Tag Archives: తెలుగులో వ్యాసం

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా ఉండవలసిన అవసరం రోజు రోజుకి పెరుగుతుంది.

పేమెంట్స్ చేయడం, మెసేజులు రీడ్ చేయడం, గేమ్స్ ఆడడం ఇలా రకరకాలుగా ఫోనుపై ఆధారపడడం జరుగుతుంది. అవసరానికి స్మార్ట్ ఫోన్ వినియోగించడం తప్పదు కానీ అనవసరంగా ఫోను టచ్ చేయడానికి అలవాటు పడితే….

టచ్ చేసి చూడు మెసేజ్ చదువు, టచ్ చేసి చూడు న్యూస్ చదువు, టచ్ చేసి చూడు సినిమా చూడు, టచ్ చేసి చూడు, వీడియో వాచ్ చేయి, టచ్ చేసి చూడు గేమ్ ఆడు, టచ్ చేసి చూడు ఏదైనా చేయి… ఫోను ఒత్తుతూ ఫోనులో లీనమవుతూ, పరిసరాలు కూడా పట్టించుకోని పరిస్థితి ఏర్పడుతుందా?

అవును స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక సమాజంలో అందరి తీరు మారుతుంది. పలకరింపులతో కబుర్లు చెప్పుకునే స్థానంలో ఫోనులో సందేశాలు చూస్తూ కాలక్షేపం చేసే కాలం వచ్చింది.

ఫోను టచ్ చేయడం ఫ్రెండ్ పంపిన సందేశం చదవడం… ఇక గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ అయితే…. వారి సందేశాల కోసం వేచి చూడడం… యువతలో ఈ పాషన్ వస్తుంది. టచ్ చేయడం సోషల్ మీడియాలో ప్రవేశించడం. టచ్ చేసి లైక్ చేయడం, టచ్ చేసి కామెంట్ చేయడం… ఇలా ఫోన్ టచ్ చేయడం చేతికి ఒక అలవాటుగా అవుతుంది.

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా మరి అది అలవాటుగా మారుతుంది.

స్మార్ట్ ఫోన్ టచ్ చేసి చూడడం వీడియో బ్రౌజింగ్ చేయడం. పేపర్ చదివే అలవాటు ఉన్నావారు కుడా వార్తల వీడియోలు చూడడానికి అలవాటు పడుతున్నారు. పేపర్ అయితే చదివి అర్ధం చేసుకుని మైండును కొంచెం కష్టపెట్టాలి. అలా కాకుండా కేవలం ఒకసారి టచ్ చేసి చూసి అనేక వార్తా వీడియోలను బ్రౌజ్ చేయవచ్చు.

ఫ్రెండ్ సందేశాల కోసం, నచ్చిన అంశంలో వీడియోల కోసం, నచ్చిన గేమ్స్ ఆడటం కోసం టచ్ ఫోన్ టచ్ చేస్తూ… చేస్తూ… అదే అలవాటుగా మారుతూ… అనుకోకుండా ఫోన్ టచ్ చేస్తూ ఉండడం కూడా జరిగే అవకాశం లేకపోలేదు. అంతలా స్మార్ట్ ఫోన్ మనిషిపై ప్రభావం చూపుతుంది.

అనుక్షణం ఎదో వ్రాస్తూ ఉండేవారికి, మాట మాటకు జేబులో పెన్ను తీయడం అలవాటు అయ్యినట్టు… టచ్ చేసి చూస్తూ చూస్తూ… ఫోన్ టచ్ చేయడం ఒక అలవాటు అయినా ఆశ్చర్యపడక్కర్లేదు.

అందరికీ ఎదో అలవాటు ఉంటుంది. పుస్తకాలు ఎక్కువగా చదివే వారిని చూసి, అలంటి వారిని ఎక్కువమంది పట్టించుకోరు. ఎందుకంటే పుస్తకాలు అదేపనిగా చదివేవారికి లోకంతో కన్న పుస్తకంలో అంశాలే మైండుపై ప్రభావం చూపుతాయి. వారి లోకం వారిది అన్నట్టుగా ఉంటే, మరి స్మార్ట్ ఫోన్ అదే పనిగా వాడేవారి స్థితి?

కొందరికి అతి ఆహారం అలవాటుగా ఉంటుంది. సాదారణంగా భోజనం మనిషికి బలమైతే, అతిగా తినడం అనారోగ్యానికి కారణం కాగలదు. అలాగే అవసరానికి, కాసేపు కాలక్షేపానికి స్మార్ట్ ఫోన్ అవసరం కానీ అదే పనిగా దానితో లీనమవ్వడం కొరకు కాదు.

అలవాటుగా మారుతున్న స్మార్ట్ ఫోను వ్యసనంగా మారకూడదు అంటే ఏం చేయాలి?

ఏదైనా అలవాటు వ్యసనంగా మారకూడదు అంటే, ముందుగా ఆ అలవాటును గుర్తించాలి. ఆ అలవాటు వలన కలిగిన నష్టం ఏమిటో ప్రధానంగా గుర్తించాలి.

అలవాటు తాత్కాలికంగా మనసుకి ప్రియంగా ఉంటుంది కానీ దీర్ఘ కాలంలో అది నష్టమే అవుతుంది.

ఫోనులో కనబడే అనేక అంశాలలో అనేక విషయాలు ఆకట్టుకునే ప్రక్రియలో ప్రయత్నం చేస్తుంటాయి.

స్మార్ట్ ఫోనులో ఉపయుక్తమైనవి ఉంటాయి… అలాగే కేవలం ఆకట్టుకునేవి మాత్రమే ఉంటాయి. ఉపయోగపడనివి ఉంటాయి.

ఉపయోగపడే విషయాలు అంటే సమయానికి నడుస్తున్న పనికి సహాయకారిగా ఉండేవి. అంటే…

పేటియం కెవైసి చేయడం ఎలా? అని సెర్చ్ చేస్తే, పేటియం కెవైసి చేయడం పూర్తిగా వివరించే పోస్టులు, వీడియోలతో బాటు… ఇతర విషయాలు స్మార్ట్ ఫోను స్క్రీనుపై ప్రదర్శితం అవుతాయి. ఇందులో పేటియం కెవైసి గురించి పూర్తి వివరణ ఉన్న వీడియో ఉపయోగకరం.

అలాగే మనకు అవసరం మేరకు సహాయపడే విషయ సూచన మనకు ఉపయోగం సమయం సేవ్ అవుతుంది.

ఆకట్టుకునే విషయాలు మాత్రం మరింత ఆకర్షణీయంగా మారుతూ మనసుని ఆకట్టుకునే ఉంటాయి… మన సమయం ఖర్చు అవుతూ ఉంటుంది.

ఇదే గుర్తించాలి… మన టచ్ చేస్తూ…. చేస్తూ... బ్రౌజ్ చేస్తున్న విషయాలు వలన ఏమిటి తెలియబడుతుంది. అక్కడ అప్పుడు తెలియబడే అంశం చాలా చాలా మార్గాలలో చేరుతూనే ఉంటుంది.

ఒక సినిమా చూడాలి అంటే అది థియేటర్లో చూడవచ్చు. టి‌విలో చూడవచ్చు. కంప్యూటర్లో చూడవచ్చు. లాప్ టాప్లో చూడవచ్చు. చివరికి స్మార్ట్ ఫోనులో కూడా చూడవచ్చు. అంటే ఒక సినిమా చూడదగిన మార్గాలు ఉన్నట్టే మిగిలిన విషయాలలో కూడా మార్గాలు ఉంటాయి.

అలాంటి సినిమాలు ఫోనులోనే చూడడం తగ్గించాలి.

ఫోనులో గేమ్స్ ఆడుట అలవాటుగా

ఇక గేమ్స్ చాలా చాలా మందిని ఫోనుకి అలవాటు చేసేస్తూ ఉంటాయి. ఇదే చాలా పెద్ద సమస్య అంటారు. ఎందుకంటే యువత ఎక్కువగా గేమ్స్ వైపు వెళుతూ ఉంటారు.

బౌతికంగా గేమ్స్ అడితే అది శారీరక శ్రమ ఉంటుంది. అలసిన శరీరం మంచి నిద్రకు ఉపక్రమిస్తుంది. ముఖ్యంగా ఎదిగే వయసులో ఆటలు ప్రధానంగా ఉంటాయి.

కానీ అటువంటి ఆటలు ఫోనులో ఆడుతూ సమయం వృధా చేసుకోవడమే పెద్ద సమస్యగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఫోనులో ఆటలు ఆడుతూ ఉంటే, ఫోన్ చార్జింగ్ అయిపోతే విసుగు… ఫోనులో నెట్ బాలన్స్ లేకపోతే విసుగు… ఇలాంటి విసుగు ఫోనులో గేమ్స్ అదే పనిగా ఆడుతూ ఉంటే వస్తుందని అంటారు.

అదే బౌతికంగా ఆడే శరీరం అలసేవరకు సాగితే, ఫోనులో గేమ్స్ మనసు అలసేవరకు సాగుతూనే ఉంటాయి. మనసుకు అంతు ఎక్కడ ఉంటుంది? విసుగు ఉంటుంది, చిరాకు ఉంటుంది…

కాబట్టి మనసు ఎటు వెళ్తుందో గమనించకపోతే, అది చేటు చేస్తుంది.

అంతులేని మనసుకు, అంతుబట్టని గేమ్స్ ఫోనులో టచ్ చేస్తూ ఆదుకోవడం, అంతులేని సీరియల్స్ ఫోనులో టచ్ చేసి చూడడం అలవాటు చేయడం… మన వేలుతో మన కన్ను పొడుచుకోవడమే…

పరిమితులు ఎక్కడ ఉంటాయో అక్కడ మనసు లొంగడం మొదలవుతుంది.

స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడుతూ… ఈ మనసేమిటి అనుకోవద్దు… కారణం మనసును తరిచి చూస్తే దానికి అంతు ఉండనట్టే, ఫోనులో కనబడే విషయాలు, మన ఫోను హిస్టరీకి అంతు ఉండదు… రెంటికీ పోలిక ఉంటుంది.

మనసుకు ముందు సక్రమమైన పరిమితులతో కూడిన పనిని చేయడం.

ఎక్కడ పరిమితులతో కూడిన పనులు నియంత్రించబడుతు ఉంతాయో అక్కడ పనిచేసేవారికి పరిమితులకు లోబడి పని చేయడం అలవాటు ఉంటుంది.

మరి పిల్లలకు పరిమితులు ఎక్కడ ఉంటాయి? అంటే మంచి కుటుంబంలో పెద్దల మద్య పెరిగే పిల్లలకు పరిమితులలో ఉండడం అలవాటు అవుతుంది.

కొందరికి స్కూల్ వాతావరణంలో పరిమితులు బాగా ఉపయోగపడతాయి. ఎదిగే వయసులో మనసు విచ్చలవిడిగా వెళ్ళకుండా పరిమితులు ఉంటాయి.

పిల్లల మనసు గాయపడకుండా పరిమితులు విధిస్తూ, మంచి విషయాలు తెలిసేలా చేయడం పెద్దల బాద్యత…

స్మార్ట్ ఫోన్ వినియోగించడంలో స్కూల్ పిల్లలు కూడా చేరుతున్నారు. కరోనా కరనంగా ఆన్లైన్ క్లాసులు వలన పిల్లలకు ఫోన్ అందుబాటులోకి వస్తుంది.

పిల్లలు కూడా తప్పకుండా ఫోన్ వాడవలసిన స్థితి సమాజంలో ఏర్పడుతుంది. కాబట్టి ఫోనులో పిల్లలు తప్పు విషయాల వైపు మరలకుండా పెద్దలు, వ్యవస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

స్మార్ట్ ఫోన్ టచ్ చేయడమే పనిగా పెట్టుకునే వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

అదే అలవాటుగా మారకుండా జాగ్రత్త పడాలి.


మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు మనుషులంతా ఒక్కటిగానే స్పందిస్తారు. అది ప్రాణాపాయ సమస్య కావచ్చు. సామాజిక విద్రోహ చర్యలు జరిగినప్పుడు కావచ్చు.

