తెలివిగా వ్యవహరించడం… ఏదైనా మెదడు పనితీరుకు తెలివి తార్కాణంగా నిలుస్తుంది. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో అంశంలో గొప్ప తెలివిని ప్రదర్శించగలరు. అందరూ…
-
త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి.
త్యాగం గొప్పతనం ఏమిటి వివరించండి. త్యాగం అంటే తన దగ్గర ఉన్నదానిని ఫలితం ఆశించకుండా ఇచ్చేయడమే… లేదా ఖర్చు చేయడమే. త్యాగమూర్తుల త్యాగ ఫలితం భవిష్యత్తు తరం కూడా అనుభవిస్తుంది. సాయం ఒకరికే ఉపయుక్తం కావచ్చును… కానీ త్యాగ ఫలితాలు మాత్రం ఒక తరానికి లేదా కొన్ని తరాలకు సమాజంలో ఉపయోగపడుతూనే ఉంటాయని అంటారు. ధనవంతుడు తన దగ్గర ఉన్న ధనంలో కొంత ధనం ఇతరులకు అందిస్తే, అది సాయం అవుతుంది. అదే తన దగ్గర ఉన్న…
-
కోవిడ్ కారణంగా చదువు అయితే
కోవిడ్ కారణంగా చదువు అయితే, ఆగుతుంది…. నడుస్తుంది… కానీ పూర్తి విద్యా సంవత్సరం కొనసాగింపు కావడంలేదు… కారణం కరోనా వైరస్…. కాబట్టి ఒక విద్యా సంవత్సరం నిర్విరామరంగా పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పుడే, విద్యాభ్యాసం బాగుంటుందని అంటారు. అయితే కోవిడ్ కారణంగా చదువును వాయిదా వేయడం విద్యార్ధిగా తప్పు చేసినట్టే… ఎందుకంటే…. ఈ తెలుగు వ్యాసంలో చదువు వలన ఏమి తెలుసుకుంటాము? పరీక్షలెందుకు? అవగాహన చేసుకుందాం…. ఆటలంటే ఆసక్తి ఉంటే, ఖాళీ లభించినప్పుడు ఆటలు ఆడడం ఆరోగ్యదాయం…
-
తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి
తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి. వారి కష్టాలలో పాలుపంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కష్టపడుతున్న తల్లిదండ్రుల ఆర్దిక ప్రయత్నాలలో తమవంతుగా వారికి సాయంగా ఉండాలి. అమ్మానాన్నలు ఇద్దరూ కూడా పిల్లల భవిష్యత్తుకోసం కష్టపడుతూ ఉంటారు. కొందరికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పాస్టులుంటాయి… కొందరికి అటువంటి ఆస్తి ఉండదు… కానీ పిల్లల భవిష్యత్తుకోసం పాటుపడుతూ ఉంటారు… కొందరు జీవితం గురించి కలలు కంటారు. కానీ కాలంలో తాము కన్న కలలు నెరవేరవని తెలుసుకుని వాటిని విరమించుకుంటారు.…
-
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు మేలు కలుగుతుంది. చెట్లనుండి విడుదల అయ్యే ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు… అంటే కొన్ని నిమిషాలపాటు ఊపిరి తీయకపోతే, ప్రాణం నిలవదు… అటువంటి మన ప్రాణాలకు ఆధారం ఆక్సిజన్, అటువంటి ఆక్సిజన్ చెట్ల వలన సమృద్దిగా లభిస్తుంది. చేసిన మేలు మరిచేవాడిని కృతఘ్నుడు అంటాము… కృతఘ్నుడికి క్షమా బిక్షలేదని అంటారు. మరి చెట్టు మానవజాతి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి… కాబట్టి చెట్లకు నీరు అందించి వాటిని సంరక్షించాలి. చెట్లను తొలగించడము అంటే,…
-
నా ఇష్టమైన గేమ్ షెటిల్
నా ఇష్టమైన గేమ్ షెటిల్. ఎందుకంటే నేను ఉదయం వేళల్లో షెటిల్ ఆడితే, అది నాకు ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకా షెటిల్ ఆడడం వలన నేను ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. చూడడానికి ఇష్టమైన గేమ్ అంటే క్రికెట్… కానీ గేమ్ చూడడం వలన కలిగే సంతోషం కన్నా ఆడితే వచ్చే సంతోషం ఎక్కువ… కాబట్టి వీలైనన్ని రోజులు ఉదయం వేళ మరియు సాయం వేళల్లో షెటిల్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజులో నాచుట్టూ ఉండేవారు…
-
విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు.
విద్యార్ధులను పబ్ జీ గేమ్ ఆడేందుకు అనుమతించకూడదు. ఎందుకంటే పబ్ జీ గేమ్ ఒక అలవాటుగా మారి అది చివరికి వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. వ్యసనం వ్యక్తి పతనానికి నాంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా పబ్ జీ వంటి గేమ్స్ ఆడేందుకు విద్యార్ధులను అనుమతించరాదు. పబ్ జీ గేమ్ ఇది ఒక స్మార్ట్ ఫోన్ ఇది ఆడుతూ ఉన్నప్పుడు చేతిలో ఉన్న ఆయుధాలతో అవతలివారిని చంపుకుంటూ వెళ్లాలి. లేకుంటే ప్రత్యర్థి చేతుల్లో చావాల్సి ఉంటుంది. అంటే…
-
జీవితంలో నా లక్ష్యం గురించి
మనిషి జీవితంలో నా లక్ష్యం గురించి ఒక వ్యాసం వ్రాయడానికి… మనకు లక్ష్యం ఖచ్చితంగా మనం ఏర్పరచుకున్నదో లేక పెద్దలు చెప్పగా విని మనం ఏర్పరచుకోవడమో… ఏదో ఒక విధంగా లక్ష్యం ఏర్పడుతుంది. అయితే ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఏర్పడుతుంది. అది ఆర్ధికంగా బాగా ఎదగాలి అని కొందరికి ఉంటే, మంచి ఉద్యోగం సంపాదించాలి. మంచి స్థాయిగల ఉద్యోగం పొందాలి. క్రీడలలో అగ్రస్థానం సంపాదించాలి… ఏదో ఒక రకంగా ఏదో ఒక రంగంలో…
-
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించాలి. ధూమపానం అంటే పొగ తాగడం అంటారు. అంటే చుట్ట, బీడి, సిగరెట్ తదితర వాటితో హానికరమైన ధూమపానం చేయడం ప్రమాదకరం. చుట్ట, బీడి, సిగరెట్ వంటివి తాగుతూ, పొగ బయటికి వదలడంతో, ఆ పొగ పీల్చినవారికి కూడా అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు అంటారు. చుట్ట, బీడి, సిగరెట్ వంటి వాటితో పొగ త్రాగుట లేదా పీల్చుట ఆరోగ్యానికి హానికరం…. కాబట్టి ధూమపానం చేయరాదు. ధూమపానం చేయడం వలన…
-
శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి
శాంతి ఆవశ్యకత కరపత్రం రాయండి! శాంతిగా ఉండే మనసు బాగా ఆలోచన చేయగలిగితే, అశాంతితో ఉండే మనసు అసహనంతో ఉంటుంది. పరిష్కార ధోరణి కానరాదు. శాంతియుత వాతావరణంలో వ్యక్తి జీవనం ప్రశాంతంగా ఉంటుంది. శాంతస్వభావం ఉన్నవారి మాటతీరు ఆహ్లాదకరంగా ఉంటుంది. శాంతము లేని చోట సౌఖ్యముండదని అంటారు. దైనందిన జీవితంలో సమస్యల వలయం ఏర్పడుతూనే ఉంటే, అశాంతితో ఉన్నవారు ఆ వలయంలో చిక్కుకుంటారు. శాంత చిత్తంలో ఆలోచించేవారు సమస్యలకు పరిష్కార ధోరణితో ముందుకు సాగగలరు. మనిషి శాంతిగా…
-
స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా?
