Tag Archives: తెల్లవారు జాములో

తెల్లవారు జామున ప్రశాంత చిత్తంతో ప్రార్ధన

తెల్లవారు జామున ప్రశాంత చిత్తంతో ప్రార్ధన మంచి ఫలితం ఇస్తుందని అంటారు. స్కూల్ కు వెళ్ళే బాలబాలికలను తెల్లవారు జామునే చాడువుకోమన్నట్టుగా…

స్కూల్ కు వెళ్ళే ఒక పిల్లవాడు ఎంత శ్రద్ద పెడితే, అన్ని మార్కులు పరిక్షలలో సాధించగలడు. అటువంటి పిల్లవానికి ఏకాగ్రత కోసం తెల్లవారు జాములో చదువుకోమని పెద్దలు చెప్పేవారు.

అంటే భగవంతుడి విషయంలో కూడా స్కూల్ పిల్లవాని వలె భక్తునికి శ్రద్ద అవసరం అనుకుంటా…

అందుకే స్కూల్ పిల్లవానిని చాడువుకోమన్నట్టుగా తెల్లవారుజామునే భగవంతుడిని ప్రశాంత చిత్తంతో ప్రార్ధన చేయమంటారు.

అవును శ్రద్ధ వలననే ఒక పిల్లవాడు పుస్తకంలోని విషయం గ్రహిస్తున్నాడు. విషయసారం గ్రహింఛి కొత్త విషయం కనుగోనడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అలాగే భక్తుడు కూడా భగవంతుడిపై శ్రద్ద పెడితే, భగవతత్వం మనసులోకి వచ్చేస్తుందేమో?

మరి భగవంతుడిపై శ్రద్ద పెట్టె ఆసక్తి మనసులో కలగాలంటే, దానికి ఆలంబన కోసం పురాణ పుస్తకాలూ చదవడం లేక పురాణ ప్రవచనాలు వినడం చేయమంటారు.

పురాణాలు చదవకపోయినా ప్రతిరోజు ఈశ్వరుని పూజ చేస్తూ ఉండాలని అంటారు.

కష్టాలలో ఉన్నవారికి సాయం చేస్తూ, ఆ సాయం ఈశ్వరునికి అర్పించేవారు ఉంటారు.

ప్రతి పనిలోనూ ఈశ్వరుని చూడడం ప్రధానమని అంటారు.

ఈశ్వర సంభందంగా జీవనం సాగించేవారిని ఆ ఈశ్వరుడే రక్షణ చేస్తాడని అంటారు. అయితే ఈశ్వరుడు చిత్తశుద్దిని చూస్తాడని చెబుతారు.

ఈ చిత్తశుద్ది ఉంటే, మనిషి మహనీయుడు అని అంటారు.

అటువంటి చిత్తశుద్ది కలగాలంటే ప్రశాంతమైన చిత్తం కలిగి ఉండాలి.

ప్రశాంతమైన చిత్తం కదిలే మనసులో కన్న, ఒక చోట దృష్టి సారించే మనసులో ఎక్కువగా ఉంటుందని అంటారు.

అలా మనసు ఒక చోట దృష్టి కేంద్రీకృతం చేయాలంటే, దానికి ఎంతో ఇష్టం అయితేనే దృష్టి పెడుతుందని అంటారు.

అలా మనసు ఒక చోట కేంద్రీకృతం అయ్యేలాగా దృష్టి పెట్టడానికి పూజ పునాదిగా చెబుతారు.

సంసారం సాగించేవారికి పూజ ప్రధానం అంటారు.

సంసారం సమస్యలను తెస్తుంది, సుఖదుఖాలను తీసుకువస్తుంది… వాటిని దాటి మనసుని ఏకీకృతం చేయడం చాలా కష్టమంటారు… అలాగే అది అసాద్యమేమి కాదని కూడా అంటారు.

చిత్తశుద్దితో పూజ చేయడానికి సాదారణ పూజ ప్రశాంత చిత్తంతో తెల్లవారు జామున ప్రారంభించడం శ్రేయస్కరమని పెద్దలు చెబుతూ ఉంటారు.