అలా ఒక ప్రాంతంలో మనుషులంతా ఒక్కటిగా స్పందించడం సమైఖ్యతగా కనబడుతుంది. అలాంటి ఉదాహరణ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఒక్కటైనారు. సమిష్టిగా తెలంగాణ సాదనకు ప్రజలు సహకరించారు.

అంటే ఇక్కడ ఎంత ఎక్కువమంది ఒకే విషయంలో ఒకే అభిప్రాయం కలిగి ఉంటే, ఆ అభిప్రాయం శాసనంగా మారగలదు. దీనినే సమైఖ్యతా కృషి ఫలితం అంటారు.

ఇటువంటి ఫలితాలు దేశమంతా రావాలంటే, దేశం కోసం జాతీయత భావనను కలిగి ఉండి, అందుకు సమైఖ్యతా దృష్టి అందరిలోనూ ఉండాలి.

ఎందుకోసం జాతీయతా సమైఖ్యభావన అవసరం అంటే?

ప్రపంచం అంతటా వివిధ దేశాలు, వివిధ సంస్కృతులు కలసి ఉంటే, ఒక దేశంలో ఒక సంస్కృతి అన్నట్టుగా ప్రపంచ దేశాలు ఉంటాయి. కానీ మన దేశం భిన్న మతాలు, భిన్న సంస్కృతులతో కూడి ఉంటుంది. అదే మన దేశం యొక్క గొప్పతనంగా ప్రపంచం భావిస్తుంది.

అయితే ఇటువంటి భిన్న స్వభావాల మధ్య జాతీయత సమస్య వచ్చినప్పుడు ఒకే విధంగా స్పందిస్తూ భరతజాతి మొత్తం ఒకే విధంగా స్పందిస్తూ ఉంటుంది. మనదేశంలో ఇది మరొక గొప్ప విశయంగా పరిగణింపబడుతుంది.

అయితే రాజకీయ స్వార్ధపరుల వలన సమైఖ్యతా భావన లేనట్టుగా కనబడుతుంది… కానీ భారతీయులంతా భారతదేశమంటే ఒక్కటే అనే భావన బలంగా ఉంటుంది.

భారతీయుల అందరిలో జాతీయ సమైఖ్యత

ఈ విషయం జనతా కర్ఫ్యూ పాటించడంలో ప్రస్పుటం అయ్యింది. దేశ ప్రధాని పిలుపుకు యవజ్జాతి అంతా సంఘీభావం తెలియజేస్తూ… జనతా కర్ఫ్యూ విజయవంతం చేశారు. ఇది మన జాతీయ సమైఖ్యత దృష్టికి నిదర్శనం. ఇది మన మనోభావావేశ బలం.

జాతీయ సమైఖ్యత భావం మతపరంగా చూసినప్పుడు వేరుగా కనబడవచ్చు. కానీ భారతీయులమనే భావన దానిని కూడా ప్రక్కకు నెడుతుంది.

అలాగే కొన్ని ప్రాంతీయ భావజాలం దగ్గర కూడా జాతీయ సమైఖ్యత కొరవడినట్టుగా కనబడ్డా, అది కూడా భరతమాత బిడ్డలమనే భావన ముందు తేలిపోతుంది.

మన భారతీయుల అందరిలోనూ జాతీయ సమైఖ్యత భావన బలంగా ఉంది.

అప్పుడప్పుడు రాజకీయ కారణాల చేతనో లేక మతపరమైన సంఘటనల కారణంగానో ఏర్పడే భావజాలమునకు ప్రభావితం కావడం జరుగుతూ ఉంటుంది.

ఇటువంటి విషయాలలో కారణాంతరాలను చూస్తూ, వాస్తవిక దృష్టిని పరిశీలన చేయాలి. లేకపోతే సమాజాన్ని తప్పుదోవ పట్టించేవారిని అనుసరిస్తే, పాడయ్యేది మనమే అని గుర్తించాలి.

ఆర్ధిక పురోగతి సాధించాలంటే అందరూ కష్టపడుతూ ఉండాలి. సమాజం శాంతిగా ఉండాలంటే అనవసరపు విషయాలకు ప్రాధాన్యతను తగ్గించాలి.

మనమంతా ఒక్కటే అనే భావన మనిషి మనసులో శాంతిని సృష్టించగలదు. వేరు అనుభావన మనసులో అలజడి సృష్టించగలదు. కాబట్టి ఎప్పుడు భారతీయులమనే భావనే మనకు బలం. మన జాతీయ సమైఖ్యత మన కోసం మన దేశం కోసం….

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం… దూరం నుండి ప్రసారల అయ్యే చలన చిత్రములను దర్శనం చేయించే పరికరం. దీనినే టి‌వి అని అంటారు.

టి‌వి ఫుల్ ఫార్మ్ టెలీవిజన్ అంటారు. దీని ద్వారా ఇంట్లో కూర్చొని సినిమాలు, వార్తలు, దారవాహిక కార్యక్రమములు, ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చును.

కుటుంబంలో దూరదర్శిని ఒక భాగమై కూర్చుంది.

శాటిలైట్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమములను చలనచిత్ర రూపంలో దూరదర్శిని మనకు దర్శింపజేస్తుంది. అందుకే దీనిని దూరదర్శనీ అంటారు.

రేడియోలో అయితే కేవలం శబ్ధ రూపంలో మాటలు వినగలం కానీ టి‌విలో అయితే శబ్దరూపంలోను చలనచిత్ర రూపంలోనూ కార్యక్రమములు వీక్షించవచ్చును.

దూరదర్శిని కనిపెట్టే ప్రయోగం 1883 నుండి ప్రారంభం అయితే, 1925 లో ఒక చిత్రం మరొక రూమ్లో ఉన్న రిసీవర్ ద్వారా ప్రసారం చేయడం జరిగింది.

1946లో బ్లాక్ అండ్ వైట్ దూరదర్శిని ప్రసారాలు జరిగాయి. అటు తర్వాత కలర్ టి‌విలు కూడా రావడం విశేషంగా ప్రజాధరణ పొందడం జరిగింది.

ఈవిధంగా రంగుల దూరదర్శిని మనిషి జీవితంలో ప్రతి కుటుంబంలో భాగమై ఉంది.

ప్రతి వ్యక్తి కుటుంబంలోకి వచ్చిన టి‌విలలో మొత్తం ప్రాపంచిక విషయాలు చలనచిత్ర రూపంలో దర్శనం ఇస్తున్నాయి.

వివిధ రకాల చానల్స్ ద్వారా వివిధ రకాల కార్యక్రమములు, ప్రత్యక్ష ప్రసారాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి.

వార్తా ఛానళ్ళు, క్రీడా ఛానళ్ళు, సినిమా ఛానళ్ళు, భక్తి ఛానళ్ళు, వ్యాపార వర్తక ఛానళ్ళు ఇలా ప్రాచుర్యం పొందిన ప్రతి రంగానికి చానల్ రావడం సాదారణం అయింది.

సమాజంలో ఏమూల ఏం జరిగినా ప్రజల ముందుకు తీసుకువచ్చే ఛానళ్ళు అనేకంగా ప్రాంతాలవారీగా ఉన్నాయి. వీటికి తోడు జాతీయ, అంతర్జాతీయ ఛానళ్ళు సర్వసాధారణం.

ఇంట్లోనే కూర్చుని ప్రాపంచిక విషయాలు తెలుసుకోవచ్చు. అలా టి‌వి ప్రజల జీవితమలో మమేకం అయ్యింది.

దూరదర్శిని ప్రధాన ప్రయోజనాలు

దూరదర్శిని ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే ముఖ్యంగా వినోదభరిత కార్యక్రమములు ఇంట్లోనే వీక్షించవచ్చు.

అలాగే ప్రపంచంలో జరిగే వివిధ విషయాలు తెలుసుకోవచ్చు.

సమాజంలో ఉండే పోకడలు దూరదర్శిని ద్వారా వీక్షించవచ్చు.

విజ్ఞానమును పెంపొందించుకోవడంలో కూడా టి‌వి ఉపయోగపడుతుంది.

ప్రభుత్వ పధకాలు, ప్రభుత్వ ఆదేశాలు, ప్రభుత్వ పనితీరు తదితర వాటిగురించి విశ్లేషకుల అభిప్రాయాలూ ప్రత్యక్షంగా దూరదర్శినిలో వీక్షించవచ్చు.

కాలక్షేపం కోసం కాసేపు టి‌వి చూసే ధోరణి నుండి, అదేపనిగా టి‌వి చూసేవిధంగా కార్యక్రమములు అందుబాటులో ఉండడం వలన కొంతమేరకు వ్యక్తికి కాలహరణం జరిగే అవకాశం లేకపోలేదు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం

లక్ష్య సాధనకు ఏకాగ్రత అవసరం తెలుగులో వ్యాసం. ఏదైనా లక్ష్యం సాధించాలంటే, ఆ యొక్క లక్ష్యంపైన సరైన అవగాహనతో పాటు ఏకాగ్రత ముఖ్యం.

ఏదైనా లక్ష్యం ఏర్పాటు అయినప్పుడు, ఆ లక్ష్యం చేరడానికి కృషి, పట్టుదల ప్రధానం. అటువంటి లక్ష్యంపై పట్టుదల పెరగడానికి దానిపై ఉండే అవగాహన మూలం అవుతుంది.

ఎంత అవగాహన ఉంటే అంత త్వరగా లక్ష్య సాధనవైపు మనసు పరుగులు పెడుతుంది.

అయితే లక్ష్యం చాలా సులభంగా కనబడవచ్చు. కానీ అప్పుడు నిర్లక్ష్యం చూపిస్తే, అదే లక్ష్యానికి శత్రువు అవుతుంది. మధ్యలోనే లక్ష్యం చెదిరే అవకాశాలు ఎక్కువ.

ఏర్పరచుకున్న లక్ష్యం చెదిరిపోవడానికి ప్రధాన కారణం. మనసులో లక్ష్యంపై దృష్టితో బాటు ఇతర విషయాలు కూడా ఉండడం.

పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులు రావాలి! అనే లక్ష్యం ఉన్న విద్యార్ధికి టి‌వి చూడడం అనే అలవాటు ఉంటే, అతని మనసులో టి‌విలోనూ కార్యక్రమములు కనబడుతూ ఉంటాయి.

మరొక విద్యార్ధికి ఆటలంటే ఇష్టం కానీ అతనికి పబ్లిక్ పరీక్షల లక్ష్యం ఉంది. అయితే అటలంటే ఆసక్తి ఉన్న అతని మనసుకు మాత్రం ఆడుకోవడానికి రెడీగా ఉంటుంది.

దేనిపై ఎక్కువ ఆసక్తి ఉంటే దానివైపు మనసు వేగంగా మరలిపోతుంది అంటారు.

మనసులో లక్ష్యం సాధనకు కృషి చేయాలన్న తలంపు బలంగా ఉండాలి!

మరలిపోవడం మనసు యొక్క గుణం అయితే, ఆ గుణాన్ని అదుపు చేయడం యువతకు బలం అవుతుంది. అటువంటి బలం యువత ఎంత పెంచుకుంటే, అంత త్వరగా లక్ష్య సాధనకు మనసులో ఏకాగ్రత ఏర్పడుతుంది.

మన చుట్టూ ఎప్పుడూ అనేక విషయాలు ఉంటూనే ఉంటాయి. అవి మనం పుట్టి పెరిగిన లేక నివసిస్తున్న ప్రాంతం మరియు మిత్రుల బట్టి ఉంటాయి. అయితే మనం పుట్టి పెరిగిన లేక మన మిత్రుల మద్య మనం హీరో కావాలంటే మన మనసుపై మనకు నియంత్రణ ముఖ్యం.

తన చుట్టూ అనేక విషయాలు ఆకట్టుకునే విధంగా ఉంటూ, తన సమయం వృధా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అని ఎవరు విషయాలపై అవగాహనతో ఉంటారో, వారు వ్యక్తులపై ఆగ్రహం తెచ్చుకోరు. విషయాల వ్యాపకం తగ్గించుకోవడంలో జాప్యం చేస్తున్న మనసుపై ఆగ్రహిస్తారని అంటారు.