స్వశక్తి చేత ఏ పనులనైనా సాధించవచ్చునా? అవును స్వశక్తి చేత పనులను సాధించుకోగలమని పెద్దలు చెబుతూ ఉంటారు. తనను తాను నమ్మిన వ్యక్తి, తన శక్తిపై తనకు సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారు. అవగాహనా రాహిత్యం లేకపోవడం వలన కార్యములు విజయవంతంగా ప్రారంభించగలరు. తనకు తెలిసి ఉన్న విషయములలోనే తనకున్న పరిజ్ఙానం చేత, తను చేయగల పనులను ప్రారంభించడంతో కార్యసాధనకు బీజం పడుతుందని అంటారు. ఒక వ్యక్తి బాగా లెక్కలు చేయగలడు… అంటే అతనికి లెక్కలు గురించి…
-
కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది
కుటుంబంలో మనమనే భావన బలమవుతుంది. అలా కాకుండా మనమనే భావన కొరవడితే, అది కుటుంబంలో బంధాలను బలహీనపరుస్తుంది. కావునా కుటుంబంలో సభ్యులందరిలోనూ మనమనే ఏక భావన ఉండడం, ఆ కుటుంబానికి శ్రేయష్కరం అంటారు. మనమనే ఐక్యతా భావన ఒక కుటుంబానికి బలమైన భావనగా చెబుతారు. కుటుంబ సభ్యులంతా కుటుంబ పెద్ద మాటకు కట్టుబడి ఉండడం వలన, సదరు కుటుంబానికి సమాజంలో ఆకుటుంబ పెద్దకు మంచి విలువ ఉంటుంది. ఇంకా ఆ కుటుంబంలో సభ్యులంతా మనమనే భావనతో ఉండడం…
-
మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి?
మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేమిటి? ప్రధానంగా ప్రధమ పుత్రుడు కానీ ఏకైక పుత్రుడు కానీ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా జీవించాలని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు. పితృవాక్య పరిపాలన ప్రధాన కర్తవ్యంగా జీవించాలని రామాయణం మనకు బోధిస్తుంది… రామాయణం ప్రకారం ఆలోచిస్తే, తండ్రిమాటకు విలువనిచ్చి జీవించడం కుమారుడి ప్రధాన లక్షణంగా కనబడుతుంది. మంచి కుమారుడు తండ్రిమాట వినాలి అంటారు. ఇంకా సమాజంలో తండ్రికి తలవొంపులు తేకుండా ప్రవర్తించాలి. మంచి విషయాలలో తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా…
-
పివి నరసింహారావు మన మహనీయుడు
మన తెలుగు జాతి గర్వించదగిన మహానుభావులలో పి.వి. నరసింహారావు గారు చాలా ప్రముఖులు. పివి నరసింహారావు మన మహనీయుడు, మన దేశ మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. భారతదేశానికి తొలి తెలుగు ప్రధానమంతి ఇంకా మొదటి దక్షిణదేశపు ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు 1921 సంవత్సరంలో జూన్ 28 తేదీన వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. రుక్నాభాయి – సీతారామారావు ఈయన…
-
తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం తెలుగు వాడివైనందుకు గర్వించు
తెలుసుకో తెలుసుకో తెలుగు గొప్పతనం, తెలుగు వాడివైనందుకు గర్వించు అని మన పూర్వీకులు పట్టుబట్టారు. మన పెద్దవారు తెలుగు వారలమైనందుకు ఎంతగానో సంతషించారు కావునా వారు తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు. అలా తెలుగులో అద్భుతమైన మాటలు చెప్పగలిగారు అనడానికి ఉదాహరణ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు… మన తెలుగు మహనీయుడైన శ్రీకృష్ణదేవరాయలు ఏమని చెప్పారంటే దేశభాషలందు తెలుగులెస్స… ఇలాంటి అద్భుతమైన మాటలే కాదు పద్యాలు పలికిన మహానుభావులు మన తెలుగు పూర్వీకులు. మన కవులు అందించిన కవిత్వంలోని మాధుర్యం…
-
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం ఒక అలవాటుగా ఉండడం వలన నాకు రాజకీయం గురించి కొంచె అవగాహన కలుగుతుంది. గత కొంతకాలంగా దేశ రాజకీయాలు అయితే జాతీయతా భావం ప్రజలలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజల ఆలోచనా తీరు గమనిస్తున్న రాజకీయ పార్టీలు జాతీయతా భావమునే ప్రచారాస్త్రాలుగా మార్చుకుని దేశ రాజకీయాలలో తమ ప్రభావం చూపడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏదైనా ఒక విషయంలో ఒక ప్రాంతంలో ఎంత…
-
విశ్వసనీయత గురించి మీ మాటలలో వివరించండి
విశ్వసనీయత గురించి మీ మాటలలో విశ్వసనీయత ప్రధానమని తెలుగులో వివరించండి. విశ్వసనీయత జీవితంలో చాలా ముఖ్యమైనది. విశ్వాసం ఏర్పడిన తర్వాత దానిని నిలబెట్టుకోవడం వ్యక్తికి చాలా అవసరం. విశ్వాసం కోల్పోతే అర్హతను కోల్పోవలసి ఉంటుంది. వ్యక్తికైనా, వ్యవస్థకైనా, సంస్థకైనా, రాజకీయ పార్టీకైనా చివరికి ఒక ప్రాంతమైనా విశ్వసనీయత ప్రధానమైన ప్రభావం చూపగలదు. ఒక ప్రాంతంలో దారి దోపిడి దొంగలు ఎక్కువ అని సమాజంలో ప్రాచుర్యం పెరిగితే, ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రాంతంపై ప్రజలలో విశ్వసనీయత ఉండదు. ఆ…
-
పావురం గురించి తెలుగులో వ్యాసం
పావురం గురించి తెలుగులో వ్యాసం ! ప్రధానంగా తెల్లని పావురం శాంతికి సంకేతంగా చెబుతారు. పావురం ప్రధానంగా ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. చాలా దూరంలో ఉన్నవాటిని కూడా ఇవి గుర్తించగలవు. 16గంటలు అవిశ్రాంతంగా ఆకాశంలో ఎగురగలవు. అందుకే వీటిని పూర్వపు కాలంలో సందేశాలు ఒక ప్రాంతం నుండి మరొక సుదూర ప్రాంతానికి పంపడానికి ఉపయోగించేవారు. పావురాలు తలను పైకెత్తకుండానే ఆహారాన్ని స్వీకరించగలవు. కానీ ఇతర పక్షలు పావురం మాదిరి ఆహారాన్ని స్వీకరించలేవని అంటారు. ఇంకా పావురం గుండె…
-
స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన
స్త్రీల పట్ల గౌరవ భావన స్త్రీల పట్ల మర్యాదపూర్వకమైన ఆలోచనలు లేని సమాజంలో స్త్రీ పూజింపబడదు అంటారు. అయితే మనదేశంలో స్త్రీ పూజింపబడింది. స్త్రీ గౌరవింపబడింది. స్త్రీ పట్ల మర్యాద పూర్వకమైన ప్రవర్తన కలిగి ఉన్న సమాజం మన భారతీయ సమాజం అని ప్రపంచం కీర్తించింది. అయితే ఇప్పుడు అదే దేశంలో కూడా స్త్రీ లైంగిక వేధింపులకు గురి అవుతుందనే వార్తలు సమాజాన్ని కలచివేస్తున్నాయి… దారుణం అందులో చిన్నారులు కూడా ఉండడమేనని పెద్దలు వాపోతున్నారు. స్త్రీల పట్ల…
-
వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి
వ్యక్తి వ్యక్తిత్వం అంటే ఏమిటి ! అంటే వ్యక్తి యొక్క తత్వమును తెలియజేయునదిగా చెప్పబడుతుంది. సమాజంలో వ్యక్తి తన యొక్క తత్వముతో ప్రభావం చూపుతూ ఒక గుర్తింపును పొందుతూ ఉంటే, ఆ తత్వమును అతని యొక్క వ్యక్తిత్వముగా చెబుతూ ఉంటారు. వ్యక్తిత్వంలో వ్యక్తి యొక్క లక్షణాలు, గుణాలు, అభిరుచులు మొదలైనవి మిళితమై ఉంటాయి. వ్యక్తి తనకు ఉన్న విశిష్టమైన లక్షణాల వలన, గుణాలు వలన, అభిరుచుల వలన తన యొక్క ప్రవర్తనతో వివిధ పరిస్థితులలో వివిధ విధాలుగా…
-
కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి!