ఎందుకంటే విషయాలే మనసులో ఉంటాయి. విషయాలే ఆలోచనలకు కారణం అవుతాయి. విజ్ఞాన వేదికగా ఉండాల్సిన మనసు వినోద వేదికగా మారుతుంటే, విజ్ఞులు ఒప్పుకోరు అంటారు.

విజ్ఞానమును వంటబట్టించుకునే సమయంలో ఏర్పడే అవరోధాలకు విషయాలు కారణం అయితే, అటువంటి విషయాలవైపు వెళ్లకుండా ఉండడానికి మనసులో ఏకాగ్రత ముఖ్యం.

ఏకాగ్రతతో ఉండే మనసు తన ముందు ఉన్న పనిని చాలా చాలా చక్కగా చేయగలదని పెద్దలు చెబుతారు. అందుకు ఉదాహరణగా వేకువజామునే చేసే పనులు చెబుతారు.

కాబట్టి అనేక విషయాలు మనసును పట్టుకుని దానిని ఆకర్షించే పనిలో ఉంటాయి. కానీ లక్ష్యం చేరాలంటే వాటిని నియంత్రించాలి. అటువంటి విషయాలను నిరోధించడానికి మనసుకు బలం ఏకాగ్రత. ఏకాగ్రతగా మనసును ఒక విషయం వైపు మరలిస్తే, అది లక్ష్య సాధనకు ఉపయోగపడుతుంది.

నేర్చుకునే వయసులో జీవితానికి ఉపయోగపడే ప్రతి విషయంలోనూ శ్రద్ద చూపుతూ, లక్ష్యాన్ని చెదరగొట్టే విషయాలపై నియంత్రణ కలిగి ఉంటూ ముందుకు సాగాలి…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి. గాలిలో ప్రయాణం చేస్తూ ఉండే శబ్ధ సంకేతాలను మనకు మాటలు లేక పాటలు రూపంలో వినిపించే సాధనాన్ని రేడియో అంటారు.

విద్యుత్ అయస్కాంత తరంగాల ప్రయాణం గురించి గతంలో మ్యాక్స్ వెల్, హెర్ట్ జ్ మరియు బ్రాన్లీ వంటివారు ప్రయోగాలు చేస్తే, చివరికి మార్కోని ప్రయోగాల అనంతరం రేడియో ఆవిష్కరణ జరిగినట్టు చరిత్ర చెబుతుంది.

1907 సంవత్సరంలో బ్రిటిష్ నావికాదళంలో ఒక ఓడ నుండి మరొక ఓడకు వారి జాతీయగీతం రేడియో ద్వారా ప్రసారం చేసుకున్నట్టు, 30 మైళ్ళ దూరం రేడియో ప్రసారాలు మార్కోని పంపినట్టు చరిత్ర.

100 వాట్ల సామర్ధ్యం గల రేడియో ప్రసార కేంద్రం 1922 లో లండన్లో స్థాపించబడింది. అటు తరువాయి 1923 మేలో జెకోస్లావేకియాలోనూ అదే సంవత్సరంలో జర్మనీలోను రేడియో ప్రసార కేంద్రాలు స్టాపించబడ్డాయి.

మనదేశంలో రేడియో ప్రసార కేంద్రం అల్ ఇండియా రేడియోగా ఉంది. దీనికి ఆకాశవాణి పేరు ఉంది. ప్రపంచంలో అతి పెద్ద రేడియో వ్యవస్థల్లో ఇది ఒక్కటి.

మన దేశంలో రేడియో ఆకాశవాణి గా పరిచయం

ఆకాశవాణి ప్రసారములలో వ్యవసాయ పనులకు సంభందించిన కార్యక్రమములు ఉండేవి.  పంటలగురించి, కొత్తరకాల వంగడాలు, సస్యరక్షణ, వ్యవసాయ పద్ధతులగురించి కార్యక్రమములు రైతులకు సాయపడేవి.

ఇంకా పశు సంరక్షణ, పాడి, పశువులు గురించి రేడియో ప్రసార కార్యక్రమములు రైతులకు చక్కగా వివరించేవారు.

అలాగే వార్తలను శబ్ద రూపంలో ఏరోజూకారోజు సాయం వేళల్లో రేడియో ద్వారా ప్రసారం చేసేవారు. రేడియోకు ముందు వార్తలు కేవలం దినపత్రికల ద్వారా మాత్రమే చదువుకునేవారికి పరిమితం.

కానీ రేడియో వచ్చాక అక్షరజ్ఞానం లేనివారు కూడా వార్తలు వినడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా సమాజంలో జరిగే విశేషాలు దేశంలో ఎక్కువమంది తెలుసుకునే అవకాశం రేడియో ద్వారా ఏర్పడింది.

ప్రజా వినోదార్ధం సంగీత కార్యక్రమాలు, సినిమా పాటల ప్రసారం వంటి వినోదాత్మక ప్రసారాలు రేడియో ద్వారా జరిగేవి.

రేడియో వినోదాత్మక, వివరణాత్మక కార్యక్రమములు పాటల, మాటల రూపంలో ప్రజలను ఆకట్టుకునేవి.

నాటికలు, నాటకాలు, సినిమాలు కూడా మాటల, పాటల రూపంలో ప్రసారాలు ప్రజలను ఆకర్షించేవి.

మొదట్లో పెద్దగా ఉండే రేడియోలు చిన్న పరిణామంలోకి మారి ఎక్కువమందికి రేడియో చేరువైంది.

కాలంలో రేడియో, రేడియో మరియు టేప్ రికార్డర్ గా కూడా అందుబాటులోకి వచ్చింది. టి‌విలు వచ్చేవరకు రేడియో ప్రసారాలు విశేషంగా ప్రజలను ఆకర్షించేవి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం. సమాజంపై ప్రభావం చూపగలిగే వాటిలో వార్తా పత్రికలు ఉంటాయి. మొదట్లో వార్తా పత్రికలే పాలకులకు ప్రజలకు సమాచారం అందించడంలో ముందుండేవి.

టి‌వి, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ తదితర పరికరాలు వచ్చాక, వార్తలు ప్రచారం పొందడంలో పోటీ పెరిగింది. గతంలో మాత్రం ప్రజలకు వార్తలను అందించడంలో ప్రధాన పాత్ర పత్రికలదే.

ప్రతిదినం ఎన్నో ఇళ్ల ముంగిట్లోకి వార్తలు చేరవేసే ప్రక్రియను వార్తా పత్రికలు చాలాకాలం నుండి మోసుకొస్తున్నాయి. టి‌వి చూసినా సరే, వార్తా పత్రిక చదివితేనే వార్తలు చదివినట్టు ఉండదు అనేవారు కూడా కనబడతారు.

కొందరికి వార్తా పత్రికను చదువుతూ టీ త్రాగే అలవాటు ఉంటుందని అంటారు. వారికి వార్తా పత్రిక చదవకుండా టీ తాగితే, టీ తాగిన తృప్తీ ఉండదనే వారు ఉన్న ఆశ్చర్యపడనవసరం లేదంటారు.

అంటే ప్రతిదినం వార్తా పత్రిక చదవడం కొందరికి ఒక అలవాటుగా మారినట్టే.

ఇక సమాజనికి మీడియా ఒక స్తంభంలాంటిది అయితే, వార్తా పత్రికల ప్రధాన పాత్రను కలిగి ఉండేవి.

ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం కల్పించడంతో బాటు, ప్రజా పాలనలోని లోటుపాట్లు, సామాజిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో వార్తా పత్రికలు కధనాలు చాలా కీలకమైనవి.

ఇంకా సమాజంలో ఎక్కడైనా అమానుషం ఘటన జరిగితే, దానిని నలుగురికి తెలిసేలాగా చేస్తూ, అందుకు కారణం అయినవారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టే విధంగా వార్తా పత్రికలలో కధనాలు సాయపడగలవని అంటారు.

ఉద్యమాలకు ఊపిరి పోయాలంటే, వార్తా పత్రికలలో వచ్చే కధనాలు కీలకంగా మారగలవు.

ప్రపంచంలో జరిగే విషయాలను, ప్రజలకు అక్షర రూపంలో చూపించే వ్యవస్థే వార్తా పత్రికలు

అక్షరం ఆయుధం కన్నా పదునైనది అంటారు. అక్షరంలో పలికే భావం, ఒక వ్యక్తిలో చైతన్యం తీసుకురాగలదు. అలాంటి వారిని ఎక్కువమందిని ఒకేసారి చైతన్య పరచగలిగే భావాలు, వార్తా పత్రికల ద్వారానే ప్రజాలలోకి చేరతాయి.

ప్రజలకు అవసరాలు పట్టించుకోకుండా, సామాజిక అభివృద్దిని కాదని ప్రవర్తించే ప్రభుత్వం ఉంటే, అటువంటి ప్రభుత్వ విధానాలను ఎండగట్టగలిగె అక్షర శక్తి వార్తా పత్రికల కధనాలలో కదులుతూ, ప్రజలలో అవగాహన తీసుకురాగలవు.

రాజకీయాలలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ ఉంటే, ప్రజల పక్షం ఎప్పుడు ఉండేవి వార్తా పత్రికలుగా చెబుతారు. ప్రజా సమస్యలపై కధనాలు వ్రాస్తూ, ప్రభుత్వ అధికారులలో చలనం కలిగించే శక్తి వార్తా పత్రికలకు ఉంటుంది.

నేటి కాలంలో టి‌విలు, స్మార్ట్ ఫోన్లు అంటూ ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉన్నా, వార్తలను ప్రజలకు అందించడంలో వార్తా పత్రికలు పోటీ పడుతూనే ఉన్నాయి.

ఇంకా వార్తా పత్రిక పఠనం వలన విద్యార్ధులకు జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇంకా సమాజంపై ఒక అవగాహన కూడా ఏర్పడగలదు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం

చలన చిత్రాలు గురించి తెలుగులో వ్యాసం. చలన చిత్రం అంటే ఆంగ్లంలో సినిమా అంటారు. వెండితెరపై కదిలే బొమ్మలు మాట్లాడుతూ సన్నివేశాలలో పాల్గొంటూ ముగింపుకు వచ్చే కధను తెలియజేసేది సినిమా. మనుషులు నటించిన పాత్రలను తిరిగి అనేకమార్లు తెరపై ప్రదర్శించేవిధంగా తయారు చేసిన ప్రక్రియ చలనచిత్రంగా మారితే, అది అనేకమార్లు ధియేటర్లలో ఇంకా ఓటిటి ద్వారా చిన్న చిన్న తాకే తెరలలో కూడా ప్రదర్శితమవుతుంది. అదే సినిమా….

తెలుగులో మొదటి చలన చిత్రం శబ్దం లేకుండా మూకీ సినిమాగా 1921 లో విడుదల అయ్యిందంటారు. ఆ తరువాత 1950వ దశకంలో అద్బుతమైన తెలుగు సినిమాలు వచ్చాయి.

తెలుగు చలన చిత్రాలు మొదటగా భక్తి భావనను పెంచే విధంగానే సాగాయని అంటారు. బహుశా తెలుగు చలనచిత్రం రాకముందు నుండి కూడా నాటకాలు ఉండేవి. అవి ఎక్కువగా పౌరాణిక నాటకాలు కాబట్టి, అవే కొన్ని నాటకాలు వెండితెరకెక్కాయని అంటారు.

వెండితెరపై వెలుగు వెలిగిన తొలి కధనాయుకులు, కధనాయికలు కూడా భక్తిని పెంపొందించే పాత్రలే పోషించారు. పౌరాణిక పాత్రలతో వెండితెరపై వెలుగు వెలిగారు, అప్పటి నటీనటులు.

అటువంటి తెలుగు భక్తి సినిమాలు బాగా రావడం వలన సమాజంలో భక్తితో కూడిన జ్ణానము ప్రజలకు మరింత చేరువైందని అంటారు. దీనిని బట్టి చలన చిత్రాలు సమాజముపైన బాగా ప్రభావం చూపుతాయని తెలియబడుతుంది.

అంటే ఎటువంటి చలన చిత్రాలు సమాజంలో పెరిగితే, అటువంటి మార్గములో సమాజము గతి ఆధారపడే అవకాశం ఉంటుందని తెలియబడుతుంది.

చలన చిత్రాలు మంచిని మోసికెళ్తే, సమాజంలో మంచి పెరుగుతుంది.

సమాజంలో చలన చిత్రాలు మంచిని చూపించే ప్రయత్నం చేస్తే, సమాజంలో మంచి మరింత పెరుగుతుంది. చెడును అదేపనిగా చూపుతూ ఉంటే, చెడు భావనలు పెరిగే అవకాశం ఉంటుందని అంటారు.

ఎందుకంటే చలన చిత్రాలు మనిషిని ఇట్టే ఆకట్టుకోగలవు. సరైన కధనం కలిగిన కధ అయితే, వ్యక్తి మనసులో దీర్ఘకాలం మెదులుతూనే ఉంటుంది. అంతటి శక్తివంతమైన చలన చిత్రాలు మానవాళికి సందేశాత్మ కధలు అందిచడంలో కూడా ముందుంటున్నాయి. వీటి వలన సమాజనికి మేలు కలుగుతుంటే, సమాజనికి చేటు తెచ్చే కొన్ని రకాల చలన చిత్రాలు కూడా ఉంటున్నాయని అంటారు.

ప్రేక్షకుల దృష్టిని బట్టి చలన చిత్రాలు ఉంటే, ఎటువంటి చలన చిత్రాలు చూస్తున్నామో

ప్రేక్షకుల అభిరుచిని బట్టి చలన చిత్రాలు నిర్మాణం సాగితే, ఎటువంటి చలన చిత్రాలను ప్రేక్షకులు ఆధారిస్తూ ఉంటే, అటువంటి చలన చిత్రాలు నిర్మాణం అవుతూ ఉంటాయి.

సమాజంపై చలన చిత్రాలు మంచి ప్రభావం చూపగలవు. ఆగగాహనా రాహిత్యంతో చేసే ప్రయత్నాల వలన వచ్చే చలన చిత్రాలు సమాజంపై ప్రతికూల ప్రభావం కూడా చూపగలవు అంటారు.

కాబట్టి చలన చిత్రాలు కేవలం వినోదాత్మక దృష్టితోనే కాకుండా, సామాజిక శ్రేయస్సు కూడా దృష్టిలో ఉంచుకుని చలన చిత్రాల నిర్మాణం కొరకు దర్శకనిర్మాతలు ఆలోచన చేయాలి.

ప్రేక్షకులు కూడా కేవలం వినోదం ఉన్న చలనచిత్రాలను కాకుండా, సందేశాత్మక చలన చిత్రాలను ఆధరించడం వలన మరిన్ని సందేశాత్మక చలన చిత్రాలు సమాజంపై మంచి ప్రభావం చూపగలవు… కారణం ప్రేక్షకాధరణే చలన చిత్ర పరిశ్రమ మనుగడ ఆధారపడి ఉంటుంది.

ప్రేక్షకుల దృష్టిని బట్టి దర్శకుని దృష్టి, దర్శకుడు తీసే సినిమాలు ప్రేక్షకుల దృష్టి ప్రభావితం అవుతూ ఉంటాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

గ్రంధములకు ఆలవాలమైన స్థలమునకు గ్రంధాలయం అని పేరు. అనేక గ్రంధములు ఈ గ్రంధాలయాలలో ఉంటాయి. గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి. అంటే లైబ్రరీ గురించి తెలుగులో వ్యాసం.

గ్రంధము అంటే పుస్తకము. ఆవహించడానికి అనువుగా ఉండేది. దేవాలయంలో దేవుడు ఆవహించినట్టుగా గ్రంధాలయములో గ్రంధములు ఆవహించు ఉంటాయి. గ్రంధములలో శాస్త్ర పరిజ్ఙానం నిక్షిప్తం అయి ఉంటుంది. ఇక గ్రంధాలయం అంటే పుస్తకాలయం. అంటే పుస్తకములు నిల్వ ఉంచు ప్రదేశముగా చెప్పవచ్చును.

ప్రజల ఉపయోగం కొరకు విజ్ఙాన విషయాలు తెలుసుకోగోరు వారికి, అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి, వాటిని పరిరక్షించు ప్రదేశాన్ని గ్రంథాలయం అని అంటారు.

విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. గ్రంధాలయాలలో లభించు పుస్తకాలు వివిధ విషయాలలో విజ్ఙానమును నిక్షిప్తం చేసుకుని ఉంటాయి.

ఆధునిక పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్‌లో తొలి గ్రంథాలయం విశాఖపట్నంలో ఏర్పాటు అయ్యిందని పరిశోధకులు భావిస్తారు.

చాలా గ్రంధాలయలు మనకు ఉంటున్నాయి. ఇంకా ఇప్పుడు ఆన్లైన్ టెక్నాలజి పెరిగాక ఆన్లైన్ లైబ్రరిలు పెరిగాయి.

వివిధ రకాల తెలుగు బుక్స్ స్టోర్ చేసుకుని, వాటిని చదివే అలవాటు ఉన్నవారికి, చదువుకునే నిమిత్తం బుక్స్ అందిస్తూ, చదువుకోవడం పూర్తయ్యాక వారి వద్ద నుండి బుక్స్ రిటర్న్ తీసుకోవడం… గ్రంధాలయాలలో జరుగుతూ ఉంటుంది.

విజ్నాన విషయాల గురించి వ్రాయబడిన పుస్తకాలు గ్రంధాలయాలలో లభిస్తాయి. ఇంకా వివిధ పాపులర్ రచయితల పుస్తకాలు లభిస్తాయి.

ముఖ్యంగా సామాజిక అంశాలలో వివిధ రచయితల పుస్తకాలు గ్రంధాలయాలలో లభిస్తాయి.

సమాజం చేత కీర్తింపబడ్డ ప్రముఖుల జీవిత చరిత్రలు పుస్తక రూపంలో గ్రంధాలయాలలో లభిస్తాయి.

పుస్తక పఠనం అంటే ఆ పుస్తకంలో వ్రాయబడిన అంశముతో మనసు మమేకం కావడమే అంటారు.

ఏదైనా ఒక వస్తువు తయారీ గురించి వ్రాయబడిన పుస్తకం ఒక వ్యక్తి చదువుతూ ఉంటే, ఆ వస్తువు తయారీ విధానంలో ఆచరించవలసిన విధివిధానాలపై మనసులో ఊహ పుడుతుంది.

తనకంటూ ఒక పూర్తి ఊహాత్మక విధానం తట్టేవరకు మనసు పుస్తములో విషయంపై దృష్టిసారిస్తుంది. అలా పుస్తక పఠనం అంటే మనసు పుస్తకం చదువుతూ ఉన్నంతసేపు ఏకాగ్ర చిత్తంతో ఉంటుంది.

ఇలాగే ఎవరైనా గొప్పవారి జీవిత చరిత్ర చదివినా అక్కడి అప్పటి పరిస్థితులపై మనసు ఊహ ఏర్పరచగలదు. కాబట్టి మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉండడం వలన మనసులో మంచి ఆలోచనలు పెరుగుతాయి.

జ్ఞాన సముపార్జనకు గ్రంథాలయం ఎంతగానో దోహదపడుతుంది

గ్రంధాలయాలలో అన్నీ రకాల విజ్ఞాన పుస్తకాలు లభిస్తాయి.

ఏదైనా ఒక వస్తువు తయారీ విధానం గురించి పుస్తక రూపంలో ఉంటే అది గ్రంధాలయంలో ఉండవచ్చు.

ఎవరైనా గొప్ప వ్యక్తి గురించి పుస్తకం వ్రాయబడి ఉంటే, అది కూడా గ్రంధాలయంలో లభించే అవకాశం ఉంటుంది.

గతంలో జరిగిన సామాజిక చరిత్ర గురించి పుస్తకాల రూపంలో గ్రంధాలయాలలో లభిస్తుంది.

సామాజిక, తాత్విక, వేదాంత విజ్ఞానము, పిల్లల పెంపకం, పిల్లల పేర్లు, వ్యవస్థ, వ్యవస్థ విధి విధానాలు ఇలా ఎన్నో రకాల అంశాలలో పుస్తకాలు ఉంటే, అవి గ్రంధాలయంలో లభించే అవకాశం ఉంటుంది.

తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారికి గ్రంధాలయం ఒక విజ్ఞాన కూడలి అవుతుంది. విజ్ఙాన వేదికలు అన్నీ అక్షరరూపంలోకి మారితే, అవి గ్రంధాలయములలో అల్మారాలలో నిక్షిప్తం అయి ఉంటాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం. ఇప్పటి ప్రసాద సాధనాలు యువతపై రెండు రకాల ప్రభావం చూపించే అవకాశం కలదు.

ఒకటి: ఉపయుక్తమైన విషయ సంగ్రహణం చేసే క్రమంలో ఉత్సాహావంతులకు ప్రోత్సాహకరంగా నేటి సాంకేతికత ఉపయోగపడును.

రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

బ్లేడు రెండువైపులా పదును కలిగి ఉండి, దానిని ఉపయోగించేటప్పుడు చేతి వెళ్లకు ప్రమాదకరంగా ఉంటుందో, నేటి సాంకేతికత కూడా ఎదిగే మనసుకు అలాగే ఉంటుంది.

ప్రసార సాధనాల ప్రభావం సమాజంలో ముఖ్యంగా యువతపై ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా మొబైల్స్ రూపంలో ప్రసార సాధనాల ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది.

ఒకప్పుడు ప్రసార సాధనాలు కేవలం పత్రికల రూపంలోనే ఉండేవి. అవి మాస పత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలు, దిన పత్రికలు అంటూ పత్రికల ద్వారకా సమాచారం అందేదీ.

రేడియో కార్యక్రమాలు ప్రజలను అలరిస్తూ వచ్చేవి, సాయం వేళలో సాంగ్స్ వినడం ఒక అలవాటుగా కూడా ఉండేదని అంటారు.

ఆ తరువాత టి‌విల వలన ప్రసార సాధనాల పనితీరు మెరుగు పడింది. అనేక అంశాలు ప్రతి ఇంటిలోకి వార్తలుగా రావడం… ఇంకా వినోద కార్యక్రమాలు సంఘజీవిని ఇంటికే పరిమితం చేయడంలో టి‌విల పాత్ర ప్రముఖమైనది అంటారు.

టి‌విల నుండి వేగం అందుకున్న ప్రసార సాధనాలు ఇప్పుడు అందరి చేతులలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడే అందించే క్రమానికి మారాయి.

పత్రిక – రేడియో – టి‌వి – కంప్యూటర్ – లాప్ టాప్ – టాబ్ – స్మార్ట్ ఫోన్ ఇలా ప్రసార సాధనాలు అక్షర రూపంలో, శబ్ధరూపంలో, దృశ్య రూపంలో ప్రసారం అయ్యి, ఇప్పుడు దృశ్యం రూపం పెద్ద పెద్ద స్క్రీనుల నుండి అతి చిన్న స్క్రీనులా ద్వారా కూడా ప్రపంచాన్ని అరచేతిలో చూపుతున్నాయి.

యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం
యువతపై ప్రసార సాధనాల ప్రభావం తెలుగులో వ్యాసం

స్మార్ట్ ఫోన్, ఇది ఒక మాయల మరాఠి చేతిలో మంత్రదండం లాగా మనిషి చేతిలో ఇమిడిపోయింది.

ఒకప్పుడు కరెంట్ బిల్ కట్టడానికి క్యూ కట్టిన జనులు ఇప్పుడు ఉన్న చోట నుండే కదలకుండా కరెంట్ బిల్ పే చేసే స్థితిని ప్రసార సాధనాలు కల్పిస్తున్నాయి.

సమయం సేవ్ చేయడంలో ఇది మంచి పరిణామం అయితే, అదే సమయంలో సహనం స్థానంలో అసహనం ఏర్పడే అవకాశం కూడా ఈ స్మార్ట్ ఫోన్ వంటి సాధనాల రూపంలో కలిగే అవకాశం ఉంటుంది.