కర్తవ్య నిర్వహణ గురించి వివరించండి! జీవితంలో కర్తవ్య నిర్వహణ పాటించినవారికి జీవితపు లక్ష్యం నెరవేరగలదని అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏర్పడే లక్ష్యాలు, తాము నిర్వహించే కర్తవ్యమును అనుసరించి ఉండే అవకాశం ఉంటుందని అంటారు. వ్యక్తి కర్తవ్య నిర్వహణలో కృతకృత్యుడైతే, వచ్చే గుర్తింపు కలకాలం కొనసాగుతుందని అంటారు. వృత్తిరిత్యా కర్తవ్యతా దృష్టితో ఉండేవారి మనసు వృత్తిలో తమ పనిని తాము సమర్ధవంతంగా నిర్విహించగలగడానికి వారి మనసు సహకరించగలదని పెద్దలు అభిప్రాయపడుతూ ఉంటారు. ఒక పోలీసు తన కర్తవ్య…
-
కరపత్రం ఎలా రాయాలి తెలుగులో
కరపత్రం ఎలా రాయాలి తెలుగులో కరపత్రం అంటే పాంప్లేట్ అంటారు. karapatram meaning in telugu కరపత్రం అంటే కరము చేత వ్రాయబడిన పత్రం లేదా కరము చేత పంచబడే పత్రం అనవచ్చును. కరము అంటే చేయి…. చేతి వ్రాతతో పత్రమును వ్రాసి, దానిని పలువురికి చేతితోనే అందిస్తూ ప్రచారం చేస్తారు. అటువంటి పత్రమును కరపత్రం అంటారు. అయితే ఇది ఇప్పుడు ప్రింటింగ్ చేస్తారు. ఇది ఆకర్షణీయంగా ఉంటూ విషయం సరళంగా అర్ధవంతంగా ఉంటుంది. అది ఆహ్వానం…
-
మన చుట్టూ మనకో మార్గదర్శకుడు
మన చుట్టూ మనకో మార్గదర్శకుడు ఉంటారు. ఈ వ్యాక్యం ఆధారంగా ఒక వ్యాసం వ్రాయాలంటే, మన చుట్టూ ఉండే పరిస్థితుల గురించి మనకో అవగాహన ఉండాలి. మన చుట్టూ ఉండే పరిస్థితులలో, ఆ పరిస్థితులను ప్రభావితం చేసేవారు ఎవరెవరు ఉన్నారో తెలిసి ఉండాలి. ఇంకా ఎవరెవరు ఎటువంటి ప్రభావం చూపుతున్నారో తెలియబడి ఉండాలి. ఇలా మన చుట్టూ ఉన్న స్థితి మనకు అవగాహన ఉంటే, మన చుట్టూ మనకో మార్గదర్శకుడు కనబడతారు. ఒక వ్యక్తి చుట్టూ ఒక…
-
సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు
సమయం ఎందుకు వృధా చేసుకోకూడదు. సమయం అంటే కాలం. కదిలే కాలం చాలా విలువైనది. ఎంత విలువైనది అంటే మనకొక నానుడి కూడా ఉంది. అదేటంటే కాలం కాంచన తుల్యం అని అంటారు. అంటే క్షణ కాలం అయినా బంగారంతో సమానమని అంటారు. సంపాదించేవారు ఎప్పుడూ సమయానికి ప్రాధన్యతనిస్తారు. వారు చేసే దినచర్య ఎట్టి పరిస్థితుల్లోనూ సరైన సమయపాలనను పాటిస్తారు. అందుకే వారు కాలాన్ని ధనముగా మార్చగలరు. ఏది చేయాలన్నా మనకున్న కాలంలోనే సాధ్యం. మనం లేని…
-
కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం
కుటుంబ వ్యవస్థ భారతీయ సంస్కృతికి మూలం. భారతీయ కుటుంబ వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిత్వం, కుటుంబ సభ్యులపై ప్రభావం పడుతుంది. అలాగే ఎదుగుతున్న పిల్లలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ప్రభావం పడుతుంది. ఒకరిపై ఒకరికి ఉండే గౌరవం పిల్లలలోనూ వినయ విధేయతలను పెంచుతుంది. ముఖ్యంగా తాత-ముత్తాతలు, అమ్మమ్మ, అమ్మకు అమ్మమ్మలు మాటలు పిల్లలలో మంచ అవగాహనను కలిగిస్తాయి. ఒకరిపై ఒకరు చూపుకునే ప్రేమాభిమానాలు ఎదుగుతున్న పిల్లలో ఒంటరితనం అనే భావన లేకుండా, పాజిటివ్ దృక్పధం పెరిగే అవకాశాలు ఎక్కువ.…
-
జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది
జీవనశైలి వ్యక్తి ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే సమయానికి శ్రద్దతో ఆహారం స్వీకరించేవారు శక్తివంతులుగా ఉంటారు. సమయానికి ఒత్తిడి కారణంగా ఆహారం స్వీకరించక ఉండేవారు బలహీనతను కొని తెచ్చుకుంటారు. జీవనశైలి వలన వచ్చు వ్యాధులు, వ్యక్తికి వచ్చు వ్యాధులు వ్యక్తి జీవనశైలిని బట్టి ఉంటుందని అంటారు. ఆరోగ్యానికి మంచి ఆహారం తీసుకునేవారి జీవనశైలితో వారు సంతోషంగా ఉండగలరు. ఒత్తిడికి తలొగ్గి కనీస సమయపాలన కూడా పాటించిన జీవనశైలి గలవారు అనారోగ్యవంతులు అవుతారని అంటారు. అంటే ఎవరి ఆరోగ్యం వారి…
-
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి.
సంతృప్తిగా జీవించడం ప్రధానం వివరిస్తూ కోరికలే దు:ఖానికి మూలం ఎలాగో తెలియజేయండి. సంతృప్తిగా జీవించడం ప్రధానం. ఎందుకు సంతృప్తిగా జీవించాలి? ప్రశ్న వేసుకుంటే… ఒక వ్యక్తి తల్లిదండ్రుల సంరక్షణలో పెరుగుతూ ఉంటాడు. అతను పుట్టగానే తనకు ఆకలి తీర్చుకోవడం ఒక్కటే తెలుసు… మిగిలినవి అన్నీ తల్లిదండ్రులను చూసి లేక తల్లిదండ్రుల అలవాటు చేసిన దానిని బట్టి నేర్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఎదిగే కొలది బంధువుల పిల్లల, స్కూల్లో సహవాసం ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈకాలంలో వ్యక్తి ఖచ్చితమైన…
-
కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి.