ఇలా ఏదైనా నెలవారి చెల్లింపులు చేయడంలో చేతిలోని స్మార్ట్ ఫోన్ పనితీరు ఒక అద్బుతమే అని చెప్పాలి. ఇది నిజంగానే చేతిలో మంత్రదండం వలె ఉంటుంది.

ఇక వినోద కార్యక్రమాలు అయితే సరే సరి. ఎప్పుడంటే అప్పుడే, ఎక్కడంటే అక్కడే టైమ్ పాస్ కావడానికి స్మార్ట్ ఫోన్లో ఎన్నో వినోదాత్మక వీడియోలు దర్శనమిస్తాయి. వినోదభరిత పెట్టె వలె చేతిలో ఇమిడిపోతుంది.

ఒకటి: ఉపయోగకరమైన విషయ సంగ్రహణకు కంప్యూటర్ – లాప్ టాప్ – టాబ్ మరియు స్మార్ట్ ఫోన్లు చాలా ఉపయోగకరంగా….

ఉంటున్నాయనే చెప్పాలి.

ఒక విధ్యార్ధి తరగతిలో టీచర్ చెప్పిన విషయం అర్ధం కాకపోతే, ఇంటర్నెట్ ఆధారిత పరికరములలో శోధించి సాధించవచ్చు.

అలాగే ఒక ఉద్యోగి తన కార్యచరణలో సందేహాలకు సమాధానాలను ఇంటర్నెట్ ఆధారిత పరికరాల ద్వారా వచన రూపంలో కానీ దృశ్య రూపంలో కానీ పరిస్కారం కనుగొనవచ్చు.

నేర్చుకునే వయస్సులో ఆసక్తికి నేటి సాంకేతికత అదనపు ఆయుధంగా మారుతుంది. అయితే అది మంచి ఆసక్తి అయితే, అది అతని ఉన్నత స్థితికి హేతువు కాగలదు…

అవసరానికి ఆలోచన తోడైతే, ఆ ఆలోచన అందరికీ ఉపయోగపడేది అయితే, అదే ఆలోచనను అభివృద్ది పరచి అందరికీ ఉపయోగపడేలా చేయడంలో నేటి సాంకేతికత ఒక ప్రోత్సాహకరంగా ఉండగలదు.

రెండు: అనవసర విషయాలు కూడా శోధనలో ఎరుకలోకి వచ్చే అవకాశం

కూడా నేటి సాంకేతికత ద్వారా అభివృద్ది చెందిన ప్రసార సాధనాలు కారణం కావచ్చు. ఇంటర్నెట్ ఆధారిత పరికరాలలో వ్యక్తికి స్వేచ్చ ఎక్కువగా ఉంటుంది.

అతను శోధించే అంశం అతనికే పరిమితం అవుతుంది కానీ అతని శ్రేయోభిలాషులకు తెలిసే అవకాశం తక్కువ.

వయసుకు మించిన విషయాలు కూడా ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు ఉపయోగించేవారి దృష్టికి వచ్చే అవకాశం నేటి ప్రసార సాధనాల ప్రభావం ద్వారా ఉండవచ్చు.

వాటిని ఉపయోగించే వారి విజ్నతను బట్టి ప్రసార సాధనాల ఉపయోగం ఫలితం ఉంటుంది.

ఈ ప్రసార సాధనాల ప్రభావంతో వ్యక్తి ఆలోచనా తీరు వేగం పుంజుకుంటే, దానికి సరి అయిన పరిస్కారం యోగా అంటారు.

మనసుని నియంత్రించే ప్రక్రియలో యోగా మేలైనదిగా చెప్పబడుతుంది.

ఇప్పటి ప్రసార సాధనాలు అనెక అంశాలు యువత మదిలోకి చొచ్చుకు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే శ్రేయస్సు కలిగించే విషయాలు మాత్రం మనిషికి శాంతిని అందిస్తే, ఆకట్టుకునే విషయాలు మనసులో అశాంతికి ఆలవాలం కాగలవు.

మంచి చెడులు ఒకరిని అనుసరించి తెలుసుకునే రోజుల నుండి శోధించే తెలుసుకునేవిధంగా ప్రసార సాధనాలు మార్పును తీసుకువచ్చాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి ! గుణపాఠం అంటే గుణమునకు పాఠం. ఎవరి గుణమునకు పాఠం అంటే, చెడుగుణం కలిగిన వ్యక్తికి గుణపాఠం అంటారు.

ఒక వ్యక్తిని మోసం చేస్తూ, మరొక వ్యక్తి జీవిస్తూ ఉంటే, మోసం చేసిన వ్యక్తికి గుణపాఠం చెప్పే అవకాశం మోసపోయిన వ్యక్తికి కాలం కల్పిస్తుంది…

కానీ గుణపాఠం త్వరగా ప్రారంభం కాకపోవచ్చు… కానీ గుణపాఠం ఎదురయితే జీవితంపై ప్రభావం పడుతుంది…. సమాజంలో గుర్తింపు మారుతుంది.

సమాజంలో వివిధ రకాల స్వభావాలతో వ్యక్తులు కలిసి ఉంటారు. అందరి స్వభావం ఒకేవిధంగా ఉండకపోవచ్చు. అలాగే వివిధ వ్యక్తులు వివిధ రకాల గుణాలను కలిగి ఉంటారు.

ఒకరి గుణం వలన మరొకరికి మేలు జరగవచ్చు. ఒకరి గుణం వలన మరొకరికి నష్టం కలగవచ్చు. కానీ ఒకరి గుణం వలన మరొకరికి చేటు కలిగితే, సదరు వ్యక్తికి గుణపాఠం కాలమే చెబుతుందని అంటారు.

అంటే కాలంలో మరొక వ్యక్తి రూపంలోనో మరొక సంఘటన ద్వారానో చెడు గుణాలు కలిగిన వ్యక్తికి కాలం గుణపాఠం చెబుతుందని పెద్దలు అంటారు.

గుణాలు మారే స్వభావం ఉన్నవారికి, చెడు ప్రవర్తన కలిగిన వారికి కూడా కాలం ద్వారా సమాజంలో గుణపాఠం ఉంటుందని చెబుతారు. సమాజంలో సహజీవనం చేసే వ్యక్తులు మంచి గుణాలు కలిగి ఉంటే, సమాజం చేత కాలంలో కీర్తింపడతారు. అదే చెడు ప్రవర్తన కలిగి ఉండీ, ఇతరులకు చేటు చేసేవిధంగా ప్రవర్తించేవారికి సమాజం కాలంలో గుణపాఠం చెబుతుంది.

జీవితంలో ఎదురైన సంఘటనల ద్వారా గుణపాఠం నేర్చుకున్న వ్యక్తి, తన జీవన మార్గాన్ని మంచివైపు నడిపించగలడు. గుణపాఠం నేర్వని వ్యక్తి స్వీయపతనానికి కారణం కాగలడు.

ఒక వ్యక్తి ఏదైనా పని చేసేటప్పుడు, ఆ పని వలన సామాజిక విధానానికి విఘాతం కలిగిస్తుందంటే, విజ్నులు సదరు పనిని మానుకుంటారు.

అలాగే ఎవరైనా ఒక వ్యక్తి తన స్వార్ధ ప్రయోజనం కోసం సామాజికమైన నష్టం ఉన్నా, సామాజిక ప్రయోజనలు ప్రక్కనపెట్టి తన స్వార్ధ ప్రయోజనం గురించే చూసుకునేవారికి సమాజం చేత కాలంలో గుణపాఠం ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

తన గుణాలు తాను పరిశీలన చేసుకోవడానికే కాలం పరిస్థితుల ద్వారా వ్యక్తికి జీవన పాఠాలు చెబితే, గుణపాఠం నేర్చుకున్నవారు. జీవితగమ్యాన్ని చేరగలరని పెద్దలంటారు.

జీవనపోరాటంలో సామాజిక పరిస్థితులు ఎప్పుడూ అనుకూలం కాదు… అలాగే ఎప్పుడూ ప్రతికూలం కాదు. అలాంటి కాలంలో సద్గుణాలతో నడుచుకునేవారి ప్రవర్తన మిగిలినవారికి ఆదర్శప్రాయంగా ఉంటుంది.

సహజీవనంలో సహచరులను ఇబ్బందులకు గురిచేస్తూ, ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం వ్యక్తిగత స్వార్ధం కోసం వ్యవస్థాగత ప్రయోజనాలు కూడా ప్రక్కన పెట్టేసేవారు జీవితంలో గుణపాఠం ఎదురౌతుందని అంటారు.

ప్రకృతి నియమాలు పక్కకు పెట్టి, ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తే, సదరు ప్రాంతం కాలంలో గుణపాఠం పొందుతుందని అంటారు. అంటే పర్యావరణం విషయంలో ప్రకృతిని అసహజమైన పద్దతిలో ఉపయోగించుకోవడం కూడా ప్రకృతి నుండి గుణపాఠం ఎదుర్కోవడానికి కారణం కాగలదు.

అపకారికి ఉపకారం చేయమని సూచించే పద్యం మనకు బాగా ఫ్యామస్…

తనకు అపకారం చేసినవారికి సాయం అవసరం అయితే, అలాంటి అపకారికి కూడా ఉపకారమే చేయమని నీతిని తెలియజేసే పద్యం.

అంటే ఈ పద్యం యొక్క భావమును పరిశీలిస్తే, సమాజంలో ఒకరు మరొకరికి అపకారం చేయకుండా ఉండాలనే భావనకు బలం చేకూరుతుంది.

ఒక వ్యక్తికి అపకారం చేసిన వ్యక్తికి కూడా ఉపకారమే చేయమని అంటే, తనకు అపకారం చేయకుండా ఉన్నవారికి, ఉపకారం చేసిన వారికీ ఉపకారమే చేయాలి… ఇక అపకారం ఎవరికి చేయాలి?

పద్య భావం ప్రకారం అపకారం చేయాలనే ఆలోచన రాకుండా ఉంటే, అటువంటి వ్యక్తి ఉత్తమ గుణమే కలిగి ఉన్నట్టు.

ఒక వ్యక్తికి సమాజంలో అపకారం చేయనివారు, ఉపకారం చేసినవారు కూడా ఉంటారు. కానీ ఆ ఒక వ్యక్తి తన స్వార్ధం కోసం తెలిసి తెలిసి అపకారం తలపెడితే, మాత్రం అటువంటి వ్యక్తి గుణపాఠం కాలంలో ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది.

ప్రకృతిలో కాలంలో చర్యకు ప్రతిచర్య జరుగుతూనే ఉంటుంది. ఎవరు ఎలా జీవనం సాగిస్తూ ఉంటే, అలాంటి జీవనం వలన ఏర్పడే పరిస్థితులు మరలా ఎదురయ్యే అవకాశం కాలంలో కలుగుతూ ఉంటుంది.

కాబట్టి వ్యక్తికి చుట్టూ ఉండే వ్యక్తుల ద్వారా మంచిచెడులు సూచించబడుతూ ఉండే అవకాశం ఎక్కువ… వ్యక్తుల ద్వారా సూచించబడే సమయం మనల్ని మనం మార్చుకునే సమయంగా అవకాశంగా భావిస్తే, వ్యక్తి జీవనం శాంటిమయం అవుతుంది… అంటారు.

శ్రుతిమించిన వ్యవహారం బెడిసికొడుతుంది… అలా పదే పదే అలాంటి వ్యవహారాలు నిర్వహించేవారికి కాలమే గుణపాఠం చెబుతుందని అంటారు…

ఎవరికైనా గుణపాఠం ఎవరైనా చెప్పే అవకాశం కాలం భవిష్యత్తులో కల్పిస్తుందని అంటారు… అయితే అప్పటికి ఆ వ్యక్తిలో కూడా దోషం ఉండకుండా స్వీయపరిశీలన అవసరం అని అంటారు.

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక

స్నేహం గురించి వ్యాసం ఏ బంధం అయినా స్నేహపూర్వక ప్రవర్తన వలన ఆ బంధం మరింత బలపడుతుంది అంటారు. ఏ బంధం అయినా స్నేహం ప్రభావం ఉంటుంది.

మానవ జీవనం అనేక బంధాలతో కొనసాగుతుంది. ప్రతి బంధంలోనూ స్నేహపూర్వకంగా ప్రవర్తించే వారు శాంతిగా ఉంటారు. వారి చుట్టూ ఉండేవారిని శాంతిగా ఉంచుతారు.

అంటే స్నేహం యొక్క ప్రభావం ప్రతి మానవ బంధంపైనా ఉంటుంది. అంటే స్నేహం ఇద్దరి మద్యలో అంతరాలను తొలగిస్తుంది. ఇద్దరినీ ఒక్కటి చేసే ప్రక్రియలో మొదటిమెట్టు స్నేహమే అవుతుంది.

మంచి మిత్రుడిని మించిన ఆస్తి లేదంటారు. ఎందుకంటే మంచి మిత్రుడు స్నేహితుడి మంచిని కోరుకుంటాడు. ఆపదలో ఆదుకుంటాడు. బాధలో ఓదార్పు అవుతాడు. కష్టానష్టాలలో మంచి మిత్రుడు వెన్నంటే ఉంటాడు. కాబట్టి మంచి మిత్రుడిని మించిన ఆస్తి ఉండదని అంటారు.

అమ్మఒడిలో అమ్మ దగ్గర అప్యాయతను చూసిన తర్వాత, మనిషి చూసే మరో ఆప్యాయత స్నేహంలో కనబడుతుంది. మంచి మిత్రుడు వలన మరొక మంచి బంధమే అవుతుంది.

స్నేహపూర్వక ప్రవర్తనతోనే పనులను సులభంగా నెరవేర్చుకోగలం… స్నేహంతో మెదిలే మనిషికి అంతా స్నేహితులే…

అహంకారికి మిత్రులుండరు అని అంటారు… అంటే ఎక్కువమంది మిత్రులన్నవారికి అహంకార భావన ఉండదేమో… లేదా స్నేహపూర్వక ప్రవర్తనతో ఎదుటివారి అహం సంతృప్తి చెందుతుంది. ఏది ఏమైనా స్నేహం వలన ఇద్దరి మధ్య అహంకార అంతరాలు తొలగిస్తుంది.

ప్రేమకు పునాది స్నేహమని ఎక్కువమంది నమ్ముతారు. అంటే ప్రతి బందంలోనూ ప్రేమ ఉంటుంది. కాబట్టి ప్రేమను వెన్నంటే స్నేహం ఉంటుంది.

మనిషికి ఉండే బంధాలు స్నేహంతో ముడిపడి ఉంటే, ఆ బంధం మరింత బలంగా

తండ్రి కొడుకుతో స్నేహపూర్వకంగా ఉంటే, ఆ కొడుకుకు తనతో సింహం స్నేహం చేస్తున్నట్టేగానే అనిపిస్తుంది.

అమ్మ కూతురితో స్నేహంగా ఉంటే, ఆదిశక్తి ఆ అమ్మాయితో స్నేహం చేస్తున్నట్టే…

అన్న తమ్ముడితో స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఆ తమ్ముడికి పులి తోడు ఉన్నట్లే…

ఇలా సహజంగా మనిషికి ఉండే బంధాలు స్నేహంతో ముడిపడి ఉంటే, ఆ బంధం మరింత బలంగా మారుతుంది.

వ్యక్తికి మిత్రులు ఉన్నట్టే శత్రువులు ఉండవచ్చు… అయితే శత్రువు కూడా మిత్రుడుగా మారితే మాత్రం… జీవితం సుఖవంతం…

స్నేహం వలన శతృత్వ భావనలు ఉండవు.

ఎదుగుతూ ఉన్నప్పుడే ఏర్పడే స్నేహబంధం, జీవితముపైన ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎంతమంది మిత్రులు ఉంటే, అంత బలగం వ్యక్తికి ఉన్నట్టే…

ప్రతి బంధమూ నేను నువ్వు అనే వేర్పాటు భావన తీసుకురావచ్చు కానీ స్నేహం మాత్రం సమానమనే భావనతోనే ఆరంభం అవుతుంది. మనమంతా ఒక్కటే అనే బలమైన భావనను స్నేహం మరింతగా పెంచుతుంది.

గొప్పవారి స్నేహం వలన మనకూ సమాజంలో గౌరవం లభిస్తుంది. అంటే స్నేహం ఎప్పుడూ సమానమైన స్థితినే ఇస్తుంది.

స్నేహం అంటే స్నేహమే చెప్పాలి… మంచి స్నేహమే మేలు చేస్తుంది. అటువంటి మంచి స్నేహంలోనే స్నేహం యొక్క గొప్పతనం తెలియబడుతుంది.

సమాజంలో స్నేహం గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్నేహం గురించి తెలియజేయాలంటే పది వ్యాక్యాలు కాదు పది పుస్తకాలు వ్రాసిన సరిపోదు.

స్నేహం గొప్పతనం మంచి మిత్రుడు స్నేహం వలననే తెలియబడుతుంది…

స్నేహితుడి దృష్టిలో లోకంపై మిత్రభావనతోనే ఉంటుంది. స్నేహామంటే స్నేహమే… అయితే ఎటువంటి స్నేహం చేస్తూ ఉంటే అటువంటి ప్రభావం జీవితంపైన ఖచ్చితంగా ఉంటుంది అంటారు.

అందుకే స్నేహం చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అంటారు.

ఏ బంధం అయినా స్నేహపూర్వక ప్రవర్తన వలన బలహీన పరిస్థితిలో కూడా బలంగా మారగలదు… ఇలా ఆలోచిస్తే జీవితంలో ప్రేమ ఉన్నంత బలంగా స్నేహం కూడా ఉంటుంది.


మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం. కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. ఇంతకంటే మంచి పోలిక ఏముంది?

వ్యక్తి తన జీవిత కాలంలో సమయ పాలన పాటించడం బట్టి, అతని జీవితం ఆధారబడి ఉంటుంది. ఒక వ్యక్తి వృత్తిలో చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలగడం వలన అతని చేతి వృత్తికి విలువ ఎక్కువ ఉంటుంది. అదే వ్యక్తి తగు సమయానికి పనిని పూర్తి చేయలేకపోతే, ఆ వ్యక్తి చేతివృత్తికి విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా, అవసరానికి ఉపయోగపడే విధంగా ప్రతిభ ప్రదర్శించలేకపోతే, ఆ ప్రతిభా పాటవాలు నిరర్ధకమే అంటారు.

అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ, మరొక వ్యక్తి అవసరం లేక ఒక వ్యవస్థాగత అవసరంపైన ఆధారపడి ఉంటుంది. అలా కాలంలో వ్యక్తి ప్రతిభకు గుర్తింపు, ఆ వ్యక్తి అవసరానికి తగ్గట్టుగా తన పనిని తాను పూర్తి చేయడంపైన ఆధారపడి ఉంటుంది.

వ్యక్తి కానీ వ్యవస్థ కానీ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందించే ప్రక్రియను పాటిస్తూ, ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తూ ఉంటే, సేవలు సమయానికి ఉపయోగపడితే, సదరు వ్యవస్థపైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. సదభిప్రాయం ఏర్పడితే, సదరు వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్ధికంగా లాభాలు గడించగలరు. అంటే ఆర్ధిక పురోగతిని కాలం శాసించగలదు.

గడువులోపులో పనిని పూర్తి చేయగలగడం వలన అవసరాలకు అంతరాయం కలగదు

ఒక మోటారు సైకిల్ మెకానిక్, ఒక వ్యక్తి యొక్క మోటారు సైకిల్ రిపైరు చేయడానికి రెండురోజులు గడువు కోరితే, అతను ఖచ్చితంగా తను కోరిన గడువులోపులో మోటారు సైకిల్ రిపైరు చేయగలిగితే, సదరు మోటారు సైకిల్ యజమాని యొక్క మన్ననకు పాత్రుడు కాగలడు. కానీ ఆ రెండురోజుల గడువులో మోటారు సైకిల్ రిపైరు చేయలేకపోతే మాత్రం, మరొకసారి మోటారు సైకిల్ రిపైరుకు వచ్చినప్పుడు సదరు యజమాని మరొక మెకానిక్ కొరకు శోచించే అవకాశం ఉంటుంది. అదే మోటారు సైకిల్ తన దగ్గర కొంతమంది సహాయకులను పెట్టుకుని, తన దగ్గరకు వచ్చిన ప్రతి మోటారు సైకిల్ రిపైరు చేసేస్తూ ఉంటే, అతని దగ్గరకు ఆ ప్రాంతపు మోటారు సైకిల్ యజమానులు మోటారు సైకిల్ రిపైరు చేయించుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక్కడ కాలంలో అవసరానికి మోటారు సైకిల్ రిపైర్ చేయగలగడం వలన అతని ఆర్ధిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఇంకా వాహనదారుల పని కూడా అంతరాయం ఏర్పడకుండా ఉంటుంది.

కాలంలో ఒక వ్యక్తి ఇచ్చే కమిట్ మెంట్, మరొక వ్యక్తి మరొకరికి ఇచ్చే కమిట్ మెంట్ కు కారణం కాగలదు. అంటే మోటారు సైకిల్ మెకానిక్ ఒక మోటారు సైకిల్ యజమానికి మోటారు సైకిల్ రిపైరుకు రెండురోజులు గడువు ఇస్తే, ఆ మోటారు సైకిల్ యజమాని కూడా తను పనిచేసే చోట కానీ, తన సేవలు అందుకునే వ్యక్తులకు కానీ అదే గడువు కోరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మోటారు సైకిల్ మెకానికి రెండురోజుల గడువులో మోటారు సైకిల్ రిపైర్ చేయగలిగితే, అతని మాట నిలబడుతుంది. ఇంకా మోటారు సైకిల్ యజమాని మాట నిలబడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే, కాలమును బంగారంగా మార్చుకోవడమే…. భవిష్యత్తులో మాటకు విలువ పెరగడమే అవుతుంది.

అలా ఒక మెకానిక్ తను కోరిన గడువులోపులో పనిని పూర్తి చేయగలగడం వలన అవసరాలకు అంతరాయం కలగదు.

ఇలా వ్యవస్థ అయిన సరే, తమ సంస్థ ఇచ్చే గడువులోపులో సేవలను అందించడమే, ఆ సంస్థ మనుగడకు ప్రధాన కారణం కాగలదు.

వ్యక్తి జీవితములో కాలం కన్నా విలువైనది ఉండదు.

బాల్యం అంటే చిన్నప్పుడు

యవ్వనం అంటే యుక్త వయసుకు వచ్చినవారు

వృద్దాప్యం అంటే ముసలివారు….

పై ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి.

బాల్యంలో ఆటలు ఆదుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా చాలా ప్రధాన విషయం. బాల్యంలో ఒక బాలుడు స్కూల్ కు వెళ్తూ చదువుకుంటూ, రోజు కొంత సమయం ఆటలు ఆడుకోవడం… ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు.

ఆటల వలన శరీరానికి అలుపు ఉంటుంది. సమయానికి తినడం వలన, తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వలన విషయ పరిజ్నానమ్ పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోదనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది.

సామాన్యమైన చదువు ఒక ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది.

అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యంగా ఉండేలా, బాల్యంలో చదివే చదువులు వ్యక్తి వృత్తికి సాయపడేలా ఉంటాయి… ఇక్కడ ఎంత శ్రద్దపెట్టి చదువు చదివితే, అంత గుర్తింపు… ఎంత చక్కగా తిండి తిని, సరైన వ్యాయామం కానీ ఆటలు కానీ అడితే, అంతటి ఆరోగ్యం అంటారు.

కష్టపడి బాల్య కాలంలో చేసే సాధన యవ్వన కాలమును ప్రభావితం చేస్తుంది. అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని, వృద్దాప్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక కాలంలో పడిన కష్టం యొక్క ఫలితం మరొక కాలంలో పడుతుంది.

కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం
కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం

అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి… అందుకు శ్రమించాలి అని అంటారు.

కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితంపై పడుతూ ఉంటాయి… అయితే అంతకు ముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగ పడుతుంది.

ఒక వ్యక్తి వ్యాయామంతో కాయమును పెంచితే, ఆ కాయము కాలంలో వచ్చే అంటువ్యాధులతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుందని అంటారు.

అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే, కాలంలో కలిగే ఆర్ధిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది.

ఒక వ్యక్తి తనతోటివారికి సాయపడుతూ ఉంటే, కాలంలో ఎదురయ్యే కష్టాలలో తన తోటివారే తనకు అండగా నిలబడతారు….

అంటే ఒక వ్యక్తి చేసే సాధన ఏవిధంగా ఉంటే, అదే విధంగా కాలంలో సమాజం నుండి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటారు.

ఈ విధంగా కాలం వ్యక్తి జీవితముపై అనేక విధాలుగా ప్రభావం చూపగలదు… కాబట్టి కాలం కాంచన తుల్యం అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం… అందుకే కాలం చాలా విలువైనది… ఇది ఒక మాటగా ఉండవచ్చు. ఒక సేవగా ఉండవచ్చు. ఒక సాయంగా ఉండవచ్చు. డబ్బురూపంలో ఉండవచ్చు… ఎలాగైనా ఉండవచ్చు కానీ కాలం చాలా విలువైనది…. మాత్రం సత్యం... కాలం చాలా విలువైనది తెలుగులో వ్యాసం…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం. మాటతీరు వలన మన్ననలు పొందవచ్చు. మాట తీరుతో బాగుంటే, స్నేహపూర్వక సమాజం మనిషి చుట్టూ ఏర్పడుతుంది. సంఘంలో గుర్తింపు మాట తీరును బట్టి ప్రభావితం అవుతుంది.

మనిషి మాట తీరు అతని చుట్టూ ఉండే మనుషులపై ప్రభావం చూపుతుంది. మాట వలన మనిషికి మనిషికి సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి.

మాటే మంత్రం అవుతుంది. మాటే కష్టం పోగొడుతుంది. మాటే మనిషికి కష్టాన్ని తీసుకురావచ్చు. మాట శక్తివంతమైనది… అది ఒక మంత్రంగా పనిచేయగలదు. ఎందుకంటే మాట మనసుని తాకుతుంది.

వ్యక్తి మాట తీరు బాగుంటే, ఆ వ్యక్తి చుట్టూ స్నేహితులే ఎక్కువగా ఉంటారు. ఎవరైనా సరే స్నేహపూర్వక ఆదరణ మాట తీరు బాగుండే వ్యక్తిపై చూపుతారు.

అలా కాకుండా ఒక వ్యక్తి మాట తీరు కటువుగా ఉంటే మాత్రం, ఆ వ్యక్తికి ఎక్కువమంది మిత్రుల కంటే శత్రువులు పెరుగుతారు. మాట తీరు వలననే మిత్రత్వం లేదా శతృత్వ భావనలు వ్యక్తి చుట్టూ ఏర్పడుతూ ఉంటాయి.

సమాజంలో వ్యక్తిపై అతని మాట తీరు ప్రభావం చాల ప్రముఖమైంది. అతని మాటే అతనికి పరిచయాలు తీసుకువస్తుంది,. మాట తీరును బట్టి స్నేహితులు గాని శత్రువులు గాని ఉండవచ్చు.

మాట తీరు మనిషికి ధైర్యాన్ని ఇవ్వగలదు, మాట తీరు వలన విషయాలను చక్కగా వివరించవచ్చును. మాట తీరు మంచిదైతే లోకం అంతా ప్రశాంతంగా కనబడుతుంది. లేకపోతె లోకం అశాంతిగా అనిపిస్తుంది.

కొందరి మాట తీరు ఎదుటివారిలో శాంతిని రేకెత్తిస్తే, కొందరి మాట తీరు ఎదుటివారిలో అశాంతికి కారణం కాగలదు. కొందరు నొప్పించే మాట తీరు కలిగి ఉండి, తమ చుట్టూ ఉండేవారిని కూడా బాధపెడుతూ ఉంటారు.

మాట సాయం వలన మనిషికి మనో బలం ఏర్పడుతుంది. అటువంటి మాట సాయం మంచి మాట తీరు కలిగిన వ్యక్తులకే సాద్యమంటారు.

మాట తీరు ప్రాముఖ్యత గురించి పురాణాలలో కూడా కనబడుతుంది.

మనకు మాట తీరు ప్రాముఖ్యత పురాణాలలోను కనబడుతుంది. రామాయణంలో హనుమంతుడు మాట్లాడితే ప్రాణాలు నిలబడతాయి. హనుమంతుడు చాల చక్కగా ఓర్పుగా మాట్లాడగలడు, విషయం సూటిగా సున్నితంగా హృదయానికి తాకేలాగా మాట్లాడగలడు. అందుకే శ్రీరాముడు సీతాన్వేషణలో హనుమపైన నమ్మకం ఉంచాడు. శ్రీరాముని నమ్మకాన్ని హనుమ నిలబెట్టాడు,

చక్కని మాట తీరు ఉంటే, రోజుల తరబడి మాట్లాడినా ఆ మాటలు వినేవారు ఉంటారు. మహా భారతంలో శుకుని మాటలను వారం రోజులపాటు వింటూ కూర్చున్నాడు. మాట తీరు బాగుంటే చెప్పే విషయం ఎదుటివారి మనసులో మంచి భావనలు పెంచుతుంది.

ఏడు రోజులలలో మరణం సంభవిస్తుంది అని తెలుసుకున్న పరిక్షత్తు మహారాజు… శుక మహర్షి మాటలకు మరణ భయం పోగొట్టుకున్నాడు. జీవిత పరమార్ధం ఏమిటో తెలుసుకోగలిగాడు… కారణం మంచి మాటలు చెప్పగల వారిని మాట్లాడించేలాగా మాట తీరు కలిగి ఉండడమే

మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అనే నానుడి ఒకటి కలదు. మంచి భావనలు కలిగి ఉండే వ్యక్తికి మాటపై మంచి అభిప్రాయం కలిగి ఉంటారు. మాట యొక్క అంతరార్ధం గ్రహించి మెసులుకుంటారు… కాబట్టి మంచి మనిషికో మాట చాలు అంటారు.

ఏదైనా మాట తీరు బాగుంటే లోకమంతా మిత్రులే…. లేకపోతె లోకంలో ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతాయి. మాట తీరు ప్రభావం మనిషి జీవితంపై పడుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం

అమ్మ ఒడి పధకం తెలుగులో వ్యాసం చదవండి. అమ్మ ఒడి గురించి వ్రాయండి అంటే తెలుగులో వ్యాసం వ్రాయడానికి కొంత విశ్లేషణ…

విధ్యార్ధులకు ఆర్ధికంగా అండగా ఉండాలనే సదుద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే స్టూడెంట్స్ కొరకు ఈ పధకం అందుబాటులో ఉంది.

రాష్ట్రంలో నివసించే వారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది.

కుటుంబంలో ఒక విధ్యార్ధికి ఆర్థిక సాయం కింద ఒక ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించే ప్రక్రియ అమ్మఒడి పధకం ద్వారా అమలు చేస్తున్నారు. పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పథకం వర్తిస్తుంది.

ఇప్పుడు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే విధ్యార్ధులకు నగదుకు బదులుగా లాప్ టాప్ ఎంచుకునే అవకాశం అమ్మ ఒడి పధకం కల్పిస్తుంది.

అమ్మఒడి విధార్ధికి ఆర్ధిక సాయం అందించే ప్రక్రియగా ప్రారంభమయిన, పేద విధ్యార్ధికి ఆశకు అండ అవుతుంది. పెద విధార్ధికి ప్రోత్సాహకంగా ఉంటుంది.

మన రాష్ట్రంలో అమలు చేస్తున్న అమ్మఒడి పధకం వలన సాలుకు ఒక విధ్యార్ధికి అందే నగదు, ఫీజు చెల్లించలేని వారికి వెసులుబాటుగా ఉంటుంది.

ఫీజు చెల్లించగలిగిన వారు, తమ పిల్లలకు ఏదైనా ప్రోత్సాహక వస్తువు కొనుగోలు చేసే విధంగా అమ్మ ఒడి పధకం నగదు ఉపయోగించుకోవచ్చు. ఇలా చదువుపై మరింత ఆసక్తిని పిల్లలకు ఏర్పరచవచ్చు.

ఎందుకంటే కొత్త వస్తువు పిల్లల మనసుకు ఉత్సాహం అందిస్తుంది. ఉత్సాహం పొందిన మనసు తన లక్ష్యంవైపు ఉత్సాహంగా పరుగులు తీస్తుంది.

ఇలా అమ్మఒడి పధకం నగదు పేద వారికి ఆర్ధికంగా, పెద్దవారికి ప్రోత్సాహకంగా మారుతుందని చెప్పవచ్చు.

అమ్మఒడి పధకం క్రింధ లబ్ది పొందేవారు, అమ్మఒడి ఆశయం మేరకు చక్కగా విధ్యను అభ్యసించాలి. మంచి ఫలితాలను సాధించాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు



కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

కోపం వలన కలిగే నష్టాలు. మనిషికి మంచి గుణాలలో శాంతంగా ఉండడం కూడా చెబుతారు. కానీ కోపం వస్తే, నియంత్రణ లేనివారికి, మాత్రం శాంతంగా ఉండే మనసు క్రోదానికి బలవుతుంది. తత్ఫలితంగా కోపం వలన నష్టాలు ఎక్కువ అవుతాయి.

మనకు కోపం రావడానికి కారణాలు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అయిష్టమైన విషయాలు ఎదుర్కొనేటప్పుడు, మనిషి మనసు సహజంగా కోపానికి లోనవుతుంది. మనసుకు అయిష్టాలు చాలానే ఉండవచ్చు.

నచ్చని మాట వినబడినా కోపం వచ్చేస్తూ ఉంటుంది. నచ్చనివారు ఎదురుపడిన కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. నచ్చని పని చేయాలంటే, కోపం, అసహనం కలిగే అవకాశాలు ఉంటాయి.

కోపం వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం

అసహనం పెరిగే కొలది చిరాకు, కోపం పెరుగుతూ ఉంటాయి. చిరాకు, చికాకు వలన చీటికి, మాటికి కోపం రావడం అలవాటు అయితే, అది ఇతరులపై ప్రదర్శించడం అలవాటు అయి, వారి మనసులో మనపై చికాకు భావన పెంచుకునే అవకాశం మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

దాని పర్యవసానంగా పలు సంబంధాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. నలుగురిలోనూ “వీడికి కోపం ఎక్కువ” అనే భావన బలపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

కాని కోపం రాని మనిషి ఉండడు. అయితే కొందరు కోపాన్ని నియంత్రిస్తారు. కొందరు కోపాన్ని ఇతరులపై ప్రదర్శిస్తారు. కోపాన్ని నియంత్రించుకోగలగడం గొప్ప విషయంగా పెద్దలు పరిగణిస్తారు.

తన కోపమే తన శత్రువు అంటారు. అంటే ఎవరికీ కోపం వస్తే, అదే వారి శత్రువుగా మారుతుంది.

ఎందుకంటే ఎప్పుడూ కోపగించే తత్త్వం కలిగిన వ్యక్తితో ఎవరూ ఆప్యాయంగా మాట్లాడలేరు. ఆప్యాయంగా మాట్లాడే మనిషి ఒక్కరు కూడా లేకపోతే, ఒంటరితనం పెరిగి, మనిషి ఒంటరివాడుగా మారతాడు. కష్టసుఖాలు పంచుకోకుండా మనిషి మనసు ఉండలేదు.

ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే అలవాటు ఉంటే, అది చివరికి క్రోధంగా దారి తీసే అవకాశం ఉంటుంది. క్రోధం వలన మనసు విచక్షణ కోల్పోతుంది. అలాంటి సమయాలలో మనసు ఇష్టారీతిలో ప్రవర్తిస్తుంది.

ఇష్టానుసారం మెదిలే మనసుకు అంతులేని ఆలోచన, ఆందోళన, చికాకు ఎక్కువ అవుతాయి.

నచ్చిన విషయాలు మనసుకు ఎదురైనప్పుడు సంతోషించే మనసు, నచ్చని విషయం ఎదురైనప్పుడు మాత్రం అందుకు కారణం అయినవారిని వెతుక్కొని, వారిని తప్పుబడుతుంది.