కరోనా వైరస్ జాగ్రత్తలు తప్పనిసరి వివరించండి. కరోనా వైరస్ చైనాలో పుట్టినా ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. అన్ని దేశాలలోనూ కరోనా వైరస్ తన ప్రతాపం చూపించింది. ఎందరలో మనషులను హరించింది. తదుపరి కరోనా వైరస్ తన రూపు మార్చుకుంటూ మరింత ప్రభావం ప్రపంచంపై చూపుతుంది. సాదారణ వ్యక్తి మాదిరిగానే కనబడినా కరోనా లేదనుకోవడానికి వీలు లేదంటారు. కారణం కరోనా వైరస్ బారిన పడినవారు వెంటనే అనారోగ్యంపాలు కాకపోవచ్చును. వైరస్ తీవ్రత పెరిగాక రోగలక్షణాలు కనబడవచ్చును. కాబట్టి వైరస్…
-
స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి
స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి! ఇది చాలా చాలా ప్రధానమైన అంశము. మనిషికి ప్రశాంతతను ఇచ్చేది స్వేచ్ఛ… క్రమశిక్షణలో పెరిగినవారికి సరైన సమయంలో స్వీయ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉండాలని అంటారు. స్వేచ్ఛ గురించి తెలుగు వ్యాసం వ్రాయండి ఒకరి స్వేచ్ఛ మరొకరికి భంగం కలగరాదు. నియంతృత్వ దోరణి వలన స్వేచ్ఛ హరించబడుతూ ఉంటుంది. స్వేచ్ఛను హరించే గర్హించాలి. సమాజంలో మనుషులందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కుంది. కాబట్టి వ్యక్తి ఎదిగేవరకు సంరక్షకుల నియంత్రణలో ఉన్నా…
-
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి. పిల్లలకు వినయ విధేయతలు ఎందుకు నేర్పాలి? క్రమశిక్షణను ఎందుకు అలవాటు చేయాలి?మొక్కగా ఉన్నప్పుడే వంగని…
-
మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం?
మహాభారతం తెలుగు పుస్తకం రీడ్ చేయడం వలన కలుగు ప్రయోజనం? తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి, అనే నానుడి చాలా ప్రసిద్ది… మినప గారెలు మనకాయమునకు బలము అయితే మహాభారతం మన మనసు జవము అంటారు. అంటే మనం మహాభారతం రీడ్ చేయడం వలన మన మనసును మరింత శక్తివంతం చేయవచ్చనే భావన పై నానుడి వలన కలుగుతుందని చెప్పవచ్చును. కారణం మినపగారెలు రుచిగా ఉంటాయి… అవి తిని అరిగితే, వాటి మన శరీరమునకు…
-
ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి.
ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి, తెలుగులో వ్యాసం. శక్తివంతమైన మనిషికి మనోబలం సఖ్యతతో ఉండే స్నేహితులు, కదిలి వచ్చే బంధుగణం అయితే సమాజాకి బలం ప్రజల ఐక్యత. ఎంతమంది ఐకమత్యంగా ఉంటే, అది అక్కడ అంతటి బలం అవుతుంది. ఐకమత్యమే బలం అయితే అనైక్యతే బలహీనత అంటారు. ఐకమత్యం అంటే ఒక విషయంలో గాని, ఒక అంశంలో గానీ అందరూ ఒక్క మాటపై ఉండడం అయితే అనైక్యత అంటే ఒక విషయంలో గాని, ఒక…
-
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది
ఓటు విలువైనది పవిత్రమైనది అమూల్యమైనది అంటూ ఓటు గురించి వింటూ ఉంటాము. అవును ఓటు చాలా విలువైనది. ఓటు అతి పవిత్రమైనది. ఓటు అమూల్యమైనది. కానీ అయిదు సంవత్సరాలకొక్కమారు వచ్చే ఓటు హక్కు అయిదు సంవత్సరాల కాలంపాటు అధికారాన్ని ఒకరికి అప్పగించడమే. మన ప్రజా స్వామ్యంలో మన భవిష్యత్తు ఏవిధంగా ప్రభావితం అవుతుంది? ఓటు వేయడం అంటే అయిదు సంవత్సరాల కాలంపాటు ఒకరికి అధికారాన్ని అప్పగించడం. ఓటు అనేది మన సమాజం కోసం మనన్ని పరిపాలించడానికి మనం…
-
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు నిత్యం వెన్నంటి ఉంటారు. ప్రతివారికి బాల్యం భగవంతుడు అందించిన వరం. అనుకరించడంలో డిగ్రీ పుచ్చుకున్నట్టుగా అనుసరించడంలో ముందుండే బాలల చుట్టూ రక్షణ వలయంలాగా సమాజం ఉంటుంది. ఇంట్లో అమ్మా, నాన్న అన్నయ్య, అక్క, ఇంటి చుట్టూ ఇరుగుపొరుగు, ఇంటి బయట బంధువులు, ఊరికెళితే అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య చదువుకుంటున్న వేళల్లో బోధకులు ఇలా నిత్యం బాలల వెన్నంటి బాలల శిక్షణకు, బాలల ఉత్తమ క్రమశిక్షణ కోసం పాటుపడే వ్యవస్థ…
-
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది. అలా నష్టమేమిటో చూస్తే, మనిషి భూమిపై బ్రతకలేడు అని చెప్పవచ్చును. ఎందుకు భూమిపై చెట్లు అనేవి లేకపోతే మనిషి జీవించలేడు? కారణం మనిషి ఆక్సిజన్ లేకుండా బ్రతకలేడు. ఇంకా నీరు లేకుండా జీవన సాగించలేడు.…
-
పుస్తక పఠనం వలన ఉపయోగాలు
పుస్తక పఠనం వలన ఉపయోగాలు చాలానే ఉంటాయని అంటారు. పుస్తకాలు చదవడం వలన జ్ఙానం పెరుగుతుంది. పుస్తకాలు చదవడం వలన విషయాలలో సారం అర్ధమవుతుంది. ఎందుకంటే పుస్తకాలలో వివిధ విషయాల సారం వివరించబడి ఉంటుంది. పుస్తకాలలో వివిధ విధానాల గురించి లేక పద్దతుల గురించి వివరించబడి ఉంటుంది. పుస్తకాలు చదవడం వలన ఒక విధానం గురించి అర్ధం అవుతుంది. అది వస్తు తయారీ విధానం కావచ్చును. సంస్కృతి సంప్రదాయం కావచ్చును. ఏదైనా ఒక పద్దతి గురించి అక్షర…
-
వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము
వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశము ఎంచుకోవడానికి చాలా రకాల అంశములలో వివిధ విషయములు ఉంటాయి. అయితే తెలిసి ఉన్న రంగంలో మనకు బాగా తెలిసిన విషయంలో అయితే వ్యాసం బాగా వ్రాయగలుగుతాం. కాబట్టి వ్యాసం వ్రాయుటకు ఏదైనా అంశం ఎంచుకోవడంలో బాగా తెలిసిన అంశమునే ఎంచుకోవాలి. విద్యార్ధులకు అయితే ప్రశ్నాపత్రములో ముందుగానే అంశము చెప్పి, దానిపై మీ సొంత వ్యాక్యాలలో వ్యాసం వ్రాయమని ప్రశ్నరూపంలో అడుగుతారు. ప్రశ్నాపత్రములో పాఠ్యాంశము నుండి కానీ లేదా సామాజిక అంశము నుండి…
-
మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి
మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకు చర్చించండి? ముందుగా ఇది అందరికీ ఉపయోగపడే ప్రశ్న. అన్ని అంశములలోనూ మంచి చెడుల గురించి సరైన రీతిలో ఆలోచన చేయాలి. లేకపోతే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒక మంచి స్నేహితుడు మంచే చెబుతూ ఉంటాడు. కానీ ఆలోచించకుండా త్వరపడి చెడు అభిప్రాయానికి వస్తే, మంచి స్నేహితుడు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. బంధువు గురించి చెడు అభిప్రాయం ఏర్పరచుకుంటే, ఆ బంధం అట్టేకాలం కొనసాగదు. సహచరుల విషయంలో చెడు…
-
ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి
ఆత్మకథ అంటే ఏమిటి వివరించండి ! వ్యక్తి తన యొక్క జీవిత ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టనష్టాలు, స్వానుభవం, చవి చూసిన అనుభవాలు, ఇంకా వారి స్వ జ్ఞాపకాలు గురించి తనకు తానుగా నిజాయితీగా రచన చేసిన కధను ఆత్మకథ అంటారు. అంటే వ్యక్తి జీవిత చరిత్రను కూడా ఆత్మకధగా చెబుతారు. ప్రధానం ప్రముఖులు ఆత్మకధలు సాధారణ వ్యక్తులలో ప్రేరణ పుట్టిస్తాయి. విద్యార్ధులకైతే ఏదైనా సాధించాలనే లక్ష్యము ఏర్పడగలదు. తన జీవితములో తాను ఎదుర్కొన్న పరిస్థితులు వాస్తవిక దృష్టితో…
-
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం వివరించండి. కాదు అంటే అందరికీ తెలిసిన పదమే అమోదయోగ్యం కాదు. అంటే అంగీకరించకూడనిది. ఒప్పుకోలు కానీది… మంచిది అంటే అమోదయోగ్యమైనది, శ్రేయష్కరమైనది, అంగీకరించదగినది. ఒప్పుకోవలసిన విషయం, మేలు చేసే విషయం. వృత్తి అంటే పని అంటారు. అదే మనోవిజ్ఙానం ప్రకారం అంటే మనసు గురించి చెప్పేటప్పుడు వృత్తిని ఒక ఆలోచనగా చెబుతారు. అనేక ఆలోచనలు సృష్టించే మనసు వివిధ విషయాలపై వివిధ రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఇలా…
-
తెలుగు నాట దీపావళి పండుగ
తెలుగు నాట దీపావళి పండుగ చక్కగా జరుపుకుంటారు. నరకుడిని సత్యభామ సంహరించిన తర్వాత నరకపీడ వదిలిందని లోకంలోని జనులంతా సంతోషంతో దీపాలు వెలిగించి తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా దీపావళి పండుగ ప్రారంభం అయినట్టుగా పురాణ గాధలు చెబుతూ ఉంటాయి. ఇంతకీ నరకుడు ఎవరు అంటే భూదేవి పుత్రుడని అంటారు. కానీ ద్వాపరయుగంలో భూదేవి సత్యభామగా అవతారం స్వీకరించింది. కృష్ణుడికి ఆమె భార్య అయ్యింది. వరప్రసాదం వలన నరకుడు తనకన్నా శక్తివంతుడు లేడని లోకంలో…
-
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి!
ఆర్ధిక క్రమశిక్షణ ఆవశ్యకత వివరించండి. చాలా ప్రధాన విషయము. చాలా ముఖ్యమైన విషయము. అందరూ తెలుసుకోవలసిన అంశము. అందరికీ అవగాహన ఉండాల్సిన అంశము. ఎందుకు ఇంత ముఖ్యం? ఇంత ప్రధానం అంటూ అవే పదాలు రిపీట్ చేయడం? వ్యక్తి ఉన్నతికి ఆర్ధిక క్రమశిక్షణ దోహదపడుతుంది. ఒక వ్యక్తి సామాజిక స్థితిని ఆర్ధిక పరిస్థితి శాసిస్తుంది. సమాజంలో గౌరవం వ్యక్తి యొక్క ఆర్ధిక స్థితి ఆధారంగా ఉంటుంది. కుటుంబ జీవనంలో ఆర్ధిక వనరులు కీలక పాత్ర పోషిస్తాయి. సామాజిక…
-
మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని
మనసుకు అలవాటుగా మారుతున్న అంశాన్ని అడ్డుపెట్టుకుని, మనసుపై పట్టు సాధించడం వలన స్వీయ నియంత్రణ పెరుగుతుందని అంటారు. మనిషికి మనసే బలం మనసే బలహీనత అంటారు. విద్యార్ధి దశలో చిన్న చిన్న పొరపాట్లే అలవాట్లుగా మారకుండా జాగ్రత్తపడాలి. నేర్చుకుంటూ ఏవో కొన్ని విషయాలను అలవాటుగా మార్చుకునే గుణం మనసుకు విద్యార్ధి దశలో ఉంటే, మంచి విషయాలలో ఆసక్తి అలవాటుగా మారితే, అవి జీవితానికి ఉపయోగపడతాయని అంటారు. రోజూ ఆడుకోవడం ఇష్టం కాబట్టి ప్రతిరోజూ ఆట ఆడుకునే సమయానికి…
-
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు ఎక్కువ కాలం వైర భావన బలమైన శత్రువును తయారు చేస్తుంది. బలనమైన శత్రువు వలన వ్యక్తి, ఆ వ్యక్తిని నమ్ముకుని ఉన్నవారిపైనా పడుతుంది. ధర్మాత్ములైనవారు మంచి వచనములే చెబుతారు. తమకు నష్టం జరుగుతున్నా సరే సామాజిక ప్రయోజనాలకు పెద్ద పీఠ వేస్తూ మంచి మాటలు పలుకుతూ ఉంటారు. అటువంటి మహానుభావులలో ధర్మరాజు గొప్పవానిగా కీర్తింపబడ్డాడు. క్షత్రియ ధర్మం ప్రకారం రాజ్యాధికారిగా ఉండేకాలంలో రాజుగా ఉండాలి కాబట్టి శ్రీకృష్ణునితో ధర్మరాజు చెప్పే మాటలు…
-
మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?
మాతృభావన జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది? అందుకు శివాజీనే ఆదర్శంగా చెబుతారు. ప్రతి స్త్రీని కన్నతల్లిగా భావించిన ఆ మహానుబావుడి మాతృభావన వలననే ఛత్రపతి శివాజీని సమాజం నేటికి కీర్తిస్తుంది. కీర్తిగడించడం కన్నా లోకంలో చేసే ఘనకార్యం ఏముంటుంది? అలా కీర్తి గడించినవారికి జన్మినిచ్చిన తల్లి హృదయం పొంగుతుంది. తల్లిని సంతోషపెట్టడం కన్నా సృష్టిలో విశేషమేముంది. పరమాత్మ అయిన శ్రీకృష్ణుడంతటివాడు కూడా అమ్మ సంతోషం కోసం అమ్మ చేత కట్టబడ్డాడు… కాబట్టి తల్లి సంతోషం కన్నా కొడుకు సాధించేదేముంటుంది?…
-
చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం
పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సబ్జెక్టు సెర్చ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటే సమంజసం కాదు… పాఠశాలలు ప్రత్యేకించి క్రమపద్దతిలో పాఠ్యాంశాలు బోధించడానికి ఉంటే, స్మార్ట్ ఇష్టానుసారం విషయ సంగ్రహణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలకు స్మార్ట్ ఫోన్ తగదని అంటారు. కానీ కొన్ని పరిస్థితులలో హోమ్ వర్క్ నేపధ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగిస్తే… ఎంతవరకు దానిని వాడుకోవాలి? కొందరు విద్యార్ధులు పాఠ్య పుస్తకం చదువుతూ ఫోనులో సెర్చ్ చేయడం చేస్తూ ఉంటారు. కూడికలు చేయడానికి…
-
అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే…
అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే… తెలుగు వ్యాసం. ముందుగా అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే, అమ్మ ప్రేమే చెప్పగలదు… అమ్మ ప్రేమను చవిచూసిన ప్రతి బిడ్డ అమ్మ గురించి గొప్పగా చెప్పగలరు. ఏదైనా ఒక విషయం గురించి వ్రాయాలంటే, సదరు విషయంలో ఎంతో కొంత పరిజ్ఙానం అవసరం. కానీ అమ్మ విషయంలో మాత్రం ఏదైనా వ్రాయడమంటే, అమ్మ పంచిన ప్రేమను తరిచి చూస్తే చాలు… పదాలు ప్రవహిస్తూ పేరాలుగా ఏర్పడుతూ పేజీలకు పేజీలు పెరుగుతూనే…
-
చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం
చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండేవని అంటూ ఉంటారు. ఇప్పుడు పెద్ద కుటుంబాలు తక్కువగానే ఉంటున్నాయని అంటూ ఉంటారు. సాదారణంగా చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటారు. కారణం పెద్ద కుటుంబాల వలన పెత్తనం ఉండే పెద్దవారి చాదస్తంతో చిన్నవారు ఇబ్బందులు ఎదర్కొంటున్నారనేది ఒక సమస్యగా ఏర్పడడంతో ఇటువంటి అభిప్రాయం కలిగి ఉండవచ్చును. ఇంకా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ నినాదం కూడా పుట్టడానికి కారణం తక్కువమంది…
-
స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం
స్మార్ట్ ఫోనులో వైరస్ ఉంటే ఎలా తెలుగులో వ్యాసం. స్మార్ట్ ఫోను వాడుక సర్వ సాధారణం అయింది. అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోను ఉంటుంది. కారణం స్మార్ట్ ఫోను ఉపయోగించి సులభంగా కొన్ని పనులు చేయొచ్చు… ఇతరులతో చూస్తూ మాట్లాడుట, మెసేజ్ చేయడం, ఫోటోలు వీడియోలు ఎడిట్ సోషల్ మీడియాలో పెట్టడం ఇలాంటివి వ్యక్తిగత అభిరుచులు బట్టి ఉంటాయి. డబ్బులు పంపించడం, కరెంట్ బిల్ పే చేయడం, లొకేషన్ షేర్ చేయడం వంటివి అవసరాన్ని బట్టి స్మార్ట్…
-
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం. ఏస్థాయి అయినా వ్యక్తి నుండి వ్యవస్థ వరకు కూడా ఈ మంచి మాట వర్తిస్తుందని అంటారు. ఈ మాటను విశ్లేషించడానికి ఒక పుస్తకమే వ్రాయవచ్చును. అంతటి మంచిమాట అంతటి శక్తివంతం కూడా… ఇది వంటబట్టించుకున్న వ్యక్తి అందరితోనూ సఖ్యతతో ఉంటారు. అందరితో చాలా సౌమ్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఆ మాటలోనే చాలా ఆంతర్యం ఉంటుంది. పోరు అంటే పోరాటం లేక యుద్ధం అంటారు. పొందు అంటే సఖ్యత, స్నేహం,…
-
మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం
మానవ వనరులు నిర్వచనం ఏమిటి? తెలుగు వ్యాసం. మానవ వనరులు అంటే ఏమిటి? మానవ వనరుల గురించి వ్యాసం. మానవ వనరులు అనగానేమి? ఇలా ప్రశ్న పలు రకాలుగా ఉండ వచ్చును. మానవ వనరుల గురించి చూద్దాం. వనరు అంటే ఆస్తి వంటిది అంటారు. మనిషి ఒక వనరుగా ఉంటే, మానవ వనరు అంటే, ఒక సంస్థకు పనిచేసే మనుషులను మానవ వనరులు అంటే, ఒక సంస్థలో నియమితులైన సిబ్బందినే హ్యుమన్ రిసోర్సెస్ అంటారు. సంస్థకు ఉండే…
-
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం. వృద్దులు అనగా అమ్మ గానీ నాన్నగానీ అమ్మగానీ తాతయ్యగానీ ఉంటారు. వీరు కాకుండా వృద్దులు ఉండరు. వ్యక్తికి ఉన్న తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు మరొకరికి మామగారు అవ్వవచ్చును అత్తగారు కావచ్చును. కానీ వారసుడు చుట్టూనే ఈ తల్లిదండ్రుల బంధం పెనవేసుకుని ఉంటుంది. వ్యక్తికి ఉండే తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారసత్వంగా ఆస్తిని ఆచారాన్ని అందిస్తారు. వారిని వీరు చూస్తున్నంతకాలం వృద్దులకు కూడా కుటుంబంలో పిల్లలవలె అనిపిస్తారు. పిల్లలను చిన్ననాటి…
-
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం వ్రాయమంటే, ఆర్ధికపరమైన పొదుపు గురించి, నీటి పొదుపు గురించి, విద్యుత్ వాడుకలో పొదుపు గురించి, మోటారు వాహన వాడుకలో పొదుపు గురించి ఇలా వివిధ అంశములలో పొదుపు గురించి తెలుసుకోవడం వలన ఆర్ధిక ప్రయోజనాలు మరియు సామాజిక ప్రయోజనలు ఉంటాయని అంటారు. ముందుగా పొదుపు అంటే ఏమిటి అంటే, తగు పాళ్ళల్లో వాడుక. తగినంతగా ఉపయోగించుట. తగు సమయంలో ముగించుట… అంటే డబ్బు విషయానికొస్తే, ధనం విరవిగా ఖర్చు చేయకుండా ఎంత…
-
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో అంటే చాలా సులభం అంటారు. వ్యాసం రాయడం ద్వారా ఒక విషయం గురించి సవివరంగా తెలియజేయవచ్చు. ఒక వస్తువు వాడుక విధానం వ్యాస రూపంలో అందించవచ్చు. ఒక సేవ యొక్క లక్ష్యం వ్యాసం ద్వారా తెలియజేయవచ్చు. ఇలా వ్యాసం రాయడం ద్వారా కూడా డబ్బు సంపాదన చేయవచ్చు. ఇంకా ఇతర భాషలలో కూడా వ్యాసం (ఆర్టికల్) వ్రాయగలిగితే మరింత ఆదాయం గడించవచ్చు. నేటి రోజులలో అనేక విషయాల గురించి ప్రచారం అవసరం అవుతుంది. ఒక కొత్త వస్తువు వస్తే, దాని వాడుక విధానం తెలిపే వ్యాసాలు అవసరం అవుతాయి. ఒక కొత్త సినిమా విడుదల అయితే ఆ సినిమా గురించి విశ్లేషణను కూడా ఒక వ్యాసం ద్వారా వివరించవచ్చు. రాజకీయ నాయకుడి గుణగణాలు, వారి సేవానిరతి గురించి ప్రజలకు తెలియడానికి కూడా వ్యాసం ఉపయోగపడుతుంది. సేవా సంస్థల గురించి, వాటి కార్యకలాపాల గురించి విపులంగా తెలియజేయడానికి వ్యాసం అవసరం అవుతుంది. సామజిక సమస్యల గురించి వ్యాసాల ద్వారా ప్రజలలో ప్రచారం కల్పించవచ్చు. ప్రజలలో సామజిక స్పృహ పెరిగేలా వ్యాసాల ద్వారా ప్రజలలో అవగాహనా తీసుకురావచ్చు… సామజిక అసమానతలు ఉంటె, వాటిపై విశ్లేషణలతో వ్యాసం ద్వారా వివరించవచ్చు.. ఇలా వ్యాసాలు వివిధ అంశాలలో వివిధ రంగాలలో వివిధ విషయాల గురించి విశ్లేషిస్తూ అర్ధవంతంగా తెలియజేయడానికి ఉపయోగపడతాయి… అలా అర్ధవంతమైన వ్యాస రచన చేయగలిగినవారికి ఆర్ధిక సంపాదన కూడా ఉంటుంది. ఎలా వ్యాసాలు ద్వారా డబ్బు సంపాదన ప్రసిద్ది చెందిన వార్త పత్రికలకు కధనాలు వ్రాస్తూ సంపాదించవచ్చు. టీవీ చానల్స్ లో కధనాలు వ్రాయవచ్చు. ఏదైనా ప్రసిద్ది చెందిన వెబ్ సైట్ కు వ్యాసాలు రాస్తూ డబ్బు సంపాదించవచ్చు. లేదా మీకు మీరే ఒక బ్లాగు సృష్టించుకుని అందులో వ్యాసాలు వ్రాస్తూ ఉండవచ్చు… ఇలా వ్యాసం రాయడం బాగా వస్తే, మంచి మంచి వ్యాసాలు వ్రాస్తూ కీర్తి గడించవచ్చు. అయితే ఇలాంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు వాస్తవికతకు దూరంగా కల్పన ఉండకూడదు. వాస్తవికతను ప్రస్తావిస్తూ ఊహాత్మక విశ్లేషణ వ్యాసంలో అవసరం అంటారు. పుస్తకాలూ చదివే సమయంలోనే మనసుకు ఊహాశక్తి అలవరుతుంది. ఊహాశక్తికి అక్షరరూపం ఇస్తూ అది అర్ధవంతంగా చెప్పగలిగితే అది వ్యాసం అవుతుందని అంటారు. అయితే అది విపులంగా విశ్లేషణతో ఉండాలి. ఇంకా కల్పిత కదల బ్లాగు సృష్టించుకుని చక్కటి కధలు ఆకట్టుకునే విధంగా వ్రాయగలిగితే, అటువంటి బ్లాగు కూడా సంపదను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అనుకరణ వ్యాసం కన్నా అలోచించి విషయాన్నీ సరిగ్గా విశ్లేషించగలగాలి. డబ్బు సంపాదన మార్గాలు…
-
బమ్మెర పోతన గురించి రాయండి
తెలుగులో బమ్మెర పోతన గురించి రాయండి. ఈయనను బమ్మెర పోతనామాత్యులుగా పండితులు ఎక్కువగా సంభోదిస్తూ ఉంటారు. పోతనామాత్యులు గారికి సహజ పండితుడు అను బిరుదు కూడా కలదు. ఈయన రచించిన భాగవతం కాసుల కోసమని రాజులకు అంకితం ఇవ్వలేదు.. తన మనసంరాజ్జ్యంలో కొలువై ఉన్న రాముడికే అంకితమిచ్చాడు. ఎటువంటి ప్రలోభాలకు కానీ బెదిరింపులకు కానీ లొంగలేదు… ఈ రామభక్తుడు. బమ్మెర పోతరాజు పోతనగా బాగా పరిచయం కలిగిన పేరు. కారణం ఈయన రచించిన శ్రీమద్భాగవతం భక్తులపాలిట కల్పవృక్షం. అయితే ఈ భాగవతం సంస్కృతంలో వ్యాసుడు రచించాడు. ఆ సంస్కృతంలో ఉన్న భాగవతం తెలుగులో తెలుగువారికి అందించాలనే శ్రీరాముడు తలంపును పోతన స్వీకరించాడు. సహజ పాండిత్యం కలిగిన పోతనామాత్యులు భాగవత అనువాదం తెలుగులో రచన చేసారు. ఈయన రచించిన భాగవతంలో పద్యాలూ ఎప్పటికి భక్తుల పాలిట కల్పవృక్షమే అంటారు. ఎందుకంటే ఈయన రచించిన భాగవతం అప్పటి సాదారణ వాడుక భాషలో వాడె పదప్రయోగాలూ ఎక్కువ అని అంటారు. “అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బెద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్….” “ఇందు గలఁ డందు లేఁ డనిసందేహము…
-
ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా
ఒకప్పుడు ఇప్పుడు మరొకప్పుడు ఎప్పుడైనా అవగాహన ఉన్నవారికి, తాము ఏమి చేస్తున్నామో ప్రణాళిక ఉంటుంది. ఏమి చేయాలో సరైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒకప్పుడు అవగాహనా విధానం కుటుంబంలో పిల్లలు ఎదుగుతున్నప్పుడే ఏర్పడుతూ ఉండేది… ఎందుకంటే కుటుంబ పెద్దలలో సరైన అవగాహన ఉండేది. ఇప్పుడు అవగాహన లోపించిన కుటుంబం ఉంటే, ఆ కుటుంబంలో ఎదుగుతున్న పిల్లల్లో అవగాహన కంటే ఆందోళన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవగాహన లేని బంధం మద్యలో ఆందోళనకరమైన స్థితి ఉంటుంది….…
-
ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం
ఆరోగ్యకరమైన ఆలోచన విజయానికి సుమార్గం. ఆరోగ్యకరమైన ఆలోచన ఉన్నత శిఖరాలకు విశిష్టమైన వారధి. తక్కువ ఆలోచన చేసే ఎక్కువపని చేసే శక్తి కలిగి ఉంటే, సవ్యదిశలో ఆలోచించేవారు సక్రమ పనివిధానం కలిగి ఉంటే, మంచి ఆలోచన చేసేవారు మంచి పనులే చేస్తారు. మంచి పనులే మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తాయి. మనిషికి సహజంగా వచ్చేది ఆలోచన. ఏదో ఒక అంశంలో దీర్ఘ ఆలోచనలు కలిగి ఉండడం ఉంటుంది. అలాగే రోజువారీ స్థితిలో ఎలా ప్రవర్తించాలో కొంత ఆలోచన…
-
నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై
నీ చుట్టూ ఉన్న పరిసరాలలో కనిపించే బాలకార్మిక వ్యవస్థపై వ్యాసం రాయండి. అంతంత మాత్రంగా ఉండే కుటుంబ ఆర్ధిక పరిస్థితుల రిత్యా చిన్న వయస్సులోనే కార్మికులుగా మారే బాలలు ఉండడం సమాజం యొక్క దురదృష్టకం. అంతర్జాతీయ కార్మిక నిర్వహణ వ్యవస్థ యొక్క సర్వేలో లక్షలాది బాల కార్మికులు ఉన్నారని తేలడం వలన ఈ విషయం తేటతెల్లం అవుతుంది. ఇంకా గమనిస్తే చుట్టూ ఉన్న పరిసరాలలో బాల కార్మికులు కనబడుతునే ఉంటారు. బడికిపోయి చదువుకోవలసిన బాలలు హోటల్లలో పని…
-
అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి?
అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి? అధిక్షేపం ఆక్షేపించడం అంటారు. అంటే ఒక విషయంలో ఉన్న లోపామును అర్ధవంతంగా వివరణగా విశదీకరించడం అంటారు. పరిపాలనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సమాజంలో ఉన్న మేధావులకు ఆ చట్టాలు లోపభూయిష్టంగా అనిపిస్తే, వాటిపై ఆక్షేపణలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ చట్టం యొక్క ఉద్దేశం, ఆ చట్టం యొక్క ప్రభావం, ఆ చట్టం అమలు అయితే వచ్చే దుష్ఫలితలను తెలియజేస్తూ విశ్లేషణలు వ్యక్తం చేస్తూ…
-
ఇంటి నుంచే ఓటు ఈఓట్
ఇంటి నుంచే ఓటు ఈఓట్ తెలుగులో వ్యాసం. ఇంటి నుండే ఓటు వేసే అవకాశం ఉంటే ఎలా ఉండవచ్చు. ముందుగా ఇంటి ఉంచే ఓటు వేయడం అంటే ఎలా సాధ్యం అనుకుంటే… స్మార్ట్ ఫోన్ ద్వారా అది సాద్యపడుతుంది. నిర్దేశించబడిన మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులో వివరాలు నమోదు చేసుకోవడం మరియు వివరాలు తనికీ చేయబడిన తరువాత ఈఓట్ వేసే విధంగా ఉంటుంది. ఇప్పటికే ఈఓట్ విధానం అభివృద్ది జరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈఓట్…
-
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు తెలుగు వ్యాసం. ఆర్ధికపరమైన స్థితి బాగుంటే సమాజంలో గౌరవం బాగుంటుంది. సమాజంలో గౌరవం తనకు తనని నమ్ముకున్నవారికి రక్షగా ఉంటుంది. కబటి ఆర్ధిక అభివృద్ది కోసం చూసినప్పుడు నగరాలలో ఎక్కువగా ఉంటుంది. అధిక జనాభా, ఎక్కువ అవసరాలు, తీరిక లేని జనులకు సేవలు, ఆర్ధిక స్థితి మెరుగుపర్చుకోవడానికి నగర జీవనంలో అవకాశాలు ఎక్కువ… ఇదే ప్రధానమైన అనుకూల అంశం… మిగిలినవన్నీ దీనికి అనుకూలంగా ఉంటాయి. నగరంలో నివసించేవారికి ఆర్ధిక…
-
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం
నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను విశ్లేషిస్తూ తెలుగులో వ్యాసం. స్త్రీని అబల కాదు సబల అని నిరూపించుకుంటున్న నేటి సమాజంలో కూడా స్త్రీ ఇంకా సమస్యలను ఎదుర్కోవడం దురదృష్టకరం అంటారు. అమ్మ అయ్యే అమ్మాయి అయినా అమ్మ అయిన అమ్మాయి అయినా ఒక్క జీవితభాగస్వామికి తప్ప మిగిలినవారికి అమ్మవంటిదే… ఇదే మన సంప్రదాయం అని పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి దృష్టితో పురుషులు ఉండడం స్త్రీలకు మరియు సమాజనికి శ్రేయస్కరం అంటారు. విమానం నడిపే మగవారికి…
-
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత
నేటి బాల బాలికలే రేపటి భావి భారత యువత తెలుగు వ్యాసం. బడికిపోయి చదువుకునే పిల్లలు, పనిని పరిశీలించే పిల్లలు, తండ్రిని అనుసరించే పిల్లలు, చదువుకోని పిల్లలు, వ్యతిరేకించే పిల్లలు… రకరకాల స్వభావాలతో పెరుగుతున్న పిల్లలే రేపటి యువత. కొందరు బాల బాలికలు సహజంగా చదువుకోవడానికి సుముఖంగా ఉంటే, కొందరు బాల బాలికలు చదువుకోవడం కన్నా ఏదో నేర్చుకునే ప్రయత్నంలో ఆసక్తి ఎక్కువగా కనబరుస్తారు. కొందరు బాల బాలికలు ఖాళీగా తిరగడానికి ఆసక్తి చూపవచ్చు… కానీ తల్లిదండ్రుల…
-
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి.
కాలుష్యంతో నిండిపోతున్న నేటి నగర వాతావరణాన్ని గురించి వ్యాసం రాయండి. ఈ వ్యాసం చదివే ముందు… ఈ క్రింది పేరా చదివి అర్ధం చేసుకోండీ… ఆపై వ్యాసం చదవండి. వాటర్ తో నింపిన ఒక పావులీటర్ పరిమాణం గల గాజు గ్లాసులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. అలాగే ఒకే 20 లీటర్ల వాటర్ గల క్యానులో ఒక టీ స్పూన్ మట్టి వేయండి. ఆ తర్వాత రెండూ చూస్తే, పావులీటర్ పరిమాణం గల గాజు…
-
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి ?
డబ్బు ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? అలాగే కాలం ఖర్చు చేసి ఏమిటి చేస్తున్నాం? వస్తువు కోసం డబ్బు ఖర్చు చేస్తే, మరి కాలం దేని కోసం ఖర్చు చేస్తున్నాం? తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేసి వస్తువు కొనుగోలు చేసే హక్కు ఆ డబ్బు సంపాదించినవారికే ఉంటుంది. మరి కాలం ఖర్చు చేసేవారికి ఆ కాలం ఎలా వచ్చింది? మనకున్న పరిమితమైన కాలం మనకు ఎలా వచ్చింది? ఈ ప్రశ్న పుడితే, కాలం విలువ…
-
పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి
పరిశీలన పురోగతికి పునాది అయితే ఎలాంటి విషయాలు మనిషి చుట్టూ ఉంటే, అలాంటి ప్రభావం మనిషిపై ఉంటే, మనిషి చుట్టూ వెలుగు నీడల మాదిరి మంచి చెడులు ఉంటాయి. గుడిలో దైవం గురించి ఆలోచనలు పెరిగిన మనిషికి, ఆ గుడిలో గోవిందుడి గురించే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. మనసు గోవిందుడి లీలలపై ఆసక్తి పెంచుకుంటుంది. గుడిలో విగ్రహంపై ఉన్న పరిశీలన దృష్టి, ఆ కదలని గోవిందుడి గురించి ఆలోచనలు కలిగే విధంగా ప్రభావం చూపుతుంది. భక్తి పురోగతికి…
-
లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం.
లోక దర్శినితో విషయ విజ్ఞానం తెలుగులో వ్యాసం. ఒకప్పుడు ప్రపంచం చుట్టి వచ్చినవారి ద్వారా లోకంలో జరిగే విషయాలు తెలియబడుతూ ఉండేవట. కానీ ఇప్పుడు అరచేతిలో మొబైల్ ఉంటే లోకం మొత్తం దర్శించే అవకాశం ఉంది. ఇక లోకం గురించి తెలియనిదేముంది? ఎక్కెడెక్కడో జరిగినవి, జరిగేవి, జరుగుతున్నవి… అప్పటికప్పుడు ఉన్న చోట నుండే తెలుసుకునే సౌకర్యం మొబైల్ వలన ఏర్పడుతుంది. స్మార్ట్ మొబైల్ అయితే లోకంలో జరుగుతున్న విషయాలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇలా మొబైల్ ఒక లోక…
-
మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం
మన మొబైల్లో సెర్చ్ హిస్టరీ ప్రభావం తెలుగు వ్యాసం విషయ విజ్ఞానం వలన పరిజ్ఞానం పెరుగుతుంది. ఎటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటే, అటువంటి పరిజ్ఞానం పెరుగుతుంది అంటారు. ఎటువంటి విషయాలు మన మొబైల్లో వెతుకుతూ ఉంటే, అటువంటి విషయాలతో కూడిన సెర్చ్ హిస్టరీ మన మొబైల్లోని గూగుల్ ఖాతాకు జోడించబడుతూ ఉంటుంది. ఎందుకు మొబైల్ ద్వారా మంచి విషయాలపై ఆసక్తి పెంచుకోవాలి? మొబైల్ ద్వారా మంచి విషయాలు తెలుసుకోవడం వలన అవే విషయాలు మొబైల్ హిస్టరీగా ఉండి,…
-
విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం
విజ్ఞాన విహార యాత్రలు తెలుగులో వ్యాసం. వ్యాసాలు విషయాలను విపులంగా విశదీకరిస్తాయి…. వచన రూపంలో ఉండే విషయాలు తెలుసుకోవడంతో బాటు వాటి గురించి బౌతిక పరిచయం కావడం వలన మనసుకి విషయ విజ్ఞానము వృద్ది చెందుతుంది. విజ్ఞానయాత్రలు చేయడం వలన లోకజ్ఙానం వస్తుంది. ప్రత్యేక స్థలాలకు ప్రయాణం చేయడానికి ఆసక్తి ఉంటుంది, అటువంటి ఆసక్తి చేత విజ్ఙానయాత్రలలో వినోదంతో బాటు విజ్ఙానం కూడా సంపాదించవచ్చును. పుస్తకపఠం చేత విషయ జ్ఙానం లభిస్తే, విజ్ఙానయాత్రలు వలన విజ్ఙానంతో బాటు…
-
కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం
ఆధునిక కాలంలో కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం. వ్యక్తి జీవన విధానంలో వేగవంతమైన పోటీ పెరగడానికి కంప్యూటర్ కూడా కారణం కావచ్చు. వివిధ రూపాలలో కంప్యూటర్ లభిస్తుంది. ముఖ్యంగా అద్భుతమైన సదుపాయాలతో ఆకట్టుకునే ఫీచర్లతో వివిధ పరిణామలలో కంప్యూటర్ లభిస్తుంది. ముఖ్యంగా పనులు వేగవంతం కావడానికి కంప్యూటర్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాంటి కంప్యూటర్ ను వేగంగా ఉపయోగించే నిపుణుల మధ్య పోటీ… అలాంటి కంప్యూటర్ పరికరాలను మరింత శక్తివంతంగా రూపొందించడంలో వ్యవస్థల మధ్య పోటీ… ఇలా సమాజంలో…