అలాగే తమకు నచ్చినట్టు ప్రవర్తించే మనిషి అంటే ఇష్టం. తమకు నచ్చనట్టు ప్రవర్తించే మనిషి అంటే కష్టంగా కొందరి మనసు మారుతూ ఉంటుంది. కానీ అలంటే సమయంలో సంయమనం పాటించేవారిని, గొప్పవారిగా పెద్దలు చెబుతారు.

నచ్చడం, నచ్చకపోవడం అనే అలవాటు, మనిషికి నచ్చినట్టుగా కాకుండా శాస్త్రం లేక పెద్దలు ఆమోదించిన విధానం ప్రకారం ఉంటే, వారు మార్గదర్శకులుగా మారగలరు. కానీ నచ్చడం, నచ్చకపోవడం అనే అలవాటు, మనసును బట్టి ఏర్పరచుకుంటే, అదే అలవాటు కోపానికి కారణం కాగలదు.

తత్కారణంగా అలవాటు కోపంగా మారితే, తన కోపమే తన శత్రువుగా మారుతుంది.

ఆహారం ఒక పద్దతిగా వైద్యులు సుచించినట్టుగా తీసుకుంటే, అనారోగ్యం కూడా నయం అవుతుంది. అలా కాకుండా ఆహారం మనసు కోరినట్టుగా అతిగా ఆరగిస్తే, అదే ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. ఇంకా నచ్చని ఆహారం తినవలసి వచ్చినప్పుడు కోపం కలిగే అవకాశం ఉంటుంది.

ఇలా పలు విషయాలలో మనిషికి నచ్చడం, నచ్చకపోవడం ఉంటుంది. కానీ నచ్చిన విషయం అందరికి ఆమోదయోగ్యమైతే, అది మంచి విషయంగా ఉండవచ్చు. నచ్చని విషయం అందరికి ఆమోదయోగ్యంగా ఉండి, ఒక్కరికే నచ్చకపోతే, సదరు వ్యక్తి తన ఆలోచనను గమనించాలి.

కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి కోపం ఎందుకు వస్తుంది

మనిషి మనసుకు నచ్చడం, నచ్చకపోవడం, వినడం, వినకపోవడం, ఇష్టం, అయిష్టం వంటి వాటి భావనలు బలపడి ఉంటే, అవే కోపానికి కారణం కాగలవు, కీర్తికి కారణం కాగలవు.

ఒకరికి చదువుకోవడం ఇష్టం. అది మంచి, చదువుకునే విషయంలో కాలయాపన జరిగితే కోపం. అది మంచి చేసే కోపం. కానీ అదే కోపం పదే పదే తెచ్చుకుంటే, అది భాధకు కారణం కాగలదు.

మంచి విషయానికైనా, చెడు విషయానికైనా కోపం రావచ్చు. కానీ అది నియంత్రించబడాలి. అప్పుడే అది మనిషికి శాంతిని అందిస్తుంది. లేకపోతే కోపం వచ్చిన వ్యక్తి మనసుతోపాటు, ఇతరుల మనసు మదనపడుతుంది.

కావునా కోపమనేది కేవలం ఒక చెడు విషయాన్నీ ఖండించడానికి ఉపయోగపడాలి… కానీ మనసుకు అలవాటుగా మారకూడదు. అతి సర్వత్రావర్జయేత్ అంటారు.

అంటే అతి అన్నింటా అనర్ధమే అంటారు. కోపం విషయంలో ఇది నిజమని, గుర్తించకపొతే, మనసుకు కోపం చాలా చాలా నష్టాన్నే మిగిలుస్తుంది.

కారణం లేని కోపం చేటు చేస్తుంది. కారణాంతరాల వలన కోపం కలిగినా, దానిని నియంత్రించుకునే అలవాటు నేర్చుకోవాలి.

కోపం వలన కష్టాలు తీరవు కానీ కోపం వలన కొత్త కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ. కావునా కోపం అనే గుణం దుర్గుణంగా మారకుండా, కోపం అనే గుణంపై నియంత్రణ ప్రయత్న పూర్వకంగా సాధించాలి.

సాదారణ స్థితి మనిషికి మరొక మనిషితో సత్సంబంధం ఏర్పరిస్తే, కోపం వలన సత్సంబంధం మద్య బేధభావం ఏర్పడే అవకాశం ఎక్కువ. కాబట్టి కోపం కారణంగా నష్టాలు అధికంగా ఉండవచ్చు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం. శ్రీరామాయణంలో రాముడి పితృవాక్య పరిపాలన, సీతమ్మ ప్రాతివత్య ధర్మం, సుగ్రీవునితో స్నేహం, హనుమంతుడి సేవానిరతి, లక్ష్మణస్వామితోడు ఏ పాత్ర చూసిన రాముని ధర్మమునకు కట్టిబడి ఉంటారు. ధర్మమునకు కట్టుబడి రాముడు నడిస్తే, రాముని వెంట నడిచినవారే ఎక్కువమంది ఉంటారు. మరణానికి చేరువ అయ్యేవారు రావణుడికి దగ్గరగా ఉంటే, ధర్మము అంటే ఇష్టపడేవారు రాముని చుట్టూ ఉంటారు. అలా రాముడి ధర్మమే రామాయణంలో చాలా ప్రధానంగా ఉంటుంది.

అలాంటి సుగుణాభిరాముడి గురించి శ్రీరామాయణం అంటే శ్రీరాముని పదహారు గుణాలను తెలుపుతూ ఉంటుంది.

ఈశ్వరునికి ఉండే పదహారు విశిష్టమైన గుణాలు ఒక మానవుడికి ఉంటే, ఆయనే శ్రీరామచంద్రమూర్తిగా ప్రవచనకారులు చెబుతారు.

ఇంకా శ్రీరాముడు పరమ ధర్మమూర్తిగా పురాణాలలో చెప్పబడతారు. ధర్మాన్ని నీవు రక్షిస్తే, ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది… అనే ఆర్యోక్తి శ్రీ రామాయణంలో రాముని ద్వారా తెలుసుకోవచ్చు.

ఒక ప్రాంతంలో అనుభవజ్ఞుడైన వ్యక్తి, ఆ ప్రాంతవాసులకు ఆదర్శం అయితే, ఆ ప్రాంతం మిగిలిన ప్రాంతాలకు ఆదర్శప్రాయంగా కనబడును.

అలాగే ఒక కుటుంబ పెద్ద కూడా సమాజంలో తగినంత అనుభవం కలిగి ఉంటాడు. కాబట్టి కుటుంబ పెద్ద అయినా తండ్రి తనయుడికి ఆదర్శప్రాయంగా నిలిస్తే, అతనిని అనుసరించడం తనయుడి ధర్మం.

అటువంటి కర్తవ్య దీక్షనే శ్రీరామచంద్ర మూర్తి రామాయణంలో నిర్వహించినట్టుగా రామాయణం ద్వారా మనకు తెలియబడుతుంది.

కేవలం తండ్రి మాటపై గురువుతో రాముడు అడవులలో నడిచాడు.

అయోధ్యలో అంతపురంలో సౌకర్యవంతమైన జీవనం కలిగి ఉన్న శ్రీరాముడు, విశ్వామిత్రుడి వెంట అడవులలో నడిచాడు.

శ్రీరాముడిని తనతో పంపవలసినదిగా, దశరడుని విశ్వామిత్రుడు కోరతాడు. అప్పుడు దశరదుడు శ్రీరాముడిని, విశ్వామిత్రుని వెంట పంపుతాడు… విశ్వామిత్రుడి చెప్పినట్టు శ్రీరాముడు అడవులలో నడుచుకుంటాడు.

విశ్వామిత్రుడిని దగ్గర అనేక అస్త్ర, శస్త్రాలను శ్రీరాముడు పొందుతాడు… కానీ వాటిని స్వప్రయోజనానికి ఉపయోగించకుండా కేవలం ధర్మరక్షణకై ఉపయోగించడం రామాయణంలో రాముడి దగ్గరే తెలుసుకోవాలని పెద్దలంటారు.

ఎంతటి శక్తిని పొందినా గురువు దగ్గర ఎంతటి వినయంతో నడుచుకోవాలో రామాయణంలో శ్రీరాముడిని నుండి నేర్చుకోవాలి.

గురువుపై గురి కుదిరితే అత్యంత శక్తివంతమైన, అసాదరణమైన విజయం సాధించవచ్చని శ్రీరామాయణంలో శ్రీరాముడిని చూసి తెలుసుకోవచ్చు.

శక్తివంతులైన రాక్షసులకు, ఇతరులకు సాద్యం కానీ శివధనుస్సు ఎక్కుపెట్టగలగడం శ్రీరాముడికే సాద్యం అయ్యింది.

చెప్పుడు మాటలు వింటే, బుద్ది నశిస్తుందని రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు

చెప్పుడు మాటలు వింటే, బుద్ది నశిస్తుందని శ్రీరామాయణం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే శ్రీరాముడంటే అమితమైన ప్రేమ కలిగినవారిలో కైకేయి ఉంటుంది.

ఆమెకు రాముడంటే చాలా ఇష్టం. అటువంటి కైకేయి చెప్పుడు మాటల వలన సమాజంలో నిందితురాలిగా మారింది. కన్న కొడుకు కూడా ఆమెను అసహ్యించుకోవడం కైకేయి విషయంలో శ్రీరామాయణంలో చూడవచ్చు.

శ్రీరామపట్టాభిషేకం అడ్డుకుని, కొడుకుకు రాజ్యం ఇప్పించాలనే సంకల్పం, మంధర మాటల వలన కైకేయి మనసులో కలుగుతుంది.

వెంటనే దశరడుడిని కోరడంతో, ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి మాటమేరకు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడానికి అడవులకు బయలుదేరతాడు. శ్రీరాముడిని అడవులకు పంపింది, దైవమె అయినా, చెప్పుడు మాటలు వింటే, లోకనింద పొందే అవకాశం ఎక్కువ అని రామాయణంలో కైకేయి పాత్ర నిరూపిస్తుంది.

వ్యక్తి మహనీయుడుగా మారాలంటే అందుకు ఆదర్శప్రాయమైన పాత్రలు శ్రీరామాయణంలో చాలా కనబడతాయి. శ్రీరాముడులాగా అందరితో మంచి అనిపించుకుంటే, కష్టంలో అందరూ సాయపదతారని శ్రీరామాయణం చాటి చెప్పుతుంది.

అన్నీ తెలిసినా, మరొకరికి ఉపకారం చేయకుండా, అపకారం తలపెడితే, ఎంత ప్రమాదమో రామాయణంలో రావణుడు పాత్ర తెలియజేస్తుంది.

రావణుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. బలవంతుడు. అనేకమంది శక్తివంతులైన రాక్షసగణం కలిగినవాడు. అటువంటి వాడు అన్నీ తెలిసినా, మరొకరికి ఉపకారం చేయకుండా, అపకారం తలపెడితే, ఎంత ప్రమాదమో రామాయణంలో రావణుడు పాత్ర తెలియజేస్తుంది.

సాక్షాత్తు దైవానుగ్రహం కలిగి ఉన్నా, మన ప్రవర్తన ఇతరులకు అపకారం చేస్తే, ఫలితం అనుభవించాల్సిందే… రావణుడికి పరమేశ్వరుడి అనుగ్రహం కలిగింది. కాబట్టి పంచభూతాలను శాసించాడు.

ఇంకా లోకాన్ని పీదించాడు. మితిమీరి శ్రీరాముడి భార్యను తీసుకువెళ్ళి లంకలో కూర్చోబెట్టాడు. అందుకు ఫలితంగా సీతమ్మ తల్లి వేదనకు గురైంది…. సీత ఆవేదన, రావణుడికి పాపం పెరుగుతూ, పుణ్యం నశించడం మొదలైంది.

నశించిన పుణ్యం వలన కేవలం రావణుడికి దైవానుగ్రహం దూరం అయింది. రాముడు, రావణుడిని జయించాడు.

శ్రీరామాయణం వ్యక్తి సమాజంలోను, కుటుంబంలోను ఎలా జీవించాలో? తెలియజేస్తుందని పెద్దలు చెబుతారు.

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు